ఆరువారాల క్రితం ప్రముఖ స్టాక్ మార్కెట్ బ్రోకరేజీ సంస్థ జెరోదా సీఈఓ నితిన్ కామత్ మైల్డ్ స్ట్రోక్‌కి గురయ్యారు. తన తండ్రి మరణం, తగినంత నిద్ర లేకపోవడం, డీహైడ్రేషన్, ఎక్కువగా పనిచేయడం వంటి కారణాల వల్ల మైల్డ్ స్ట్రోక్ వచ్చిందని భావిస్తున్నట్లు తెలిపారు. 3 నుంచి 6 నెలల్లో పూర్తిగా కోలుకుంటానంటూ ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు.
ఈ తరుణంలో మైల్ట్ స్ట్రోక్ తర్వాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు నితిన్ కామత్ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని కోరుకుంటున్నారు. తాము ఇస్తున్న కొన్ని రకాల వైద్య సంబంధిత సలహాలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ సలహాలపై వైద్యులు ఖండిస్తున్నారు. టాటా మెమోరియల్ హాస్పిటల్ డైరక్టర్ డాక్టర్ సీఎస్ ప్రమేష్ స్పందించారు.
‘‘సోషల్ మీడియా ఎంత ప్రాణహాని కలిగిస్తుందో తెలిపే ఉదంతం ఇంది. దయచేసి 'నన్ను నమ్మండి బ్రో' సైన్స్ సంబంధిత అంశాలపట్ల ఏమాత్రం సంబంధం లేని, అవగాహనలేని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు చెప్పే మాటల్ని అస్సలు పట్టించుకోవద్దని కోరారు.
ఆపత్కాలాంలో మన మంచి కోరుతూ అనేక మంది సలహాలు ఇస్తుంటారు. వాళ్లు చెప్పేది మన మంచి కోసమే. కానీ ఏమాత్రం అనుభవం లేకుండా ఇచ్చే కొన్ని సలహాలు మేలు కంటే హానిని కలిగిస్తాయి. జాగ్రత్త!!’ అని డాక్టర్ ప్రమేష్ ట్వీట్ చేశారు.
పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇచ్చిన సలహాలపై బెంగళూరులోని ఓ ప్రముఖ హాస్పిటల్‌కు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ దీపక్ కృష్ణమూర్తి సైతం వ్యతిరేకించారు.ఇన్‌ఫ్లూయెన్సర్ల ట్వీట్‌లకు వరుస సమాధానాలిచ్చారు. ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇచ్చే సలహాలకు, వైద్య విధానానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ బదులిచ్చారు.
A thread that demonstrates how life threatening social media can be...
— Pramesh CS (@cspramesh) February 26, 2024
Please don't follow random "influencers" who don't have true science to back them beyond "Trust me, bro" https://t.co/50OBrlNNjS
When I spoke against 72 hour work week sometime ago, there were many people up in arms and called me what all names. But the fact remains that there needs to be work life balance. There needs to be time to relax, unwind and sleep. For all that you need spare time. #MedTwitter… https://t.co/zdMwWu1rgc
— Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) February 27, 2024
Comments
Please login to add a commentAdd a comment