టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. చాలా పనులు సులభమైపోతున్నాయి. సోషల్ మీడియాను ఉపయోగించుకుని చాలామంది ఉద్యోగార్థులు జాబ్స్ వెతుక్కుంటూ ఉంటారు. ఇక్కడ మోసపోవడానికి కూడా ఆస్కారాలు చాలానే ఉన్నాయి. కాబట్టి దీని నుంచి బయట పడటానికి కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది.
ఉద్యోగం వెతుక్కోవడం కోసం చాలామంది లింక్డ్‌ఇన్‌ను ఆశ్రయిస్తారు. ఇది జాబ్స్ సెర్చ్ చేసుకోవడానికి విశ్వసనీయమైన స్థలం అయినప్పటికీ.. కొంత మంది తప్పుడు ప్రకటనలతో మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని.. లింక్డ్‌ఇన్ ఇండియా లీగల్ & పబ్లిక్ పాలసీ హెడ్ 'అదితి ఝా' పేర్కొన్నారు. లింక్డ్‌ఇన్ ప్లాట్‌ఫామ్‌లో ఇలాంటి మోసాలను నివారించడానికి మా బృందం పనిచేస్తోందని కూడా అన్నారు.
జాబ్ సెర్చ్ చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
➤ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్న సమయంలో.. మీకు కనిపించే ఉద్యోగ పోస్టింగ్‌పై ధృవీకరణ బ్యాడ్జ్ అనేది ఉందా? లేదా? అని గమనించాలి. పోస్టర్ అధికారిక కంపెనీ పేజీతో అనుసంధానించి ఉంటే అలాంటి వాటిని ఎంచుకోవచ్చు. ఉద్యోగానికి సంబంధించిన ధృవీకరణ చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.
➤మీరు ఒక ఉద్యోగాన్ని వెతుకుతున్న సమయంలో బ్యాంకింగ్ వివరాలు లేదా ఇతర వ్యక్తిగత సమాచారం అడుగుతున్నారంటే.. అలాంటి వివరాలను చెప్పకపోవడమే ఉత్తమం.
➤ఇంటర్వ్యూ కోసం ఎన్‌క్రిప్టెడ్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయమని అడగడం లేదా తక్కువ పనికి అధిక వేతనంతో ఉద్యోగాలను అందించడం వంటివి చెబితే అస్సలు నమ్మకూడదు. చట్టబద్దమైన సంస్థలు ఎప్పుడూ ఇలాంటి విషయాలను చెప్పదని గుర్తుంచుకోవాలి.
➤ఉద్యోగం కోసం ఎవరైనా మిమ్మల్ని డబ్బు డిమాండ్ చేస్తే.. క్రిప్టోకరెన్సీని, గిఫ్ట్ కార్డ్‌లను పంపమని లేదా పెట్టుబడి పెట్టమని అడగడం పట్ల జాగ్రత్తగా ఉండండి. జాబ్ ఇచ్చే కంపెనీలు మీ నుంచి డబ్బు ఆశించదు.
➤కంపెనీల అధికారిక లింక్డ్‌ఇన్ పేజీలలో ఉద్యోగాలను వెతుక్కోవడం మంచిది. జాబ్ పోస్టర్‌లతో కంపెనీలు పోస్ట్ చేసిన ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా సెర్చ్ చేయడానికి ఫిల్టర్ వంటివి ఎంచుకోవచ్చు. ఇది ఎంచుకుంటే.. వెరిఫికేషన్‌లతో కూడిన జాబ్‌లు మాత్రమే మీ శోధన ఫలితాల్లో కనిపిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment