ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. కంపెనీలోని ఉన్నతోద్యోగులు మంచి నడవడిక కలిగినవారైతే.. ఇతర ఉద్యోగులు కూడా వారిని అనుసరించవచ్చు. కానీ ఉన్నతోద్యోగులు చెడ్డవారైతే? పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ విషయాన్ని రిటైర్డ్ అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ 'ఏతాన్ ఎవాన్స్' వెల్లడించారు.
అమెజాన్ సంస్థలో పనిచేస్తున్న సమయంలో కంపెనీ సీఈఓ తన భార్యను ప్రలోభపెట్టాడని, దీంతో వారిరువురు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని 'ఏతాన్ ఎవాన్స్' (Ethan Evans) పేర్కొన్నారు. ఈ విషయంలో అతడు గెలిచాడు, నేను విడాకులు తీసుకున్నానని అన్నారు. పని విషయంలో సీఈఓను వ్యతిరేకించిన కారణంగా.. తనపై ప్రతీకారం తీర్చుకోవాలనే నెపంతో తన భార్యను ప్రలోభపెట్టారని లింక్డ్‌ఇన్‌లో వెల్లడించారు.
అప్పట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా అమెజాన్ కంపెనీలో పనిచేయాల్సి వచ్చింది. అదే నేను చేసిన పెద్ద పొరపాటు. ఆ సమయంలోనే ఉద్యోగం వదిలేసి ఉంటే చాలా బాగుండేదని ఆయన అన్నారు. అంతే కాకుండా కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కొన్ని టిప్స్ కూడా చెప్పారు.
ఏతాన్ ఎవాన్స్ టిప్స్
➡మీరు పనిచేసే కంపెనీలో మేనేజర్ మంచి వారైతే.. వారి నుంచి మంచి విషయాలను నేర్చుకోండి.
➡పాములను గుర్తించండి (చెడ్డవారిని గుర్తించండి).
➡సంస్థలో ఉన్నతోద్యోగులు చెడ్డవారని తెలిసినప్పటికీ.. మీ పని మాత్రం అద్భుతంగా ఉండేలా చూసుకోండి.
➡చెడ్డవారిని నేరుగా ఎదుర్కోవద్దు.
➡చెడ్డవారిని ఎదుర్కోవడానికి మీరు కూడా పాములా మారకండి.
Comments
Please login to add a commentAdd a comment