గూగుల్ పరిస్థితులు బయటపెట్టిన మాజీ ఉద్యోగి | Ex Google Employee Criticize Senior Leaders | Sakshi
Sakshi News home page

గూగుల్ పరిస్థితులు బయటపెట్టిన మాజీ ఉద్యోగి

Jan 5 2024 6:00 PM | Updated on Jan 5 2024 6:44 PM

Ex Google Employee Criticize Senior Leaders - Sakshi

ఉద్యోగాల్లో చేరాలనుకునే చాలామంది గూగుల్ సంస్థలో పనిచేయడం ఒక కలగా పెట్టుకుంటారు. దీనికి కారణం వేతనాలు కావొచ్చు, కంపెనీ అందించే ప్రయోజనాలు కావొచ్చు. అయితే 2023లో కంపెనీ ఎక్కువ మందిని తొలగించినప్పటికీ.. జీతాలు ఎక్కువ చెల్లించే సంస్థల్లో ఒకటిగా నిలిచింది. కొన్ని సందర్భాల్లో విమర్శలకు గురవుతోంది.

గూగుల్ కంపెనీలో 15 సంవత్సరాలు పనిచేసిన మాజీ ఉద్యోగి 'జోనాథన్ బెల్లాక్' ఇటీవల కంపెనీ పరిస్థితులను వివరించడమే కాకుండా సీఈఓ సుందర్ పిచాయ్‌ను సైతం విమర్శించాడు. కంపెనీలో చాలామంది సీనియర్ నాయకులు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా టీమ్ సమస్యలను పరిష్కరించడం మానేశారని పేర్కొన్నారు.

ఉన్నత స్థాయి అధికారులు త్వరగా తీసుకోవలసిన ముఖ్యమైన నిర్ణయాలు సుదీర్ఘ వాదనలలో చిక్కుకుంటున్నాయని, ఇవి నెలలు తరబడి సుదీర్ఘ చర్చలుగా సాగుతూ.. కొత్త ఆలోచనలను అందించడానికి జూనియర్ ఉద్యోగులను ఉపయోగించుకుంటారని వెల్లడించారు. భిన్నాభిప్రాయాలతో కలిసి ముందుకు వెళ్లడం కంటే.. నష్టాలు లేదా ఖర్చుల గురించి చర్చించడం ఉన్నతాధికారులకు సులువుగా ఉండటమే దీనికి కారణమని బెల్లాక్ వివరించారు.

ఇదీ చదవండి: బంగారం కొనటానికి ఇది సరైన సమయం.. మళ్ళీ తగ్గిన ధరలు

తన పదవీకాలం ముగిసే సమయానికి, వాణిజ్యపరంగా సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించడంలో విఫలమైనందుకంటే గ్లోబల్ అఫైర్స్‌తో విభేదించినందుకు ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు వివరించారు. గూగుల్ కంపెనీలో సుమారు 15 సంవత్సరాలు ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేసిన బెల్లాక్ ఇటీవల ఈ విషయాలను థ్రెడ్‌ యాప్ ద్వారా పోస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement