ఇప్పటికి కూడా చాలా మందికి సొంత ఇంట్లో ఉండాలా? లేక అద్దె ఇంట్లో ఉండాలా? అనే ప్రశ్న, ప్రశ్నగానే ఉంది. కొందరు సొంత ఇల్లు బెస్ట్ అంటే.. మరి కొందరు అద్దె ఇల్లు బెటర్ అని చెబుతున్నారు. అయితే ఈ ప్రశ్నకు జెరోధా సీఈఓ నితిన్ కామత్ తనదైన రీతిలో సమాధానం వెల్లడించారు.
జర్నలిస్ట్ సోనియా షెనాయ్‌తో పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జెరోధా సీఈఓ నితిన్ కామత్ 'రెంట్ vs బై' ప్రశ్నకు సమాధానంగా.. సొంత ఇల్లు కంటే అద్దె ఇంట్లో ఉండటానికే తాను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని తన అభిప్రాయం వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
నితిన్ కామత్ జవాబుతో కొందరు ఏకీభవిస్తే.. మరికొందరు సొంతంగా ఇల్లు ఉంటేనే బాగుంటుందని వాదిస్తున్నారు. నితిన్ కామత్ మాట్లాడుతూ.. తనకు ఉన్న ఇల్లు తన తల్లిదండ్రులదని, భావోద్వేగాల కారణంగా ఎప్పుడూ ఆ ఇంటిని అంటిపెట్టుకుని ఉండాలని, కాబట్టే కొత్త ఇల్లు కొనేది లేదని వెల్లడించారు.
ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో లక్షల వ్యూవ్స్ పొందింది. దీనిపైనా నెటిజన్లు రకరాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అతని మాటలు ఎవరూ నమ్మొద్దని, అవన్నీ మూర్ఖపు మాటలని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆగస్టు నుంచి 'జీమెయిల్' షట్‌డౌన్! ఇందులో నిజమెంత?
Comments
Please login to add a commentAdd a comment