ex employee
-
ఐటీ కంపెనీల్లో ఇదీ పరిస్థితి: ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్
వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి సర్వత్రా చర్చ జరుగుతున్న తరుణంలో.. ఇన్ఫోసిస్ (Infosys) మాజీ ఉద్యోగి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇందులో ఇన్ఫోసిస్ కంపెనీకి, ఇతర పెద్ద టెక్ సంస్థలకు.. పని సంస్కృతిలో, ఇతర విషయాలలో ఉన్న తేడాను వివరించారు. ఐటీ కార్పొరేట్ సంస్కృతి నిలువు దోపిడీ అంటూ అభివర్ణించాడు.న్యాయమైన పరిహారం అందేలా, కార్మిక విధానాలను సంస్కరించాలని చెబుతూ.. నా 9 సంవత్సరాల అనుభవం అనే శీర్షికతో, తన వ్యక్తిగత ప్రయాణంలో ముఖ్యమైన విషయాలను షేర్ చేశారు.నేను 2008లో ఇన్ఫోసిస్‌లో ఫ్రెషర్‌గా నా ప్రయాణాన్ని ప్రారంభించాను. 2017లో సంస్థను విడిచి మరో కంపెనీలో చేరాను. ఇన్ఫోసిస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నా జీతం రూ. 35,000 మాత్రమే. నేను ఇప్పుడు రూ. 1.7 లక్షలు సంపాదిస్తున్నాను. అంటే ఇన్ఫోసిస్ జీతానికి 400 శాతం ఎక్కువని చెప్పాడు.ఇన్ఫోసిస్‌లో.. ఉద్యోగి రవాణా కోసం నెలకు రూ. 3,200 చెల్లించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుత కంపెనీలో అది పూర్తిగా ఉచితం. అంతే కాకుండా నేను ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో వెహికల్ పార్కింగ్ ఉచితం. అయితే ఇన్ఫోసిస్ తమ ఉద్యోగుల నుంచి వారి వాహనాల పార్కింగ్ కోసం కూడా డబ్బు వసూలు చేసిందని ఆయన ఆరోపించాడు.ప్రస్తుతం నేను పనిచేస్తున్న కంపెనీలో ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ధర రూ. 15 నుంచి రూ. 20 మాత్రమే. కానీ ఇన్ఫోసిస్‌లో దీని విలువ రూ. 40.ఇన్ఫోసిస్ పురోగతి వ్యవస్థను అనుసరించింది. ఇందులో ఉద్యోగులకు పదోన్నట్లు ఉంటాయి. కానీ జీతాల పెరుగుదల లేదా బాధ్యతలలో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుత సంస్థలో పదోన్నతులతో పాటు ఉద్యోగులకు నిజమైన బాధ్యతలను అందిస్తూ.. 15-25 శాతం జీతాల పెరుగుదల అందిస్తుంది.ఇన్ఫోసిస్‌లో 9 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా.. నేను సింగిల్ డిజిట్ వార్షిక పెంపుదల (Single-Digit Salary Hikes) అందుకున్నాను. ఈ కారణంగా నా జీతం రూ. 35000 వద్దనే ఉండేది. ఇప్పుడు ఆలోచిస్తుంటే.. చాలా సమయం వృధా చేసినట్లు అర్థమవుతుందని అన్నాడు.ఇదీ చదవండి: మొన్న టీసీఎస్.. నేడు విప్రో: ఫ్రెషర్లకు పండగే..ఇన్ఫోసిస్.. ఉద్యోగుల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదు. కానీ తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాల గురించి తరచుగా మాట్లాడుతుందని ఆయన ఆరోపించారు. ఉద్యోగి శ్రామికశక్తికి మెరుగైన జీతాలు, సంక్షేమం ద్వారా ఉదారతను చూపించాలని వాదించాడు. ఉద్యోగ భద్రత అనేది ఒక అపోహ మాత్రమే. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగ భద్రత (Job Security) ఎక్కువగా ఉందని ఆయన నొక్కి చెప్పారు.Infosys - My 9 years experience of 'unchained' slavery byu/GoatTop607 inbangalore -
జాబ్ అంటే చావేనా? ఊపిరి తీస్తున్న ఉద్యోగాలు!
కార్పొరేట్ రంగంలో పని సంస్కృతి రానురాను విషపూరితంగా మారుతోంది. తీవ్రమైన పని ఒత్తిడితో ఉద్యోగులు సతమతవుతున్నారు. రోజూ నిద్రాహారాలు లేకుండా 15 గంటలకు పైగా సుదీర్ఘంగా పని చేయాల్సి ఉండటంతో శారీరక, మానసిక అనారోగ్యాలకు గురవుతున్నారు. ఒత్తిడి తాళలేక కొంత మంది తనువులు చాలిస్తున్నారు."పని ఒత్తిడి" కారణంగా ఎర్నెస్ట్ & యంగ్ (EY) కన్సల్టెంట్ 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డెలాయిట్ మాజీ ఉద్యోగి దేశంలోని కార్పొరేట్ రంగంలో విషపూరితమైన పని సంస్కృతికి సంబంధించిన తన సొంత అనుభవాన్ని పంచుకోవడానికి ముందుకు వచ్చారు. ఇండోర్‌కు చెందిన జయేష్ జైన్ తన స్వానుభవాన్ని ‘ఎక్స్’(ట్విటర్)లో వివరించారు."అన్నా ఎంత ఒత్తిడి అనుభవించిందో పూర్తిగా అర్థం చేసుకోగలను" అంటూ తాను డెలాయిట్‌లో అనుభవించిన తీవ్రమైన ఒత్తిడిని వివరించారు. వేకువజామున 5 గంటల సమయంలో వర్క్ గురించి, తద్వారా తలెత్తిన ఆరోగ్య సమస్యల గురించి సహచరులతో చర్చించిన చాట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేశారు.రోజులో దాదాపు 20 గంటలు పని చేసేవాళ్లమని, అయితే అన్నేసి గంటలు పనిచేసినా కూడా 15 గంటలకు మించి పని చేసినట్టుగా లాగిన్‌లో చూపేందుకు వీలుండేది కాదని రాసుకొచ్చారు. "ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీరు వారికి (కంపెనీలకు) ఒక ఉద్యోగి మాత్రమే. కానీ మీ కుటుంబానికి మీరే సర్వస్వం" అంటూ ఒత్తిడి గురయ్యే ఉద్యోగులను ఉద్దేశించి హితవు పలికారు. "కార్పొరేట్ జీవితమంటేనే కఠినం. తొందరగానే అక్కడి నుండి బయటపడగలిగినందుకు సంతోషిస్తున్నాను" పోస్ట్‌ను ముగించారు.With EY case getting some lights. I would like to share my personal experience at Deloitte. Attaching some screenshots of chats with my team mate - friend where we were discussing the work and our health at 5AM in the morning. We use to work for around 20 hours and they won’t… pic.twitter.com/EjtqWjhwSm— Jayesh Jain (@arey_jainsaab) September 18, 2024 -
''అతడు గెలిచాడు.. నేను విడాకులు తీసుకున్నాను''
ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. కంపెనీలోని ఉన్నతోద్యోగులు మంచి నడవడిక కలిగినవారైతే.. ఇతర ఉద్యోగులు కూడా వారిని అనుసరించవచ్చు. కానీ ఉన్నతోద్యోగులు చెడ్డవారైతే? పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ విషయాన్ని రిటైర్డ్ అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ 'ఏతాన్ ఎవాన్స్' వెల్లడించారు.అమెజాన్ సంస్థలో పనిచేస్తున్న సమయంలో కంపెనీ సీఈఓ తన భార్యను ప్రలోభపెట్టాడని, దీంతో వారిరువురు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని 'ఏతాన్ ఎవాన్స్' (Ethan Evans) పేర్కొన్నారు. ఈ విషయంలో అతడు గెలిచాడు, నేను విడాకులు తీసుకున్నానని అన్నారు. పని విషయంలో సీఈఓను వ్యతిరేకించిన కారణంగా.. తనపై ప్రతీకారం తీర్చుకోవాలనే నెపంతో తన భార్యను ప్రలోభపెట్టారని లింక్డ్ఇన్లో వెల్లడించారు.అప్పట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా అమెజాన్ కంపెనీలో పనిచేయాల్సి వచ్చింది. అదే నేను చేసిన పెద్ద పొరపాటు. ఆ సమయంలోనే ఉద్యోగం వదిలేసి ఉంటే చాలా బాగుండేదని ఆయన అన్నారు. అంతే కాకుండా కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కొన్ని టిప్స్ కూడా చెప్పారు.ఏతాన్ ఎవాన్స్ టిప్స్➡మీరు పనిచేసే కంపెనీలో మేనేజర్ మంచి వారైతే.. వారి నుంచి మంచి విషయాలను నేర్చుకోండి. ➡పాములను గుర్తించండి (చెడ్డవారిని గుర్తించండి).➡సంస్థలో ఉన్నతోద్యోగులు చెడ్డవారని తెలిసినప్పటికీ.. మీ పని మాత్రం అద్భుతంగా ఉండేలా చూసుకోండి.➡చెడ్డవారిని నేరుగా ఎదుర్కోవద్దు.➡చెడ్డవారిని ఎదుర్కోవడానికి మీరు కూడా పాములా మారకండి. -
గూగుల్ పరిస్థితులు బయటపెట్టిన మాజీ ఉద్యోగి
ఉద్యోగాల్లో చేరాలనుకునే చాలామంది గూగుల్ సంస్థలో పనిచేయడం ఒక కలగా పెట్టుకుంటారు. దీనికి కారణం వేతనాలు కావొచ్చు, కంపెనీ అందించే ప్రయోజనాలు కావొచ్చు. అయితే 2023లో కంపెనీ ఎక్కువ మందిని తొలగించినప్పటికీ.. జీతాలు ఎక్కువ చెల్లించే సంస్థల్లో ఒకటిగా నిలిచింది. కొన్ని సందర్భాల్లో విమర్శలకు గురవుతోంది. గూగుల్ కంపెనీలో 15 సంవత్సరాలు పనిచేసిన మాజీ ఉద్యోగి 'జోనాథన్ బెల్లాక్' ఇటీవల కంపెనీ పరిస్థితులను వివరించడమే కాకుండా సీఈఓ సుందర్ పిచాయ్‌ను సైతం విమర్శించాడు. కంపెనీలో చాలామంది సీనియర్ నాయకులు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా టీమ్ సమస్యలను పరిష్కరించడం మానేశారని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి అధికారులు త్వరగా తీసుకోవలసిన ముఖ్యమైన నిర్ణయాలు సుదీర్ఘ వాదనలలో చిక్కుకుంటున్నాయని, ఇవి నెలలు తరబడి సుదీర్ఘ చర్చలుగా సాగుతూ.. కొత్త ఆలోచనలను అందించడానికి జూనియర్ ఉద్యోగులను ఉపయోగించుకుంటారని వెల్లడించారు. భిన్నాభిప్రాయాలతో కలిసి ముందుకు వెళ్లడం కంటే.. నష్టాలు లేదా ఖర్చుల గురించి చర్చించడం ఉన్నతాధికారులకు సులువుగా ఉండటమే దీనికి కారణమని బెల్లాక్ వివరించారు. ఇదీ చదవండి: బంగారం కొనటానికి ఇది సరైన సమయం.. మళ్ళీ తగ్గిన ధరలు తన పదవీకాలం ముగిసే సమయానికి, వాణిజ్యపరంగా సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించడంలో విఫలమైనందుకంటే గ్లోబల్ అఫైర్స్‌తో విభేదించినందుకు ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు వివరించారు. గూగుల్ కంపెనీలో సుమారు 15 సంవత్సరాలు ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేసిన బెల్లాక్ ఇటీవల ఈ విషయాలను థ్రెడ్ యాప్ ద్వారా పోస్ట్ చేశారు. -
అలా అనుకున్నా.. ఇలా జరిగింది - గూగుల్ మాజీ ఉద్యోగి
కరోనా మహమ్మారి వ్యాప్తి తరువాత నుంచి ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం తమ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. ఇప్పటికి కూడా ఉద్యోగాల కోత ఆగడం లేదు. లేఆప్స్ భారిన పడిన వేలాది మంది ఉద్యోగుల్లో భారతీయులు సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో భాగంగానే గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ గత నెలలో కూడా రిక్రూటింగ్ టీమ్ నుండి వందలాది మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో కొందరు తమ అసహనాన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే ఒక వ్యక్తి జాబ్ కోల్పోయిన తరువాత లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తూ.. తాను రిటైర్మెంట్ వరకు అక్కడే పనిచేస్తానని భావించినట్లు, ఇంత త్వరగా ఉద్యోగం కోల్పోతానని ఊహించలేదని వెల్లడించాడు. టెక్ దిగ్గజంలో పనిచేసే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు.. మళ్ళీ అవకాశం దొరికితే తప్పకుండా సంస్థలో పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయని తెలిపాడు. సంస్థ విశేషమైన వ్యక్తులతో కూడిన ఒక అద్భుతమైన ప్రదేశమని కూడా ప్రస్తావించాడు. ఇదీ చదవండి: ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ సూపర్‌కార్.. జెనీవా మోటార్ షోలో ఇదే స్పెషల్ అట్రాక్షన్! గూగుల్ లేఆఫ్స్ గూగుల్ సంస్థ ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటి సారి కాదు. గత జనవరిలో ఏకంగా 12000 మందిని తొలగించడానికి కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే దశల వారీగా కొంతమందిని తొలగిస్తూ ఉంది. కాగా రానున్న రోజుల్లో మరింతమందిని తొలగిస్తుండగా లేదా అనే విషయాల మీద ప్రస్తుతానికి ఎటువంటి క్లారిటీ లేదు. ఇంకా తొలగింపులు పర్వం ముగియలేదని నిపుణులు భావిస్తున్నారు. -
అతని కోపం ప్రళయం.. మస్క్ గురించి కీలక విషయాలు చెప్పిన మాజీ ఉద్యోగిని
ట్విటర్ మాజీ ఉద్యోగిని ఎస్తేర్ క్రాఫోర్డ్.. ఈమె పేరు చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. క్రాఫోర్డ్ ట్విటర్లో పనిచేస్తున్నప్పుడు రాత్రిళ్లు అక్కడే ఆఫీస్‌లోనే నిద్రిస్తున్న ఫొటో గతేడాది నవంబర్‌లో వైరల్ అయిన తెలిసిందే. ప్రొడక్ట్ మేనేజర్‌గా అంతలా కష్టపడి పనిచేసినా ఆమెను ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కనికరించలేదు. ట్విటర్ గత ఫిబ్రవరి నెలలో చేపట్టిన లేఆఫ్స్‌లో ఆమె ఉద్యోగం కూడా పోయింది. ఇదంతా తెలిసిందే. అయితే ఐదు నెలల తర్వాత ఆమె మస్క్‌తో పనిచేయడం ఎలా ఉంది, ఆయన అసాధారణ ప్రవర్తన ఉద్యోగులను ఎలా భయపెట్టేది తదితర ఆసక్తికర విషయాలు తెలియశారు. ఎలాన్ మస్క్ ఆధీనంలో లేక ముందు ఇతర కంపెనీల మాదిరిగానే ట్విటర్ కూడా చాలా బాగా ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు. కేవలం పని చేస్తేనే సరిపోదు.. రాజకీయాలు కూడా చేస్తేనే రాణిస్తారంటూ ఎస్తేర్ క్రాఫోర్డ్ ఇటీవల ట్విటర్లో సుదీర్ఘ పోస్ట్‌లో రాశారు. అపరిచితుడు! ఇక ఎలాన్ మస్క్‌తో కలిసి పని చేయడం గురించి వివరిస్తూ.. “వ్యక్తిగతంగా ఎలాన్ మస్క్ చాలా అసాధారణంగా ఉంటాడు. కొన్నిసార్లు ఫన్నీగా ఉంటాడు. చెప్పన కథలు, జోకులే పదే పదే చెప్తాడు” అని పేర్కొంది. ఇక ఉద్యోగులు ఎదుర్కొన్న సవాలు ఏమిటంటే, మస్క్ ఉత్సాహంగా ఉన్న బాస్ నుంచి క్షణాల్లో కోపంగా మారిపోతాడని రాసుకొచ్చారు. ఇదీ చదవండి ➤ 'X' Replacing Twitter Blue Bird Logo: పిట్ట పోయి ‘ఎక్స్’ వచ్చె.. మారిపోయిన ట్విటర్ లోగో "అతను ఎప్పుడు ఎలాంటి మూడ్‌లో ఉంటాడో, ఏ విషయానికి ఎలా ప్రతిస్పందిస్తాడో అంచనా వేయడం చాలా కష్టం. దీంతో మీటింగ్‌కి పిలిచినప్పుడల్లా ఉద్యోగులు భయపడేవారు. ఆయనతో ప్రతికూల విషయాలను చర్చించడానికి సంశయించేవారు" అని క్రాఫోర్డ్ పేర్కొన్నారు. కాగా 2022 నవంబర్‌లో ట్విటర్ భారీ తొలగింపులు చేపట్టిన సమయంలో ఎస్తేర్ క్రాఫోర్డ్.. తాను ఆ కంపెనీలో ఉన్నందుకు సంతోషిస్తున్నానంటూ మస్క్ ఆలోచనలను సమర్థించడంపై సోషల్ మీడియాలో ఆమెపై విపరీతంగా విమర్శలు వచ్చాయి. -
ఉద్యోగులకు ట్విటర్ రూ.4 వేల కోట్లు బాకీ.. ఎలాన్ మస్క్‌పై కోర్టులో దావా
ఎలాన్ మస్క్ ఆధీనంలోని ట్విటర్‌కు దావాలు, కోర్టు పిటిషన్ల సెగ తగులుతూనే ఉంది. ట్విటర్‌ను కొనుగోలు చేసి ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించినప్పటి నుంచి అనేక దావాలు ఆ సంస్థపై దాఖలవుతున్నాయి. తొలగించిన ఉద్యోగులకు చెల్లించాల్సిన 500 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 4,104 కోట్లు) పరిహారం చెల్లింపులో ట్విటర్ విఫలమైందంటూ తాజాగా అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలైంది. ట్విటర్ హెచ్ఆర్ విభాగంలో పని చేసిన కోర్ట్నీ మెక్మిలాన్ ఈ ఏడాది జనవరిలో శాన్ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో దావా వేశారు. ఎలాన్ మస్క్ ఆధీనంలోని ట్విటర్ 2022 అక్టోబర్ నుంచి అప్పటి సీఈవో పరాగ్ అగర్వాల్ సహా 80 శాతం మందిని తొలగించిందని, మొత్తంగా 6వేల మందికి పైగానే ఉద్యోగులకు ఉద్వాసన పలికిందని మెక్మిలాన్ తన దావాలో పేర్కొన్నారు. ట్విటర్ సీవెరెన్స్ ప్లాన్ ప్రకారం.. తొలగించే ఉద్యోగికి కనీసం రెండు నెలల జీతం, హెల్త్ ఇన్సూరెన్స్, ఇతర బెనిఫిట్లకు సంబంధించిన నగదు పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. అలాగే సీనియర్ ఉద్యోగులకు ఆరు నెలల బేస్ శాలరీతోపాటు ఏడాదికి ఒక వారం చొప్పున మూల వేతనం బాకీ ఉందన్నారు. దీని గురించి ఉద్యోగుల తొలగింపునకు ముందే ఎలాన్ మస్క్‌కు తెలుసునని పిటషనర్ ఆరోపించారు. మరోవైపు తొలగించిన ఉద్యోగులకు పరిహారంగా మూడు నెలల వేతనం చెల్లిస్తామని ట్విటర్ అప్పట్లో హామీ ఇచ్చింది. ఇందులో యూఎస్ చట్టాల ప్రకారం చెల్లించాల్సిన రెండు నెలల వేతనంతోపాటు సీవెరన్స్ ప్లాన్ కింద అదనంగా మరో నెల వేతనం ఉంటుంది. ఉద్యోగులకు ఎటువంటి సమాచారం లేకుండా సీవెరన్స్ ప్లాన్‌ను ట్విటర్ మార్చిందని, న్యాయబద్ధంగా తమకు రావాల్సిన ప్రయోజనాలను ట్విటర్ యాజమాన్యం చెల్లించడంలో విఫలమైందంటూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇదీ చదవండి: ట్విటర్ యూజర్లకు షాకిచ్చిన మస్క్.. ఇక రోజుకు అన్నే ట్వీట్లు.. -
Bangalore: టెక్ కంపెనీ సీఈఓ, ఎండీను హత్య చేసిన మాజీ ఉద్యోగి..
బెంగళూరు: బెంగళూరులో దారుణం జరిగింది. ఓ మాజీ ఉద్యోగి తన పాత కంపెనీకి చెందిన సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌ను హత్య చేశాడు. నిందితుడు సంస్థలోకి చొరబడి కత్తితో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితులను ఫణీంద్ర సుబ్రహ్మణ్యం, విను కమార్‌లుగా గుర్తించారు. ఫణీంద్ర, విను కుమార్‌లు ఏడాది క్రితం ఏయిరోనిక్స్ ఇంటర్నెట్ అనే సంస్థను స్థాపించారు. దానికి ఫణీంద్ర సీఈఓ, విను కుమార్ ఎండీగా పనిచేస్తున్నారు. అయితే.. నిందితుడు వీరు కంపెనీలో క్రితం ఏడాది ఉద్యోగిగా పనిచేశాడు. అనంతరం బయటకు వెళ్లి అదే రంగంలో వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో ఫణీంద్ర, విను కుమార్‌లు నిందితుని వ్యాపారంలో కలగజేసుకున్నారని పోలీసుల ప్రాథమిక సమాచారం. ఈ క్రమంలోనే కక్ష పెంచుకున్న నిందితుడు ఫణీంద్ర, విను కుమార్‌లను కత్తితో కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. బాధితులు ఆస్పత్రికి తీసుకువెళ్లే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందినట్లు వెల్లడించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: హనుమాన్ టెంపుల్లో చోరి.. రూ.10 సమర్పించి.. రూ.5000 దోపిడి.. -
Ex-Twitter employee: ఆఫీస్‌లో నేలపై పడుకుని అప్పట్లో వైరల్! అంతలా కష్టపడినా వేటు తప్పలేదు..
టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ ఎవ్వరినీ వదలడం లేదు. ఎంత సీనియర్ ఉద్యోగి అయినా.. కంపెనీ కోసం ఎంతలా కష్టపడి పనిచేసినా ఉద్వాసన తప్పడం లేదు. డెడ్‌లైన్స్‌ను చేరుకునేందుకు ట్విటర్లో ఓ సీనియర్ ఉద్యోగిని ఆఫీస్‌లోనే నేలపై నిద్రించిన ఫొటో గతేడాది వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఉద్యోగం కోల్పోయారు. కంపెనీ ప్రధాన కార్యాలయంలో నేలపై పడుకుని వైరల్ మారిన ట్విటర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎస్తేర్ క్రాఫోర్డ్ ఇటీవలి తొలగింపుల్లో ఉద్వాసనకు గురయ్యారు. ఆమె ట్విటర్ ద్వారా తన భావోద్వేగాలను పంచుకున్నారు. కంపెనీ కోసం ఎంత పనిచేసినా చివరికి ఉద్వాసన తప్పలేదని, యాజమాన్యం ఎప్పటికీ కుటుంబం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మన పని మాత్రమే కావాలని నిట్టూర్చారు. అయితే లేఆఫ్స్ తర్వాత కంపెనీలో మిగిలిపోయిన ఉద్యోగుల పట్ల ఆమె సానుభూతి వ్యక్తం చేశారు. వారికి మరింత పని భారం తప్పదన్నారు. ఏదేమైనా యాజమాన్యం ఎప్పటికీ కుటుంబం కాలేదని, మీరు కంపెనీ కోసం ఎంతలా కష్టపడినా కంపెనీ అవసరాలు మారినప్పుడు అవేమీ పట్టించుకోదని చెప్పారు. మన చేతుల్లో ఏమీ ఉండదని, ఇలాంటివి జరిగినప్పుడే స్మార్ట్‌గా పని చేయడం వంటి కొత్త పాఠాలు నేర్చుకోవచ్చని సూచించారు. చదవండి: Google Bard: గూగుల్ బార్డ్ అంటే సెర్చ్ మాత్రమే కాదు.. అంతకు మించి.. తొలగింపునకు ముందు వరకు క్రాఫోర్డ్ ట్విటర్ పెయిడ్ బ్లూ సబ్స్క్రిప్షన్ సర్వీస్ బాధ్యతలు నిర్వహించారు. 2022 అక్టోబర్‌లో ట్విటర్‌ను ఎలాన్ మస్క్ స్వాధీనం చేసుకున్నాక అందులో ఇది ఎనిమిదో రౌండ్ ఉద్యోగాల కోత. చదవండి: ఈ-మెయిల్ యాప్‌ను బ్లాక్ చేసిన యాపిల్.. కారణం ఇదే.. -
మాజీ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాల్సిందే
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ కొత్త యజమాని– జలాన్–ఫ్రిట్ష్ కన్సార్టియంకు (మురారి లాల్ జలాన్– ఫ్లోరియన్ ఫ్రిచ్) అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఎయిర్‌లైన్ మాజీ ఉద్యోగుల భవిష్య నిధి, గ్రాట్యుటీ బకాయిలను చెల్లించాలని ఆదేశిస్తూ, నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది. అప్పీలేట్ ట్రిబ్యునల్ గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన ఇచ్చిన రూలింగ్‌కు వ్యతిరేకంగా కన్సార్టియం దాఖలు చేసిన అప్పీల్‌ను విచారణకు స్వీకరించలేదు. ‘‘ఎవరైనా ఏదైనా డీల్‌లో అడుగుపెడుతున్నప్పుడు కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల గురించి తెలుసుకుంటారు. చెల్లించని కార్మికుల బకాయిలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఈ విషయంలో అంతిమ నిర్ణయం ఉండాలి. క్షమించండి, మేము ట్రిబ్యునల్ తీర్పులో జోక్యం చేసుకోవడం లేదు’’ అని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కన్సార్టియం వాదన ఇది... కన్సార్టియం తరఫున సీనియర్ అడ్వకేట్ సౌరభ్ కిర్పాల్ తన వాదనలు వినిపిస్తూ, కన్సార్టియంకు అందించిన సమాచార పత్రంలో (ఇన్ఫర్మేషన్ మెమోరాండమ్) కార్పొరేట్ రుణగ్రహీత (జెట్ ఎయిర్వేస్) భవిష్య నిధి, గ్రాట్యుటీ బకాయిలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలను పూర్తిగా వెల్లడించలేదని పేర్కొన్నారు. బకాయిల కింద ఇప్పుడు రూ. 200 కోట్లకు పైగా అదనపు మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుందని, దీనివల్ల విమానయాన సంస్థను పునరుద్ధరించడం కష్టమని అన్నారు. ఒకసారి ఆమోదించిన తర్వాత రిజల్యూషన్ ప్లాన్‌ను సవరించడం లేదా వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని కూడా పేర్కొన్నారు. ఈ తరహా ఉద్యోగులకు ఆశాకిరణం సుప్రీం రూలింగ్‌తో జెట్ ఎయిర్వేస్ మాజీ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. కన్సార్టియం అప్పీల్‌కు వెళుతుందన్న అభిప్రాయంతో జెట్ ఎయిర్వేస్ అగ్రివ్డ్ (బాధిత) వర్క్‌మెన్ అసోసియేషన్ (ఏఏడబ్ల్యూజేఏ) సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. అసోసియేషన్ తరఫున సీనియర్ అడ్వకేట్ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ భట్నాగర్, న్యాయవాది స్వర్ణేందు ఛటర్జీ తమ వాదనలు వినిపించారు. ‘‘ఈ ఉత్తర్వు ఈ వివాదంలో మార్గనిర్దేశం చేయడమే కాదు, ఈ రకమైన వ్యాజ్యాలలో చిక్కుకున్న ఈ తరహా కార్మికులు, ఉద్యోగులందరికీ ఇది ఒక ఆశాకిరణం’’ అని అడ్వకేట్ ఛటర్జీ విలేకరులతో అన్నారు. రికార్డ్ తేదీ... 2019 జూన్ 20 ఆర్థిక సంక్షోభం కారణంగా 2019 ప్రారంభంలో కార్యకలాపాలను నిలిపివేసిన జెట్ ఎయిర్వేస్ కోసం బిడ్‌ను దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా జలాన్–ఫ్రిట్ష్ కన్సార్టియం గెలుచుకుంది. విమానయాన సంస్థ ఇప్పుడు తన సేవలను పునఃప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం, రాజీనామా చేసిన లేదా పదవీ విరమణ చేసిన కార్మికులు, ఉద్యోగులందరికీ పూర్తి గ్రాట్యుటీ మరియు ప్రావిడెంట్ ఫండ్ చెల్లించాలి. ఈ లెక్కలకు 2019 జూన్ 20 వరకు తేదీని (దివాలాకు సంబంధించి అడ్మిషన్ తేదీ వరకు) పరిగణనలోకి తీసుకోవాలి. సుప్రీం రూలింగ్‌తో ప్రయోజనం పొందుతున్న వారిలో జెట్ ఎయిర్వేస్ కార్మికులు, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు, ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. -
ఫేస్బుక్ మాజీ ఉద్యోగులకు కొత్త ఝలక్ ఇచ్చిన మెటా
-
ఒక ఐడియా... కళను బతికిస్తోంది
తను కోరుకున్న వస్తువు దొరకనప్పుడు చాలా మంది పెద్దగా పట్టించుకోరు. ఉన్నదానితో సరిపెట్టుకుని పనిపూర్తిచేస్తారు. కానీ దొరకని వాటిని అందరికి అందుబాటులోకి తెచ్చే బిజినెస్ ఎందుకు చేయకూడదన్న ఒక ఐడియా వత్సల జీవితాన్నే మార్చేసి ఎంట్రప్రెన్యూర్‌గా మార్చింది. అందుకే మనకు వచ్చే ఐడియాలను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ఐడియా వచ్చినప్పుడు అది సాధారణంగా అనిపించినప్పటికీ... ఆచరణలోకి వచ్చినప్పుడు వాటి విలువ, గొప్పతనాలు తెలుస్తాయి. కశ్మీర్‌కు చెందిన వత్సల తనకు పెళ్లికి కావలసిన కాశ్మీరీ సంప్రదాయక వస్త్రాలు, ఆభరణాలు దొరకకపోవడంతో కొంత నిరాశకు గురైంది. ఆ తర్వాత ఆ నిరాశ నుంచి పుట్టిన ఆలోచననే స్టార్టప్‌గా చేసుకుని అంచెలంచెలుగా పైకి ఎదిగింది. వత్సల హలి సొంత రాష్ట్రం కశ్మీర్ అయినప్పటికీ..తన తండ్రి ఉద్యోగ రీత్యా హరిద్వార్‌లో ఉండడంతో అక్కడే పుట్టిపెరిగింది. ఇంజినీరింగ్ అయ్యాక, కమ్యునికేషన్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేసింది. ఎంబీఏ అయ్యాక ఓ అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేసింది. తరువాత బెంగళూరులోని ఓలా కంపెనీలో పీఆర్ టీమ్‌లో ఉద్యోగిగా చేరింది. ఇక్కడ పనిచేసే సమయంలో అనేక స్టార్టప్ కంపెనీల ప్రారంభం, ఎదుగుదల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. అప్పటి నుంచి తాను కూడా ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలని అనుకునేది వత్సల. ఓలాలో నాలుగేళ్లు పనిచేసాక... వత్సలకు పెళ్లి కుదిరింది. తన పెళ్లికోసం బెంగళూరు, ఢిల్లీలలోని పెద్దపెద్ద మార్కెట్లలో షాపింగ్ చేయడం ప్రారంభించింది. ఎక్కడికెళ్లినా కశ్మీరీ శాలువలు తప్ప మరి ఇంకేమీ దొరకలేదు. కశ్మీరీ జరీతో తయారు చేసే చీరలు, ఆరీ ఎంబ్రాయిడరీ సూట్లు, డ్రెస్‌లు, జ్యూవెల్లరీలు ఏవీ దొరకలేదు. వత్సల షాపింగ్ పూర్తయింది కానీ ఎక్కడా కశ్మీరి సంప్రదాయానికి తగ్గట్టుగా ఉండేవి ఏవీ మార్కెట్లో దొరకడం లేదని నిరాశపడింది. అయినా ఉన్నవాటితో సర్దుకుని పెళ్లి చేసుకుంది. ఉద్యోగం వదిలేసి.. పెళ్లి తరువాత ఏడాది పాటు ఉద్యోగం చేసింది. కానీ సొంత స్టార్టప్ పెట్టాలన్న కోరిక, కశ్మీరి సంప్రదాయ వస్త్రాలపై ఉన్న మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేసి, 2020లో ‘ఉర్జువ్– ద స్పిరిట్ ఆఫ్ కశ్మీర్’ పేరిట స్టార్టప్‌ను ప్రారంభించింది. ఉర్జువ్ ప్రారంభం సమయంలోనే.. కరోనా కూడా దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ‘‘అంతా శానిటైజర్ల వ్యాపారం పెడితే..నువ్వు బట్టల వ్యాపారం పెట్టావు? ఈ సమయంలో ఎవరు కొంటారు?’’ అని ఇంట్లో వాళ్లు, స్నేహితులు, బంధువులు నిరాశపరిచారు. అయినా వత్సల ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. లక్షరూపాయలతో ఉర్జువ్ను ప్రారంభించి.. ఉన్నితో తయారు చేసిన స్టోల్స్‌ను మాత్రమే విక్రయించేది. ఇవి బాగా అమ్ముడవుతుండడంతో తరువాత కుర్తా, పీరాస్, సూట్లు, సమ్మర్ స్టోల్స్ అన్ని విక్రయిస్తోంది. బనారస్ వస్త్రంపై కశ్మీరి ఎంబ్రాయిడరీని వేస్తోంది. ఉర్జువ్ విక్రయాలలో ‘పష్మీనా’ శాలువలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఇవి వారసత్వంగా ఒకరి నుంచి ఒకరికి ఇచ్చుకుంటారు కశ్మీరీలు. అందుకే ఇవి ఎంతో ప్రత్యేకంగా అమ్ముడవుతాయి. సోషల్ మీడియా ద్వారా.. వత్సల ఉత్పత్తులు నాణ్యంగానూ, కశ్మీరీ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుండడంతో చాలా వేగంగానే కస్టమర్లను ఆకర్షించాయి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా ఉర్జువ్ బాగా పాపులర్ అయ్యింది. తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి పరచడానికి ‘లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్’లో ఫ్యాషన్ బిజినెస్ కోర్సు కూడా చేసింది వత్సల. ఒకపక్క సంప్రదాయ ఉత్పత్తులను విక్రయిస్తూనే.. కశ్మీరీ హస్తకళాకారులకు పనికల్పించి ఉపాధినిస్తోంది. ఈ కళానైపుణ్యాలను తరువాతి తరానికి అందించాలని తపనతో హస్తకళాకారులందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి వారి అభివృద్ధికి కృషిచేస్తోంది. -
ఓయోలో ఉద్యోగులకు వాటా
న్యూఢిల్లీ: వినియోగదారులకు హోటల్ రూములను సమకూర్చే ఆతిథ్య రంగ కంపెనీ ఓయో.. ఉద్యోగులకు షేర్లను జారీ చేసింది. కంపెనీ ప్రస్తుత సిబ్బందిసహా మాజీ ఉద్యోగులు సైతం షేర్లను సొంతం చేసుకున్నట్లు ఓయో తాజాగా తెలియజేసింది. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్(ఇసాప్)లో భాగంగా 3 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఓయో మాతృ సంస్థ ఒరావెల్ స్టేస్ లిమిటెడ్ పేర్కొంది. ఇసాప్‌ల మార్పిడి ద్వారా ఉద్యోగులు ఈక్విటీ షేర్లను పొందినట్లు వెల్లడించింది. కంపెనీ భారీ డిస్కౌంట్లో జారీ చేసిన ఇసాప్‌ల ద్వారా సిబ్బంది షేర్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాగా.. కంపెనీ గతేడాది ఆగస్ట్‌లో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి 5 మిలియన్ డాలర్లను సమీకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఓయో విలువ 9.6 బిలియన్ డాలర్లకు చేరింది. వెరసి ఉద్యోగులు కొనుగోలు చేసిన షేర్ల విలువను రూ. 330 కోట్లుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ ఇటీవల ఇసాప్‌ల జారీని 41 శాతానికి విస్తరించడంతో ప్రస్తుత సిబ్బందిలో 80 శాతం మందికి ఇవి లభించినట్లు తెలుస్తోంది. 2021 మార్చికల్లా ప్రపంచవ్యాప్తంగా కంపెనీ సిబ్బంది సంఖ్య 5,130కు చేరింది. వీరిలో దాదాపు 71 శాతం మంది దేశీయంగానే విధులు నిర్వహిస్తుండటం గమనార్హం! గతేడాది అక్టోబర్‌లో పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా కంపెనీ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన విషయం విదితమే. తద్వారా రూ. 8,430 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఐపీవోలో భాగంగా రూ. 7,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. మరో రూ. 1,430 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. -
నేను కల్కి అవతారాన్ని, నా గ్రాట్యుటీ డబ్బులు ఇవ్వండి లేదంటే..
అహ్మదాబాద్: ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన గ్రాట్యూటీ కోసం సరికొత్తగా బెదిరించాడు ఓ మాజీ ఉద్యోగి. ఈ విచిత్ర ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ జలవనరుల శాఖ మాజీ ఇంజినీర్ రమేశ్చంద్ర ఫెఫార్ ఇట తన గ్రాట్యూటీని విడుదల చేయాలని బెదిరిస్తూ ప్రభుత్వానికి ఓ లేఖ రాశాడు. ఆ లేఖలో.. తనను తాను విష్ణువు కల్కి అవతారంగా చెప్పుకున్నాడు. అదే క్రమంలో తన జీతం, గ్రాట్యుటీ ఇంకా రాలేదని ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వంలో కూర్చున్న రాక్షసులు తన రూ.16 లక్షల గ్రాట్యుటీ, ఒక సంవత్సరం జీతం రూ.16 లక్షలను ఇవ్వకుండా తనను వేధిస్తున్నారని ఆయన రాశారు. వెంటనే వీటిని విడుదల చేయకపోతే ఈ సంవత్సరం తన "దైవిక శక్తులతో" భూమిపై తీవ్రమైన కరువును సృష్టిస్తానని ఆ లేఖలో బెదిరించాడు. కాగా ఫెఫార్ చాలాకాలం విధులకు హాజరు కాలేదు. దీంతో ప్రభుత్వం ఆయనకు ముందస్తు పదవీ విరమణ ఇచ్చింది. 8 నెలల్లో 16 రోజులే ఆఫీసుకు రావడంపై ప్రశ్నిస్తూ ఆయనకు షోకాజ్ నోటీసు కూడా ఇచ్చింది. కాగా తన బెదిరింపులపై స్పందించిన జల వనరుల శాఖ కార్యదర్శి ఎం కె జాదవ్ మాట్లాడుతూ.. అతని గ్రాట్యుటీ ప్రక్రియలో ఉందంటూ చెప్పారు. -
వైరలవుతోన్న రతన్ టాటా ఫోటో
ముంబై: టాటా గ్రూపు అంటేనే విలువలకు పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు విస్తరించినప్పటికి వీసమెత్తు గర్వం కనపడదు. ఇక ఉద్యోగుల పట్ల టాటా సంస్థలు చూపే శ్రద్ధ గురించి అందులో పని చేసే వారిని అడిగితే తెలుస్తుంది. టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా సింప్లిసిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశం పట్ల, సమాజం పట్ల టాటా కుటుంబానికి ఎంతో ప్రేమ, బాధ్యత. ఇక ఏదైనా విపత్తు వచ్చిందంటే చాలు సాయం చేయడంలో టాటా సంస్థలు ముందు వరుసలో ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే గత నాలుగైదు రోజులుగా రతన్ టాటాకు సంబధించిన ఓ వార్త సోషల్ మీడియా తెగ వైరలవుతోంది. తమ కంపెనీలో పని చేసిన ఓ మాజీ ఉద్యోగిని కలవడం కోసం రతన్ టాటా స్వయంగా ముంబై నుంచి పుణె వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. యోగేష్ దేశాయ్ అనే వ్యక్తి తన ట్విట్టర్లో రతన్ టాటా సదరు ఉద్యోగి పిల్లలతో మాట్లాడుతున్న ఫోటోని షేర్ చేశారు. (చదవండి: పరిగెత్తండిరా!.. శబ్ధం చేయకండయ్యా!!) Ratan Tata,83, living legend, greatest businessman alive in India visited the friends society in Pune to meet his Ex Emoloyee all the way from Mumbai who is ailing for last 2 years. This is how legends are made of. No media, no bouncers only commitment towards loyal employees. pic.twitter.com/5xktAH2CUX — No Robert Elekes - AnKuVa (@SuspendedAkount) January 4, 2021 ఇక ‘రతన్ టాటా లివింగ్ లెజెండ్.. భారతదేశంలో ఉన్న అతి గొప్ప వ్యాపారవేత్తల్లో ఆయన ఒకరు. తమ సంస్థలో పని చేసిన ఓ మాజీ ఉద్యోగి గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతన్నారని రతన్ టాటాకు తెలిసింది. దాంతో అతడిని పరామర్శించడానికి ముంబై నుంచి పుణె వెళ్లారు. ఆయన వెంట బౌన్సర్లు లేరు.. మీడియా హడావుడి లేదు. నమ్మకంగా పని చేసిన ఉద్యోగి పట్ల ఆయన చూపిన ఈ సానుభూతి ఎంతో గొప్పది. డబ్బు మాత్రమే జీవితం కాదని అందరు వ్యాపారవేత్తలు తెలుసుకోవాలి. గొప్ప మనిషిగా బతకడం అనేది ముఖ్యం. సర్ మీరు చేసిన ఈ పనికి గౌరవంగా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’ అంటూ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. లివింగ్ లెజెండ్ రతన్ టాటా.. అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజనులు. -
ఆ వీడియోల కోసం యాహూ మాజీ ఉద్యోగి నిర్వాకం
మనుషుల విపరీత ధోరణులు, వికారాలు ఎంత హేయంగా వుంటాయనే దానికి నిదర్శనం యాహూ ఉద్యోగి మాజీ ఇంజనీర్ రీస్ డేనియల్ రూయిజ్ (34). లైంగిక ఫోటోలు, వీడియోల కోసం ఏకంగా 6,000 ఖాతాలను హ్యాక్ చేశాడు. అదీ తనకు తెలిసిన మహిళలు, తన తోటి మహిళా ఉద్యోగుల ఖాతాలనుంచే వీటిని చోరీ చేశాడు. ఎన్‌గాడ్జెట్ అందించిన కథనం ప్రకారం సంస్థలోని అంతర్గత నెట్‌వర్క్‌కు తన కున్న యాక్సెస్‌ను ఉపయోగించుకొని ఈ దురాగతానికి పాల్పడ్డాడు. తద్వారా వేలాది వినియోగదారుల పాస్‌వర్డ్స్‌ను హ్యాక్ చేశాడు. వారి ఖాతాల్లోని వ్యక్తిగత ఫోటోలను, వీడియోలను తన పర్సనల్ హార్డ్ డ్రైవ్‌కు డౌన్లోడ్ చేశాడు.ప్రధానంగా మహిళలు,చిన్నపిల్లల సోషల్ మీడియా ఖాతాలే అతడి టార్గెట్. అంతేకాదు వీరిలో తన స్నేహితులు, మహిళా సహోద్యోగులు కూడా ఉన్నారని స్వయంగా రూయిజ్ వెల్లడించాడు. థర్డ్ పార్టీ సైట్స్ ద్వారా యాపిల్ ఐక్లౌడ్, ఫేస్బుక్, జీమెయిల్, డ్రాప్‌బాక్స్ తదితర ఖాతాల పాస్వర్డ్ రీసెట్ చేసి, తనకు కావాల్సిన డాటాను చోరీ చేసేవాడు. తాజాగా రూయిజ్ తన నేరాన్ని అంగింకరించాడు. ఇందుకు రూయిజ్ ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంచనా. -
ఎమ్మెల్యే పీఏ చెబితినే వింటా....
అనంతపురం : ఓ ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను హిందూపురం ఎంపీడీవో బేఖాతరు చేశారు. స్థానిక ఎమ్మెల్యే పీఏ చెబితేనే విధుల్లోకి తీసుకుంటానంటూ సదరు ఎంపీడీవో భీష్మించుకుని కుర్చున్నారు. దీంతో బాధితుడు దిక్కు తోచక పరిస్థితుల్లో మిత్రుల సలహా మేరకు మీడియాను ఆశ్రయించాడు. తనను విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించిన సదరు ఎంపీడీవో మాత్రం నిబంధనలు పెట్టడం పట్ల సదరు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
ఉద్యోగం పోయిందని.. బస్సు హైజాక్!!
(జి.వి.నారాయణరావు - సాక్షి, రంపచోడవరం) ఉద్యోగం పోయిందన్న కోపంతో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ఓ మాజీ డ్రైవర్ ఓ బస్సును హైజాక్ చేశాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగింది. రాజవొమ్మంగికి చెందిన సీహెచ్ వెంకన్న గతంలో ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేశారు. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో గుర్తేడు వెళ్లేందుకు గోకవరం బస్టాండు పాయింట్లో సిద్ధంగా ఉన్న బస్సును హైజాక్ చేసి, డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. కొంతసేపటికి ఈ విషయాన్ని గుర్తించిన గోకవరం డిపో మేనేజర్.. బస్సు రంపచోడవరం వైపు వెళ్తున్నట్లు తెలుసుకుని, రంపచోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కాపుకాసి.. బస్సును ఓ స్పీడ్ బ్రేకర్ వద్ద ఆపి, వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత బస్సును గోకవరానికి తరలించారు. వెంకన్న గతంలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేశారు. తర్వాత పదోన్నతిపై ఆయనను అడ్మినిస్ట్రేషన్ విభాగంలోకి మార్చారు. అయితే అక్కడ ఆయనపై లక్ష రూపాయలు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఆ మొత్తాన్ని ఆయన తిరిగి కట్టేశారు. అయినా తిరిగి ఉద్యోగంలోకి మాత్రం తీసుకోలేదు. డబ్బు కట్టినా ఉద్యోగం రాలేదన్న కోపంతో బస్సను హైజాక్ చేసినట్లు వెంకన్న అంగీకరించారు.