linkdin
-
ఏఐ డిటెక్టర్ ప్రమాదం!.. పాక్ మహిళ పోస్ట్ వైరల్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో చాలామంది 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) మీద ఆధారపడుతూ ముందుకు సాగుతున్నారు. అయితే ఓ మహిళ ఈ ఏఐ వల్లనే ఉద్యోగం కోల్పోయినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆమె ఉద్యోగం ఎలా పోయిందనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..ప్రస్తుతం చాలా దేశాల్లో ఇంటర్వ్యూ ప్రక్రియలను నిర్వహించడానికి ఏఐ డిటెక్టర్లను వాడుతున్నారు. ఈ ఏఐ డిటెక్టర్ల కారణంగానే జాబ్ ఇంటర్వ్యూలో తిరస్కరణకు గురయ్యానని పాకిస్థానీ మహిళ 'దామిషా ఇర్ఫాన్' లింక్డ్ఇన్ పోస్ట్‌లో వెల్లడించింది. నేను సొంతంగా కంటెంట్ క్రియేట్ చేసినప్పటికీ.. దానిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించినట్లుగా ఏఐ డిటెక్టర్ నిర్దారించింది.ఏఐ సాధనాలు మానవ సృజనాత్మకతను, ఏఐ రూపొందించిన టెక్స్ట్ మధ్య తేడాను ఖచ్చితంగా గుర్తించలేకపోవడం వల్లనే.. ఇంటర్వూలో రిజెక్ట్ అయ్యాను. ఈ సంఘటన జరిగిన తరువాత, లోపభూయిష్ట సాంకేతికత కారణంగా మనం ప్రతిభను కోల్పోతున్నామా? అనే ప్రశ్నను దామిషా ఇర్ఫాన్ లేవనెత్తింది. సరైన నిర్ణయం తీసుకోవడంలో ఏఐ ఎలా ఉపయోగపడుతుందో.. మళ్ళీ పరీశీలించాలని, లేకుంటే ప్రమాదమని వెల్లడించింది.సోషల్ మీడియాలో ఇర్ఫాన్ పోస్ట్ చర్చకు దారితీసింది. నెటిజన్లు దీనిపైన వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కంటెంట్ రైటర్‌గా పని చేయడం మానేయడానికి ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నాను. డిజిటల్ వ్యాపార దిగ్గజాలు కంటెంట్ క్రియేటింగ్, బిజినెస్ ప్రమోషన్ కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించనివ్వండి అని ఒక నెటిజన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి షాక్!.. రిలయన్స్ పవర్‌పై మూడేళ్ళ నిషేధంఏఐ డిటెక్టర్లు.. దాదాపు 99 శాతం అసలు కంటెంట్‌ను కూడా ఏఐ క్రియేట్ చేసినట్లు ఫ్లాగ్ చేస్తున్నాయని మరొకరు పేర్కొన్నారు. కంటెంట్‌ను ఏఐ క్రియేట్ చేయడానికి, మానవులు క్రియేట్ చేయడానికి చాలా వ్యత్యాసం ఉందని ఇంకొకరు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. -
''అతడు గెలిచాడు.. నేను విడాకులు తీసుకున్నాను''
ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. కంపెనీలోని ఉన్నతోద్యోగులు మంచి నడవడిక కలిగినవారైతే.. ఇతర ఉద్యోగులు కూడా వారిని అనుసరించవచ్చు. కానీ ఉన్నతోద్యోగులు చెడ్డవారైతే? పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ విషయాన్ని రిటైర్డ్ అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ 'ఏతాన్ ఎవాన్స్' వెల్లడించారు.అమెజాన్ సంస్థలో పనిచేస్తున్న సమయంలో కంపెనీ సీఈఓ తన భార్యను ప్రలోభపెట్టాడని, దీంతో వారిరువురు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని 'ఏతాన్ ఎవాన్స్' (Ethan Evans) పేర్కొన్నారు. ఈ విషయంలో అతడు గెలిచాడు, నేను విడాకులు తీసుకున్నానని అన్నారు. పని విషయంలో సీఈఓను వ్యతిరేకించిన కారణంగా.. తనపై ప్రతీకారం తీర్చుకోవాలనే నెపంతో తన భార్యను ప్రలోభపెట్టారని లింక్డ్ఇన్లో వెల్లడించారు.అప్పట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా అమెజాన్ కంపెనీలో పనిచేయాల్సి వచ్చింది. అదే నేను చేసిన పెద్ద పొరపాటు. ఆ సమయంలోనే ఉద్యోగం వదిలేసి ఉంటే చాలా బాగుండేదని ఆయన అన్నారు. అంతే కాకుండా కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కొన్ని టిప్స్ కూడా చెప్పారు.ఏతాన్ ఎవాన్స్ టిప్స్➡మీరు పనిచేసే కంపెనీలో మేనేజర్ మంచి వారైతే.. వారి నుంచి మంచి విషయాలను నేర్చుకోండి. ➡పాములను గుర్తించండి (చెడ్డవారిని గుర్తించండి).➡సంస్థలో ఉన్నతోద్యోగులు చెడ్డవారని తెలిసినప్పటికీ.. మీ పని మాత్రం అద్భుతంగా ఉండేలా చూసుకోండి.➡చెడ్డవారిని నేరుగా ఎదుర్కోవద్దు.➡చెడ్డవారిని ఎదుర్కోవడానికి మీరు కూడా పాములా మారకండి. -
లింక్డ్ఇన్పై అసంతృప్తి.. భవిష్ అగర్వాల్ ట్వీట్ వైరల్
ఓలా సీఈఓ ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ పోస్ట్ చేస్తూ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో లింక్డ్ఇన్ను విమర్శించారు. పాశ్చాత్య దేశాల టెక్నలాజిలు భరతదేశంలో వ్యాపిస్తున్నాయి. ఇందులో లోపాలు కూడా కూడా ఉన్నయని వివరించారు. అందుకే భారత్ సొంత టెక్నాలజీని నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు.లింక్డ్ఇన్ ఏఐ బాట్లో 'భవిష్ అగర్వాల్' ఎవరు అని సెర్చ్ చేస్తే.. వచ్చిన ఫలితంలో చాలా వరకు సర్వనామాలకు సంబంధించిన దోషాలు ఉన్నయని భవిష్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.దీనిపైన లింక్డ్ఇన్ కూడా స్పందించింది. ఇది ప్రొఫెషనల్ కమ్యూనిటీ పాలసీలకు వ్యతిరేఖంగా ఉందని లింక్డ్ఇన్ నోటిఫికేషన్ ద్వారా పేర్కొన్నారు. నిజానికి భారత్ సొంత టెక్నాలజీని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాల టెక్నాలజీలను గుడ్డిగా నమ్మితే ఇలాంటి దోషాలే వస్తాయి. దీనిని యూజర్స్ నమ్మే ప్రమాదం ఉంది.Dear @LinkedIn this post of mine was about YOUR AI imposing a political ideology on Indian users that’s unsafe, sinister.Rich of you to call my post unsafe! This is exactly why we need to build own tech and AI in India. Else we’ll just be pawns in others political objectives. pic.twitter.com/ZWqiM90eT1— Bhavish Aggarwal (@bhash) May 9, 2024 -
ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు!
ఉద్యోగమంటే టాలెంట్ చూసి ఇవ్వడం ఆనవాయితీ, అయితే బెంగళూరులో ఒక యువతి తెల్లగా ఉందన్న కారణంతో జాబ్ ఇవ్వలేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బెంగళూరులో ఒక సంస్థ ఉద్యోగ ప్రకటన చూసి 'ప్రతీక్ష జిక్కర్' అనే యువతి అప్లై చేసుకుంది. కంపెనీ నిర్వహించిన పరీక్షలో విజయం పొందింది, ఆ తరువాత జరిగిన మూడు రౌండ్లను కూడా ఆమె పూర్తి చేసింది. అయితే చివరికి కంపెనీ మాత్రం ఈమెను రిజెక్ట్ చేసింది. దీనికి ప్రధాన కారణం ఆమె తెల్లగా ఉండటమే అని సంస్థ తెలిపింది. కంపెనీ పంపిన మెయిల్లో 'మేము మీ ప్రొఫైల్ చూసాము, ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు మీకు ఉన్నాయి, కానీ మా మొత్తం టీమ్‌లోని ఇతర సభ్యులకంటే తెల్లగా ఉండటం వల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నామని' తెలిపింది. ఈ విషయాన్ని ప్రతీక్ష జిక్కర్ లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: ఫుడ్ సీక్రెట్ చెప్పిన సుధామూర్తి - విదేశాలకు వెళ్లినా..) నిజానికి కంపెనీ మెయిల్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను, మనిషి రంగును బట్టి కూడా ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందని నేను ఊహించలేదు, మనిషి కలర్ కాకుండా ప్రతిభను బట్టి ఉద్యోగం ఇవ్వాలని కంపెనీని కోరుతూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన చాలామంది తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. బహుశా ఇలాంటి సంఘటన బెంగళూరులో వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కావచ్చు. -
భారత్‌లో డిమాండ్ ఉన్న జాబ్స్ స్కిల్స్ ఇవే
ప్రపంచ దేశాల్లో ఆర్ధిక మాంద్యం భయాలు కొనసాగుతున్నాయి. నిరుద్యోగం పెరిగిపోవడం, ప్రజల ఆర్జన శక్తి తగ్గడం, ద్రవ్యోల్బణం పెరగడం, కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు తగ్గిపోయే పరిస్థితులు ఎదుర్కొనబోతున్న నేపథ్యంలో చిన్న చిన్న కుటీర పరిశ్రమల నుంచి బడాబడా టెక్ కంపెనీల వరకు ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. అయితే జాబ్ మార్కెట్ ఎక్కువగా ఉండే దేశాలతో పాటు భారత్ వంటి దేశాల్లో కొత్త ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికలకు కొనసాగింపుగా.. భారత్‌లో ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ సైట్ లింక్డ్ ఇన్‌కు బుధవారం నాటికి 56 శాతం వృద్దితో 100 మిలియన్ల మంది యూజర్లను దాటినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీంతో మైక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డ్ ఇన్ గ్లోబల్ ఎక్కువ మంది యూజర్లు ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఇక భారత్‌కు చెందిన యూజర్లు లింక్డ్ ఇన్‌లో ఎక్కువగా సాఫ్ట్వేర్ & ఐటీ, మ్యానిఫ్యాక్చరింగ్, కార్పొరేట్ సర్వీస్,ఫైనాన్స్, ఎడ్యూకేషన్ రంగాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లు ఆ సంస్థ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. నేర్చుకునేందుకు 4.6 మిలియన్ల గంటలు 2022లో లింక్డ్ ఇన్‌లో భారత్‌కు చెందిన యూజర్లు ఎక్కువగా నేర్చుకునేందుకు సమయం వెచ్చించారు. యూఎస్ యూజర్ల కంటే రెండు రెట్లు ఎక్కువగా భారత్ యూజర్లు లెర్నింగ్ కోసమే 4.6 మిలియన్ గంటలు వెచ్చించారు. టాప్ 10 స్కిల్స్ ఇవే మనదేశంలో డిమాండ్ ఉన్న టాప్ 10 స్కిల్స్ జాబితాలో మేనేజ్మెంట్ (1వ స్థానం), కమ్యూనికేషన్ (4),సేల్స్ (10), సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ (2), ఎస్‌క్యూఎల్ (3), జావా (5), లీడర్షిప్ (6), అనటికల్ స్కిల్స్ (8)ఈ జాబితాలో ఉన్నాయి. -
ఏడుపుగొట్టు సీఈఓ.. బామ్మ చావును కూడా కంపెనీ ప్రమోషన్‌కే!
'హైపర్ సోషల్' సీఈఓ బ్రాడెన్ వాలెక్ అంటే లింక్డ్ఇన్లో దాదాపు తెలియని వారుండురు. ఈయన గతంలో ఓసారి సంస్థలోని ఉద్యోగులను మూకుమ్మడిగా తొలిగించిన అనంతరం ఏడుస్తున్న పోట్ షేర్ చేయడం వైరల్‌గా మారింది. ఇప్పుడు మరోసారి ఆయన అలాంటి ఫోటోనే షేర్ చేశారు. తన గ్రాండ్మా చనిపోయిందని అమ్మ నుంచి మెసేజ్ వచ్చిందని బ్రాడెన్ ఓ పోస్టు పెట్టాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ ఘటన వర్క్, లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరాన్ని తనకు తెలియజేసిందని చెప్పుకొచ్చాడు. తాను హైపర్సోషల్ను ప్రారంభించింది కూడా ఇందుకే అని పేర్కొన్నాడు. హైపర్ సోషల్‌తో వ్యాపారాన్ని సులభంగా చేసుకోవచ్చని, దీని వల్ల కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుందని వివరించాడు. బ్రాడెన్ పోస్టుపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. బామ్మ చావును కూడా కంపెనీ ప్రమోషన్ కోసం ఉపయోగించుకుంటున్నారు, ఇది వెరీ సాడ్ పోస్టు అని ఓ లింక్డ్ఇన్ యూజర్ విమర్శించాడు. సీఈఓ పోస్టు ట్విట్టర్లో కూడా చర్చనీయాంశమైంది. ఈ ఏడుపు గొట్టు సీఈవో కంపెనీ ప్రచారం కోసం ఏమైనా చేసేలా ఉన్నాడు అని నెటిజన్లు ఫైర్ అయ్యారు. చదవండి: ‘కోహినూర్’పై బకింగ్‌హామ్ ప్యాలెస్ సమీక్ష.. భారత్‌కు అప్పగిస్తారా? -
Bill Gates Resume: రెజ్యూమ్ అంటే అట్లుంటది: బిల్‌గేట్స్ పోస్ట్ వైరల్
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు సంబంధించి ఒక ఆసక్తికర విషయం విశేషంగా ఆకట్టుకుంటోంది. 48 ఏళ్ల పాత రెజ్యూమ్ ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన బిల్ గేట్స్ తన రెజ్యూమ్‌ను శుక్రవారం సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేశారు. ‘‘మీలో ఎవరైనా ఇటీవల గ్రాడ్యుయేట్ అయినా లేదా కాలేజీ డ్రాపౌట్ అయినా, మీ రెజ్యూమ్ 48 సంవత్సరాల క్రితం నాటి నా రెజ్యూమ్ కంటే చాలా మెరుగ్గా ఉంటుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను’’ అని ఆయన తన పోస్ట్‌లో చెప్పారు. 1973 నాటి విలియం హెన్రీ గేట్స్ (బిల్ గేట్స్) రెజ్యూమ్ చూసి మంచి రెజ్యూమ్ కోసం వెబ్సైట్లు కన్సల్టెంట్లను వెతుక్కునే యూత్ అంతా వావ్ అంటోంది. సుమారు 48 ఏళ్ల క్రితం తాను ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే సమయంలో అప్పటి రెజ్యూమ్‌ను మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌గేట్స్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.1973లో బిల్‌గేట్స్ హార్వర్డ్స్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో ఉన్నారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై లింక్డిన్ వినియోగదారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక-పేజీ రెజ్యూమ్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు. చాలా బాగుంది. మన జీవితంలో మనం ఎంత సాధించామో చాలాసార్లు మర్చిపోతాం. అందుకే అలాంటి జ్ఞాపకాలం కోసం గత రెజ్యూమ్‌ల కాపీలను దాచుకోవాలని ఒకరు, అది రెజ్యూమ్‌లా లేదు ప్రామిసరీ నోట్‌గా ఉందని మరో యూజర్ వ్యాఖ్యానించడం విశేషం. -
చైనాతో కటీఫ్.. భారత్‌తో దోస్తీ!
ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలోని ‘లింక్డిన్’ అడుగులు భారత్ వైపు పడ్డాయి. హిందీ మాట్లాడేవాళ్ల కోసం లింక్డిన్‌ని హిందీ భాషలో అందుబాటులోకి తెచ్చింది. ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌లలో టాప్ పొజిషన్లో ఉన్న లింక్డిన్.. గురువారం నుంచి హిందీ సేవలను ప్రారంభించినట్లు పేర్కొంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా 25 ప్రధాన భాషల్లో సేవలు అందిస్తున్నట్లయ్యింది. మొబైల్, డెస్క్‌టాప్ వెర్షన్లలో లింక్డిన్ మెంబర్స్ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. చైనాతో పొసగకే! ఇదిలా ఉంటే చైనా ప్రభుత్వం ఆంక్షల వల్ల వరుసగా ఎంఎన్‌సీలు ఆ దేశాన్ని వీడుతున్న విషయం తెలిసిందే. ఈ దెబ్బకు చైనాలో మిగిలిన ఏకైక అతిపెద్ద విదేశీ కంపెనీ మైక్రోసాఫ్ట్. అయితే ఆ నిబంధనల వల్ల లింక్డిన్ నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అయితే 54 మిలియన్ల యూజర్ల కోసం.. ఇన్జాబ్స్ (లింక్డ్ ఇన్‌లో మాదిరి యూజర్లు తమ అభిప్రాయాలను పంచుకొలేరు) పేరుతో ఓ ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయించింది. ఈ తరుణంలో చైనాను వీడేందుకే.. భారత్ వైపు అడుగులు వేస్తోందని, ఇందులో భాగంగానే ఇక్కడి యూజర్లను ఆకర్షించేందుకే ‘హిందీ’ అడుగు వేసినట్లు విశ్లేషిస్తున్నారు. ఇక లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండా.. గత మూడేళ్లలో 20 మిలియన్ల మంది లింక్డిన్ యూజర్లు పెరిగారు భారత్‌లో. దీంతో భారత్‌లో యూజర్లను పెంచుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది మైక్రోసాఫ్ట్. బిజినెస్ అండ్ ఎంప్లాయిమెంట్ ఒరియెంటెడ్ ఆన్లైన్ సర్వీస్ ‘లింక్డిన్’.. 2003లో మే5న అమెరికా నుంచి తన కార్యకలాపాల్ని ప్రారంభించింది. వెబ్సైట్, యాప్‌ల రూపంలో సర్వీసులు అందిస్తోంది. ఇక 2014లో చైనాలో కార్యకలాపాల్ని ప్రారంభించిన లింక్డిన్.. అమెరికా తర్వాత చైనాలోనే అతిపెద్ద మార్కెట్‌ను కలిగి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో చైనా మార్కెట్ నుంచి నెమ్మదిగా జరుగుతూ.. భారత్‌కు చేరువవుతుండడం విశేషం. చదవండి: చైనా ముందే చెప్పింది.. అయినా వినలేదు! -
వైరల్: జాబ్‌కు ఆప్లికేషన్ ఇవ్వలేదు.. ఓ వీడియోతో జాబ్ కొట్టేశాడు..!
ముంబై: కరోనా మహామ్మారి పుణ్యానా విద్యార్థులందరు ఇంటికే పరిమితమయ్యారు. విద్యార్థులు ఇంట్లోనే ఉండి తమ అకడమిక్ ఇయర్‌ను కొనసాగిస్తున్నారు. విద్యార్థుల్లో కొంతమంది తమ డిగ్రీని పూర్తి చేసి ఉద్యోగాల కోసం నానాతంటాలు పడుతుండగా.. అందుకోసం వీలైనన్నీ కంపెనీలకు ఆప్లికేషన్లను పంపుతూ.. తమ అదృష్టాన్ని చెక్ చేసుకుంటున్నారు. విద్యార్థుల్లో కొంతమంది తమ డ్రీమ్ జాబ్‌ను సంపాదించుకోవడం ఎంతగానో కష్టపడుతున్నారు. మనలో సత్తా ఉండాలేగానీ.. ఉద్యోగమే మనల్ని వెతుకుంటూ వస్తోంది. కాగా ముంబైకు చెందిన 21 ఏళ్ల అవ్కాష్ షా (గ్రాఫిక్ డిజైనర్) విషయంలో అదే జరిగింది. అవ్కాష్ తన డ్రీమ్ జాబ్ సంపాదించుకోవడం కోసం.. భిన్నంగా ఆలోచించి తన శక్తి సామర్య్థాలను నేరుగా కంపెనీకి చూపించలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఓ 3డీ మోషన్ వీడియోను తన లింక్డిన్ ఖాతాలో ప్రముఖ క్రెడిట్‌కార్డు కంపెనీ క్రిడ్ను టాగ్ చేన్తూ పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారి, సుమారు పది లక్షల వరకు వ్యూస్ వచ్చాయి. వీడియోను చూసిన పలు కంపెనీలు అవ్కాష్ షాకు ఉద్యోగాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. కాగా ఈ వీడియోను క్రిడ్ కంపెనీ వ్యవస్థాపకుడు కునాల్ షాను ఎంతగానో ఆకర్షించింది. కంపెనీ నుంచి అవ్కాష్ షా క్రిడ్ డిజైన్ మాఫియాలోకి వెల్కమ్ అంటూ మెసేజ్‌ను పంపించింది. దీంతో అవ్కాష్ షా ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఈ వీడియోతో తాను కోరుకున్న డ్రీమ్ జాబ్‌ను సంపాదించుకోవడంలో మార్గం సుగుమం చేసుకున్నాడు. ఈ వీడియోను చూసిన లింక్డిన్ అవ్కాష్ను మెచ్చుకుంది. చదవండి: యూట్యూబ్ కొత్త అప్ డేట్స్, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న క్రియేటర్స్ -
భారీ సంఖ్యలో లీకైన లింక్డ్ఇన్ యూజర్ల డేటా!
కొద్ది రోజుల క్రితం 53.3 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటా లీకైన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరవక ముందే లింక్డ్ఇన్ యూజర్ల డేటా లీక్ అయింది. సైబర్‌న్యూస్ ప్రకారం.. 50 కోట్లకు పైగా లింక్డ్ఇన్ వినియోగదారుల డేటా డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉన్నట్లు పేర్కొంది. లీక్ అయిన సమాచారంలో లింక్డ్ఇన్ ఐడి, పూర్తి పేర్లు, ఇమెయిల్ చిరునామాలు, ఫోన్ నంబర్లు, లింగాలు, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్, ఇతర కీలక వివరాలు ఉన్నాయి. ఈ మేరకు 50 కోట్ల మంది వివరాల్ని హ్యాక్ చేసిన సైబర్ నేరగాడు దాన్ని ఓ వెబ్సైట్లో అమ్మకానికి ఉంచినట్లు సైబర్‌న్యూస్ అనే వార్తా సంస్థ పేర్కొంది. ఈ సమాచారాన్ని సదరు హ్యాకర్ కొన్ని వేల డాలర్లు విలువ చేసే బిట్కాయిన్లకు విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. లీకైన డేటా లింక్డ్ఇన్ యూజర్ల ఫొఫైళ్ల నుంచి హ్యాక్ చేసినవి కాదని లింక్డ్ఇన్ తెలిపింది. కొన్ని ఇతర వెబ్సైట్లు, కంపెనీల నుంచి సేకరించిన వివరాల సమాహారమని పేర్కొంది. దాదాపు 50 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల సమాచారం ఆన్లైన్లో కనిపించడం ఇటీవల కలకలంరేపిన విషయం తెలిసిందే. 106 దేశాలకు చెందిన వినియోగదారుల ఫేస్బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, ప్రాంతాలు, పుట్టిన తేదీలు, ఈ-మెయిల్ ఐడీలు, చిరునామాలు అమ్మకానికి ఉంచారు ఇటాలియన్ గోప్యతా వాచ్డాగ్ లింక్డ్ఇన్ మిలియన్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ఏవిదంగా బహిర్గతం అయ్యింది అనే దానిపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ డేటా ద్వారా స్పామ్ కాల్స్, స్పామ్ మెయిల్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు సైబర్ నిపుణులు పేర్కొన్నారు. అలాగే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి టూ-స్టెప్-వెరిఫికేషన్ ఆక్టివేట్ చేసుకోవాలని, అలాగే మీ లింక్డ్ఇన్ ఖాతా పాస్వర్డ్, లింక్డ్ఇన్ ఖాతాతో అనుబంధించబడిన ఈమెయిల్ చిరునామా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: గుప్త నిధులు దొరికితే.. అది ఎవరికి చెందుతుంది? -
నియామకాలకు ‘సోషల్’ రూట్
ముంబై: సోషల్ మీడియా వెబ్సైట్ల ద్వారా కంపెనీలు ఉద్యోగాలివ్వడం పెరుగుతోంది. కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాలకు సరైన అభ్యర్థులను ఫేస్బుక్, లింక్డిన్,ట్విటర్, గూగుల్ ప్లస్ తదితర సామాజిక వెబ్సైట్ల ద్వారానే కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ పోకడ ఈ ఏడాది 50 శాతం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సునిల్ గోయల్(గ్లోబల్‌హంట్), ఆల్ఫ్ హారిస్ (మైకేల్ పేజ్). నిశ్చల్ సూరి(కేపీఎంజీ ఇండియా పార్ట్నర్)వంటి నిపుణుల అభిప్రాయాల ప్రకారం..., {పతి నిత్యం బిజీగా ఉంటున్న వ్యక్తులకు పరిశ్రమలో వస్తున్న తాజా మార్పులను తెలుసుకోవడానికి సోషల్ మీడియానే ఏకైక సాధనంగా ఉంటోంది. అంతేకాకుండా వీరంతా తమ తాజా స్టేటస్‌లను ఈ వెబ్సైట్లలోనే అప్డేట్ చేస్తున్నారు. 2010లో ప్రారంభమైన ఈ పోకడ ప్రతీ ఏడాది 50 శాతం చొప్పున వృద్ధి సాధిస్తోంది. ఫలితంగా కంపెనీలు తమకు కావలసిన అభ్యర్ధులను తేలికగా పట్టుకోగలుగుతున్నాయి. జాబ్ పోర్టళ్ల ద్వారా, ఉద్యోగ నియామక ఏజెన్సీల ద్వారా ఉద్యోగాలు పొందడం కంటే సోషల్ మీడియా వెబ్సైట్ల ద్వారా ఉద్యోగాలు పొందితేనే ఎక్కువ వేతనం డిమాండ్ చేయవచ్చని మధ్య, ఉన్నత స్థాయి మేనేజర్లు భావిస్తున్నారు. ఐటీ, ఐటీఈఎస్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లోని కంపెనీలు వివిధ స్థాయిల్లోని ఉద్యోగాలను సోషల్ మీడియా వెబ్సైట్ల ద్వారా భర్తీ చేస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ, తయారీ, విద్యుత్, ఇంధన, రిటైల్, ఆటోమొబైల్ రంగాల్లోని కంపెనీలు కూడా మధ్య, ఉన్నత స్థాయి ఉద్యోగాలను ఈ వెబ్సైట్ల ద్వారా కూడా భర్తీ చేసుకుంటున్నాయి. సరైన ఉద్యోగాలు పొందడానికి అభ్యర్థులకు, సరైన ఉద్యోగులను ఎంపిక చేసుకోవడానికి కంపెనీలకు సోషల్ వెబ్సైట్లు కీలకంగా మారాయి. నియామక ప్రక్రియలో ఇలాంటి వైబ్సైట్ల పాత్ర ఒక భాగమే. నియామక ప్రక్రియ నుంచి అభ్యర్థి సామర్థ్యాలను మదింపు చేసే ప్రక్రియలో మాత్రం ఈ వెబ్సైట్ల పాత్ర పరిమితంగానే ఉంటోంది. దాదాపు 80 శాతం వరకూ కంపెనీలు ఉద్యోగ నియామకాలకు సామాజిక మీడియా వెబ్సైట్లను ఉపయోగించుకుంటున్నాయి. ఈ సోషల్ మీడియా వెబ్సైట్ల ద్వారా ఉద్యోగాలివ్వడమనేది ఫార్చ్యూన్ 500, అంతర్జాతీయ కంపెనీల్లో అధికంగా ఉంది.