Tata Memorial Hospital
-
‘నన్ను నమ్మండి బ్రో’ ..జెరోదా సీఈఓకి మైల్డ్ స్ట్రోక్‌పై టాటా హాస్పిటల్!
ఆరువారాల క్రితం ప్రముఖ స్టాక్ మార్కెట్ బ్రోకరేజీ సంస్థ జెరోదా సీఈఓ నితిన్ కామత్ మైల్డ్ స్ట్రోక్‌కి గురయ్యారు. తన తండ్రి మరణం, తగినంత నిద్ర లేకపోవడం, డీహైడ్రేషన్, ఎక్కువగా పనిచేయడం వంటి కారణాల వల్ల మైల్డ్ స్ట్రోక్ వచ్చిందని భావిస్తున్నట్లు తెలిపారు. 3 నుంచి 6 నెలల్లో పూర్తిగా కోలుకుంటానంటూ ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు. ఈ తరుణంలో మైల్ట్ స్ట్రోక్ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు నితిన్ కామత్ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని కోరుకుంటున్నారు. తాము ఇస్తున్న కొన్ని రకాల వైద్య సంబంధిత సలహాలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ సలహాలపై వైద్యులు ఖండిస్తున్నారు. టాటా మెమోరియల్ హాస్పిటల్ డైరక్టర్ డాక్టర్ సీఎస్ ప్రమేష్ స్పందించారు. ‘‘సోషల్ మీడియా ఎంత ప్రాణహాని కలిగిస్తుందో తెలిపే ఉదంతం ఇంది. దయచేసి 'నన్ను నమ్మండి బ్రో' సైన్స్ సంబంధిత అంశాలపట్ల ఏమాత్రం సంబంధం లేని, అవగాహనలేని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు చెప్పే మాటల్ని అస్సలు పట్టించుకోవద్దని కోరారు. ఆపత్కాలాంలో మన మంచి కోరుతూ అనేక మంది సలహాలు ఇస్తుంటారు. వాళ్లు చెప్పేది మన మంచి కోసమే. కానీ ఏమాత్రం అనుభవం లేకుండా ఇచ్చే కొన్ని సలహాలు మేలు కంటే హానిని కలిగిస్తాయి. జాగ్రత్త!!’ అని డాక్టర్ ప్రమేష్ ట్వీట్ చేశారు. పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఇచ్చిన సలహాలపై బెంగళూరులోని ఓ ప్రముఖ హాస్పిటల్‌కు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ దీపక్ కృష్ణమూర్తి సైతం వ్యతిరేకించారు.ఇన్ఫ్లూయెన్సర్ల ట్వీట్లకు వరుస సమాధానాలిచ్చారు. ఇన్ఫ్లూయెన్సర్లు ఇచ్చే సలహాలకు, వైద్య విధానానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ బదులిచ్చారు. A thread that demonstrates how life threatening social media can be... Please don't follow random "influencers" who don't have true science to back them beyond "Trust me, bro" https://t.co/50OBrlNNjS — Pramesh CS (@cspramesh) February 26, 2024 When I spoke against 72 hour work week sometime ago, there were many people up in arms and called me what all names. But the fact remains that there needs to be work life balance. There needs to be time to relax, unwind and sleep. For all that you need spare time. #MedTwitter… https://t.co/zdMwWu1rgc — Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) February 27, 2024 -
టాటా ఆస్పత్రికి వంద ఇళ్లు
సాక్షి, ముంబై: ముంబై నగరంలో ప్రముఖ టాటా మెమోరియల్ కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేద రోగుల బంధువులు బస చేయడానికి 100 ఇళ్లు అందజేసే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంతకం చేశారు. దీంతో రోగుల బంధువులకు త్వరలో ఇళ్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే 30 ఏళ్ల వరకు నామమాత్రపు అద్దె ఒప్పందంపై ఈ ఇళ్లను టాటా ఆస్పత్రికి అందజేయనున్నారు. మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా) నిర్మిస్తున్న ఇళ్లలో వంద ఫ్లాట్లను టాటా ఆస్పత్రికి అందజేయనున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవ్హాడ్ ఇటీవల విలేకరుల సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ప్రతిపాదనపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే సంతకం చేయడంతో మార్గం సుగమమైంది. కేన్సర్ రోగుల వెంట వచ్చే బంధువులకు తల దాచుకునేందుకు తాత్కాలికంగా ఓ గూడు లభించనుంది. 300 చదరపుటడుగుల ఒక్కో ఇల్లుకు సంవత్సరానికి రూపాయి అద్దె చొప్పున 30 ఏళ్ల వరకు వంద ఇళ్లను టాటా ఆస్పత్రికి ఇవ్వనుంది. కేన్సర్ చికిత్సలో దిట్ట .. ముంబైలోని పరేల్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న టాటా మెమోరియల్ ఆస్పత్రి కేన్సర్ చికిత్సకు పెట్టింది పేరు. భారతదేశంతోపాటు విదేశాలలో కూడా ఈ ఆస్పత్రి ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇందులో చేరిన రోగుల్లో సుమారు 90 శాతం మంది వ్యాధి నయమై ఇంటికి డిశ్చార్జి అవుతారనే నమ్మకం ప్రజల్లో నాటుకుపోయింది. దీంతో ఈ ఆస్పత్రి అందించే చికిత్సపై రోగులందరికి నమ్మకం ఉంది. మహారాష్ట్రతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్నాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరాంచల్, ఈశాన్య రాష్ట్రాలు తదితర దేశం నలుమూలల నుంచి నిత్యం వందలాది కేన్సర్ రోగులు వస్తుంటారు. ఇందులో 61 శాతం మన దేశానికి చెందిన రోగులుండగా 39 శాతం విదేశాల నుంచి వచ్చినవారుంటారు. ప్రతీ రోగి వెంట ఒకరు లేదా ఇద్దరు బంధువులు కచ్చితంగా వస్తారు. దీంతో ఈ ఆస్పత్రి 24 గంటలు రోగులు, రోగుల బంధువుల రాకపోకలతో రద్దీగా కనిపిస్తుంది. రోగులకు సేవలు చేయడానికి వార్డులో ఒకరికే అనుమతి ఉంటుంది. అది కూడా అవసరమైతేనే. లేదంటే బయటకు పంపిస్తారు. మిగతావారు ఆస్పత్రి బయట గడపాల్సి ఉంటుంది. ఆస్పత్రిలో కొత్తగా వచ్చిన రోగుల ప్రాథమిక పత్రాల ప్రక్రియ పూర్తిచేసిన తరువాత రక్త, మూత్ర, కాలేయం తదితర ల్యాబ్ పరీక్షలతోపాటు, సోనోగ్రఫీ, ఎక్స్ రే, సిటీ స్కాన్ లాంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తరువాత రిపోర్టు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అందుకు సుమారు వారం నుంచి 10 రోజుల సమయం పడుతుంది. ఒక్కోసారి 15 నుంచి నెల రోజుల సయమం కూడా పట్టవచ్చు. డాక్టర్లు రిపార్టును పరిశీలించిన తరువాత రోగిని ఆస్పత్రిలో చేర్చుకోవాలా...? వద్దా...? అనేది నిర్ణయిస్తారు. కొందరికి మందులు రాసిచ్చి ఇంటికి పంపిస్తారు. రోగిని ఆస్పత్రిలో చేర్చుకున్న తరువాత ఒకరు మినహా మిగతా బంధువులు ఆస్పత్రి బయటే ఉండాల్సి ఉంటుంది. అదే చిన్న పిల్లలైతే తల్లిని వెంట ఉండేందుకు అనుమతిస్తారు. తండ్రి మాత్రం బయటే పడిగాపులు కాయాల్సి వస్తుంది. రోడ్లపైనే వంటలు.. సాధారణంగా కేన్సర్ వ్యాధి నయమం కావాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. కొంత ఆర్థికంగా ఉన్నవారైతే గెస్ట్‌హౌస్‌లు, లాడ్జింగులు, హోటళ్లలో బస చేస్తారు. కానీ, పేదలు ఆస్పత్రి బయట రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై లేదా ఫ్లై ఓవర్ల కింద, ఉద్యానవనాల్లో కాలం వెల్లదీస్తారు. కొందరు ప్రతీరోజు అస్పత్రి క్యాంటిన్లో, బయట హోటళ్లు, రోడ్లపై విక్రయించే చిరుతిళ్లు తినలేక ఫుట్‌పాత్‌లపైనే ప్లాస్టిక్ కాగితాలు కట్టుకుని పోయ్యి వెలిగించి వంట కూడా చేసుకుంటారు. ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ, చలికి గజగజ వణుకుతూ కాలం వెల్లదీస్తారు. కొన్ని స్వచ్ఛంద, సామాజిక సేవా సంస్థలు మానవత్వం ప్రదర్శించి ఉదయం, మధ్యాహ్నం సాయంత్రం, రాత్రి అల్పహారం, భోజనం పంపిణీ చేస్తాయి. కానీ, తల దాచుకునేందుకు ఏర్పాట్లు మాత్రం ఎవరు చేయడం లేదు. దీంతో కరీ రోడ్ ప్రాంతంలో మాడా ఆధీనంలో ఉన్న హాజీ కాసం భవనంలో వంద ఫ్లాట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సంతకం చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. స్థానికుల వ్యతిరేకత.. 100 ఫ్లాట్లు కేన్సర్ రోగుల వెంట వచ్చే నిరుపేదలు తల దాచుకునేందుకు ఎంతో దోహదపడతాయని మంత్రి జితేంద్ర అవ్హాడ్ అన్నారు. ఒక్కో ఫ్లాటు ఖరీదు రూ. కోటి ఉంటుంది. ఇలా వంద ఫ్లాట్లకు రూ.100 కోట్లు విలువ ఉంటుందని ఆయన అన్నారు. కానీ కరీ రోడ్లో మాడా ఆధీనంలో ఉన్న హాజీ కాసం చాల్ నివాసులు వంద ఫ్లాట్లు టాటా కేన్సర్ ఆస్పత్రికి కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందులో కేన్సర్ రోగుల బంధువులు బస చేస్తారు. వారి వెళ్లిపోగానే ఇంకొకరు వస్తారు. వారి రాకపోకల వల్ల తమ కుటుంబాలకు కేన్సర్ వ్యాధి సోకే ప్రమాదముందని ఆరోపిస్తున్నారు. దీంతో మరోచోట వారికి బస ఏర్పాట్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
బాలభారతాన్ని కబళిస్తున్న కేన్సర్
భావిభారత విధాతలైన నేటి బాలలను కేన్సర్ మహమ్మారి కబళిస్తోంది. కేన్సర్ వ్యాధి సోకిన చిన్నారులను కాపాడుకోలేని పరిస్థితి ఆందోళన కరంగా తయారయ్యింది. కేన్సర్ వ్యాధిగ్రస్తులైన ప్రతి ఐదుగురు చిన్నారుల్లో నలుగురు మరణిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సరైన సమయంలో కేన్సర్‌ని గుర్తించకపోవడం, చికిత్సకోసం సుదూరప్రాంతాలకు వెళ్లాల్సి రావడం, వైద్యం ఖరీదవడం వల్ల కేన్సర్ వ్యాధిగ్రస్తులైన చిన్నపిల్లలు చికిత్సకు దూరమౌతున్నారు. ఉదాహరణకు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ముంబై టాటా మెమోరియల్ కేన్సర్ ఆసుపత్రిలో కేన్సర్ చికిత్సకోసం చేరుతోన్న చిన్నారుల్లో 43.6 శాతం మంది 1,300 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని తాజా రికార్డులు వెల్లడిస్తున్నాయి. పది శాతం మంది 2,200 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆసుపత్రిలో చేరుతున్నారు. మరో 20 శాతం మంది మాత్రం ఈ ఆసుపత్రిలో చేరడానికి ముందే అసంపూర్తిగా చికిత్స చేయించుకొని వస్తున్నారు. ఆ దేశాల్లో ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఆదాయం, మధ్యతరగతి ఆదాయం కలిగిన దేశాల్లోని కేన్సర్ బాధిత చిన్నారుల్లో ఎక్కువ మంది చనిపోతున్నట్టు ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది. దేశంలో కేన్సర్ సోకిన అత్యధిక మంది బాలలు ఐదేళ్ళకు మించి బతక్కపోవడానికి, కేన్సర్‌ని సరైన సమయంలో గుర్తించకపోవడం, వైద్యం ఖర్చు భరించలేనంతగా ఉండడం, సగంలోనే (అసంపూర్ణం) చికిత్సను ఆపివేయడం కారణాలని ఇండియా స్పెండ్ సంస్థ వెల్లడించింది. సరైన సమయంలో గుర్తిస్తే.. ప్రతియేటా దేశంలో దాదాపు 50,000 మంది 19 ఏళ్ళలోపు వయస్సువారు కేన్సర్‡ బారిన పడుతున్నట్టు ద లాన్సెంట్ అధ్యయనం గుర్తించింది. అయితే ఈ సంఖ్య వాస్తవంలో 75,000కు పైచిలుకే అంటున్నారు టీఎంహెచ్ ఆంకాలజిస్ట్ గిరీష్ చిన్నస్వామి. దాదాపు 20,000 మంది చిన్నారుల్లో కేన్సర్‌ని గుర్తించడం గానీ, దానికి చికిత్స చేయించడం గానీ జరగడంలేదు. కేన్సర్సోకిన 55,000 మందిలో కేవలం 15000 మందికే నైపుణ్యం, అనుభవం కలిగిన వైద్యుల ద్వారా నాణ్యమైన, మంచి చికిత్స లభిస్తోంది. అలాగే వారికి మంచి ఆహారం, వైద్యానికి ఆర్థిక సహకారం లభిస్తోంది. వీరిలో 70 శాతం మంది కేన్సర్‌ని జయిస్తున్నారు. మూడోవంతు మంది మధ్యలోనే.. ► కేన్సర్‌బారిన పడిన చిన్నారుల్లో 3వవంతు మంది అసంపూర్ణ చికిత్సకారణం గా బతికే అవకాశాన్ని కోల్పోతున్నారు. ► దిగువ, మధ్య తరగతి ఆదాయం కలిగిన దేశాల్లో 90 శాతం మంది చికిత్సను మధ్యలోనే వదిలేస్తున్నారు. ► మరింత పేదరికంలో మగ్గుతోన్న దేశాల్లో 99 శాతం మంది చికిత్స చేయించుకోకపోవడమో, లేక చికిత్సను మధ్యలోనే వదిలేయడమో జరుగుతోంది. ఓ అధ్యయనం ప్రకారం ► ప్రత్యామ్నాయ, సాంప్రదాయ చికిత్సావిధానాన్ని అనుసరిస్తున్నవారు 31 శాతం ► ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చికిత్సను మానుకుంటున్న వారు 28 శాతం ► కేన్సర్‌కి చికిత్సలేదనీ, అది నయం కాని వ్యాధి అని భావిస్తున్నవారు 26 శాతం ఇండియా స్పెండ్ ప్రకారం ప్రతి పదిలక్షల మంది జనాభాకి ఆంకాలజిస్ట్‌లు ► ఫిలిప్పైన్స్‌లో 25.63 మంది ► చైనాలో 15.39 ∙ఇరాన్లో 1.14 ► భారత్‌లో 0.98 -
చవకగా మెరుగైన వైద్యం
స్టార్టప్‌లు ఈ దిశగా కృషిచేయాలి: ప్రధాని మోదీ ► స్వదేశీ ఉపకరణాల తయారీని ప్రారంభించాలి ► టాటా మెమోరియల్ ఆసుపత్రి 75 ఏళ్ల వేడుకల్లో ప్రధాని ముంబై: పేదలకు మెరుగైన వైద్యాన్ని తక్కువధరకే అందించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ దిశగా స్టార్టప్ కంపెనీలు దేశీయంగా వైద్యపరికరాలను రూపొందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని ఆయన గురువారం పిలుపునిచ్చారు. ప్రస్తుతం వైద్య పరికరాల కోసం దిగుమతిపైనే ఎక్కువగా ఆధారపడుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. టాటా కంపెనీ ఆధ్వర్యంలో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు. టాటా సంస్థ 75 ఏళ్లుగా చేపడుతున్న సేవాకార్యక్రమాలపై రాసిన ‘ఇండెలిబుల్ ఫుట్‌ప్రింట్స్ ఆన్ ద శాండ్స్ ఆఫ్ టైమ్’ పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారు. ‘ప్రతి ఏటా 10 లక్షల మందికి కేన్సర్ నిర్ధారణ అవుతోంది. ఇందులో 6.5 లక్షల మంది చనిపోతున్నారు. అంతర్జాతీయ ఏజెన్సీల పరిశోధన ప్రకారం.. కేన్సర్ మరణాలు 30 ఏళ్లలో రెట్టిం పుకానున్నాయి’ అని ప్రధాని వెల్లడించారు. రోగులకు చికిత్స చేసే పరికరాల్లో 70% విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామ ని.. దీనివల్ల వైద్యం మరింత ఖరీదైందన్నారు. దిగుమతి పరికరాలతో వైద్యం ఖరీదు ‘వైద్యం ఖర్చు పెరుగుతున్నందున విదేశీ పరికరాలను దిగుమతి చేసుకునే పద్ధతి మారాలి. స్టార్టప్ పరిశ్రమ వైద్య రంగంలో పరిశోధనలపై ప్రత్యేక దృష్టిసారించాలి. దేశీయంగా వైద్య పరికరాల తయారీకి ముందుకు రావాలని కోరుతున్నాను. దీని వల్ల వైద్యం ఖర్చు తగ్గి పేదలకు కూడా అందుబాటుధరల్లోనే ఆరోగ్య సేవలందాలి’ అని ప్రధాని కోరారు. పేదలకు తక్కువ ధరకే అత్యాధునిక వైద్యసేవలందించేందుకు జాతీయ వైద్య విధానాన్ని ప్రకటించామన్నారు. ఇందుకోసం 15 ఏళ్ల లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మోదీ చెప్పారు. రానున్న రోజుల్లో దేశ జీడీపీలో 2.5శాతం వైద్య రంగానికి వెచ్చిస్తామన్నారు. కేన్సర్‌పై పరిశోధనలు చేస్తూ నాణ్యమైన చికిత్సనందించేందుకు ప్రయత్నిస్తున్న వివిధ ఆసుపత్రులను ఒకే వేదికపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అధునాతన సాంకేతికత సాయంతో తక్కువ ఖర్చుకే వైద్యం అందించాలన్నారు. ‘మేం అధికారంలోకి రాకముందు 36 కేన్సర్ ఆసుపత్రులు కేన్సర్ గ్రిడ్‌కు అనుసంధానమయ్యా యి. ఈ మూడేళ్లలో ఈ సంఖ్య 108కి చేరింది’ అని మోదీ తెలిపారు. టాటా మెమోరియల్ ఆసుపత్రి సహకారంతో వారణాసి, ఛండీగఢ్, విశాఖపట్టణం, గువాహటిల్లో నాలుగు కేన్సర్ పరిశోధన కేంద్రాలు అభివృద్ధి చేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు. కేన్సర్ నిర్మూలనకు టాటా మెమోరియల్ సెంటర్ చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ‘ప్రతి మనిషికి అగ్నిపరీక్షకన్నా కేన్సర్ తక్కువేం కాదు’ అని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా రతన్ టాటా, టాటా మెమొరియల్ ఆసుపత్రులను ప్రధాని అభినందించారు. -
మహిళను వేధించినందుకు రోడ్లూడ్చే శిక్ష
ఆదివారం ఉదయం మహరాష్ట్ర లోని థానేలో నలుగురు యువకులు చీపుర్లు పట్టుకుని రోడ్లు ఊడ్చారు. అలా ఒకటి కాదు... రెండు కాదు.. ఏకంగా ఏడు గంటల పాటు..చమటోడ్చి థానే రోడ్లను శుభ్రం చేశారు. వీళ్లంతా స్వచ్ఛ భారత్ లో భాగంగా ఇలా చేశారనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఓ మహిళను.. వేధించినందుకు పడిన శిక్ష ఇది. గత ఏడాది దసరా ఉత్సవాల సందర్భంగా స్థానికంగా నివాసం ఉంటున్న అంకిత్ జాదవ్, సుహాస్ ఠాగూర్, మిలింద్ మోర్, అమిత్ లు పూటుగా తాగారు. అటుగా వెళుతున్న ఓ యువతిపై లైగిక వేధింపులకు దిగారు. ఇది గమనించిన ఓ యువకుడు వీరిని అడ్డుకోడానికి ప్రయత్నించగా.. ఇనప రాడ్ తీసుకుని అతడిని చితక బాదారు. అడ్డుకోడానికి ప్రయత్నించిన వారందరినీ వేధించారు. దీంతో వీరిపై కేసు నమోదైంది. అయితే..నిందితులు.. బాధితులతో కోర్టు బయట కేసు సెటిల్ చేసుకున్నారు. ఈవిషయాన్ని బాధితులు కోర్టులో ధృవ పరిచారు. దీంతో తమ కేసును క్వాష్ చేయాలంటూ నిందితులు ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు పరిశీలించిన కోర్టు .. నిందితులంతా.. ఆరు నెలల పాటు.. పోలీసుల పర్యవేక్షణలో సమాజ సేవ చేయాల్సిందిగా ఆదేసించింది. అంతే కాదు.. టాటా మెమోరియల్ ఆస్పత్రికి ఒక్కొక్కరూ.. రూ.5000 డొనేషన్ రూపంలో చెల్లించాలని పేర్కొంది. తమకు పడ్డ శిక్షపై స్పందించిన నిందితుడు ఠాగూర్ ' మేం తప్పు చేశాం.మళ్లీ ఆ తప్పు చేయం. అంతే కాదు.. మాలాగా తప్పులు చేసేవాళ్లకు మా శిక్ష ఒక గుణ పాఠం కావాలి. మమ్మల్సి చూసి.. ఇలాంటి తప్పు ఎవరూ చేయకుండా భయపడాలి' అని తెలిపాడు. మరో నిందితుడు జాదవ్ స్పందిస్తూ..'మేంచేసి పనికి చింతిస్తున్నాం..ఈ విధంగా దేశానికి సేవ చేసే అవకాశం రావడం సంతోషమే కాని.. మా చర్యలపట్ల సిగ్గుపడుతున్నామని అన్నాడు. -
బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడకంపై నిషేధం
త్వరలో ఆదేశాలు జారీ చేస్తామన్న సీఎం ముంబై: బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వినిమయంపై త్వరలోనే నిషేధం విధిస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. పొగాకు, గుట్కా, పాన్ మసాలా, సిగరెట్ల వాడకం వల్ల ఆ ఒక్క వ్యక్తి మాత్రమే రోగాల బారిన పడబోరని, అతని కుటుంబమంతా నష్టపోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడి టాటా మెమోరియల్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడకంపై త్వరలోనే నిషేధం విధిస్తామని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్యాన్సర్ సంభావ్యత 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉందని అన్నారు. అందువల్ల క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా సంస్థల దరిదాపుల్లో పొగాకు, పాన్ మసాలాల అమ్మకాలు బాగా పెరిగినట్టు తెలుస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. అందువల్ల హోం శా, విద్యా విభాగం సహకారంతో వాటి అమ్మకాలపై నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పారు. పొగాకు ఉత్పత్తులపై పంజాబ్ ప్రభుత్వం భారీగా పన్నులు విధించిందని అన్నారు. అయితే ఆ పన్నుల వల్ల ఎటువంటి ఫలితాలు వచ్చాయో మాత్రం స్పష్టం కాలేదన్నారు. ఏదైనా మంచి ఫలితం ఉంటే ఆ విధానాన్ని తాము కూడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని ఫడ్నవీస్ చెప్పారు.