భారతదేశాన్ని వాయు కాలుష్యం మహమ్మారిలా పట్టి పీడిస్తోంది. ఈ సమయంలో జెరోధా కో-ఫౌండర్ 'నితిన్ కామత్' రియల్ ఎస్టేట్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
నితిన్ కామత్ తన ఎక్స్ ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేస్తూ.. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము. కింద కనిపిస్తున్నది 2019 వరకు డేటా. అయితే గత ఐదేళ్లలో పరిస్థితులు ఎంత దిగజారాయనిధి స్పష్టంగా కనిపిస్తోంది. వాయు కాలుష్యం కారణంగా భారతదేశంలో ప్రతి ఏటా లెక్కకు మించిన జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గాలి కాలుష్యం కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య అధికం.
భూమిని కొనుగోలు చేసే ఎవరైనా గాలి, నీటి నాణ్యతను ఆస్తిగా భావించరు. కానీ గాలి, నీటి నాణ్యత అనేది ఆస్తి రేటును నిర్ణయిస్తుంది. నేను బెంగళూరులోని జేపీ నగర్‌లో ఆస్తిని కలిగి ఉన్నాను. ఇది ఇతర లేఅవుట్‌ల కంటే మంచి వాతావరణంలో ఉందని నితిన్ కామత్ పేర్కొన్నారు.
దేశ రాజధాని అందరినీ ఆకర్శిస్తున్నప్పటీ.. అక్కడి వాతావరణం చాలా దుర్భర స్థితిలో ఉంది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 412 కంటే ఎక్కువ ఉంది. దీన్ని బట్టి చూస్తే.. ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమైపోతోంది. అయితే నోయిడా, ఘజియాబాద్ వంటి ప్రాంతాల్లో గాలి నాణ్యత కొంత మెరుగ్గానే ఉంది.
ఇదీ చదవండి: జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు?.. ఇవి తెలుసుకోండి
ఢిల్లీ మాత్రమే కాకుండా.. ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరులో కూడా కాలుష్యం కొంత తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వాయు కాలుష్యం అనేది కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. కాబట్టి దీనికోసం సమిష్టి పరిష్కారాలు అవసరం. లేకుంటే.. రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందిన నగరాల్లో కూడా భూములు కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపరు. కాబట్టి రియల్ ఎస్టేట్ ధరలను కాలుష్యం నిర్ణయిస్తుందని నితిన్ కామత్ అన్నారు.
You have to wonder what it will take for us to take air pollution more seriously. By the way, this data only covers until 2019, and things have only gotten worse in the last five years.
Maybe a property price discount for the quality of air and water is the solution. If… pic.twitter.com/QtyzkqoG43— Nithin Kamath (@Nithin0dha) November 24, 2024
Comments
Please login to add a commentAdd a comment