senior leaders
-
వైఎస్సార్సీపీ వైపు.. సీనియర్ నేతల చూపు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతోంది. సూపర్ సిక్స్‌తో పాటు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో ఎన్నికలు జరిగిన ఆరు మాసాల్లోనే టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దీంతో సీనియర్ రాజకీయ నేతలంతా ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.ప్రజల ఆకాంక్ష లకు అనుగుణంగా పనిచేయడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలం అవుతోంది. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీల తో పాటు సుమారు 150కి పైగా హామీలు ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలే కాకుండా జిల్లాలు.. నియోజకవర్గాల వారీగా స్థానిక హామీలను ప్రత్యేకంగా ఇచ్చారు కూడా. దీంతో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు ఓట్లు వేసి గెలిపించారు ప్రజలు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది మాసాలు పూర్తయినా హామీల అమలులో టీడీపీ కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.పింఛన్ల పెంపు మినహా ఏ ఒక్క హామీపై స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ప్రజలు అసంతృప్తి చెందుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాటలు నమ్మి ఓట్లు వేస్తే సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదంటూ వారు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైఎస్సార్ సీపీలో చేరటం ప్రాధాన్యత సంతరించుకుంది. శైలజానాథ్ చేరికతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ మరింత బలోపేతం అయింది.ఇదీ చదవండి: జగనన్న చేసిన సాయం.. ‘తండేల్’లో చూపకపోవడం బాధాకరంశింగనమల నియోజకవర్గం నుంచి 2004, 09 ఎన్నికల్లో శైలజానాథ్ గెలుపొందారు. ప్రభుత్వ విప్‌గా, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో సాకే శైలజానాథ్ కీలక పాత్ర పోషించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు సాకే శైలజానాథ్. రాజకీయాలంటే వ్యాపారం కాదని.. ప్రజా సేవ అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేస్తున్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చాలా మంది సీనియర్ నేతలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తాజా పరిణామాలు టీడీపీ, జనసేన, బీజేపీలకు మింగుడు పడటం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడవకనే గతం లో ఎన్నడూలేని విధంగా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. -
పార్టీపై పూర్తి పట్టు కోసం లోకేశ్ ఎత్తులు
-
టీడీపీలో సీనియర్లకు పొగ!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీపై పూర్తి పట్టు సాధించేందుకు చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్ పార్టీలోని సీనియర్లకు పొగ పెడుతున్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పార్టీలోని సీనియర్లను బయటకు పంపేసి, పూర్తిగా తన మనుషులతో నింపేందుకు లోకేశ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు పార్టీ అధినేత చంద్రబాబు కూడా తలొగ్గడంతో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన సీనియర్ నేతలకు గడ్డుకాలం వచ్చింది. సీనియర్ల వల్ల ఎటువంటి ఉపయోగంలేదని, పార్టీకి భారమన్న ముద్ర వేసి వారిని బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల్లో ఉన్న పలువురు సీనియర్ నేతలకు త్వరలోనే ఉద్వాసన పలుకుతారని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని), గంటి హరీష్ మాధుర్, దీపక్‌రెడ్డి వంటి వారికి లోకేశ్ టీంగా పార్టీలో కీలక పదవులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది.పార్టీపై లోకేశ్ పట్టు బిగిస్తుండటంతో చాలా కాలం నుంచి సీనియర్ల హవా తగ్గిపోయింది. లోకేశ్ అండదండలున్న నేతలు, ఆయనకు నచ్చిన వారికే పార్టీలో అవకాశాలు దక్కుతున్నాయి. చంద్రబాబు కూడా కుమారుడి మాట కాదనలేని పరిస్థితులు ఏర్పడ్డాయని సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో సీట్ల కేటాయింపు కూడా చాలావరకు లోకేశ్ అభీష్టం మేరకే జరిగినట్లు నేతలు చెబుతున్నారు. కాసులిచ్చిన వారికే సీట్లు దక్కాయని అప్పట్లో అనేక మంది నేతలు గగ్గోలు పెట్టారు. ఆ తర్వాత కూటమి ఆధ్వర్యంలో ఏర్పడిన మంత్రివర్గంలోనూ లోకేశ్ చెప్పిన వారికే చోటు దక్కింది. మంత్రి పదవులు ఖాయమనుకున్న అనేక మంది సీనియర్లను పక్కన పెట్టి తనకు నచ్చిన వారికి, తనతో లావాదేవీలు జరిపిన వారికే లోకేశ్ మంత్రి పదవులు ఇప్పించారనే ఆరోపణలు వచ్చాయి. లోకేశ్ చేతిలోకి పొలిట్‌బ్యూరో!ఇప్పుడు పార్టీలోనూ అదే తరహా నియామకాలకు రంగం సిద్ధౖమైనట్లు తెలుస్తోంది. పార్టీలో అత్యంత కీలకమైన పొలిట్‌బ్యూరోను చేతుల్లోకి తీసుకోవడానికి లోకేశ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం పొలిట్‌బ్యూరో మొత్తాన్ని తన మనుషులతో నింపాలని ఆయన పట్టుబడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పొలిట్‌బ్యూరోలో సీనియర్ నాయకులైన యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి అత్యంత సీనియర్లు ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో వీరెవరికీ సరైన ప్రాధాన్యం దక్కలేదు. చంద్రబాబు తర్వాత ఆ స్థాయి నేతగా ఉన్న యనమల రామకృష్ణుడికి ఇటీవల పార్టీలో చెప్పుకోలేని అవమానాలు ఎదురయ్యాయి. కళా వెంకట్రావుకి ఎమ్మెల్యే సీటు నిరాకరించి, చివరికి వేరే చోట సర్దుబాటు చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి వారిని పక్కన పెట్టేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కింజరాపు అచ్చెన్నాయుడికి ఇప్పుడు పార్టీలో సరైన స్థానం లేదు. పేరుకి మంత్రిగా ఉన్నా ఆయనకున్న ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలిసిందే. అన్ని జిల్లాల్లోనూ సీనియర్ నాయకులను కాదని కొత్తగా లోకేశ్‌కు దగ్గరైన వారికే పెత్తనం అప్పగించారు. గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, నిమ్మకాయల చినరాజప్ప వంటి వారిని సైతం నియోజకవర్గాలకే పరిమితం చేశారు. వీరంతా గతంలో పార్టీలో చక్రం తిప్పినవారే. అలాంటి వారందరినీ పూర్తిగా పక్కకు తప్పించి పొలిట్‌బ్యూరోలో, ఇతర కమిటీల్లోనూ తనకు అనుకూలంగా ఉండే వారిని నియమించుకోవడానికి లోకేశ్ కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. చంద్రబాబు కూడా అందుకు సానుకూలంగా ఉన్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.ఒకటే పదవి ఉండేలా..ఈ క్రమంలోనే ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆ పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలో కానీ, పార్టీలో కానీ ఒక చోటే బాధ్యత ఉండేలా చూసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. పార్టీ పదవులు ఉన్న వారికి ప్రభుత్వ పదవులు ఉండవని, ప్రభుత్వ పదవులు ఉన్న వారికి పార్టీలో పదవులు ఉండకుండా చూసే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇచ్చిన పదవులను కూడా రెండేళ్లకు మాత్రమే పరిమితం చేయాలని చూస్తున్నారు. ఇదంతా పార్టీపై లోకేశ్ పూర్తిగా పట్టు సాధించేందుకు వేస్తున్న ఎత్తుగడలేనని సీనియర్లు చెబుతున్నారు. ఇన్నేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన సీనియర్లు, ముఖ్య నాయకులకు ఇక మీదట ఇబ్బందులు తప్పవని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. -
కొలికపూడిపై టీడీపీ సీనియర్ నేతల ఆగ్రహం
-
సీటు కోసం పాట్లు
-
టీడీపీలో సీనియర్లకు షాకిచ్చిన సీఎం చంద్రబాబు
-
సీనియర్లకు నిరాశే
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలకు చంద్రబాబు తీవ్ర నిరాశ కలిగించారు. రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ నాయకులను కాదని కొత్త వారికి చోటు కల్పించారు. తొలి నుంచి పార్టీ కోసం పని చేసిన వారు, గతంలో మంత్రులుగా పని చేసి, పార్టీలో, జిల్లాల్లో కీలకంగా ఉన్న వారికి కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వడంపై ఆ పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. 24 మంది మంత్రుల్లో 17 మంది తొలిసారిగా మంత్రి పదవులు చేపడుతున్నారు. 2014–2019 మధ్య కాలంలో మంత్రులుగా పనిచేసి ఇప్పుడు గెలిచిన వారికీ అవకాశం ఇవ్వలేదు. అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వారిలో అచ్చెన్నాయుడు, నారాయణ, లోకేశ్‌కు మాత్రమే మళ్లీ మంత్రి పదవులు వచ్చాయి. మిగతా వారికి పదవులు దక్కలేదు. గంటా, అయ్యన్నకు దక్కని పదవులు ఉమ్మడి విశాఖ జిల్లాలో సూపర్ సీనియర్లయిన అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యన్నారాయణమూర్తిని పక్కనపెట్టి జూనియర్ అయిన వంగలపూడి అనితకు మంత్రి పదవి ఇచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజును కాదని తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొండపల్లి శ్రీనివాస్, మరో నేత సంధ్యారాణిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడికి మాత్రమే మంత్రి పదవి దక్కగా కూన రవికుమార్, కొండ్రు మురళీమోహన్లకు మొండిచేయి చూపారు. తూర్పులో జనసేనకు ప్రాధాన్యం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు ప్రాధాన్యత లభించింది. ఆ జిల్లా నుంచి జనసేన తరఫున పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ మంత్రులయ్యారు. టీడీపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాసంశెట్టి సుభాష్‌కి అనూహ్యంగా మంత్రి పదవి లభించింది. ఈ జిల్లకే చెందిన సీనియర్లు జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరిలకు మంత్రి పదవులు ఇవ్వకపోవడంపై టీడీపీలోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముందుగా అనుకున్నట్లుగానే నిమ్మల రామానాయుడికి కేబినెట్ బెర్త్ దక్కింది. ఈ జిల్లాలో సీనియర్ నేతలు చింతమనేని ప్రభాకర్, పితాని సత్యనారాయణ, రఘురామకృష్ణరాజుకు నిరాశే ఎదురైంది. ఎన్నికలకు ముందు పార్టీలోకొచ్చి మంత్రి అయిన పార్ధసారథి ఉమ్మడి కృష్ణా జిల్లాలో గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, శ్రీరాం తాతయ్య వంటి వారికి కాకుండా ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి నూజివీడు నుంచి గెలిచిన కె. పార్థసారథికి మంత్రి పదవి ఇవ్వడం గమనార్హం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్‌బాబుకు నిరాశ తప్పలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏలూరి సాంబశివరావు, నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికీ అవకాశం రాలేదు. సీమలో సీనియర్లకు మొండి చేయి చిత్తూరు జిల్లా నుంచి ఒక్కరిక్కూడా మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఈ జిల్లాకు చెందిన అమర్నాథ్రెడ్డి, పులివర్తి నాని నిరాశకు లోనయ్యారు. కడప జిల్లా నుంచి రెడ్డప్పగారి మాధవి, వరదరాజుల రెడ్డి మంత్రి పదవులు ఆశించగా, మండిపల్లి రామప్రసాద్రెడ్డికి పదవి ఇచ్చారు. కర్నూలు జిల్లా నుంచి సీనియర్ నాయకుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి మొండిచేయి చూపారు. అనంతపురం జిల్లాలో పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులును పరిగణనలోకి తీసుకోకుండా కొత్తగా వచ్చిన సవితకు మంత్రి పదవి ఇచ్చారు. సుజనా చౌదరికి ఎదురు దెబ్బ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం విశేషం. బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. గతంలో చంద్రబాబు కోటరీలో కీలక నేతగా ఉండి, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన్ని చంద్రబాబు కాదనలేరనే చర్చ జరిగింది. కానీ బీజేపీలోని ప్రధాన వర్గం, టీడీపీలోని మరో వర్గం ఆయన్ని వ్యతిరేకించడంతో మంత్రి పదవి దక్కలేదు. ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి పొందలేకపోవడం సుజనాకు తీవ్ర నిరాశ కలిగించే విషయమే. ఉత్తరాంధ్రకు తగ్గిన ప్రాధాన్యం మంత్రి పదవుల్లో ఉత్తరాంధ్రకు సరైన ప్రాధాన్యం లభించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 24 మంత్రి పదవుల్లో ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలకు కలిపి నాలుగు పదవులే దక్కాయి. ఆర్థిక రాజధానిగా భావించే విశాఖ జిల్లాకు ఒకే మంత్రి పదవి ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోనూ ఒక్కరికే అవకాశం రాగా, విజయనగరం జిల్లాలో మాత్రం ఇద్దరికి అవకాశం లభించింది. ఉమ్మడి తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు మూడు చొప్పున మంత్రి పదవులు లభించాయి. విజయనగరం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెండేసి చొప్పున పదవులు ఇచ్చారు. శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమగోదావరి, కడప, చిత్తూరు జిల్లాలకు ఒకటి చొప్పున మంత్రి పదవులు దక్కాయి. జనసేనకు మూడే జనసేన తరఫున నలుగురైదుగురికి మంత్రి పదవులు లభిస్తాయని ఆ పార్టీ నేతలు ఆశించారు. కానీ మూడు మాత్రమే దక్కాయి. జనసేన నుంచి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌కు మాత్రమే అవకాశం దక్కింది. దీంతో మంత్రి పదవులు ఆశించిన కొణతాల రామకృష్ణ, పంతం నానాజీ, పులపర్తి రామాంజనేయులు అసంతృప్తిలో ఉన్నారు. -
టీడీపీలో హాహాకారాలు
సాక్షి, అమరావతి/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/ఆత్మకూరు రూరల్/అమలాపురం టౌన్/సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సాక్షి ప్రతినిధి కర్నూలు: తెలుగుదేశం పార్టీలో ఆగ్రహ జ్వాలలు చల్లారడంలేదు. పొత్తులు, సమీకరణలు, ధన ప్రభావంతో సీట్లు గల్లంతైన సీనియర్ నేతలు చంద్రబాబు తీరుపై గతంలో ఎన్నడూ లేనివిధంగా దుమ్మెత్తిపోస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తుతున్నారు. ప్రతిజిల్లాలోనూ అసమ్మతి తీవ్రస్థాయిలో రాజుకోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయి. 30కిపైగా నియోజకవర్గాల్లో సీట్లు రాని నేతలు టీడీపీ అభ్యర్థులను ఓడిస్తామని ప్రకటించడంతో బాబు తల పట్టుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఏలూరు ఎంపీ సీటును యనమల రామకృష్ణుడి అల్లుడు మహేశ్ కు కేటాయించడాన్ని తప్పు బట్టారు. చాలాఏళ్లుగా తమ సామాజికవర్గానికి కేటాయించే సీటును బీసీకివ్వడం సరికాదని, ఈ సీటును బీసీలకు ఇవ్వాలని ఎవరడిగారని ఆయన మంగళవారం రాత్రి చంద్రబాబును కలిసినప్పుడు ప్రశ్నించారు. తమకు కనీసం చెప్పకుండా తమ సీటును మార్చడం అవమానించడమేనని నిలదీశారు. బీసీల్లో యనమల కుటుంబం తప్ప మరొకరు దొరకలేదా? ఎక్కడో కడప నుంచి అభ్యర్థిని తీసుకురావడమేమిటీ అంటూ మాగంటి సంధించిన వరుస ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానం లేదని సమాచారం. చంద్రబాబు ఎంత బుజ్జగించినా, ఎన్నికల తర్వాత రాజ్యసభ సీటు ఇస్తానని నమ్మబలికినా మాగంటి శాంతించలేదు. ఆయన తన దారి తాను చూసుకోవడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. చంద్రబాబును కలిసి బయటకు వచ్చిన వెంటనే బాబుపై నమ్మకం లేదని వ్యాఖ్యానించి కోపంగా వెళ్లిపోవడం దీనికి బలం చేకూరుస్తోంది. చంద్రబాబుతో చర్చలు ఆశాజనకంగా సాగలేదని పార్టీ శ్రేణులకు మాగంటి బాబు రాసినట్టు చెబుతున్న ఓ లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ♦ కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ఆదోని, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, నంద్యాల, డోన్ నియోజకవర్గాల్లో టికెట్లు దక్కని టీడీపీ ఇన్చార్జులు అసమ్మతిబావుటా ఎగురేశారు. ఆదోనిలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న మీనాక్షినాయుడు సీటును బీజేపీకి కేటాయించడంపై మండిపడుతున్నారు. తానుగానీ, తన తనయుడుగానీ ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలని యోచిస్తున్నారు. ఆలూరులో టీడీపీ ఇన్చార్జి కోట్ల సుజాతమ్మ పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. కుటుంబానికి ఒకే సీటు అంటూ తనను పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. మంత్రాలయంలో రాఘవేంద్ర, నందికొట్కూరులో గిత్త జయసూర్యకు టికెట్లు కేటాయించిన తర్వాత గెలుపు అవకాశాలు సన్నగిల్లాయని నివేదికలు అందడంతో ఈ సీట్లను మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. కోడుమూరులో ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వర్గాల మధ్య టిక్కెట్ పంచాయతీ తెగలేదు. విష్ణు ప్రతిపాదించిన బొగ్గుల దస్తగిరి అభ్యర్థిత్వాన్ని కోట్ల వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆకేపోగు ప్రభాకర్‌కు టిక్కెట్ ఇవాల్సిందేనని పట్టుబట్టినా అధిష్టానం స్పందించకపోవడంతో ప్రచారంలో పాలుపంచుకోవడం లేదు. డోన్ ఇన్చార్జ్ మన్నే సుబ్బారెడ్డిని కాదని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి టికెట్ ఇవ్వడంతో సుబ్బారెడ్డి సైలెంట్ అయ్యారు. ప్రచారంలో మాత్రం పాల్గొనడం లేదు. నంద్యాలలో భూమా బ్రహా్మనందరెడ్డి కూడా అభ్యర్థి ఫరూక్‌కు సహకరించడం లేదు. ♦ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పదేళ్లుగా పని చేస్తున్న కిమిడి నాగార్జునను కనీసం పరిగణన లోకి తీసుకోకుండా ఆ సీటును ఆయన బంధువు కళా వెంకట్రావుకు కేటాయించడంపై పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తున్న తనను బాబు తన అవసరం కోసం రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఇప్పుడు కనీసం మాటమాత్రంగానైనా చెప్పకుండా పక్కకు తప్పించడంపై నాగార్జున కన్నీటి పర్యంతమయ్యారు. ♦ పెందుర్తి సీటును జనసేనకు కేటాయించడం, అక్కడ తన వ్యతిరేకి పంచకర్ల రమే‹Ùను ఆ పార్టీ నుంచి పోటీ చేయిస్తుండడాన్ని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి జీర్ణించుకోలేకపోతున్నారు.చంద్రబాబు తనను ఇంతలా మోసం చేస్తారని అనుకోలేదని ఆవేదన చెందుతున్నారు. కొన్నిరోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన ఇక రాజకీయాల నుంచి విరమిస్తానని నిర్వేదం వ్యక్తం చేయడంపై పార్టీ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. ♦ అనపర్తి సీటును తొలిజాబితాలోనే తనకు కేటాయించి.. అంతలోనే మళ్లీ బీజేపీకి ఇవ్వడంపై మండిపడుతున్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ♦ రాజంపేట సీటును పార్టీ శ్రేణులకూ తెలియని సుగవాసి సుబ్రహ్మణ్యంకి కేటాయించడంతో బత్యాల చెంగల్రాయుడు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ♦హజ్ కమిటీ రాష్ట్ర మాజీ చైర్మన్ మోమిన్ అహమ్మద్ హుసేన్ బుధవారం తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు ఆయన కర్నూలు జిల్లా ఆత్మకూరులోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. 30 ఏళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన హుసేన్ పలు కీలక పదవులలో సేవలందించారు. ఆయనతో పాటు టీడీపీ రాయలసీమ స్థాయి నాయకుడైన కుమారుడు మోమిన్ ముస్తఫా, స్థానిక మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ అయిన మరో కుమారుడు ముఫ్తి కూడా టీడీపీకి రాజీనామా చేశారు. ♦ టీడీపీ కోవూరు నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లిలో బుధవారం నిర్వహించిన ప్రచారంలో పార్టీలోని వర్గవిభేదాలు బయటపడ్డాయి. ప్రచార రథమెక్కేందుకు యత్నించిన వవ్వేరు బ్యాంక్ మాజీ చైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డిని పోలంరెడ్డి దినేష్‌రెడ్డితో పాటు స్థానిక టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఆయన అనుచరులనూ మెడపట్టి తోసేశారు. మరొకరిని కాలితో తన్నడంతో కిందపడిపోయారు. దీంతో సూరాతోపాటు ఆయన అనుచరులు అవమానభారంతో వెనుదిరిగారు. సూరా ఇటీవలే టీడీపీలో చేరారు. ఆయన చేరికను పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. ప్రశాంతిరెడ్డి కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూరాకు హుకుం జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే ప్రశాంతిరెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. దీంతో ఆమె అర్ధాంతరంగా ప్రచారాన్ని ఆపేసి వెనుదిరిగారు. ళీ అనంతపురం అర్బన్ సీటును దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అనే కొత్త వ్యక్తికి ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి వర్గం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ♦ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి, జిల్లా అధ్యక్షుడికి ఫ్యాక్స్, వాట్సాప్‌ల ద్వారా బుధవారం పంపించారు. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడినా తనకు న్యాయం జరగలేదని, జనసేనకు పట్టు ఉన్న అమలాపురాన్ని టీడీపీ చేతిలో పెట్టడమేమిటని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వివరించారు. -
కూటమిలో వేరు కుంపట్లు
సాక్షి, పుట్టపర్తి: జెండాలు జత కట్టాయి.. నేతలు కూటమిగా ఏర్పడ్డారు.. సీట్లు పంచుకున్నారు.. అభ్యర్థులను ఖరారుచేశారు.. కానీ, అసలైనది అయిన సహకారం వీరి మధ్య కరువైంది. ప్రధానంగా మిత్రపక్షాల నుంచి టీడీపీకి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇదే అదనుగా బీజేపీకి చెక్ పెట్టాలని టీడీపీ నేతలు స్కెచ్ వేస్తున్నారు. మరోవైపు.. తమకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని జనసేన కార్యకర్తలూ అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా పార్టీల పెద్దలు కలుసుకునేందుకు మాత్రమే కూటమి వేదికగా మారినట్లు స్పష్టమవుతుండగా క్షేత్రస్థాయిలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కూటమిలో టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగేందుకు ఎవరికి వారు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురం పార్లమెంటు సీటుతో పాటు ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, రాప్తాడులో వేరు కుంపట్లు ఉంటాయని చెబుతున్నారు. మూడు పార్టీల నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో ఎవరికి వారుగా పోటీచేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాప్తాడు నుంచి వరదాపురం సూరి? బీజేపీ తరఫున ధర్మవరం టికెట్ ఆశించిన వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ)కి కూడా నిరాశే ఎదురైంది. బీజేపీ అధిష్టానం ధర్మవరం టికెట్‌ను వై. సత్యకుమార్‌కు ఖరారు చేసింది. దీని వెనుక పరిటాల శ్రీరామ్ హస్తం ఉందని భావిస్తున్న సూరి తనకు టికెట్ రాకుండా టీడీపీ అధిష్టానం వద్ద అడ్డుపుల్లలు వేసిన పరిటాల కుటుంబ సభ్యులను ఓడించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి.. పరిటాల సునీతను ఓడించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ‘స్వతంత్రం’గా పరిపూర్ణానందస్వామి.. హిందూపురం ఎంపీగా బీజేపీ తరఫున పోటీచేస్తానని రెండు నెలలుగా పరిపూర్ణానందస్వామి ప్రచారం చేసుకున్నారు. అయితే, కూటమిలో భాగంగా టీడీపీ నేత బీకే పార్థసారథికి ఆ ఎంపీ టికెట్ ఖరారుచేశారు. కానీ, పరిపూర్ణానందస్వామి తగ్గే పరిస్థితి కనిపించడంలేదు. తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని.. కార్యకర్తలు అందరూ సహకరించాలని ఆయన కోరుతున్నారు. టీడీపీ–జనసేన తనను మోసం చేశాయని ఆయన మండిపడుతున్నారు. ప్రచారానికి శ్రీరామ్ దూరం? ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున ప్రచారం చేసేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. రాప్తాడులో పరిటాల సునీత గెలుపు కోసం బిజీబిజీగా గడపాల్సి ఉందని.. ఇతర పార్టీ నేతల గెలుపు కోసం తానెందుకు సమయం వృథా చేసుకోవాలని తన అనుచరుల వద్ద శ్రీరామ్ చర్చించినట్లు సమాచారం. అలాగే.. జనసేన నేత చిలకం మధుసూదన్‌రెడ్డి కూడా సత్యకుమార్‌కు మద్దతిచ్చే పరిస్థితి కనిపించలేదు. కదిరిలో అంటీముట్టనట్లుగా విష్ణు.. ఇక కూటమి నిర్ణయాలు తనను నిరాశపరిచాయని కదిరి బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి తన అనుచరుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. రానున్న ఎన్నికల్లో కదిరిలో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేయకపోవచ్చని సమాచారం. కర్ణాటక రాజధాని బెంగళూరు వెళ్లి.. అక్కడ బీజేపీ పార్లమెంటు అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. పుట్టపర్తిలో టీడీపీకి సహాయ నిరాకరణ.. కలిసి పోటీచేయాలన్న లక్ష్యంతో టీడీపీ–బీజేపీ –జనసేన కూటమిగా ఏర్పడినా.. పుట్టపర్తిలో మాత్రం ఆ దిశగా ఆయా నాయకులు ముందుకెళ్లడంలేదు. అక్కడ జనసేన నాయకుల అడ్రస్‌లేదు. బీజేపీ నేతలు ఎక్కడ ఉన్నారో కనిపించని పరిస్థితి. కేవలం టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. అనంతపురం నుంచి ఉద్యోగం మాదిరిగా ఉదయం వచ్చి సాయంత్రం వెళ్తున్నట్లు ‘తమ్ముళ్లు’ చెబుతున్నారు. -
సీనియర్లకు మొండిచేయి
-
టీడీపీ 3వ జాబితా కనిపించని సీనియర్ నేతల పేర్లు...
-
సొంత నేతలతో కాంగ్రెస్‌కు తలనొప్పులు?
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని కష్టాలు వెంటాడుతున్నాయి. దీనికి ఆ పార్టీలోని సీనియర్ నేతలే కారణమంటూ పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలు పార్టీకి కత్తిమీద సాములా మారాయి. హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ హిమాచల్‌లోని మండి స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి ససేమీరా అంటున్నారు. ప్రతిభా సింగ్ 2019లో మండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక్కడ ఆమెకు అమితమైన ప్రజాదరణ ఉంది. కాగా మండి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సినీ నటి కంగనా రనౌత్ పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రతిభా సింగ్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభా సింగ్ తనయుడు విక్రమాదిత్య సింగ్ కూడా ఇదే వైఖరితో ఉన్నట్లు సమాచారం. దీనికితోడు వీరభద్ర సింగ్ గ్రూపులోని పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు వైఖరిని ప్రదర్శిస్తున్నారట. విక్రమాదిత్య సింగ్ వర్గం హిమాచల్ సీఎం కుర్చీపై కన్నేసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మరింతగా పెరిగిపోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. -
సీనియర్లకు బాబు షాక్..
-
బీజేపీ అధిష్ఠానానికి సీనియర్ల లేఖ..ఆ లెటర్ లో ఏముంది ?
-
మరోసారి చంద్రబాబు మొండిచేయి.. రగిలిపోతున్న సీనియర్లు
సాక్షి, విజయవాడ: మరోసారి సీనియర్లకు చంద్రబాబు మొండిచేయి చూపారు. రెండో లిస్ట్‌లో కూడా సీనియర్లకు చోటు దక్కలేదు. దీంతో చంద్రబాబు వైఖరితో సీనియర్లు రగిలిపోతున్నారు. రెండో జాబితాలోనూ కళా వెంకట్రావుకు చోటు దక్కలేదు. ఎచ్చెర్ల సీటు కళా వెంకట్రావు, చీపురుపల్లి సీటు కిమిడి నాగార్జున కోరుతున్నారు. మరోవైపు, నెల్లూరు జిల్లా కోవూరులో పోలంరెడ్డికి షాక్ తగిలింది. వేమిరెడ్డి భార్యకు చంద్రబాబు సీటు ఇచ్చేశారు. రూ.కోట్లు పెడతామని చెప్పడంతో పార్టీ నేతలకు బాబు హ్యాండ్ ఇచ్చారు. నెల్లూరులో సోమిరెడ్డికి కూడా చంద్రబాబు షాక్ ఇచ్చారు. రెండో జాబితాలోనూ సోమిరెడ్డికి చోటు దక్కలేదు. చంద్రబాబు తీరుపై ఉమ్మడి విశాఖ నేతలు గుర్రుగా ఉన్నారు. టికెట్లు కేటాయించకపోవడంపై టీడీపీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. గంటాకు భీమిలి సీటు కుదరదంటున్న చంద్రబాబు.. బండారు సత్యనారాయణకు కూడా పెందుర్తి సీటు నిరాకరించారు. చంద్రబాబు తీరుపై అయ్యన్నపాత్రుడు అలకబూనారు. తన కుమారుడికి ఎంపీ సీటు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లాలో టీడీపీ నుంచి రాజీనామాల పర్వం విశాఖ జిల్లాలో టీడీపీ నుంచి రాజీనామాల పర్వం మొదలైంది. టీడీపీకి సౌత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జి రాజీనామా చేశారు. విశాఖ సౌత్ స్థానం జనసేనకు కేటాయించడంతో మనస్తాపం చెందారు. విశాఖ వెస్ట్ స్థానం ఆశించిన పాసర్ల ప్రసాద్.. కొన్ని రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీడీపీకి రాజీనామా చేసేందుకు కొంతమంది నాయకులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన... చంద్రబాబు నివాసం వద్ద పుట్టపర్తి టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పుట్టపర్తి టిక్కెట్లు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. వడ్డెర సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలంటూ రోడ్డుపై బైఠాయించారు. రెండో జాబితాలో పల్లె రఘునాథరెడ్డి కోడలుకు టీడీపీ అధిష్టానం టిక్కెట్ కేటాయించడంతో గత 30 ఏళ్లుగా వడ్డెరలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘గంటా’ రహస్య భేటీ రుషికొండలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో మాజీ మంత్రి గంటా తన అనుచరులతో రహస్య సమావేశమయ్యారు. టీడీపీ అధిష్టానం వైఖరితో విసిగిపోయిన గంటా.. టీడీపీలో కొనసాగాలా? లేదా? అనే అంశంపై అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. టీడీపీ రెండో జాబితాలో కూడా గంటా శ్రీనివాస్‌కు టీడీపీ టికెట్ కేటాయించలేదు. మొదటి నుంచీ భీమిలి టికెట్ కోసం పట్టుబట్టిన గంటాకు భీమిలి టికెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. మూకుమ్మడి రాజీనామాలు.. కృష్ణాజిల్లా పెనమలూరులో బోడే ప్రసాద్‌కు టిక్కెట్ దక్కక పోవడంపై కార్యకర్తల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు తీరుపై బోడే అనుచరులు,కార్యకర్తలు మండిపడుతున్నారు. 40 ఏళ్లుగా పార్టీలో ఎందుకున్నామా అనిపిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బోడే కాలికి బలపం కట్టుకుని పెనమలూరులో తిరిగారు. చంద్రబాబు,లోకేష్ కూడా బోడే మాదిరి తిరగలేదు. చంద్రబాబు జైల్లో ఉంటే మా ఇంట్లో మనిషిలాగా భావించాం. 53 రోజులు నిరాహారదీక్షలు చేశాం. నేటి నుంచి టీడీపీ,చంద్రబాబు ఓటమే లక్ష్యంగా పనిచేస్తాం. చంద్రబాబు సీఎం కుర్చీలో ఎలా కూర్చుంటాడో చూస్తామంటూ మండిపడ్డారు. -
టీడీపీలో కొత్త కష్టాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ వద్దనుకున్న నాయకులను అక్కున చేర్చుకున్న టీడీపీకి ఇప్పుడు కొత్త కష్టాలు మొదలయ్యాయి. పార్టీ ఫిరాయించి వలస వచ్చిన నేతలు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు ఎసరు పెడుతున్నారు. భారీగా నిధులు ఇస్తుండటంతో చంద్రబాబు కూడా వారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు. వలస నేతల దెబ్బకు సీట్లు ఎగిరిపోయిన నేతలు చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. దిగుమతి నేతలపై కారాలు మిరియాలు నూరుతూ నియోజకవర్గాల్లో వారికి పట్టు దొరక్కుండా చేస్తున్నారు. ఫిరాయింపు నేతలకు పెద్దపీట వేసి, తమను అవమానిస్తున్నారని సీనియర్లు చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో టీడీపీలో పాత, కొత్త నేతల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. నెల్లూరు టీడీపీలో చిచ్చుపెట్టిన వేమిరెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పెద్ద చిచ్చే పెట్టారు. ఇటీవలే టీడీపీలో చేరిన ఆయన నెల్లూరు ఎంపీ స్థానాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా మరికొన్ని ఎమ్మెల్యే స్థానాల్లో తాను చెప్పిన వారికే సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కోవూరు స్థానాన్ని తన సతీమణి ప్రశాంతికి ఇవ్వాలని చంద్రబాబుపై గట్టి ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పుడు ఆమె పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే జరుగుతోంది. దీంతో అక్కడి మాజీ ఎమ్మెల్యే పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి రగిలిపోతున్నారు. ఆయన ఈసారి తన కొడుకుని అక్కడ పోటీ చేయించేందుకు చాలారోజుల నుంచి పని చేస్తున్నారు. ఇప్పుడు బయటి వ్యక్తి కోసం తమను మోసం చేయడం ఏమిటని ఆయన అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. వేమిరెడ్డి ప్రవేశంతో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సీటు కూడా ఎగిరిపోయే పరిస్థితి ఏర్పడింది. సర్వేపల్లిలో సోమిరెడ్డి స్థానంలో తనతోపాటు టీడీపీలో చేరిన నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్‌ని పోటీ చేయించడానికి వేమిరెడ్డ రంగం సిద్ధం చేశారు. రూప్‌కుమార్ పేరుతో సర్వే కూడా చేస్తుండడంతో సోమిరెడ్డి వర్గం భగ్గుమంటోంది. టీడీపీలో ఆది నుంచి ముఖ్య నాయకుడిగా ఉన్న సోమిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు వద్ద చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డబ్బున్న నేతలతోనే అంతా అయిపోతే ఇక తామెందుకుని ఆయన అనుయాయుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నగాన మొన్న పార్టీలో చేరి తమ సీట్లను ప్రభావితం చేయడం ఏమిటని, చంద్రబాబు ఆయనకు వంతపాడడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘లావు’ దెబ్బకు ఇద్దరు సీనియర్లు విలవిల వైఎస్సార్సీపీ నర్సరావుపేట లోక్‌సభ సీటు నిరాకరించడంతో చంద్రబాబు పక్కన చేరిన లావు శ్రీకృష్ణ దేవరాయలు దెబ్బకు ఇద్దరు టీడీపీ సీనియర్లు విలవిల్లాడుతున్నారు. పార్టీలో చేరకముందే ఆయన సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు సీటుకు ఎసరు పెట్టారు. యరపతినేని పోటీ చేసే గురజాల సీటును జంగా కృష్ణమూర్తికి ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారు. చంద్రబాబు దానికి సరేనని యరపతినేనికి సీటు ఖరారు చేయకుండా పక్కనపెట్టేశారు. అంతటితో ఆగకుండా యరపతినేనిని నర్సరావుపేట ఎమ్మెల్యే స్థానానికి పంపాలని సూచించడంతో చంద్రబాబు దానిపై ఐవీఆర్ఎస్ సర్వే చేయించారు. దీంతో అక్కడి ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద్‌బాబు సీటు ప్రశ్నార్థకమైంది. లావు రాజకీయంతో నర్సరావుపేట, గురజాల నియోజకవర్గాల్లో అయోమయం నెలకొంది. గుమ్మనూరు రాకతో జితేంద్రగౌడ్ సీటు గల్లంతు వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్లిపోయి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకి గుంతకల్ సీటు ఇచ్చేందుకు చంద్రబాబు సమ్మతించడం టీడీపీలో అగ్గి రాజేసింది. గుంతకల్ సీటును జయరాం దక్కించుకోవడంతో అక్కడి మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ సీటు గల్లంౖతైంది. దీంతో ఆయన వర్గం జయరాంకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం స్థానాన్ని బయట నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్‌కి ఖరారు చేయడంతో మాజీ మంత్రి దేవినేని ఉమా పరిస్థితి ప్రశ్నార్థకమైంది. నూజివీడు సీటును వలస నేత కేపీ సారథికి కేటాయించడంతో పదేళ్లుగా అక్కడ పార్టీ కోసం పనిచేస్తున్న బీసీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు చోటు లేకుండాపోయింది. ఇలా రాజకీయ అవసరాల కోసం అప్పటికప్పుడు పార్టీ ఫిరాయించిన వారిని చంద్రబాబు అందలం ఎక్కించుకుని పార్టీ కోసం పని చేసిన వారిని పూచికపుల్లల్లా తీసివేస్తుండటం టీడీపీలో కల్లోలం రేపుతోంది. -
చంద్రబాబు తీరుపై సీనియర్ నేతల మండిపాటు
-
టీడీపీకి గుడ్ బై చెప్తున్న సీనియర్లు
-
సీనియర్ల మౌనం.. సందేహం!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కొందరు ఎన్నికల సమయంలో స్తబ్దుగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. కీలకంగా పని చేయాల్సిన తరుణంలో ముఖం చాటేయడం, పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనకపోవడంతో టీడీపీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు తదితరులు అధిష్టానం తీరుతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వారు పార్టీ వీడే ఆస్కారమూ ఉందనే వాదన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పూర్తి దూరంగా పుల్లారావు టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆ పార్టీ ముఖ్యనేత ప్రత్తిపాటి పుల్లారావు కొద్దికాలంగా పార్టీపై అసంతృప్తితో బయటకు రావడంలేదు. ఆయన ఇన్చార్జిగా ఉన్న చిలకలూరిపేట సీటును వేరే వారికి ఇచ్చేందుకు యత్నించడంతో ఆయన అడ్డుకున్నారు. ఆ తర్వాత అడపాదడపా పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. కొద్దిరోజులుగా పూర్తిగా సైలెంట్ అయ్యారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయానికీ రావడంలేదని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీపైనా స్పష్టత లేదు. గతంలో ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. పరపతి తగ్గిన యరపతినేని! పల్నాడుకు చెందిన మరో కీలక నేత యరపతినేని శ్రీనివాసరావుకు పార్టీలో పరపతి పూర్తిగా తగ్గిందని సమాచారం. ఫలితంగా పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్నారని తెలుస్తోంది. చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలేదు. తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గురజాల నుంచి పోటీ చేస్తారో లేదో అనే సందిగ్ధం నెలకొంది. అయ్యో.. ‘చింత’కాయల ఉత్తరాంధ్రకు చెందిన మరో కీలక నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అప్పుడప్పుడు మీడియాలో మాట్లాడుతున్నా పార్టీ వ్యవహారాల్లో గతంలో ఉన్నంత చురుగ్గా లేరని చర్చ జరుగుతోంది. ఆయన కుమారుడు విజయ్ కూడా ఇప్పుడు అంత క్రియాశీలకంగా లేరని సమాచారం. గతంలో టీడీపీ సోషల్ మీడియా వింగ్‌కు ఇన్చార్జిగా ఉన్న విజయ్ను తప్పించి ఆ బాధ్యతలను పయ్యావుల కేశవ్‌కు అప్పగించారు. అప్పటి నుంచి టీడీపీకి, అయ్యన్న కుటుంబానికి దూరం పెరిగినట్లు తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావుకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా వారికి నచ్చడంలేదని చెబుతున్నారు. లోకేశ్ తీరే కారణమా..? ఇలా సీనియర్లంతా పార్టీపై అసంతృప్తితో మౌనంగా ఉండడానికి చినబాబు లోకేశ్ తీరే కారణంగా తెలుస్తోంది. ఆయన సీనియర్లను దూరం పెట్టడంతోపాటు వారికి వ్యతిరేకంగా జూనియర్లను ఎగదోయడం అసంతృప్తి జ్వాలలను పెంచిందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రత్తిపాటి, యరపతినేని తదితర సీనియర్ నేతలు పార్టీని వీడే ఆస్కారం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. లోలోన రగులుతున్న మరింత మంది మరింత మంది సీనియర్లు లోకేశ్ తీరు కారణంగా లోలోన రగిలిపోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు అప్పుడప్పుడూ మీడియాలో ఘీంకరించడం తప్ప నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉండడం లేదు. ఆయన్ను పార్టీ క్యాడర్ పట్టించుకోవడంలేదు. అసమ్మతి పెరిగిపోవడంతో ఈసారి ఆయనకు సీటు లేదని లోకేశ్ తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన మిన్నకుండిపోయారు. ఏలూరు జిల్లాలో కీలక నేత చింతమనేని ప్రభాకర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నిమ్మకాయల చినరాజప్ప, ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేఈ ప్రభాకర్ వంటి నేతలూ చురుగ్గా ఉండడంలేదని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కింజరపు అచ్చెన్నాయుడూ మొక్కుబడిగానే వ్యవహరిస్తున్నట్టు సమాచారం. లోకేష్ కోసం ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించడమే కాకుండా తరచూ మీడియా సమావేశాలు కూడా నిర్వహించనీయడం లేదని తెలుస్తోంది. అందుకే ఆయన పత్రికా ప్రకటనలతో అచ్చెన్న సరిపెట్టుకుంటున్నారు. పేరుకు అధ్యక్షుడైనా లోకేష్ ఆయన్ను అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదని లోలోపల ఆవేదన చెందుతున్నారని సమాచారం. ఇంకా చాలామంది సీనియర్లు ఇలాగే స్తబ్దుగా ఉండడంతో పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీ పుంజుకోకపోవడం, లోకేశ్ వ్యవహార శైలితో పార్టీ పరిస్థితి మరింత దిగజారిందనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. -
గూగుల్ పరిస్థితులు బయటపెట్టిన మాజీ ఉద్యోగి
ఉద్యోగాల్లో చేరాలనుకునే చాలామంది గూగుల్ సంస్థలో పనిచేయడం ఒక కలగా పెట్టుకుంటారు. దీనికి కారణం వేతనాలు కావొచ్చు, కంపెనీ అందించే ప్రయోజనాలు కావొచ్చు. అయితే 2023లో కంపెనీ ఎక్కువ మందిని తొలగించినప్పటికీ.. జీతాలు ఎక్కువ చెల్లించే సంస్థల్లో ఒకటిగా నిలిచింది. కొన్ని సందర్భాల్లో విమర్శలకు గురవుతోంది. గూగుల్ కంపెనీలో 15 సంవత్సరాలు పనిచేసిన మాజీ ఉద్యోగి 'జోనాథన్ బెల్లాక్' ఇటీవల కంపెనీ పరిస్థితులను వివరించడమే కాకుండా సీఈఓ సుందర్ పిచాయ్‌ను సైతం విమర్శించాడు. కంపెనీలో చాలామంది సీనియర్ నాయకులు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా టీమ్ సమస్యలను పరిష్కరించడం మానేశారని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి అధికారులు త్వరగా తీసుకోవలసిన ముఖ్యమైన నిర్ణయాలు సుదీర్ఘ వాదనలలో చిక్కుకుంటున్నాయని, ఇవి నెలలు తరబడి సుదీర్ఘ చర్చలుగా సాగుతూ.. కొత్త ఆలోచనలను అందించడానికి జూనియర్ ఉద్యోగులను ఉపయోగించుకుంటారని వెల్లడించారు. భిన్నాభిప్రాయాలతో కలిసి ముందుకు వెళ్లడం కంటే.. నష్టాలు లేదా ఖర్చుల గురించి చర్చించడం ఉన్నతాధికారులకు సులువుగా ఉండటమే దీనికి కారణమని బెల్లాక్ వివరించారు. ఇదీ చదవండి: బంగారం కొనటానికి ఇది సరైన సమయం.. మళ్ళీ తగ్గిన ధరలు తన పదవీకాలం ముగిసే సమయానికి, వాణిజ్యపరంగా సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించడంలో విఫలమైనందుకంటే గ్లోబల్ అఫైర్స్‌తో విభేదించినందుకు ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు వివరించారు. గూగుల్ కంపెనీలో సుమారు 15 సంవత్సరాలు ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేసిన బెల్లాక్ ఇటీవల ఈ విషయాలను థ్రెడ్ యాప్ ద్వారా పోస్ట్ చేశారు. -
ఉమ్మడి నల్గోండ జిల్లాలో పార్లమెంట్ స్థానాల్లో పోటి పై మొదలైన రాజకీయ చర్చ!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్ స్థానాల్లో పోటీపై రాజకీయవర్గాల్లో చర్చ జోరందుకుంది. మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో మూడు ప్రధాన పార్టీల్లో ఎంపీ టికెట్ల కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించడంతో ఆ పార్టీ నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. సీనియర్ నేతలతో పాటు ముఖ్య నేతలు కూడా ఎంపీ టికెట్‌పై దృష్టి పెట్టారు. ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఎంపీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల నుంచి హామీ పొందిన నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. మనసులో మాట బయటపెట్టిన జానారెడ్డి నాగార్జునసాగర్ ఎన్నికల బరి నుంచి తప్పుకొని, తన కుమారుడికి టికెట్ ఇప్పించుకున్న పార్టీ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే తన మనసులో మాట బయట పెట్టారు. పార్టీ ఆదేశిస్తే తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తానని పేర్కొన్నారు. రాజకీయాల నుంచే తప్పుకుంటానని చెప్పిన ఆయన ఈ మాట చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మూడు రోజుల క్రితం.. సీఎం రేవంత్‌రెడ్డి తన ఇంటికి వచ్చి వెళ్లిన తరువాత కూడా జానారెడ్డి ఇదే మాట చెప్పారు. దీంతో ఈసారి ఆయన పోటీలో ఉంటారన్న చర్చ సాగుతోంది. ఆయన పెద్ద కుమారుడు కుందూరు రఘువీర్‌రెడ్డి కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు బరిలో ఉంటారన్నది చర్చనీయాంశంగా మారింది. పటేల్ రమేష్‌రెడ్డికి హామీ.. సూర్యాపేట అసెంబ్లీ టికెట్‌ను సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి ఇచ్చిన సమయంలో అక్కడి నుంచి టికెట్ ఆశించిన పటేల్ రమేష్‌రెడ్డికి అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చింది. నల్లగొండ లేదా భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తామని కేసీ వేణుగోపాల్ కూడా ఆయనకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రమేష్‌రెడ్డికి ఎంపీ టికెట్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలోనే ఏదైనా పదవి ఇస్తారన్న చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఆశావహులు నల్లగొండ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ నుంచి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మునుగోడు టికెట్ ఆశించారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ కేటాయించడంతో అమిత్‌కు లోక్‌సభ టికెట్ ఇస్తారన్న చర్చ సాగింది. మరోవైపు వ్యాపారవేత్త నరేందర్‌రెడ్డి కూడా అప్పట్లో నల్లగొండ ఎంపీ టికెట్ ఆశించారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో మాజీ సీఎం కేసీఆర్ ప్రచార సభల్లోనూ ఆయన పాల్గొన్నారు. కమలం దళం నుంచి ప్రసాద్ బీజేపీ నుంచి నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బండారు ప్రసాద్‌కు గతంలోనే పార్టీ హామీ ఇచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంకినేని వెంకటేశ్వర్రావుతోపాటు ఒకరిద్దరు నేతల పేర్లు కూడా పార్టీ ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. భువనగిరి స్థానంపై యువనేతల దృష్టి భువనగిరి ఎంపీ టికెట్ రేసులో సీఎం రేవంత్‌రెడ్డి అనుచరుడు, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై తుంగతుర్తిలో మందుల సామేల్ గెలుపు కోసం పనిచేశారు. తాను ఎంపీగా పోటీ చేస్తానన్న విషయాన్ని కూడా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తారన్న చర్చ సాగుతోంది. అయితే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిని పోటీలో దింపుతారనే చర్చ కూడా సాగుతోంది. మరోవైపు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కుమార్తె కీర్తిరెడ్డి కోసం టికెట్ అడుగుతున్నట్లు తెలిసింది. ఇక బీఆర్ఎస్ నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని బరిలో నిలుపుతారనే చర్చ సాగుతుండగా, బీసీకి ఇవ్వాల్సి వస్తే జనగామకు చెందిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బూడిద భిక్షమయ్యగౌడ్ పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇక బీజేపీ నుంచి ఆ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. -
TS: సీనియర్లకు ఫ్రెషర్ల ఛాలెంజ్
ఎన్నికల్లో యువ ఓటర్ల పాత్ర ఎంతో కీలకమైనది. యువత ముందుకొచ్చి ఓటు వేయడమే కాకుండా.. ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహారించాలన్న చర్చ ఎప్పటి నుంచో నడుస్తున్నదే. అయితే ఈసారి జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో పలుచోట్ల యువరక్తం.. పైగా కొత్త ముఖాలు.. అందునా సీనియర్లతో పోటాపోటీకి సిద్ధం కావడం గమనార్హం. కార్నె శిరీష(బర్రెలక్క) : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కార్నె శిరీష(బర్రెలక్క) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఈ దఫా ఎన్నికల్లో చిన్నవయస్కురాలైన అభ్యర్థిగా ఈమెకు ఓ గుర్తింపు దక్కింది. సోషల్ మీడియాలో బర్రెలక్కగా బాగా పాపులర్ అయిన శిరీష.. నామినేషన్ మొదలు నుంచి వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రచార సమయంలో ఆమె వర్గం దాడి జరిగాక.. ఆ చర్చ తారాస్థాయికి చేరింది. చివరాఖరికి హైకోర్టు సైతం ఆమెకు భద్రత కల్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బీజేపీ సుధాకర్ లాంటి సీనియర్లను ఈమె ఢీ కొడుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: పవన్ కంటే బర్రెలక్క నూరుపాళ్లు నయం! మామిడాల యశస్వినీరెడ్డి: ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మరో అత్యంత యువ అభ్యర్థి యశస్విని కావడం విశేషం. కాంగ్రెస్ తరఫున పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి సీనియర్ మీద మామిడాల యశస్వినీ(26) పోటీకి దిగింది. యశస్వినీరెడ్డి హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసింది. ఆపై ఝాన్సీరెడ్డి కొడుకు రాజారామ్ మోహన్ రెడ్డిని వివాహం చేసుకుని అమెరికా వెళ్లింది. అత్త ఝాన్సీరెడ్డికి కాంగ్రెస్ టికెట్ విషయంలో పౌరసత్వ అభ్యంతరాలు తలెత్తడంతో.. కోడలు యశస్వినీకి ఆ అవకాశం దక్కింది. ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా ఈ యువ అభ్యర్థి కోసం ప్రచారం కూడా చేశారు. నాన్ లోకల్ అనే ప్రత్యర్థి ప్రచారాన్ని తిప్పి కొడుతూ.. పాలకుర్తిలో గెలుపుపై యశస్విని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదీ చదవండి: ఎర్రబెల్లికి చుక్కలు చూపిస్తున్న హనుమాండ్ల ఫ్యామిలీ మైనంపల్లి రోహిత్‌రావు: మైనంపల్లి హనుమంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్(27). మెదక్ జిల్లా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మెడిసిన్ పూర్తిచెసిన రోహిత్ తన తండ్రి.. ఆయన అనుచర గణం అండతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్’ పేరిట కరోనా టైంలో అందించిన సేవలకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. మెదక్‌లో పద్మాదేవేందర్‌రెడ్డి లాంటి సీనియర్‌తో పోటీకి రోహిత్ సిద్ధం అయ్యారు. ఇదీ చదవండి: మెదక్‌లో మళ్లీ పాతయుద్ధమేనా? ఉషా దాసరి: ఐఐటీ గ్రాడ్యుయేట్ ఉషా దాసరి (27).. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థినిగా పోటీలో ఉన్నారు. కలెక్టర్ కావాలనే కలని సైతం పక్కన పెట్టి తల్లిదండ్రుల పేరు మీద ట్రస్ట్ నెలకొల్పి.. ఉచిత ట్యూషన్లతో స్థానికంగా మంచి పేరు సంపాదించుకున్నారీమె. దాసరి మనోహర్‌తో పాటు చింతకుంట విజయరమణారావులాంటి సీనియర్ల నడుమ పోటీకి నిలిచారు. ఇదీ చదవండి: ఐఐటీ స్టూడెంట్... పొలిటికల్ ఎంట్రీ వీళ్లేకాదు.. మిరియాల రామకృష్ణ(28) జనసేన అభ్యర్థిగా ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మల.. పువ్వాడ అజయ్లాంటి వారితో పోటీ పడుతుండగా.. అలాగే ములుగు నుంచి సీతక్కకు పోటీగా బీఆర్ఎస్ అభ్యర్థిని బడే నాగజ్యోతి(29) ఎన్నికల బరిలో దిగి యువసత్తా చాటాలని చూస్తున్నారు. -
తెలంగాణ: బరిలో కురువృద్ధులు.. ఎవరో తెలుసా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ప్రధాన పార్టీల అభ్యర్థుల నడుమ పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది. అదే సమయంలో ఈసారి ఎన్నికల్లో కురువృద్ధులు తమ సత్తా చాటాలనుకుంటున్నారు. అత్యధిక వయసుతో ఎలక్షన్ బరిలో దిగిన నేతల జాబితాను పరిశీలిస్తే.. 1. వనమా(బీఆర్ఎస్.. కొత్తగూడెం) వనమా వెంకటేశ్వరరావు..(78) కొత్తగూడెం ఎమ్మెల్యే, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి కూడా. ప్రస్తుత అసెంబ్లీలో అందరికంటే వయస్సులో పెద్ద నేత వనమానే కావడం గమనార్హం. వనమా 1989లో మొట్టమొదటిసారిగా కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటికే ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి.. ఒకసారి మంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం మళ్ళీ కొత్తగూడెం నుంచే పోటీ చేస్తున్నారు. మొదటిసారి గెలిచిన తర్వాత, రెండుసార్లు 1999లో 2004లోనూ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2008లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. పదేళ్ల తరువాత కాంగ్రెస్ కి రాజీనామా చేసి, అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో చేరే ముందు కాంగ్రెస్ లో పార్టీ టికెట్ పై పోటీ చేశారు. ఈ పోటీలో బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్ రావుపై మెజారిటీ ఓట్లతో గెలుపొందారు. కాని, గెలిచిన అనంతరం ఆయన కాంగ్రెస్‌ను వీడి.. బీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు. 2018 ఎన్నికల్లో ఇవే తనకు చివరి ఎన్నికలని.. ఒకసారి అవకాశం కల్పించాలని ప్రజల ముందుకు వచ్చి విజయం సాధించారు. ఆ ఎన్నిక ప్రత్యర్థి అభ్యంతరంతో కోర్టు దాకా చేరి.. చివరకు సుప్రీంలో ఊరటతో గట్టెక్కింది. ఇక ఇప్పుడు తన తనయుడ్ని బరిలోకి దింపాలని చూసినా.. చివరకు వనమాకే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. 2. మర్రి శశిధర్ రెడ్డి (బీజేపీ.. సనత్‌నగర్) సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి(74).. తండ్రి అడుజాడల్లో రాజకీయంలోకి వచ్చి నాలుగు సార్లు నెగ్గి.. రెండుసార్లు ఓటమిపాలయ్యారు.ఈయన జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ మాజీ చైర్మన్ కూడా. ప్రస్తుతం సనత్‌నగర్ లో బీజేపీ నుంచి పోటీలో నిలిచారు. మొదట్లో రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా నెగ్గారు. మూడోసారి పోటీలో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత వరుసగా రెండుసార్లు గెలుపొందారు. అప్పటివరకు జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థకు చైర్మన్ గా నిలిచిన శశిధర్.. 2014లో తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. విజయం దక్కలేదు. ప్రస్తుతం సనత్ నగర్ నుంచే బరిలో నిలిచారాయన. 3. పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి (కాంగ్రెస్.. బోధన్) మరో సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి(74).. 2023లో బోధన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. వ్యాపారి అయిన పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి.. 1989లో మొదలుపెట్టిన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (1989) బోధన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాతి ఎలక్షన్స్‌లో గెలిచి.. మరో రెండుసార్లు బోధన్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. బోధన్ నుంచి పోటీలో నిలిచారాయన. 4. టీ.జీవన్ రెడ్డి (కాంగ్రెస్, జగిత్యాల) సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి (72). కాంగ్రెస్ తరఫున జగిత్యాల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. మొత్తం ఆరుసార్లు జగిత్యాల ఎమ్మెల్యేగా ఈయన గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1983లో జరిగిన ఎన్నికల్లో నెగ్గి.. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి వరుసగా మూడుసార్లు నెగ్గి జీవన్ రెడ్డి.. 1994 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత వరుసగా మూడుసార్లు గెలిచి.. హ్యాట్రిక్ రికార్డు సాధించారు. అయితే.. 2006, 2009 కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఈయన ఓటమి పాలయ్యారు. తిరిగి, 2014లో తెలంగాణ ఏర్పడ్డాక మరోసారి గెలిచారు.. 2018 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఇప్పుడు మరోసారి జగిత్యాల నుంచే బరిలో నిలిచారాయన. 5. నడిపెల్లి దివాకర్ రావు (బీఆర్ఎస్.. మంచిర్యాల) కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నడిపెల్లి దివాకర్ రావు..(71) మంచిర్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా విజయం దక్కించుకున్నారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్‌లోనే వివిధ శాఖల్లో పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ వచ్చాక.. మంచిర్యాల ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు ఈయనే నెగ్గారు. ప్రస్తుతం మంచిర్యాల నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీకి నిలబడ్డారు. 6. తుమ్మల నాగేశ్వర్రావు (కాంగ్రెస్.. ఖమ్మం) తుమ్మల నాగేశ్వరరావు..(71) సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రారంభించిన ఈయన రాజకీయ జీవితం.. ప్రస్తుతం ఖమ్మం నియోజకవర్గానికి చేరింది. తుమ్మల తొలి పోటీలోనే ఓటమి పలకరించింది. ఆ తరువాత 1985లో మధ్యంతర ఎన్నికల్లో విజయం అందుకున్నారు. అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు టీడీపీ నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికైయ్యారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక బీఆర్ఎస్కు మారిన అనంతరం.. 2014లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2016లో ఉప ఎన్నికలో పోటీ చేసి నెగ్గారు. తెలంగాణ 2018 ఎన్నికల్లో.. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023లో బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ చేరి ఖమ్మం బరిలో నిలిచారు. 7. బాబూ మోహన్ (బీజేపీ.. ఆందోల్) సినీ నటుడైన బాబూ మోహన్..(71) సీనియర్ ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1999లో జరిగిన ఎన్నికల్లో మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నిక కావడంతో పాటు మంత్రిగానూ అవకాశం అందుకున్నారు. ఆపై 2014లో బీఆర్ఎస్లో చేరారు. అటుపై బీజేపీ కండువా కప్పేసుకుని.. ఆందోల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం, సంగారెడ్డి ఆందోల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి నిలిచారు. 8. రేవూరి ప్రకాష్ రెడ్డి (కాంగ్రెస్.. పరకాల) సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి..(71) టీడీపీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో టీడీపీలో ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2023 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రకాష్ రెడ్డిని వరంగల్ రూరల్ నియోజకవర్గం పరకాల అభ్యర్థిగా ప్రకటించింది. 9. రాంరెడ్డి దామోదర్ రెడ్డి (కాంగ్రెస్.. సూర్యాపేట) సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి..(71).. ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ట్రాక్ ఈయనది. కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ.. తుంగతుర్తి, సూర్యాపేట నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సూర్యాపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. 10. ముఠా గోపాల్ (బీఆర్ఎస్.. ముషీరాబాద్) ముఠా గోపాల్..(70) రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2014 ఎన్నికలో ఓడినా.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ముషీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 11. మంచి రెడ్డి కిషన్ రెడ్డి (బీఆర్ఎస్.. ఇబ్రహీంపట్నం) మంచి రెడ్డి కిషన్ రెడ్డి..(70) టీడీపీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేసి 2009, 2014 శాసనసభ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తరువాత టీడీపీని వీడి బీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి 376 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చున్నారాయన. -
జనసేన దెబ్బకు వణికిపోతున్న టీడీపీ సీనియర్లు
-
BRS: ఇచ్చట అలకలు-రాజీలే కాదు బైబైలు కూడా!
ఈ మధ్యకాలంలో భారత రాష్ట్ర సమితి అనూహ్యమైన ఒత్తిడికి గురి అవుతున్నట్లు కనిపిస్తుంది. కొందరు ముఖ్యనేతలు పార్టీని వీడడం కాస్త ఇబ్బందే అని చెప్పాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి సన్నివేశాలు కొన్ని జరిగినా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వాటిని ఎదుర్కోగలిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తొమ్మిదేళ్ల పాలన తదుపరి పార్టీ నుంచి కొందరు సీనియర్లు వెళ్లిపోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది. రాజకీయాలలో ఇలాంటివి తప్పకపోవచ్చు. ఇప్పటికే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు కొందరు పార్టీని వీడారు. తాజాగా మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు తిరిగి ఎన్నికలలో పోటీచేయడానికి టిక్కెట్ లభించినా, దానిని తిరస్కరించి పార్టీని వీడడం బీఆర్ఎస్కు కొంత అప్రతిష్ట అని చెప్పకతప్పదు. పార్టీ టిక్కెట్లు ప్రకటించేనాటికే మైనంపల్లి తిరుగుబాటు బాటలో ఉన్నారని తెలిసినా, ఆయనకు టిక్కెట్ ప్రకటించడం తప్పిదం అనిపిస్తుంది. ఏ వ్యూహంతో ఆయనకు టిక్కెట్ ఇచ్చారో కాని, అది ఫలప్రదం కాలేదని అర్దం అవుతుంది. మైనంపల్లి కొన్నాళ్ల క్రితం మంత్రి హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. దానికి కారణం తన కుమారుడు మెదక్ నుంచి పోటీచేయాలని భావిస్తుంటే హరీష్ అడ్డుపడుతున్నారన్నది ఆయన భావన. తన కుమారుడితో పాటు తనకు మల్కాజిగిరి టిక్కెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. కాని పార్టీ నాయకత్వం ఆయనకు మాత్రమే ఇచ్చింది. దాంతో ఆయన అసంతృప్తికి గురి అయ్యారు. ✍️మైనంపల్లి మొదటి నుంచి రఫ్ అండ్ టఫ్ లీడరుగానే గుర్తింపు పొందారు. టీడీపీ పక్షాన తొలిసారిగా ఆయన 2008 లో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలో గెలుపొందారు. డీ లిమిటేషన్ లో ఆ నియోజకవర్గం రద్దు కావడంతో మెదక్ నియోజకవర్గానికి మారి మరోసారి 2009 లో గెలిచారు. తెలంగాణ ఉద్యమం దశలో ఆయన టిఆర్ఎస్ తో పలుమార్లు వివాదపడ్డ చరిత్ర ఉంది. తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత 2014లో ఆయన మల్కాజిగిరి నుంచి టీడీపీ టిక్కెట్ ఆశించారు. కానీ, బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీ ఆ టిక్కెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన అలిగి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి ఆ పార్టీలో చేరారు. కాని అక్కడ కూడా మొండి చేయి చూపడంతో ఆ పార్టీని రెండు రోజులలోనే వీడి టిఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. మల్కాజిగిరి ఎమ్.పి టిక్కెట్ ఇవ్వడంతో పోటీచేశారు కాని ఓటమి చెందారు. అయినా టిఆర్ఎస్ అధికారంలోకి రావడంతో మైనంపల్లికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అనంతరం మల్కాజిగిరి అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వడంతో మూడోసారి గెలిచారు. ✍️సొంత అనుచర బలగం కలిగిన మైనంపల్లి ఆ ప్రాంతంలో కొంత పట్టు సాధించారు.ఆ బలంతో ఇప్పుడు పార్టీపై తిరుగుబాటు చేశారు. సాధారణంగా అధికార పార్టీ టిక్కెట్ వచ్చాక ఇలా తిరస్కరించడం అరుదుగా జరుగుతుంటుంది. ఆ విధంగా చూస్తే మైనంపల్లి రిస్కు తీసుకున్నట్లు అనిపిస్తుంది. త్వరలో కాంగ్రెస్ పార్టీ లో ఆయన చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వారి నుంచి రెండు టిక్కెట్ల హామీ పొందినట్లు చెబుతున్నారు. అలాకాకుంటే మళ్లీ సమస్య మొదటికి వస్తుంది. గతంలో రెండు రోజులే కాంగ్రెస్ లో ఉన్నా, రాజకీయ పరిణామాలలో వారు కాస్త బలం ఉన్న నేతలను తిరిగి చేర్చుకుంటారు. మైనంపల్లి తన భవిష్యత్తు కన్నా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపైనే ఎక్కువ ఆశాభావంతో ఉన్నారనుకోవాలి. అందుకోసమే రాజకీయంగా తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. ఆయన సంగతి ఎలా ఉన్నా బీఆర్ఎస్ ఇటీవల పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ✍️కొద్ది రోజుల క్రితమే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ను వదలి కాంగ్రెస్ లో చేరారు. కొంతకాలం క్రితం ఆయన పార్టీ మారే అవకాశం ఉందని, అలకలో ఉన్నారని తెలిసి మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కె.తారక రామారావు స్వయంగా ఖమ్మం వెళ్లి బుజ్జగించి వచ్చారు. అయినా తుమ్మలకు పార్టీ టిక్కెట్ రాలేదు. నిజానికి టీడీపీలో ఉన్న తుమ్మలను స్వయంగా కేసీఆర్ ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్నారు. 2014లో పోటీచేసి ఓడిపోయిన తుమ్మల పార్టీలోకి రావడం ద్వారా ఒక సామాజికవర్గంలో ఎక్కువ ఉపయోగం ఉంటుందని అంచనా వేశారు. ప్రత్యేకించి అప్పట్లో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూడా పార్టీలోకి తెచ్చారని చెబుతారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. తదుపరి పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో తుమ్మల గెలిచారు. కాని అక్కడే 2018 లో జరిగిన సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ది ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. దాంతో తుమ్మలకు రాజకీయ గ్రహణం పట్టినట్లయింది. అప్పటి నుంచి పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. ఈలోగా ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరడంతో తుమ్మల అవకాశాలకు గండి పడింది. మొత్తం మీద బిఆర్ఎస్ లో తనకు అవమానం జరిగిందని భావించిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు. ✍️తుమ్మల చేరికతో ఖమ్మంలో కాంగ్రెస్ బలపడే అవకాశం ఉంది. ఆయన పాలేరు టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆ ప్రకారం కాంగ్రెస్ ఇచ్చే అవకాశం ఉంటేనే.. ఆ పార్టీలో చేరి ఉండాలి. ఎన్.టి.ఆర్. క్యాబినెట్ లోనూ, చంద్రబాబు క్యాబినెట్ లోనూ, తదుపరి కేసీఆర్ మంత్రివర్గంలోనూ పదవులు నిర్వహించిన తుమ్మల.. తనకంటూ ఒక ముద్రవేసుకున్నారు. అయినా రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కున్నారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుటుంబానికి ఆయన ప్రత్యర్దిగా మారిపోయి.. టీడీపీలో చేరిన తర్వాత సొంత వర్గాన్ని తయారు చేసుకోగలిగారు. రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు పొందిన నేత అయినా.. నోటి దురుసుతనం ఆయనకు నెగిటివ్ అని చెప్పాలి. ✍️మరో నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014 లో ఖమ్మం నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన జరిగినా ఆయన గెలవగలిగారు.కాని తదుపరి రాజకీయ పరిణామాలలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తన రాజకీయ కార్యకలాపాలను తగ్గించుకుంది. దానికి తోడు టీ(బీ)ఆర్ఎస్ నాయకత్వం ఆహ్వానించడంతో ఆయన ఆ పార్టీలో చేరారు. కానీ 2019 లో పార్లమెంటు ఎన్నికలలో ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. దాంతో హతాశుడయ్యారు. అయినా అలాగే ఓపికగా పార్టీలో ఉన్నా ప్రభుత్వపరంగా ఆయనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయని చెబుతారు. చివరికి ఆయన చేసిన కాంట్రాక్ట్ ల బిల్లులు కూడా పెండింగులో పడ్డాయని ప్రచారం జరిగింది. అయినా పార్టీపరంగా కేటీఆర్ సంప్రదింపులతో కొంత మెత్తబడ్డా, ఆశించిన రీతిలో రాజకీయం లేకపోవడంతో పొంగులేటి కాంగ్రెస్ లో చేరిపోయారు. అక్కడ పార్టీపరంగా ఒక పదవి కూడా ఇచ్చేశారు. ✍️తుమ్మల, పొంగులేటిల చేరిక బీఆర్ఎస్కు ఖమ్మం జిల్లాలో బాగా దెబ్బ అన్నది విశ్లేషణగా ఉంది. వీరిద్దరి తో పాటు మరికొందరు ప్రముఖులు కూడా ఆయా చోట్ల కాంగ్రెస్ లో చేరబోతున్నారని సమాచారం వస్తోంది. బీఆర్ఎస్ టిక్కెట్ రాని ఎమ్మెల్యేలు రేఖా నాయక్, బాపూరావు వంటివారు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే వీరేశం కూడా పార్టీలో చేరవచ్చు. ఈ మాత్రానికే బీఆర్ఎస్కు పూర్తి నష్టం జరుగుతుందని చెప్పజాలం. కానీ.. ప్రత్యేకించి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో కాంగ్రెస్ బలం పుంజుకోవడానికి ఈ పరిణామాలు ఉపయోగపడవచ్చు. ✍️కాగా మైనంపల్లి రాసిన లేఖలో బీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం పార్టీ కార్యకర్తలకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. ఇందులో కొంత వాస్తవం ఉండవచ్చు. కేసీఆర్ ఏ కారణంతో పార్టీ పేరు మార్చినా, తెలంగాణ పేరు పార్టీలో లేకపోవడం కార్యకర్తలకు అంతగా నచ్చలేదన్నది ఒక వాదన. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించే పరిస్థితి లేదు కనుక ఎవరికి వారు సర్దుకు పోయారు. ఇతర రాష్ట్రాలలో కూడా పార్టీని విస్తరించాలన్న కేసీఆర్ ఆలోచనకు ఈ ఎన్నికల కారణంగా బ్రేక్ పడుతుంది. మళ్లీ గెలిస్తే అప్పుడు ఆ వ్యవహారాలు చూసుకుంటారు. ✍️కేసీఆర్ అందరికన్నా ముందుగా 115 మంది టిక్కెట్లను ప్రకటించడంతో లుకలుకలు బయటకు వస్తున్నాయి. దీని వల్ల పార్టీకి కొంత నష్టం జరిగినా, దానిని సర్దుబాటు చేసుకోవడానికి తగు సమయం ఉందన్న విశ్వాసం పార్టీలో ఉంది. మరో వైపు కేటీఆర్ ఆయా చోట్ల నేతల తగాదాలను తీర్చి రాజీలకు యత్నిస్తున్నారు. ఆ క్రమంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్యకు, మాజీ మంత్రి కడియం శ్రీహరిలకు మధ్య రాజీకుదిర్చారు. రాజయ్యకు ఎమ్మెల్సీ లేదా మరో పదవి ఇస్తామని హామీ ఇచ్చారట. అలాగే జనగామ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వరరెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ సిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తనకే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. వీరి మధ్య రాజీ కూడా కుదర్చడానికి నాయకత్వం తంటాలు పడుతోంది. రాజకీయాలలో తగాదాలు, రాజీలు సర్వసాధారణమే. ఎందుకంటే ఎవరికి వారికి పదవి కావాలి కనుక. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
బీజేపీ అసంతృప్తుల వరుస భేటీలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ముఖ్యనేతలు కొందరు తరచూ సమావేశం కావడం పార్టీ లో కలకలం సృష్టిస్తోంది. అసంతృప్త నేతలుగా భావిస్తున్న వీరంతా ఇటీవలి కాలంలో రెండు, మూడుసార్లు భేటీ అవడంతో.. వీరెందుకు సమావేశమవుతున్నారు? ముఖ్యోద్దేశమేమిటి? అనే చర్చ సాగుతోంది. పార్టీని వీడెందుకేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీరిలో కొందరు కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు ప్రాథమికంగా చర్చలు కూడా జరిపినట్టు జరుగుతున్న ప్రచారం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. అయితే బీఆర్ఎస్తో బీజేపీకి దోస్తీ లేదని అధినాయకత్వం సుస్పష్టం చేయడంతో పాటు, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై విచారణ కమిటీ వేయడం, తదితర చర్యలు తీసుకోవడం ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు, పార్టీ కేడర్‌కు స్పష్టత ఇవ్వాలనేది కొందరు నేతల డిమాండ్‌గా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో కొందరు నేతలు ఏకంగా మోదీ, అమిత్‌షా, ఇతర జాతీయ నాయకత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పు బట్టడమే కాకుండా, తమకు తగిన గుర్తింపు, ప్రాధాన్యతనివ్వకపోవడం లాంటి అంశాలను లేవనెత్తుతుండడంతో..అసలు ఏం జరుగుతోంది? అనే సందేహాలు రాష్ట్ర నేతలను, పార్టీ కేడర్‌ను పట్టి పీడిస్తున్నాయి. ఫామ్‌హౌస్‌లో పలు అంశాలపై చర్చ తాజాగా ఆదివారం నగర శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన సమావేశానికి జాతీయ కార్యవర్గసభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజ్ గోపాల్‌రెడ్డి, విజయశాంతి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జి.విజయరామారావు తదితరులు హాజరైనట్లు సమాచారం. త్వరలోనే ఢిల్లీ వెళ్లి అమిత్‌షాను కలిసి తమ అభిప్రాయాలను స్పష్టం చేయాలని, తాము చేసిన సూచనలకు అనుగుణంగా జాతీయ నాయకత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణపై నిర్ణయానికి రావాలనే అభిప్రాయానికి వీరు వచ్చినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ లో జరుగుతున్న పరిణామాలు, తమ ప్రమేయం, సంబంధం లేకుండానే కొందరిని బీజేపీలో చేర్చుకోవడం, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌కు జాతీయ నాయకత్వం అత్యధిక ప్రాధాన్యతనివ్వడం.. ముఖ్యనేతలుగా, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులుగా ఉన్న తమకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వకుండా అవమానించే పద్ధతుల్లో వ్యవహరించడం తదితర అంశాలు ఫామ్‌హౌస్ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. కాగా, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి సోమవారం పలువురు నేతలు, తన శ్రేయోభిలాషులు, అనుయాయులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీజేపీలోనే కొనసాగాలా? కాంగ్రెస్‌లో చేరాలా.. వద్దా? వంటి అంశాలపై చర్చించేందుకే ఈ భేటీ నిర్వహిస్తున్నారని అంటున్నారు. -
బాబు ఏం చెప్పారు?.. జ్యోతుల నెహ్రూ ఎందుకు రగిలిపోతున్నారు?
తమది క్రమశిక్షణ గల పార్టీ అని డబ్బా కొట్టుకుంటారు తెలుగుదేశం నాయకులు. కాని ఆ పార్టీలో ఉన్నన్ని గ్రూప్‌లు ఎక్కడా కనిపించవు. కాకినాడ జిల్లా టీడీపీలో తాజాగా జరుగుతున్న కొట్లాటలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. జిల్లాలోని సీనియర్ నేతల మధ్య నడుస్తున్న గ్రూప్ పాలిటిక్స్ కేడర్‌కు ఆందోళన కలిగిస్తున్నాయని టాక్. ఇంతకీ కాకినాడ దేశంలో ఏం జరుగుతోందో మీరే చదవండి. కాకినాడలో కస్సు బుస్సు కాకినాడ జిల్లా తెలుగు దేశం పార్టీలోని కొందరు మాజీ ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందట. టీడీపీ నాయకుల ఈ కష్టానికి కారణం అధికార పక్షం అనుకుంటే పొరపాటే. సొంత పార్టీలో నడుస్తున్న గ్రుప్ రాజకీయాలతోనే ఈ పరిస్ధితి దాపురించిందని ఆ పార్టీ నాయకులే వాపోతున్నారు. కాకినాడ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ వ్యవహరిస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా పోటీ చేయ్యాలని నవీన్ భావిస్తున్నారు. ఎప్పటి లానే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట ఎమ్మెల్యే సీటుకు పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే తండ్రీ, కొడుకులు పోటీ చేయాలనే ప్రతిపాదనలు పార్టీలోని కొందరు సీనియర్లకు రుచించడంలేదు. ఈ నేపథ్యంలో కొంతకాలం క్రిందట చంద్రబాబును కలిసిన పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల నేతలు ఈ విషయం గురించి చర్చించారు. నవీన్ ఎంపీగా పోటీ చేస్తే.. తమ నియోజక వర్గాల్లో ఆ ఖర్చును తామే భరించాల్సి వస్తే కష్టంగా ఉంటుందని బాబుకు చెప్పారట. ఈ విషయం ఆ జ్యోతుల నెహ్రూకు తెలిసిందట. దీనిపై రగిలిపోతున్న జ్యోతుల నెహ్రూ తన వ్యతిరేకులకు సమయం చూసి ఝలక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. కోల్డ్ వార్ c/o హీట్ పాలిటిక్స్ జ్యోతుల నెహ్రూ ఎదురు చూసిన సందర్భం వచ్చింది. చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో తన గ్రూప్ పాలిటిక్స్ ను ప్రయోగించారు. ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లో తనను, తన కుమారుడిని అడ్డుకునే నేతలకు వ్యతిరేకంగా తన మద్దుతదారులతో నెహ్రూ ఆందోళన చేయించారు. ప్రత్తిపాడు సీటు బీసీలకు ఇవ్వాలని.. పిఠాపురం సీటు జ్యోతుల నవీన్‌కు కేటాయించాలని ఆ నేతలు చంద్రబాబును కలిసి తమ డిమాండ్లు వినిపించారు. ఐతే కొద్ది రోజులకు ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ వరుపుల రాజా అకాల మరణం చెందారు. ఇక నెహ్రూకు వ్యతిరేకంగా మిగిలింది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మనే. దీంతో వర్మను టార్గెట్ చేసుకుని జ్యోతుల నెహ్రూ తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. వర్మకు గాడ్ ఫాదర్ గా ఉండే టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పార్టీలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా.. కాపాడుతూ వస్తున్నారు. జిల్లా పార్టీలో తొలి నుంచీ జ్యోతుల నెహ్రూ.. యనమల రామకృష్ణుడు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పార్టీలో ఎంతో పలుకుబడి ఉన్న యనమల రామకృష్ణుడి కుటుంబంలోనే ప్రస్తుతం టిక్కెట్ వార్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో యనమల తనను కాపాడుతాడనే నమ్మకం వర్మకు కనిపించడంలేదు. దీంతో జ్యోతుల నెహ్రూ బారి నుంచి నెలా బయటపడాలో... భవిష్యత్‌లో జరిగే పరిణామాలు ఎలా తట్టుకోవాలో వర్మకు అర్థం కావడంలేదట. జ్యోతుల టెన్షన్‌తో వర్మకు కంటి మీద కునుకులేకుండా పోయిందనే టాక్ నడుస్తోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
తెలంగాణ: హస్తవ్యస్తం.. గందర గోళం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో గందరగోళం కొనసాగుతోంది. కీలకమైన అంశాలపై బుధవారం పీసీసీ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరిగే సమావేశానికి సీనియర్ల హాజరుపై అస్పష్టత నెలకొంది. ధరణి పోర్టల్‌పై పార్టీ నేతలకు అవగాహన కల్పించడంతో పాటు జనవరి 26న ప్రారంభం కానున్న హాత్‌సే హాత్‌జోడో యాత్రలు, పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా అమలు, ఎన్నికల నిబంధనలపై చర్చించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే రేవంత్‌రెడ్డి ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ ఆయన పాల్గొనే కార్యక్రమాలకు హాజరు కాకూడదని పలువురు సీనియర్లు నిర్ణయించుకోవడం, ఏఐసీసీ బుజ్జగింపుల నేపథ్యంలో బుధవారం నాటి సమావేశానికి ఎవరు వెళతారనే చర్చ జరుగుతోంది. ఏఐసీసీ నుంచి కబురు రేవంత్‌రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్లు విభేదించిన నేపథ్యంలో ఏఐసీసీ పక్షాన సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ రాష్ట్రానికి వచ్చి వెళ్లారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న ఆయన ఢిల్లీ వెళ్లి కూడా పది రోజులు దాటిపోయింది. కానీ ఇంతవరకు ఏఐసీసీ నుంచి సమస్య పరిష్కారం కోసం ఎలాంటి చర్య తీసుకున్నట్టు కనిపించలేదు. ఈ పరిస్థితుల్లోనే రేవంత్ ఐడియాలజీ సెంటర్లో సమావేశం ఏర్పాటు చేశారు. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), పార్టీ కార్యవర్గం (పీఈసీ), అనుబంధ సంఘాల చైర్మన్లు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులను ఆహ్వానించారు. ఈ సమావేశానికి సీనియర్ నేతలు కూడా హాజరు కావాలని ఏఐసీసీ కార్యాలయం నుంచి పలువురికి ఫోన్లు వెళ్లినట్టు తెలిసింది. హాత్‌సే హాత్ జోడో యాత్రలపై చర్చ జరగనున్నందున ఈ సమావేశంలో పాలుపంచుకోవాలని కోరినట్టు సమాచారం. అయితే సీనియర్లు ఇప్పటికీ మెత్తబడలేదని తెలుస్తోంది. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఢిల్లీలో జరిగే పార్ల మెంటరీ కమిటీ సమావేశానికి హాజరుకావాల్సి ఉన్నందున ఈ సమావేశానికి వచ్చే అవకాశం లేదని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. సీఎల్పీనేత భట్టితో పాటు ఇతర సీనియర్లు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. నాకు సమాచారం లేదు: ఏలేటి బుధవారం జరిగే టీపీసీసీ సమావేశం గురించి తనకు సమాచారం లేదని ఏఐసీసీ కార్య క్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. రేపటి కార్యక్రమం ఏఐసీసీ కార్యక్రమం కాదని వ్యాఖ్యానించారు. హాత్‌సే హాత్‌జోడో యాత్రల గురించి మాత్రం ఏఐసీసీ నుంచి సర్క్యులర్ వచ్చిందని తెలిపారు. మంగళవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ..హాత్‌సే హాత్‌జోడో యాత్రలో భాగంగా జనవరి 26 నుంచి రెండు నెలల పాటు ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర ఉంటుందని, ఈ యాత్రల తర్వాత రాష్ట్ర రాజధానిలో జాతీయ, రాష్ట్ర నేతలు పాదయాత్ర చేస్తారని తెలిపారు. దీనికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి హాజరవుతారని చెప్పారు. రేవంత్ పాదయాత్ర గురించి తనకు తెలియదన్నారు. ఆయన యాత్రకు ఏఐసీసీ అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఏలేటి వ్యాఖ్యలను బట్టి చూస్తే సీనియర్లు బుధవారం నాటి సమావేశానికి వెళ్లబోరని అర్ధమవుతోందని అంటున్నారు. -
అంటే మళ్లీ ‘నోటుకు కోట్లు’ లాంటివి రీపీట్ కావాలని కాదు!
అంటే మళ్లీ ‘నోటుకు కోట్లు’ లాంటివి రీపీట్ కావాలని కాదు! -
తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం.. డిగ్గీ రాజా హాట్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం.. దాన్ని చక్కదిద్దేందుకు హైకమాండ్ దిగ్విజయ్‌సింగ్‌ను బరిలోకి దింపడం.. ఆయన సుదీర్ఘంగా పది గంటల పాటు నేతలతో విడివిడిగా భేటీ అయి చర్చించడం ఉత్కంఠ రేపింది. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘తెలంగాణలో సీనియర్ నేతలు సమన్వయం పాటించాలి. పార్టీలో అంతర్గతంగా మాత్రమే చర్చించాలి. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవద్దు. ఎంతపెద్ద నాయకులైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటాం’’ అని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకోవాలి. పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేయాలి. కాంగ్రెస్ నేతలంతా ప్రజాక్షేత్రంలో ఉండాలి.ఇప్పటికే రేవంత్‌రెడ్డి నన్ను కలిశారు. చిన్న వయస్సులో ఉన్నవారికి పీసీసీ ఇస్తే తప్పేంటి?. కొత్తవారికి పీసీసీ చీఫ్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి’’ అని ద్విగిజయ్ పేర్కొన్నారు. కేంద్రం అన్ని రంగాల్లో విఫలమయ్యిందని మోదీ పాలనలో మధ్య తరగతి ప్రజలు నలిగిపోతున్నారన్నారు. ఈ స్థాయిలో ధరలు ఎప్పుడూ పెరగలేదన్నారు. ‘‘రాహుల్ యాత్రకు మంచి స్పందన వస్తోంది. దేశంలో నిరుద్యోగ సమస్య భారీగా పెరిగింది.కార్పొరేట్ల సంస్థలకే మోదీ ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది.ప్రత్యర్థులపై ప్రభుత్వ సంస్థలను ఉసిగొల్పుతున్నారు.ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు.మనుషుల మధ్య ద్వేషాన్ని పెంచుతున్నారు. జోడో యాత్రను అడ్డుకోవడానికి కేంద్రం కుట్రలు చేస్తోంది’ అని ద్విగిజయ్ అన్నారు. ‘‘ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలే తెలంగాణను సాధించారా?. ప్రజలకు హామీ ఇచ్చాం. తెలంగాణను ఏర్పాటు చేశాం. ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారు. కాంగ్రెస్ నేతలను బెదిరిస్తున్నారు.తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోంది. అవినీతిపై తెలంగాణ రికార్డు సాధిస్తోంది.బీజేపీకి మద్దతు పలికేందుకు బీఆర్ఎస్ ఏర్పాటు చేశారు. మైనార్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేసింది. తెలంగాణలో మైనార్టీ రిజర్వేషన్లపై ఓవైసీ మౌనంగా ఎందుకున్నారు?. కేసీఆర్‌కు ఓవైసీ ఎందుకు మద్దతు ఇస్తున్నారు?. బీజేపీని గెలిపించేందుకు ఓవైసీ పోటీ చేస్తున్నారు’’ అని ద్విగిజయ్ సింగ్ దుయ్యబట్టారు. -
ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే కుదరదు: టీ కాంగ్ నేతలపై డిగ్గీ రాజా సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ జాతీయ స్థాయి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. అంతర్గత కుమ్ములాటకు చెక్ పెట్టే దిశగా ఏఐసీసీ ఆయన్ని రాష్ట్రానికి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆయన గాంధీభవన్‌కు వెళ్లారు. పార్టీ నేతలతో విడివిడిగా మాట్లాడిన ఆయన.. వాళ్లను గట్టిగానే మందలించినట్లు తెలుస్తోంది. పార్టీలో జూనియర్, సీనియర్ పంచాయితీ మంచిది కాదని ఆయన నేతలకు సూచించారు. అంతేకాదు.. సమస్యలుంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎవరు ఏం పని చేస్తున్నారో అధిష్టానం అంతా గమనిస్తోంది. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే హైకమాండ్ చూస్తూ ఊరుకోదని వాళ్లకు ఆయన స్పష్టం చేశారు. అంతకు ముందు అసమ్మతి నాయకులతో విడివిడిగా మాట్లాడి.. వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలుసుకున్నారు. తర్వాత పీఏసీ సభ్యుల కమిటీ (22 మంది)తో చర్చలు జరిపారు. ఎంపీలు ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ భేటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీనియర్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. రేవంత్ ఏకపక్ష వైఖరి, మాణిక్యం ఠాగూర్ వ్యవహారశైలి, సీనియర్లను కోవర్టులుగా చిత్రీకరించేందుకు యత్నించడం, సోషల్‌మీడియాలో దుష్ప్రచారం సహా పలు అంశాలపై అసంతృప్తులు నివేదికలు సిద్ధం చేసుకుని.. దిగ్విజయ్ సింగ్‌కు సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటపై దిగ్విజయ్ సింగ్ పాత్రికేయ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. -
నేడు సీనియర్ల సమావేశం ఉంటుందా ? ఉండదా ?
-
ఉత్తమ్ ముసుగు వీరుడు.. కౌశిక్ రెడ్డికి రూ.8 కోట్లు ఇచ్చాడు: అనిల్
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం ముదిరిన వేళ అసంతృప్త సీనియర్ నేతలపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎల్పీ, మాజీ పీసీసీ సహా ఇతర నేతలు రేవంత్ రెడ్డిపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను, రేవంత్‌ను బలహీనపరిచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముసుగు వీరుడని అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గూడూరు నారాయణ రెడ్డిని బీజేపీలోకి పంపించిందే ఉత్తమ్ అని ఆరోపించారు. సీనియర్ నేత పొన్నాలకు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించారని పేర్కొన్నారు. సీఎల్పీ పదవి రాలేదని తెలంగాణలో కాంగ్రెస్‌ను ఉత్తమ్ నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. కౌశిక్ రెడ్డికి ఆయన రూ.8కోట్లు ఇచ్చారని అన్నారు. కోవర్టుగా పనిచేసినందుకే కౌశిక్ టీఆర్ఎస్లో ఎమ్మెల్సీ అయ్యారని పేర్కొన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కోవర్టా కాదా? అని ప్రశ్నించారు. ఈ నెల 26 నుంచి పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ ప్రాణాళికలు సిద్ధం చేస్తుంటే.. దాన్ని దెబ్బ తీయాలని కొందరు సొంతపార్టీ నేతలు చూస్తున్నారని అనిల్ ఆరోపించారు. పార్టీ ముగుసు వీరులు ఇప్పుడు బయటకు వచ్చారని పేర్కొన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడినప్పుడు సేవ్ కాంగ్రెస్ ఎందుకు గుర్తుకు రాలేదని అనిల్ ప్రశ్నించారు. ఆనాడు పీసీసీగా ఉన్నవాళ్లు ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉపఎన్నికలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే ఉత్తమ్ ఏం చేశారని ప్రశ్నించారు. సీనియర్లంతా పార్టీకోసం పనిచేస్తే మునుగోడులో 50వేల ఓట్లతో కాంగ్రెస్ గెలిచేదని వ్యాఖ్యానించారు. కాగా.. పీసీసీ కమిటీల్లో టీడీపీ వచ్చిన వారికే ప్రాధాన్యం ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన 12 మంది నేతలు పదవులకు రాజీనామా చేశారు. చదవండి: కాంగ్రెస్‌లో మరింత ముదిరిన సంక్షోభం.. పీసీసీ పదవులకు 13 మంది రాజీనామా -
కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?.. కమిటీల ఏర్పాటు దేనికి సంకేతం!
తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త కమిటీల ఏర్పాటుతో ముసలం బయల్దేరింది. కొత్త కూర్పు సీనియర్లను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. నాయకుల మధ్య సమన్వయం లోపించడం హై కమాండ్‌ను ఇబ్బంది పెడుతోంది. కమిటీల ఏర్పాటుతో ఓరుగల్లు కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. ఈ అసంతృప్తి నుంచే సీనియర్ నేత కొండా సురేఖ తనకిచ్చిన పదవికి రాజీనామా సమర్పించారు. ఇంతకీ ఓరుగల్లు కేంద్రంగా కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? కొండా రాజీనామా ఎందుకిచ్చారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే కలహాల కాపురం. పార్టీలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిరంతరం అసమ్మతి జ్వాలలు రగులుతూనే ఉంటాయి. కొత్తగా ప్రకటించిన పీసీసీ.. డీసీసీ కమిటీలు కొందరికి ఉత్సాహం కలిగిస్తే.. మరికొందరికి కోపాన్ని తెప్పిస్తున్నాయి. సీనియర్లు అనేక మంది తమకు సరైన పదవి రాలేదనో.. తమవారికి పదవులు దక్కలేదనో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం అసమ్మతి సెగలు రగులుతున్నాయి. తనకిచ్చిన ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ మంత్రి కొండా సురేఖ ఆ పదవికి రాజీనామా సమర్పించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలోకి తమకంటే జూనియర్లను తీసుకొని సీనియర్లమైన తమకు అవకాశం కల్పించకపోవడంతోపాటు వరంగల్‌కు చెందిన ఏ ఒక్క లీడర్ పేరు ఆ కమిటీలో లేకపోవడం అవమానంగా భావిస్తున్నామని ప్రకటించారు కొండా సురేఖ. వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి తాము సూచించిన వ్యక్తికి ఇవ్వకపోవడంతో పాటు.. తాము కోరుకున్న రెండు నియోజకవర్గాలపై అధిష్టానం స్పష్టత ఇవ్వకపోవడంపైనా కొండా దంపతులను ఆందోళనకు గురి చేస్తోందట. అందుకే కొండా సురేఖ టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారనే ప్రచారం సాగుతుంది. మూడు ముక్కలు, ఆరు చెక్కలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు డిసిసిలు ఉండగా మూడింటికే జిల్లా కమిటీలను ప్రకటించారు. హనుమకొండ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో పాతవారినే కొనసాగించాలని హైకమాండ్ నిర్ణయించింది. మరో మూడు జిల్లాలైన వరంగల్, భూపాలపల్లి, జనగామల్లో మాత్రం ఏకాభిప్రాయం రాక గందరగోళం ఏర్పడటంతో డీసీసీల ప్రకటన వాయిదా పడింది. జనగామ జిల్లాకు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జంగా రాఘవరెడ్డితోపాటు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కూడా పదవి ఆశిస్తున్నారు. ఆ ఇద్దరికి తోడు పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సైతం తాను సూచించిన వ్యక్తికే డిసిసి ఇవ్వాలని పట్టుపడుతున్నారు. వరంగల్ విషయంలో సీనియర్ నేత కొండా మురళీ, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిల మద్య డిసిసి దోబూచులాడుతోందట. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష పదవికి ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు వర్గం నేతగా ఉన్న అయిత ప్రకాష్ రెడ్డిని కొనసాగించాలనే డిమాండ్ వినిపిస్తుండగా, రేవంత్ రెడ్డి అనుచరుడుగా ముద్రపడ్డ గండ్ర సత్యనారాయణకు లేదా ఆయన సూచించిన వ్యక్తికి డీసీసీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ కొనసాగుతోంది. చేయి కాలుతుందా? బలం పెరుగుతుందా? ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా..నేతల మద్య సమన్వయం లేకపోవడం.. ఆధిపత్య పోరు కారణంగా మూడు జిల్లాల అధ్యక్ష పదవులు ఖరారు కాలేదని తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి పాతవారికే అవకాశం ఉంటుందని ప్రచారం జరిగినా.. సీనియారిటీ, పార్టీలో పనిచేసిన అనుభవం, రాజకీయ సమర్థత వంటి అంశాలను బేరీజు వేసుకుని మూడు జిల్లాల విషయంలో పాతవారి పైపే మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. మిగతా మూడు జిల్లాల విషయంలో ఆ దిశగా చర్యలు చేపట్టి సమర్థత, కార్యనిర్వహణ సామర్థ్యం గల నేతలకే అవకాశం ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వారం రోజుల్లో నేతల మధ్య ఏకాభిప్రాయం తీసుకువచ్చి మిగిలిన మూడు జిల్లాల అధ్యక్ష పదవులను ఖరారు చేస్తారని..అసంతృప్తితో ఉన్న నేతలను సైతం సముదాయించి సముచిత స్థానం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పీకల్లోతు కష్టాల్లో కాంగ్రెస్.. ఆ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు
కాంగ్రెస్ పార్టీని కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. రోజుకొక పరిణామం ఆ పార్టీ నాయకత్వానికి కునుకులేకుండా చేస్తోంది. సీనియర్ నేతలు బాధ్యతలు మాకొద్దు బాబో అని తప్పుకుంటున్నారు. పార్టీ కీలక పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు సీనియర్లు ఏకంగా పార్టీనే వీడుతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్‌శర్మ రాజీనామా చేయడం పార్టీలో చర్చనీయంగా మారింది. ఈ ఏడాది చివర్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలోనే ఆనంద్ శర్మ ముఖ్యమైన బాధ్యతల నుంచి తప్పుకోవడం పార్టీకి పెద్ద షాకే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే జమ్మూకశ్మీర్ ప్రచార కమిటీ చైర్మన్ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ కు కాంగ్రెస్ సిద్ధం మవుతున్న దశలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ఆపార్టీకి కోలుకోలేని దెబ్బేనని చెబుతున్నారు. ఆనంద్‌శర్మ, ఆజాద్ ఇద్దరూ... జీ-23 గ్రూపులో కీలక సభ్యులుగా ఉన్నారు. పార్టీలో అంతర్గత సంస్కరణలు తేవాలని.. బ్లాక్ స్థాయి నుంచి సీడబ్ల్యూసీ వరకు ఎన్నికైన కార్యవర్గాలు ఉండాలని కొంతకాలంగా జీ-23 గ్రూప్ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచింది. ఈమేరకు రెండేళ్ల క్రితమే పార్టీ చీఫ్ సోనియాగాంధీకి ఈ గ్రూపు నేతలు లేఖలు కూడా రాశారు. పార్టీలో అవమానం జరిగిందని.. తన గౌరవానికి భంగంకలిగితే సహించేదిలేదంటూ... సోనియాకు రాసిన రాజీనామా లేఖలో ఆనంద్‌శర్మ పేర్కొన్నట్టు తెలిసింది. అయితే హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించడం కొసమెరుపు. అయితే పార్టీని ధ్వంసం చేయడానికి కాంగ్రెస్‌లోనే అంతర్గత కుట్ర జరుగుతోందని ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనంద్‌శర్మ చేసిన వ్యాఖ్యలపైనా పెద్ద చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఇద్దరు గాంధీలకు మాత్రమే కాంగ్రెస్ పరిమితం కావాలా? అంటూ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలపై ఎటాక్ చేశారు. గత కొన్నాళ్లుగా ఎంతోమంది సీనియర్ నేతలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతున్నారు. సుమారు 30 ఏళ్లపాటు కాంగ్రెస్‌తో అనుబంధమున్న కపిల్ సిబల్ లాంటి వారు కూడా ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. ఎస్పీ మద్దతులో స్వతంత్ర అభ్యర్ధిగా ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైయ్యారు. కాంగ్రెస్ పంజాబ్ రాష్ట్రశాఖ చీఫ్ సునీల్ జాఖడ్ కూడా 50 ఏళ్ల అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుని బీజేపీలో చేరారు. కేంద్ర న్యాయశాఖ మాజీమంత్రి అశ్వనీకుమార్, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ కూడా హస్తం పార్టీలో ఇమడలేమంటూ బయటకు వచ్చేశారు. కాంగ్రెస్ గుజరాత్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ కూడా పార్టీతో కటీఫ్ చేసుకున్నారు. ప్రజల సెంటిమెంట్లను కాంగ్రెస్ గౌరవించలేదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చదవండి: కాంగ్రెస్‌లో కుమ్ములాట.. పీసీసీని మార్చాలంటూ నేతల ఫైటింగ్ గత ఏడాది పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పడం ఆపార్టీకి కోలుకోలేని దెబ్బతీసింది. పంజాబ్ లో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంది. అధికారాన్ని కూడా కోల్పోవలసి వచ్చింది. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న జితిన్ ప్రసాద కూడా కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ లాంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది చివర్లో, వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. 2024లో లోక్‌సభకు ఎన్నికలున్నాయి. కీలకమైన ఈ తరుణంలో పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవరపెడుతున్నాయి. పార్టీని ఎలా దారిలో పెట్టాలో కూడా కాంగ్రెస్‌కు సమస్యగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. కొన్నాళ్లుగా జరిగిన అన్ని ఎన్నికల్లో ఘోరంగా విఫలమవుతుండడం కూడా కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని అంటున్నారు. -బొబ్బిలి శ్రీధరరావు, సాక్షి ప్రతినిధి -
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి ఇద్దరు సీనియర్ నేతలు!
గాంధీనగర్: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ వేడి మొదలైంది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇద్దరు ప్రముఖ నేతలు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలనుకుంటున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర నాయకత్వం చర్యలతో నిరాశకు లోనయ్యామని, తాము సంతోషంగా లేమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అభివృద్ధి అజెండా నచ్చి వచ్చే నెలలో బీజేపీ తీర్థ పుచ్చుకోనున్నట్లు స్పష్టం చేశారు. విజయ్‌పుర్ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి నరేశ్ రావల్ ఈ మేరకు ప్రకటన చేశారు. ‘పార్టీతో నాకు చాలా సమస్యలు ఉన్నాయి. అయితే వాటి గురించి మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదు. కానీ, పార్టీకి జైహింద్ చెప్పాలని నిర్ణయించుకున్నా. త్వరలోనే బీజేపీలో చేరతాను. పార్టీ నాయకత్వం ఏ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా నిర్వర్తిస్తాం.’ అని పేర్కొన్నారు. మరోవైపు.. ఇలాంటి ప్రకటనే చేశారు కాంగ్రెస్ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ రాజు పార్మర్. ‘గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నాను. పార్టీపై నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. కానీ, దురదృష్టవశాత్తు అధిష్టానం కొత్త వారికి ప్రాధాన్యం ఇవ్వటం ప్రారంభించింది. నేనెప్పుడూ ఏ పదవులు కోరలేదు. కొద్ది రోజుల్లో చాలా మంది సీనియర్లు పార్టీని వీడతారు.’ అని తెలిపారు. ‘ఇరువురు నేతలు పార్టీకి సీనియర్లు. నరేశ్ రావల్ గతంలో ప్రతిపక్ష నేతగా, సహాయ మంత్రిగా చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజు పార్మర్ మూడు సార్లు రాజ్యసభకు వెళ్లారు. ఎస్టీ కమిషన్‌కు ఛైర్మన్‌గా చేశారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీతో చర్చించాలి. వారి నిర్ణయం పార్టీకి తీరని నష్టాన్ని మిగుల్చుతుంది. ’ అని పేర్కొన్నారు పార్టీ సీనియర్ నేత అర్జున్ మోధ్వాడియా. ఇదీ చదవండి: మోదీ అడ్డాలో పాగాకు కేజ్రీవాల్ పక్కా ప్లాన్! 300 యూనిట్ల ఉచిత కరెంటు, బకాయిల రద్దు హామీ -
మేమింతే.. మా స్టయిల్ ఇంతే!
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి తీసుకుని రావడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని, కలిసికట్టుగా పనిచేస్తామని నేతలు తరచూ చెబుతున్నా ఆచరణ అందుకు విరుద్ధంగా ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. సొంత నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాలపైనే సీనియర్ నేతలు దృష్టి పెడుతూ, ఇతర నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు దాదాపు శూన్యమని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతలు క్షేత్రస్థాయిలో విరివిగా పర్యటిస్తేనే కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నెలకొంటుందని పేర్కొంటున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, సీనియర్ వైస్–ప్రెసిడెంట్లు, ఏఐసీసీ కార్యదర్శులు కూడా ప్రజల్లో ఎక్కు వగా కనిపించడంలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కొద్దిరోజులుగా పార్టీ సంస్థాగత పనితీరుపై తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌లోనూ సీనియర్ నేతలపై అదే అభిప్రాయం వ్యక్తమైనట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. నియోజకవర్గాలకే పరిమితం.. సీనియర్ నేతలు జానారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, చిన్నారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, కొండా సురేఖ, మహేశ్వర్‌రెడ్డి, గడ్డం ప్రసాద్, నాగం జనార్దన్‌రెడ్డి, ఆర్.దామోదర్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, మధుయాష్కీ, గీతా రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రేమ్‌సాగర్‌రావు, జీవన్‌రెడ్డి లాంటి సీనియర్ నేతలు తమ తమ అసెంబ్లీ నియోజకవర్గంలో తప్ప పెద్దగా ఎక్కడా పర్యటించడం లేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎంపీలుగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడ, హుజూర్‌నగర్‌లోనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారని, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఒకటి రెండు నియోజకవర్గాలు తప్ప పెద్దగా జిల్లాల్లో పర్యటించడంలేదని ఫీడ్ బ్యాక్ వచ్చినట్టు తెలిసింది. పార్టీ కార్యక్రమాల కారణంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి కొడంగల్‌పై ఫోకస్ చేయలేదని, ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్‌లోనూ నేతలకు పెద్దగా సమయం ఇవ్వడంలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. వర్క్ అవుట్ చేయని వర్కింగ్ ప్రెసిడెంట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఉన్న ఐదుగురిలో ఆర్గనైజేషన్ వ్యవహారాలు చూస్తున్న మహేశ్ కుమార్ గౌడ్ ఓ మోస్తరు పర్వాలేదని, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న అంజన్‌కుమార్ యాదవ్ ఇంకా గ్రేటర్ అధ్యక్షుడిలాగే పనిచేస్తున్నారని, అన్ని నియోజకవర్గాల్లో పర్యటించడంలేదన్న వాదన వినిపిస్తోంది. గీతారెడ్డి పెద్దగా ఫోకస్ చేసినట్టు కనిపించడం లేదని నేతలు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరుకు వర్కింగ్ ప్రెసిడెంట్ తప్ప ఎలాంటి బాధ్యతలు లేకపోవడంతో ఆయన సంగారెడ్డికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రెండోసారి అవకాశం లభించిన అజహరుద్దీన్ అసలు ఎక్కడ పర్యటిస్తున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం షబ్బీర్ అలీకి వ్యతిరేకంగా కామారెడ్డిపై దృష్టి పెట్టి పనిచేస్తున్నారన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది. అటు సీనియర్ వైస్ ప్రెసిడెంట్లలోనూ ఒకరిద్దరు మినహా మిగిలినవారి పనితీరు సంతృప్తిగా లేదని అధిష్టానానికి నివేదిక సైతం పంపించినట్టు తెలుస్తోంది. -
ఢిల్లీ పర్యటనకు నాకు ఆహ్వానం అందలేదు: వీహెచ్
-
తెలంగాణ కాంగ్రెస్ అసంతృప్తి నాయకుల అత్యవసర సమావేశం
-
జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
జమ్మూ: జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నలుగురు మాజీ మంత్రులు, మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో తమ పదవులకి రాజీనామా చేశారు. పార్టీ వ్యవహారాల్లో తమ అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం కల్పించడం లేదని, అందుకే పదవుల్ని వీడుతున్నట్టుగా వారు చెప్పారు. రాజీనామా చేసిన వారంతా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌కి అత్యంత సన్నిహితులు. మాజీ మంత్రులు జి. ఎం.సరూరి, జుగల్ కిశోర్, వికార్ రసూల్, డాక్టర్ మనోహర్‌లాల్‌లు పార్టీ పదవుల నుంచి తప్పుకున్న వారిలో ఉన్నారు. వారు తమ రాజీనామా లేఖల్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు జమ్ము కశ్మీర్ ఇన్చార్జ్ కార్యదర్శి రజిని పాటిల్‌కు పంపారు. పార్టీలో తమ గోడు వినిపించుకునే నాథుడే లేడంటూ కశ్మీర్ పీసీసీ చీఫ్ మిర్‌పై ధ్వజమెత్తారు. మిర్ తమపై తీవ్ర వ్యతిరేక భావంతో ఉన్నారని, పార్టీ వ్యవహారాల్లో తమకు ఎందులోనూ అవకాశం కల్పించడం లేదని నిందించారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు తమ సమస్యల్ని తీసుకువెళ్లడానికి ప్రయత్నించినా తమకు సమయం ఇవ్వలేదని ఆ నేతలు చెప్పారు. -
బాబుగారు.. మీకో దండం! దూరమవుతున్న లీడర్లు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఇమడలేక సతమతమవుతున్నారా? దశ దిశా లేకుండా దిక్కులేని పక్షిలా సాగుతున్న పార్టీ ప్రయాణంతో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నారా? జనంతో సంబంధం లేకుండా నిత్యం మీడియాలో కనిపిస్తూ.. చంద్రబాబు, లోకేష్ భజన చేస్తూ పబ్బం గడుపుకునే నేతలకే ప్రాధాన్యం ఇస్తూ తమను అవమానిస్తుండడాన్ని తట్టుకోలేకపోతున్నారా? అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజా ఉదంతమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయబోనని, మరో అభ్యర్థిని చూసుకోవాలని కేశినేని నాని.. చంద్రబాబుకు స్పష్టంగా తేల్చిచెప్పడాన్ని బట్టి సీనియర్ నాయకుల్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చని అంటున్నారు. ఇటీవలే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నడుస్తున్న తీరు బాగోలేదంటూ ఆయన రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారు. చంద్రబాబు జోక్యం చేసుకుని బుజ్జగించడంతో తాత్కాలికంగా తన నిర్ణయాన్ని బుచ్చయ్య వాయిదా వేసుకున్నారు. అయితే పార్టీ అధినాయకత్వం పట్ల ఆయన అభిప్రాయం మాత్రం మారలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి సైతం పార్టీ తీరు పట్ల బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రైవేటు సంభాషణలో టీడీపీ పని అయిపోయిందని, ‘పార్టీ లేదు.. బొక్కా లేదు’ అని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. వీరే కాకుండా ఇంకా అనేక మంది సీనియర్ నాయకులు టీడీపీ మునిగిపోతున్న నావ అనే అభిప్రాయంతో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. చురుగ్గా లేని సీనియర్ నేతలు గతంలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు ఎవరూ ప్రస్తుతం చురుగ్గా లేరు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కీలక మంత్రిగా చక్రం తిప్పిన నారాయణ దాదాపు పార్టీకి దూరమయ్యారు. మరో మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీలో ఉన్నారో, లేదోననే పరిస్థితి ఉంది. రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ పార్టీకి దూరమయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన మంత్రులు, ఎంపీలు, ఇతర నేతల్లో నలుగురైదుగురు మినహా ప్రస్తుతం ఎవరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వారి నియోజకవర్గాల్లో సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించినా పట్టించుకోవడం లేదు. టీడీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు (వల్లభనేని వంశీ, మద్దాళి గిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరామకృష్ణమూర్తి) ఆ పార్టీకి దూరమయ్యారు. మిగిలిన ఎమ్మెల్యేల్లో సగం మంది గోడ దూకడానికి ఎప్పుడో సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. టీడీపీకి ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబు వైఖరే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఆయన తన తనయుడు లోకేష్‌కి పెత్తనం అప్పగించడం సీనియర్లకు మింగుడుపడడం లేదు. తన భజన చేసే వారినే ఆయన ప్రోత్సహిస్తుండడం వారికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోందంటున్నారు. -
కాంగ్రెస్ నేతలకు షాకిచ్చిన ట్విటర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం కాంగ్రెస్ పార్టీకి ట్విటర్ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ట్విటర్ ఖాతాను ఇప్పటికే లాక్ చేసిన ట్విటర్ తాజాగా మరో ఐదుగురు కాంగ్రెస్ సీనియర్ నేతల అకౌంట్లను తాత్కాలికంగా బ్లాక్ చేయడం దుమారం రేపింది. దీంతోపాటు కాంగ్రెస్ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌ను కూడా బ్లాక్ చేసింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. పార్టీ మీడియా హెడ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, లోక్ సభలో పార్టీ విప్ మాణిక్యం ఠాగూర్, మాజీ మంత్రి జితేంద్ర సింగ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ ట్విటర్ అకౌంట్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ విషయాన్ని పార్టీ నేత ప్రణవ్ ఝా ట్విటర్ ద్వారా వెల్లడించారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ట్విటర్ చీఫ్ జాక్ డోర్సేపై విమర్శలు గుప్పించారు. తమ సీనియర్ నేతలతోపాటు దాదాపు 5 వేలమంది ఇతర నాయకులు, కార్యకర్తల ఖాతాలు బ్లాక్ అయ్యాయని ఆరోపించిన కాంగ్రెస్ మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తింది. మోదీజీ ఇంకెంత భయపడతారంటూ ఎద్దేవా చేసింది. దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పోరాడింది, ప్రజల ఆకాంక్షను కేవలం సత్యం, అహింస తోనే సాధించిందనీ, అప్పుడూ గెలిచాం, మళ్లీ గెలిచి తీరుతాం అంటూ కాంగ్రెస్ తన ఇన్‌స్టా పేజీ పోస్ట్‌లో పేర్కొంది. ప్రజలకోసం పనిచేస్తున్న తమను ఇలాంటి చర్యలు ఏమాత్రం అడ్డుకోలేవంటూ ట్విటర్ ఇండియాకు సవాల్ విసిరింది. కాగా ఢిల్లీలో ఇటీవల తొమ్మిదేళ్ల బాలిక హత్యాచార ఘటన నేపథ్యంలో రాహుల్ బాధిత బాలిక, తలిదండ్రుల ఫోటోలను షేర్ చేసిననేపథ్యంలో ఆయన అధికారిక ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసింది. మరోవైపు బాధితుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంపై సీరియస్‌గా స్పందించిన జాతీయ బాలల హక్కుల సంఘం రాహుల్‌పై చర్య తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Congress (@incindia) -
టీడీపీలో రాజీనామాల పర్వం..
టీడీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ జిల్లాలోని కీలక నేతలు పార్టీని వీడుతుండడంతో కార్యకర్తలు, నాయకుల్లో నైరాశ్యం ఆవహించింది. ఇప్పటికే ప్రాభవం కోల్పోయిన పార్టీలో కొనసాగాలా.. వద్దా అన్న సందిగ్ధం నెలకుంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: తెలుగుదేశం పార్టీకి జిల్లాలో గడ్డు పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల్లో ప్రజాదరణ కోల్పోయిన పార్టీ ప్రతిష్ట క్రమక్రమంగా క్షీణిస్తోంది. అవసరం తీరిన తరువాత తన, మన అనే తేడా లేకుండా... సీనియర్లనే కనీస గౌరవం లేకుండా పూచిక పుల్లను వాడిప డేసినట్లు పక్కన పడేయడం ఆ పార్టీ అధినేతల సంప్రదాయం. దశాబ్దాలుగా అక్కడ అదే జరుగుతోంది. దీనిని జీర్ణీంచుకోలేని కొందరు సీనియర్లు పార్టీని వీడుతున్నారు. మరికొందరు పార్టీలోనే ఉంటూ తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి పడాల అరుణ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు శనివారం ప్రకటించారు. చదవండి: టీడీపీకి అభ్యర్థులు కరువు.. బాబు హైరానా.. గజపతినగరంలోని తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హయాంలో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల 1985లో రాజకీయ రంగ ప్రవేశం చేశానని, ఎన్నో పదవులు చేపట్టి ప్రజలకు ఎంతో సేవ చేశానని, కానీ వాటిని ఈ రోజు తెలుగు దేశం పార్టీ కనీసం గుర్తించక పోవడం వల్లనే రాజీనామా చేస్తున్నానని అరుణ వివరించారు. మూడు దశాబ్దాలుగా ఆమెకు టీడీపీతో అనుబంధం ఉంది. చదవండి: పంచాయతీ ఎన్నికలు: టీడీపీ నేతల బరితెగింపు.. 1987లో బొండపల్లి మండల అధ్యక్షురాలిగా, 1989, 1994లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1996లో మంత్రి పదవి చేపట్టారు. 1999 నుంచి చాలా పదవులు నిర్వహించారు. అంతటి క్రియాశీలకంగా ఉండే పడాల అరుణకు 2013 నుంచి పారీ్టలో ప్రాధాన్యం తగ్గడం మొదలైంది. ‘‘పార్టీ కోసం అంకిత భావంతో పని చేసిన నన్ను రోజురోజుకు గుర్తింపు లేనివిధంగా చేశారు’’... అంటూ ఆమె విలేకరుల ఎదుట కన్నీటిపర్యంతమవ్వడం టీడీపీలో సీనియర్లు, పారీ్టకి కట్టుబడి ఉన్నవారి పరిస్థితికి అద్ధం పట్టింది. అందిరిదీ అదే వేదన... ఒక్క అరుణకే ఈ పరిస్థితి కాదు. జిల్లాలో అనేక మంది టీడీపీ నాయకులు, సీనియర్ల పరిస్థితి కూడా ఇదే. మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావును కూడా ఇదే విధంగా పార్టీని వీడేలా చేశారు. ఆయన కూడా చాలా కాలం పాటు టీడీపీకి సేవచేసి, చివరికి తనకు పారీ్టలో కనీస గుర్తింపు లేదని మదనపడి రాజీనామా చేసి ఇటీవలే బయటకు వచ్చేశారు. ఆ తరువాత మరో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తిరుగుబావుటా ఎగురవేశారు. ఆమెకు ఇంకో ఎమ్మెలే కె.ఎ.నాయుడు జతకలిశారు. విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్ష పదవిని జూనియర్ అయిన కిమిడి నాగార్జునకు ఇవ్వడాన్ని నిరసిస్తూ గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కె.ఎ. నాయుడు తానే వేరుగా విజయనగరం పార్లమెంటరీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేశారు. ఆయన బాటలోనే విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కొందరు నేతలతో కలిసి ప్రత్యేక వర్గాన్ని ఏర్పరచుకుని విజయనగరం పార్టీ కార్యాలయాన్ని స్థాపించారు. అప్పటికే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు బంగ్లాలో నగరపార్టీ కార్యాలయం నడుస్తోంది. ఈ పంచాయితీ టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదు. మీసాల గీతకు లభించాల్సిన గుర్తింపు ఇప్పటికీ దక్కలేదన్న వాదన వినిపిస్తోంది. పోనీ అశోక్ పెద్దరికమైనా నిలిచిందా అంటే అదీ లేదు. అశోక్మీద అమిత గౌరవం ఉందని చెప్పుకునే చంద్రబాబు పార్టీ కార్యాలయం విషయంలో అశోక్ పెద్దరికాన్ని స్థానిక నేతలు ధిక్కరిస్తున్నా ఏమీ చేయలేదు. ఆయన గౌరవాన్ని కాపాడలేదు. ఈ విషయంలో సీనియర్‌గా అశోక్ తన అనుచరుల వద్ద వాపో యారు. టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడైన మహంతి చిన్నంనాయుడు పార్టీ కార్యకలాపాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు. ఇలా సీనియర్లకు, ముఖ్య నేతలకు టీడీపీలో విలువ ఉండకపోవడంతో ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. కొందరు వేరు కుంపట్లు పెట్టుకుంటున్నారు. -
‘రాహుల్‌కు కాంగ్రెస్ కట్టప్పల ద్రోహం’
ముంబై : పార్టీకి పూర్తికాల అధ్యక్షుడిని నియమించాలని డిమాండ్ చేస్తూ సోనియా గాంధీకి 23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు రాసిన లేఖపై శివసేన స్పందించింది. రాహుల్ గాంధీ నాయకత్వానికి చరమగీతం పాడేందుకే సీనియర్ నేతలు కుట్రపూరితంగా లేఖ రాశారని ఆరోపించింది. రాహుల్ గాంధీపై బీజేపీ చవకబారు వ్యాఖ్యలు, దాడులు చేసినప్పుడు వీరంతా ఎక్కడున్నారని శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం నిలదీసింది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ వైదొలగిన అనంతరం పార్టీని పునరుద్ధరించే సవాల్‌ను వీరు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించింది. రాహుల్ నాయకత్వాన్ని తుదముట్టించేందుకే వీరు కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించింది. ఈ పాతకాపులు రాహుల్ గాంధీని వెన్నుపోటుపొడిచారని, బీజేపీ తలపెట్టని హాని సైతం వీరు రాహుల్‌కు తలపెట్టారని దుయ్యబట్టింది. వీరిలో చాలామందికి జిల్లా నేతల స్ధాయి కూడా లేకున్నా గాంధీ, నెహ్రూ కుటుంబాల అండతో ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అయ్యారని శివసేన వ్యాఖ్యానించింది. అన్ని రాష్ట్రాల్లోనూ దిగ్గజ నేతలు పార్టీ పట్ల ఆసక్తి చూపకుండా కేవలం తమ పదవుల పట్లే ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొంది. పదవులు రానివారంతా బీజేపీ వైపు మళ్లుతున్నారని, ఈ పరిస్ధితుల్లో రాహుల్, సోనియా ఏం చేస్తారని ప్రశ్నించింది. పదవులు రాకుంటే పార్టీలు మారడం కొత్తతరహా రాజకీయ కరోనా వైరస్‌గా పరిణమించిందని వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలో బీజేపీతో విభేదాల నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ఉద్థవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా సోనియాకు సీనియర్ నేతల లేఖపై కాంగ్రెస్‌లో పెనుదుమారం రేగిన సంగతి తెలిసిందే. సీనియర్ నేతల లేఖపై సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేయడం, అసంతృప్త నేతలు బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించడంతో గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ వంటి నేతలు రాజీనామాకు సిద్ధపడ్డారు. ఇక సీనియర్లపై తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని ఆ తర్వాత రాహుల్ వివరణ ఇవ్వాల్సివచ్చింది. మరోవైపు పార్టీ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీ కొనసాగుతారని సీడబ్ల్యూసీ భేటీ అనంతరం కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. చదవండి : కేంద్రంపై రాహుల్ మరోసారి ఫైర్ -
పార్టీ కోసమే మా లేఖాస్త్రం
న్యూఢిల్లీ: నాయకత్వ మార్పు కోరుతూ లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లలో పలువురు మంగళవారం పలు వివరణలతో ముందుకు వచ్చారు. పార్టీలో తాము అసమ్మతివాదులం కాదని, పార్టీ పునరుత్తేజాన్ని కోరుకుంటున్న వాళ్లమని స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వాన్ని తాము సవాలు చేయలేదని, అధ్యక్ష పదవిలో సోనియాగాంధీనే కొనసాగాలని కోరుకుంటున్నామని వివరణ ఇచ్చారు. లేఖను ఇప్పుడు తప్పుబడుతున్న వారు త్వరలో ఆ లేఖలో పేర్కొన్న అంశాల ప్రాముఖ్యతను గుర్తిస్తారని మాజీ కేంద్ర మంత్రి ముకుల్ వాస్నిక్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్లే స్థితిలో, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే స్థితిలో ప్రస్తుతం పార్టీ లేదన్నది అంగీకరించిన వాస్తవమని సీనియర్ నేత వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు, దేశంలో జరగనున్న ఇతర ఎన్నికలకు పార్టీని సమాయత్తపర్చడమే తాము రాసిన లేఖ ప్రధాన ఉద్దేశమన్నారు. ‘ఇది పదవికి సంబంధించిన విషయం కాదు.. దేశానికి సంబంధించిన విషయం. అదే మాకు ముఖ్యం’అని మరో సీనియర్ నేత కపిల్ సిబల్ నర్మగర్భ ట్వీట్ చేశారు. పార్టీకి క్రియాశీల, పూర్తిస్థాయి నాయకత్వం అవసరమంటూ 23 మంది సీనియర్లు పార్టీ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాసిన నేపథ్యంలో.. ఏఐసీసీ భేటీ జరిగేవరకు పార్టీ అధ్యక్షురాలిగా సోనియానే కొనసాగాలని సోమవారం సీడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ‘మిత్రులారా.. మేం అసమ్మతివాదులం కాదు. పార్టీ పునరుత్తేజాన్ని కోరుతున్నవాళ్లం. ఆ లేఖ నాయకత్వాన్ని సవాలు చేస్తూ రాసింది కాదు.. పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ రాసింది. చరిత్ర ధైర్యవంతులనే గుర్తుంచుకుంటుంది. పిరికివారిని కాదు’అని లేఖపై సంతకం చేసిన మరో నేత, ఎంపీ వివేక్ తాన్ఖా ట్వీట్ చేశారు. తాన్ఖా ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. సీనియర్ నేత ఆనంద్ శర్మ మరో ట్వీట్ చేశారు. ‘పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ లేఖ రాశాం’అని అందులో పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ భేటీ ఫలితంతో తాము సంతృప్తి చెందామని పేరు చెప్పడానికి ఇష్టపడని నేత ఒకరు అన్నారు. సోనియా, రాహుల్ నాయకత్వంపై తమకెలాంటి అనుమానాలు లేవని, వారి నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. సోనియా పార్టీకి అమ్మ వంటిది గాంధీ కుటుంబం త్యాగానికి పేరుగాంచిందని వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించారు. సోనియా నాయకత్వం పార్టీకి అవసరమని, అధ్యక్షురాలిగా కొనసాగేందుకు ఆమె అంగీకరించడం స్వాగతించదగిన అంశమన్నారు. తమ లేఖతో ఆమెకు బాధ కలిగించి ఉంటే క్షంతవ్యులమన్నారు. పార్టీకి సోనియా అమ్మలాంటి వారని, శ్రేణులకు స్ఫూర్తినిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. 50 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్‌లో చేరిన తాను.. అన్ని సంక్షోభ సమయాల్లో పార్టీ నాయకత్వం వెంటనే నడిచానని గుర్తు చేశారు. పార్టీ వ్యవస్థీకృత పునరుత్తేజం కోసమే లేఖ రాశామని మొయిలీ స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత అవసరాల కోసం రాసిన లేఖ బహిర్గతం కావడం సరికాదని, అందుకు బాధ్యులైన వారిని శిక్షించాలని కోరారు. లేఖపై సంతకం చేసిన 23 మంది సీనియర్ నేతల్లో ఎవరికీ పార్టీని వీడి వెళ్లే ఆలోచన లేదన్నారు. బీజేపీ వల్ల దేశంలో ప్రజాస్వామ్య మౌలిక విలువలైన లౌకికత్వం, సమానత్వం, బహుళత్వం ప్రమాదంలో పడ్డాయన్నారు. కాగా, సీడబ్ల్యూసీ భేటీ అనంతరం సోమవారం రాత్రి కపిల్ సిబల్, శశి థరూర్, ముకుల్ వాస్నిక్, మనీశ్ తివారీ తదితరులు ఆజాద్ ఇంట్లో సమావేశమవడం గమనార్హం. -
సీడబ్ల్యూసీ భేటీలో ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ : నాయకత్వ మార్పు కోరుతూ సీనియర్ నేతలు లేఖ రాసిన నేపథ్యంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ పార్టీలో పెను ప్రకంపనలు రేపింది. సీనియర్ నేతల తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోనియా ఆరోగ్యం బాగాలేని సమయంలో సీనియర్లు లేఖ రాయడం సరికాదన్న రాహుల్ వారి వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించడంతో సమావేశం వాడివేడిగా సాగింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో పార్టీ ప్రభుత్వాలు ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో నాయకత్వ మార్పుపై సీనియర్లు లేఖ రాయడం అసంబద్ధమని రాహుల్ అన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై సీనియర్ నేతలు కపిల్ సిబల్, ఆజాద్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీతో సంబంధాలున్నాయని రాహుల్ వ్యాఖ్యానించడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం జీవితం అంకితం చేశామని, ఇన్లాళ్ల తమ కృషికి ఇచ్చే గౌరవం ఇదేనా అని కపిల్ సిబల్ ప్రశ్నించారు. రాహుల్ వ్యాఖ్యలతో కపిల్ సిబల్, ఆజాద్ రాజీనామాకు సిద్ధపడ్డారు. పార్టీ ప్రభుత్వాలు బీజేపీ నుంచి ముప్పును ఎదుర్కొన్న సందర్భాల్లో తాము ముందుండి పరిస్థితి చక్కదిద్దామని రాజస్తాన్ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ వారు పేర్కొన్నారు. ఇంత చేసినా తాము బీజేపీతో కుమ్మక్కయ్యామని రాహుల్ వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. రాహుల్ వివరణ సీడబ్ల్యూసీ భేటీలో తన వ్యాఖ్యలపై నొచ్చుకున్న కపిల్ సిబల్‌తో రాహుల్ మాట్లాడారు. సీనియర్లపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ వివరణ ఇచ్చారు. దీంతో రాహుల్‌పై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు సిబల్ వెల్లడించారు. సోనియా రాజీనామా ఇక అంతకుముందు పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తాను వైదొలగుతున్నట్టు సోనియా గాంధీ సీడబ్ల్యూసీకి స్పష్టం చేశారు. తన స్థానంలో మరో నేతను ఎంపిక చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గాంధీ కుటుంబ విధేయుడిగా పేరొందిన ఏకే ఆంటోని రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సైతం గాంధీ కుటుంబానికి బాసటగా నిలిచారు. సీడబ్ల్యూసీలో మార్పులు కోరుతూ రాసిన ఈ లేఖ తనను బాధించిందన్నారు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం సోనియా గాంధీ తన పదవీ కాలాన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకత్వంలో మార్పు అనివార్యమని, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత నాయకత్వం కావాలని కోరుతూ 23 మంది సీనియర్ నేతలు ఇటీవల సోనియా గాంధీకి లేఖ రాశారు. -
బీజేపీలో చేరిన ఇద్దరు టీడీపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేతలిద్దరు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ సురేశ్‌రెడ్డి బీజేపీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను ఈ ఇద్దరు నేతలు మర్యాదపూర్వ కంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబం ధించిన పలు అంశాలపై రాంమాధవ్ వారితో చర్చించినట్లు తెలిసింది. అనంతరం వీరి చేరికతో పార్టీ బలోపేతం అవుతుందని రాంమాధవ్ తన ఫేస్బుక్ ఖాతాలో పేర్కొన్నారు. దీంతో బీజేపీలో వీరి చేరిక ధ్రువీకరించినట్లయింది. -
మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఖాళీ
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఫలితాలతో నిస్తేజంలో ఉన్న హస్తానికి వలసల గుబులు పట్టుకుంది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ప్రారంభమైన వలసల సంస్కృతి ఇప్పుడు పాలమూరుకు వ్యాపించింది. ఇన్నాళ్లు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న డీకే అరుణతో పాటు ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, డీసీసీ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు సైతం టీఆర్ఎస్, బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ కాంగ్రెస్‌ను వీడి కమలం గూటికి చేరగా.. మరుసటి రోజే కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఇరువురి అనుచరులు సైతం వీరితో పాటు ఆయా పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మరో వారం రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని తెలుస్తోంది. అయితే ఇరువురు నేతలతో ఎవరెవరు పార్టీని వీడుతారో అనే చర్చ జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఒకవేళ ఇదే జరిగితే.. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న పాలమూరులో రానున్న రోజుల్లో పార్టీకి గడ్డుకాలం రాబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ‘చే’జారుతోన్న క్యాడర్‌ను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వలస వెళ్లిన ఇరువురు నేతల అనుచరులు పార్టీని వీడకుండా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జేజమ్మ వెంటే.. పాలమూరులో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి డీకే అరుణ పార్టీ వీడడం వెనక చాలా కారణాలున్నాయి. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి డీకే అరుణ వంటి సీనియర్లు ఉన్నారు. వీరిలో పలువురు సీనియర్లకు, అరుణకు మధ్య వర్గ విభేదాలున్నాయి. తన క్యాడర్‌కు టికెట్లు, పార్టీ పోస్టులు ఇప్పించుకోవడంలో అరుణ సీనియర్లతో పోటీ పడేవారు. ముఖ్యంగా ఆమెకు జైపాల్‌రెడ్డికి మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. పలు సందర్భాల్లో ఏఐసీసీ, టీపీసీసీ అరుణ ప్రతిపాదించిన వారిని కాదని ఇతరులకు టికెట్లు కేటాయించడంతో ఆమె నిరాశకు లోనయ్యారు. ముఖ్యంగా తాజాగా కాంగ్రెస్ ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల గురించి తనతో చర్చించలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమె పార్టీకి గుడ్‌బై చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలో దేవరకద్ర నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన డోకూరు పవన్‌కుమార్, మహబూబ్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్, నారాయణపేట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కుంభం శివకుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, టీపీసీసీ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, ఆ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బండల పద్మావతి, గద్వాల మున్సిపల్ చైర్పర్సన్ కృష్ణవేణి తదితరులు అరుణతో కలిసి కమల దళంలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ‘బీరం’తో పాటు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు నాగర్‌కర్నూల్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలుపొందిన కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో గులాబీ కండువా కప్పుకున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కొల్లాపూర్–సిద్ధేశ్వరం వంతెన, శ్రీశైలం ముంపు బాధితులను ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇవ్వడంతోనే ఆయన కాంగ్రెస్‌ను వీడినట్లు ప్రకటించారు. బీరం హర్షవర్ధన్‌రెడ్డితో పాటే ఇంకొందరు నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నాగరకర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు చిక్కిడు వంశీకృష్ణ కూడా వలస వెళ్లే వారి జాబితాలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వంశీకృష్ణ భార్య అనురాధ అమ్రాబాద్ జెడ్పీటీసీగా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అమ్రాబాద్ మండలం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కావడం, జెడ్పీ చైర్మన్ కూడా ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో ఈ పదవి కోసం వంశీకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అనుకున్నట్లు ముఖ్యమంత్రి నుంచి హామీ వస్తే హర్షవర్ధన్‌తో పాటు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి పెద్దగా పేరున్న నాయకుడు లేకపోవడం, ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉండడం వంశీకృష్ణకు కలిసొచ్చే అంశాలుగా చెప్పవచ్చు. మరోవైపు షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డితో పాటు పారిశ్రామికవేత్త అనిరుధ్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అనిరుధ్‌రెడ్డికి మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ పదవి ఇచ్చేందుకు కేటీఆర్ అంగీకరించినట్లు సమాచారం. -
బరిలో నిలిచేదెవరో..!
సాక్షి, సిరిసిల్ల: ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల పర్వం ముగిసింది. అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన కూడా పూర్తయ్యింది. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం తుది గడువు కాగా ఎంతమంది బరిలో నిలువనున్నారు.. ఎంతమంది తప్పుకోనున్నారో, అసలు పోటీదారులెందరో తేలనుంది. నామినేషన్ల పరిశీలన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గంలో ఒకరు, వేములవాడ నియోజకవర్గం నుంచి ఏడుగురు అభ్యర్థుల నామినేషన్‌పత్రాలు తిరస్కరణకు గురైనట్లు రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు వేసిన నామినేషన్లను అధికారులు అంగీకరించడంతో ఆయా పార్టీల అనుబంధంగా వేసిన ఇతర అభ్యర్థులతోపాటు, నామినేషన్ పత్రాలను సరిగా పూర్తిచేయని మరికొంత మంది నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఉపసంహరణ తర్వాత ఎన్నికల పోరులో నిలువనున్న అభ్యర్థుల సంఖ్య ఎంత అన్నది తేటతెల్లమవుతుంది. అయితే ఇప్పటికే జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీల్లోకి చేరికలు, నియోజకవర్గం అంతటా పర్యటనలు, ర్యాలీలు, ప్రచార వ్యూహాలతో రోజురోజుకీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ప్రచారానికి మిగిలింది 14 రోజులే.. ముందస్తు ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ఎప్పుడో మొదలైంది. ఇప్పటికే కొన్ని పార్టీలు తొలిదశ ప్రచారాన్ని పూర్తి చేసుకుని మలిదశ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ప్రచారానికి ఇంకా 14రోజులు మాత్రమే సమయం ఉండటంతో తక్కువ సమయంలో ఎక్కువ మైలేజీ పొందేలా అభ్యర్థులు ప్రచార వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. రోజూ నియోజకవర్గంలో ఏదోఒక మూలన సభ, ర్యాలీ, సమావేశం, ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రణాళిక చేసుకుంటున్నారు. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ నియోజకవర్గాల్లో పార్టీలు, జెండాల వేడి ఇంతకింతకు రాజుకోనుంది. పెద్ద తలలపైనే భారం.. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో తమ శక్తియుక్తులను ధారబోశారు. ఇకపై ఉన్న సమయంలో తమదైన ప్రచారంతోపాటు తమతమ పార్టీల పెద్దల ప్రచార స మయాన్ని నియోజకవర్గంలో కేటా యించాలని ప్రయత్నాలు చేసుకుం టున్నారు. ఇప్పటి కే గులాబీ అధినేత కేసీఆర్ జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసి వేడి పుట్టించగా.. అదే దిశగా మిగిలిన పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, రాష్ట్రస్థాయి నేతలతో పాటు స్టార్ కాంపెయినర్ల సమయం కోసం జిల్లాలోని అభ్యర్థులు వేచిచూస్తున్నారు. వారిరాక కోసం గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. మిగిలిన రెండు వారాల సమయంలో జిల్లాలో వివిధ పార్టీల నేతల అధినేతలు, పార్టీ పెద్దలు, స్టార్ కాంపెయినర్లతో మోత పుట్టించేం దుకు ఆయా పార్టీల అభ్యర్థులంతా రెడీ అవుతున్నారు. నామినేషన్ తిరస్కరణకు గురైన సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థి 1) అర్వరాజు కృష్ణంరావు – న్యూఇండియా పార్టీ వేములవాడ అభ్యర్థులు.. 1) ఆది వనజ – కాంగ్రెస్ 2) ప్రతాప మార్తాండ తేజ – బీజేపీ 3) చెల్మెడ రాజేశ్వర్‌రావు – టీఆర్ఎస్ 4) మ్యాకల ఉదయ్‌కుమార్ – సమజ్వాదీ పార్టీ 5) కొండ దినేశ్ – ఇండిపెండెంట్ 6) గోగుల రమేశ్ – సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా 7) గంటా ఇస్తరీ – ఇండిపెండెంట్ -
రెబల్స్‌ను బుజ్జగిస్తున్న పార్టీ పెద్దలు
-
అవసరమైతే సీనియర్ నాయకులు త్యాగాలు చేస్తారు
-
అసుర.. అసుర.. చంద్రాసుర..!
సాక్షి, అమరావతి: విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం అనంతరం సీఎం చంద్రబాబు అమానవీయంగా వ్యవహరించడంపై సీనియర్ రాజకీయ నేతలు, పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేయడం లేదు. రాజకీయ ప్రత్యర్థులను ‘వర్గ’ శత్రువులుగా పరిగణించి కక్ష తీర్చుకోవాలనే విష సంస్కృతికి ఆద్యుడైన చంద్రబాబు.. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించిన వారిని తప్పు పట్టకుండా సగటు మనిషిలా ఎలా వ్యవహరిస్తారని టీడీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరించిన సీనియర్ నేత ఒకరు ప్రశ్నించారు. విద్యార్థి దశలో తిరుపతిలోని గోవిందరాజస్వామి డిగ్రీ కాలేజీ, వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సం‘కుల’ సమరాన్ని రాజేసి.. విద్యాలయాలను భ్రష్టుపట్టించారని నాటి విద్యార్థులు చెబుతున్నారు. కుల రాజకీయాలతో ఎదిగిన చంద్రబాబు రాజకీయ అరంగేట్రం చేశారు. గల్లా రాజగోపాలనాయుడి శిష్యరికంతో 1978లో కాంగ్రెస్ పార్టీ టికెట్ సాధించి.. చంద్రగిరి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అనంతరం రాజకీయ భిక్ష పెట్టిన గల్లా రాజగోపాలనాయుడికి తీవ్రద్రోహం చేశారనే విమర్శలూ ఉన్నాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో టి.అంజయ్య మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత కనీసం కృతజ్ఞత ప్రదర్శించని స్వార్థపరుడని రాజకీయ విశ్లేషకులు స్పష్టీకరిస్తున్నారు. మంత్రిగా ఉన్న సమయంలోనే ఎన్టీ రామారావు కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబు వివాహం చేసుకున్నారు. 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. నాడు జరిగిన ఎన్నికలలో తన మామ ఎన్టీ రామారావుపైనే పోటీ చేస్తానంటూ బీరాలు పలికిన చంద్రబాబు.. చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు. రాజకీయ అస్థిత్వం కోసం ఎన్టీ రామారావును బతిమాలి టీడీపీలో చేరారు. వద్దని వారించినా అల్లుడనే ప్రేమతో చంద్రబాబును ఎన్టీ రామారావు చేరదీశారని టీడీపీ సీనియర్ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కుట్రలు, కుయుక్తులకు మరింత పదును టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత చంద్రబాబు తన సహజ లక్షణాలైన కుట్రలు, కుయుక్తులకు మరింత పదును పెట్టారన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఎన్టీ రామారావు మంత్రివర్గంలో, టీడీపీలో నాదెండ్ల భాస్కర్‌రావు, నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు అత్యంత కీలకంగా వ్యవహరించేవారు. వారిని అడ్డు తొలగించుకోకపోతే తాను ఎదగలేననే భావనతో.. ఆ ముగ్గురిని టీడీపీ నుంచి సాగనంపడానికి బాబు కుట్రలు చేశారు. 1984 జనవరి నాటికి రామారావు సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున సభ నిర్వహించారు. ఈ సభలో ఎన్టీ రామారావుపై మల్లెల బాబ్జీని ఉసిగొలిపి.. హత్యాయత్నం చేయించి, ఆ నెపాన్ని తనపైకి నెట్టడానికి ప్రయత్నించారని నాదెండ్ల భాస్కర్‌రావు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ తర్వాత మల్లెల బాబ్జీకి ఇస్తానన్న రూ.3 లక్షల సుపారీ ఇవ్వకుండా చంద్రబాబు ద్రోహం చేశారని.. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన మల్లెల బాబ్జీ 1988లో ఆత్మహత్య చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. నాదెండ్ల భాస్కర్‌రావు తిరుగుబాటుతో రామారావు ప్రభుత్వం కుప్పకూలింది. దీనికి నిరసనగా ఎన్టీ రామారావు శాంతియుతంగా ప్రజా పోరాటం చేశారు. కానీ.. రామారావుకు తెలియకుండా అప్పట్లో రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలకు ప్రేరేపించి, అగ్నిగుండం చేసిన చరిత్ర చంద్రబాబుదేనని టీడీపీ సీనియర్ నేత ఒకరు ఆరోపించారు. ఆ తర్వాత 1985 ఎన్నికల్లో ఓటమి భయంతో పోటీ చేసేందుకు చంద్రబాబు జంకారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఎన్టీ రామారావు దన్నుతో కర్షక పరిషత్ చైర్మన్‌గా దొడ్డిదారిన పదవిని పొంది.. ఓ వర్గం నేతలను చేరదీసి వర్గ రాజకీయాలకు తెరతీశారని అప్పట్లో పలువురు నేతలు అధినేతకు ఫిర్యాదులు చేశారు. కాగా, ఎన్కౌంటర్ పత్రిక ఎడిటర్ పింగళి దశరథరాం హత్యకూ బాబే కారకుడనే విమర్శలు ఉన్నాయి. రంగాను కడతేర్చడంతో హత్యా రాజకీయాలకు ఆజ్యం రాష్ట్రంలో 1985 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన వంగవీటి మోహనరంగా ప్రజా పోరాటాలతో తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవించారు. రంగాను అడ్డు తొలగించుకోకపోతే కోస్తాలో రాజకీయ మనుగడ ఉండదని చంద్రబాబు భావించారనే విమర్శలు ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం, వ్యక్తిగత భద్రత కోసం ఆమరణ దీక్ష చేస్తున్న రంగాపై కుట్ర చేసి.. 1988 డిసెంబర్ 26న హత్య చేయడంలో చంద్రబాబు ప్రధాన పాత్ర పోషించారని సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య తన ఆత్మకథలో ఏకరవు పెట్టారు. నాడు సీఎం ఎన్టీ రామారావు కార్యదర్శిగా పనిచేస్తున్న రాఘవేంద్రరావును కూడా ఇదే చంద్రబాబు కుట్ర చేసి యాక్సిడెంట్లో చంపేశారనే ఆరోపణలున్నాయి. కుట్రలతో టీడీపీలో ఎదిగిన చంద్రబాబు.. 1995లో రాజకీయ అస్థిత్వాన్ని కల్పించిన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచారు. వైశ్రాయ్ హోటల్లో నిర్బంధించిన తన ఎమ్మెల్యేలను విడిపించుకోవడానికి వచ్చిన ఎన్టీఆర్‌పై చెప్పులతో దాడి చేయించిన నైజం చంద్రబాబుది. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది ఎన్.హరికృష్ణల సహకారంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే వారిద్దరినీ ఇంటికి సాగనంపారు. బాబుకు సహకరించి తప్పు చేశానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనేక సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. అధికారాన్ని కోల్పోయిన ఎన్టీఆర్ ఆ క్షోభతోనే కన్ను మూశారు. తొమ్మిదేళ్ల పాలనలో రక్తపుటేరులు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడవడం ద్వారా సీఎం పీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు 1995 – 2004 మధ్య కాలంలో రాజకీయాల్లో ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరగణిస్తూ వచ్చారు. రాయలసీమలో ఫ్యాక్షన్‌ను రాజేసి.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించారనే ఆరోపణలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెందిన 415 మందిని వెంటాడి వేటాడి చంపేయడంలో కీలక భూమిక పోషించారనే విమర్శలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఇలా హత్యకు గురైన వారిలో 300 మంది మృతదేహాల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఇదే రీతిలో ప్రత్యర్థులను మట్టుబెట్టారనే విమర్శలు ఉన్నాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డిని 1998 మే 23న చంపడంలో ప్రధాన పాత్ర పోషించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. హత్య చేసిన వారికి చంద్రబాబు ఆశ్రయం కల్పించారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో నిందితుడైన రాగిపిండి సుధాకర్‌రెడ్డికి ఇటీవల క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడం ఆ విమర్శలకు బలం చేకూరుస్తోంది. 2003లో బాబు సర్కారు హయాంలోనే తనకు రక్షణ కల్పించాలని పరిటాల రవి కోరారు. కానీ.. పరిటాల రవికి భద్రత కల్పించ లేదు. 2004లో పరిటాల రవి హత్యకు గురైన తర్వాత రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేలా టీడీపీ శ్రేణులను ఉసిగొల్పడంలో చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ఆ పార్టీ నేతలే వివిధ సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చినా, కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబు.. హత్యా రాజకీయాలను మరింత తీవ్రం చేశారనే విమర్శలు వస్తున్నాయి. -
నేతల మధ్య టీ'ఢీ'పీ
టీడీపీలో వర్గ పోరు రాజుకుంటోంది. పరస్పరం ప్రతికూల వ్యూహాలు పన్నుతున్నారు. ప్రచారాలతో స్వపక్షంలోని ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆశావహులు ఇందులో కీలక భూమిక పోషిస్తూ ఒకరికొకరు పొగబెట్టుకుంటున్నారు. ఇప్పటి నుంచే ఎవరికి వారు లైన్ క్లియర్ కోసం ప్రయత్నిస్తున్నారు. తిరుపతి, మదనపల్లె, పీలేరు నియోజకవర్గంలోని అ«ధికార పార్టీలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. సాక్షి, తిరుపతి: జిల్లాలోని తిరుపతి..మదనపల్లె..పీలేరు నియోజక వర్గాల్లో టీడీపీ నేతల మధ్య వర్గ రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో తమకు అడ్డురాకుండా పన్నాగాలు వేసుకుంటున్నారు. తిరుపతి నియోజకవర్గం తీసుకుంటే ఎమ్మెల్యే సుగుణమ్మ జనసేన వైపు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఆమె ఈ వాదనను ఖండించారు. తిరుపతిలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఈమెను వచ్చే ఎన్నికల్లో తమకు పోటీ రాకుండా నగరానికి చెందిన కొందరు ముఖ్యులు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ముఖ్య కార్యక్రమాలకు తనకు ఆహ్వానం పంపటం లేదని సుగుణమ్మ ఇప్పటికే పార్టీ నాయకులపై గుర్రుగా ఉన్నారు. ఇలా పంపకపోవడం వెనుక ఆమె ప్రత్యర్థుల హస్తముం దని ఎమ్మెల్యే భావిస్తున్నట్లు తెలిసింది. మహా సంప్రోక్షణ సమయంలోనూ, తిరుమల బ్రహ్మోత్సవాలకు ఈమెకు ఆహ్వానం రాలేదు. ప్రొటోకాల్ పాటించకపోవటంపై ఎమ్మెల్యే అసంతప్తి వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే సమయంలోను ఎమ్మెల్యే హాజరుకాలేదు. ఆహ్వానం కూడా లేదని తెలి సింది. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే వర్గీయులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. సర్దుకుపోవాలని సుగుణమ్మకు సీఎం చెప్పి వెళ్లిపోయినట్లు తెలిసింది. తిరుపతిలోనూ తుడా చైర్మన్ నరసింహయాదవ్ ఏదైనా కార్యక్రమాలు చేపట్టినా ఆహ్వానం లేదని ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారని భోగట్టా. ఈ విషయాలు ముఖ్యమంత్రికి తెలిసినా పెద్దగా స్పందించలేదని సుగుణమ్మ శిబిరం భావిస్తోంది. అధికారులు, నేతలను పిలిచి మందలించాల్సింది పోయి ‘సర్దుకోపోండి’ అని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో సుగుణమ్మను దూరం పెట్టాలని కొందరు టీడీపీ నేతలు ఈ రకంగా పావులు కదుపుతున్నట్లు పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. కిషోర్ వర్సెస్ ఇక్బాల్ పీలేరులో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇక్బాల్ అహ్మద్ 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలోనే ఇక్బాల్‌కు చంద్రబాబు మాట ఇచ్చారు. గెలిస్తే మంత్రి పదవి... ఓడితే నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక్బాల్ ఓటమి పాలయ్యారు. పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి ఇస్తారని ఆయన ఆశగా ఎదురుచూశారు. పదవి రాకపోగా నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అభ్యర్థిత్వం వైపు టీడీపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు ప్రచా రం జరుగుతోంది. కిషోర్ కూడా తానే అభ్యర్థినని పలుమార్లు ప్రకటించారు. నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్లో ఇక్బాల్ మంచిపేరు సంపాదించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ అవుతారని ఇక్బాల్‌ను కిషోర్ దూరం పెడుతున్నారని తెలిసింది. ∙పార్టీ కార్యక్రమాలపై కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు. పైగా తప్పుడు ప్రచారం చేయిస్తున్నట్లు ఇక్బాల్ వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొమ్మనకుండా పొగబెడుతున్నారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. నరేష్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే కుట్ర మదనపల్లెకు చెందిన మాజీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డికి పార్టీలో అడుగడుగునా భంగపాటు తప్పటం లేదు. వాల్మీకిపురం మండలం గండబోయనపల్లెకు చెందిన ఆయన కాంగ్రెస్ సానుభూతిపరుడిగా పనిచేశారు. వైఎస్.రాజశేఖరరెడ్డితో ఉన్న అనుబంధం నరేష్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ వైపు ఆకర్షించింది. వైఎస్సార్ హయాం లో మదనపల్లె మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అంతకుముందు సీటీఎం స్పిన్నింగ్ మిల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. తరువాత కోర్టుకెక్కి అనూహ్యరీతిలో ఎమ్మెల్సీగా పదవిని దక్కించుకున్నారు. అధికారంలో ఉన్న టీడీపీలో చేరితే నియోజకవర్గ అభివృద్ధి, తన ఉన్నతికి బాటలేసుకోవచ్చునని టీడీపీలో చేరారు. నియోజకవర్గంలో నరేష్‌కుమార్‌రెడ్డి చేరడం సహించలేని టీడీపీలోని ఓ సామాజిక వర్గానికి చెందిన కొందరు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. కలెక్టర్ ప్రద్యుమ్న, నరేష్‌కుమార్‌రెడ్డి మధ్య అభిప్రాయ భేదాలను తెరపైకి తెచ్చారు. వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఆయనను దెబ్బతీసేందుకు సిద్ధపడ్డారు. సొంత పార్టీకే చెందిన కొందరు కుట్ర పన్నుతుండటంపై నరేష్ అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్సీగా పార్టీలో చేరిన నరేష్‌కుమార్‌రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఇన్చార్జ్గా ప్రకటించకపోవడంపై ఆయన అనుచరవర్గం పార్టీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సీనియర్ల అలక
సాక్షి ప్రత్యేక ప్రతినిధి– హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ ఎస్)లో అసంతృప్తులు షురూ అయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాపై పలువురు సీనియర్లు అలకబూనారు. తాము ఆశించినవారి పేర్లు జాబితాలో లేకపోవడంతో తీవ్రంగా మనస్తాపం చెందారు. పలువురు సీనియర్ నేతలతోపాటు కొందరు మంత్రులు కూడా ఈ విషయంలో సన్నిహితుల వద్ద తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకున్న కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో పార్టీ అధినేత అనుసరించిన వైఖరి చాలామంది మంత్రులకు మింగుడు పడటంలేదు. అలాగని పరిస్థితిని అధినేతకు వివరించేందుకు వారు ఎలాంటి ప్రయత్నాలూ కూడా చేయడంలేదు. కొన్ని నియోజకవర్గాల విషయంలో ముఖ్యమంత్రి కుమారుడి (కేటీఆర్) మాటే చెల్లుబాటు కానప్పుడు తామెంత అనే ధోరణి వారిలో కనిపిస్తోంది. మరోవైపు పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డవారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో మంత్రి కేటీఆర్ గత రెండు రోజులుగా క్యాంప్ కార్యాలయం దాటి బయటకు రాలేదు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన కేటీఆర్‌కు సైతం రుచించలేదని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన గండ్ర సత్యనారాయణ టికెట్ విషయంలో కేటీఆర్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారని వారు చెబుతున్నారు. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు రెండు రోజులుగా కేటీఆర్‌ను కలిసేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లినా ఆయన అందుబాటులోకి రాలేదు. ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు శనివారం కేటీఆర్‌ను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అల్లుడి టిక్కెట్ విషయంలో నాయిని అలక తన అల్లుడు, రాంనగర్ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డికి ముషీరాబాద్ టికెట్ రాకపోవడంతో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో రెండుసార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన నాయిని.. ఈసారి తన అల్లుడికి అక్కడ టికెట్ ఇప్పించడానికి ప్రయత్నించారు. శ్రీనివాసరెడ్డి కూడా నాయిని వారసుడిగా నియోజకవర్గంలో చెలామణి అయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే నాయిని.. తన అల్లుడే ముషీరాబాద్ అభ్యర్థి అని తన అనుచరులకు కూడా చెప్పేశారు. తీరా అభ్యర్థుల ప్రకటనలో ముషీరాబాద్‌లో మరొకరి (ముఠా గోపాల్) పేరు ఉండటం చూసి ఆయన ఆగ్రహం చెందారు. తన అల్లుడిని కాదని వేరొకరికి టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ భవన్లో జరిగిన సీఎం మీడియా సమావేశానికి డుమ్మా కొట్టారు. ఈ సంగతి తెలుసుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆ సీటుకు అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టారు. ఈ నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా తన అల్లుడి పేరు ప్రకటించాలని నాయిని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఆయన ఎలాంటి కార్యకలాపాల్లో పాలు పంచుకోకుండా అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సాగర్ టికెట్‌పై కంగుతిన్న జగదీష్‌రెడ్డి మరో మంత్రి జగదీశ్‌రెడ్డి సైతం అభ్యర్థుల ప్రకటనపై అసంతృప్తితో ఉన్నారు. తన స్నేహితుడు, నల్లగొండ జిల్లాలో తనకు గట్టి మద్దతుదారుడైన న్యాయవాది ఎం.సి.కోటిరెడ్డికి నాగార్జునసాగర్ టికెట్ ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా టికెట్ విషయంలో తీవ్రంగా ప్రయత్నాలు కూడా చేశారు. పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు కేటీఆర్ వద్ద కూడా దీనిపై హామీ తీసుకున్నట్లు సమాచారం. ఇక కోటిరెడ్డికి టికెట్ ఖాయమని జగదీష్‌రెడ్డి ధీమాతో ఉన్నారు. దీంతో కోటిరెడ్డి సైతం గత ఏడాదిగా నాగార్జునసాగర్ నియోజకవర్గం కలియతిరిగారు. ఇక్కడి నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోయిన నోముల నర్సింహయ్య స్థానికేతరుడు కావడం, మంత్రి ఆశీస్సులు ఉండటంతో తనకే టిక్కెట్ వస్తుందన్న ఉద్దేశంతో డబ్బులు కూడా భారీగా ఖర్చు చేశారు. తీరా అభ్యర్థుల ప్రకటనలో నర్సింహయ్య పేరు రావడం చూసి జగదీష్‌రెడ్డి కంగుతిన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో నోముల వెంట తిరిగిన పలువురు నేతలు.. ఈసారి ఆయనకు టికెట్ రాకపోవచ్చనే ఉద్దేశంతో కోటిరెడ్డి వర్గంలో చేరిపోయారు. వారంతా ఇప్పుడు ఏమి చేయాలో తెలియక తర్జనభర్జనలు పడుతున్నారు. టికెట్ విషయంలో తనకే స్పష్టత లేదని, ఇంతకుమించి తన దగ్గర సమాధానం లేదని జగదీష్‌రెడ్డి తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు సమాచారం. నొచ్చుకున్న కడియం అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సైతం ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ నుంచి పోటీ చేయాలని భావించారు. తనకు టికెట్ ఖాయమని విశ్వసించారు. అందుకు అనుగుణంగానే నియోజకవర్గంలోని ఆయన అనుచరగణం వచ్చే ఎన్నికల కోసం ఎప్పటి నుంచో సిద్ధమవుతోంది. గ్రామాలవారీగా అభివృద్ది కార్యక్రమాలు సైతం చేపట్టారు. అయితే, అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడం, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు మళ్లీ అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించడంతో కడియం తన సన్నిహితుల దగ్గర నొచ్చుకున్నట్లు తెలిసింది. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రెండు నియోజకవర్గాలకు ఇద్దరు అభ్యర్థులను సూచించినా పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. మరో ఇద్దరు సీనియర్ మంత్రులు సైతం టికెట్ ఇప్పిస్తామని, నియోజకవర్గాల్లో పనులు చేసుకోవాలని చెప్పినా.. చివరి క్షణంలో వారికి సీట్లు లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పార్టీ మారి ఇరుకునపడ్డ గుత్తా, దానం రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలన్న తాపత్రయంతో టీఆర్ఎస్లో చేరిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు లేదా మిర్యాలగూడ నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. ఈ రెండు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ తనకు ఏదో ఒక చోట టికెట్ వస్తుందని గట్టిగా విశ్వసించారు. ఎంపీగా రాజీనామా చేస్తే ఎమ్మెల్సీగా రంగప్రవేశం చేసి మంత్రి కావాలన్న ఉద్దేశంతో ఆయన టీఆర్ఎస్లో చేరారు. అయితే, ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు. అయితే, అప్పటి సంగతి ఎలా ఉన్నా, ఇప్పుడు తనకు అనుకూలంగా ఉండే రెండు నియోజకవర్గాలు కాదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ నుంచి పోటీ చేయాలని కోరడంతో గుత్తా తీవ్ర మనస్తాపం చెందారు. ఆ నియోజకవర్గం పూర్తిగా కొత్త కావడం, అందులోనూ ఉత్తమ్‌కుమార్‌కు బలమైన నియోజకవర్గం కావడంతో అక్కడ నుంచి పోటీ చేస్తే రాజకీయ భవిష్యత్ ఉండదని భావించి, తనకు టికెట్ వద్దని చెప్పారు. దీంతో ఉత్తమ్ సతీమణి పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ టికెట్ ఇస్తామని పార్టీ ఆఫర్ చేసిందని అంటున్నారు. అయితే, ఈ విషయంలో గుత్తా ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అందువల్లే ఇంకా పార్టీ నిర్ణయం వెలువడలేదని చెబుతున్నారు. ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ సైతం మనస్తాపంతో ఉన్నారు. ఆయన ఖైరతాబాద్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారంఫార్మ్హౌజ్కు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. శనివారం కేటీఆర్‌ను కలిసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇంకా టిక్కెట్ ఖరారు కాకపోవడంపై నాగేందర్ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. టికెట్ రాదనుకున్న సుభాష్‌రెడ్డి పేరు జాబితాలో... ఉప్పల్ నుంచి టికెట్ రాదనుకున్న భేతి సుభాష్‌రెడ్డి తన పేరు జాబితాలో ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. కేటీఆర్ ఆశీస్సులు ఉన్న హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు టికెట్ వస్తుందని ఆయన భావించారు. దీంతో సుభాష్ అనుచరవర్గం కూడా రామ్మోహన్‌తో చేరిపోయింది. అయితే, అనూహ్యంగా సుభాష్‌రెడ్డి పేరు జాబితాలో కనిపించడంతో రామ్మోహన్ ఆవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రామ్మోహన్ కు మద్దతుగా కొంతమంది కార్పొరేటర్లు శనివారం ప్రగతి భవన్ వద్ద కేటీఆర్‌ను కలిసే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. మరోవైపు మల్కాజ్గిరి టికెట్ తనకు ఇవ్వకుంటే పార్టీ వీడతానని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావు పరోక్షంగా హెచ్చరించారు. మాల్కాజ్‌గిరికి చెందిన పలువురు కార్పొరేట్లు ఆయనకు టికెట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. జాబితాలో తన పేరు చేర్చకుండా అవమానించారని మాజీ మంత్రి కొండా సురేఖ కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తమ్మీద ఈ టికెట్ల వ్యవహారం టీఆర్ఎస్లో నివురుగప్పిన నిప్పులా మారింది. -
పదవులన్నీ ఆమెకేనా.?
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిలో భాగంగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రులపై పలువురు సీనియర్ నాయకులు తిరుగుబాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్‌లో ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే. ఈ క్రమంలో నటి, ఎమ్మెల్సీ జయమాలకు మంత్రి పదవి ఇవ్వడంపై చాలామంది అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మంత్రి జయమాలకు మండలిలో అధికార పార్టీ నాయకురాలి హోదా కట్టబెడుతున్నారని సమాచారం. అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మండలి పరిషత్ సభ్యులు హెచ్ఎం రేవణ్ణ, వీఎస్ ఉగ్రప్ప, అబ్దుల్ జబ్బార్ తదితరులు మంత్రి జయమాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి మాట్లాడేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తగిన సంఖ్యా బలం లేదు.. మండలిలో కాంగ్రెస్ పార్టీకి తగిన సంఖ్యా బలం లేదు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నవారికే పార్టీ హోదా కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏమీ తెలియని జయమాలకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చారో తెలియలేదని ఆవేదన చెందారు. అయితే మళ్లీ ఇప్పుడు మండలిలో ఉన్నత హోదా కల్పించడమేంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్లో చోటు కోసం పోటీపడి మండలి నుంచి స్థానం పొందారు. ఎంతో మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మహిళల కోటాలో జయమాలకు అవకాశం కల్పించారు. అన్ని పదవులూ ఆమెకే కట్టబెడితే మిగతా వారి పరిస్థితేంటని పలువురు ఆవేదన చెందుతున్నారు. -
పదవుల భర్తీలో టీడీపీలో అసంతృప్త జ్వాలలు
-
పాతతరానికే రాహుల్ ఓటు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మార్చిలో ఢిల్లీలో జరపనున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్ల కమిటీలో పాతతరం నేతలకే అధ్యక్షుడు రాహుల్ కీలక బాధ్యతలు అప్పజెప్పారు. ప్లీనరీ ఏర్పాట్లకోసం నియమించిన పలు కమిటీలను ఏఐసీసీ బుధవారం ప్రకటించింది. ఇందులో పలువురు పాతతరం నేతలకు ముఖ్యమైన బాధ్యతలు అప్పజెప్పారు. ప్లీనరీ నిర్వాహక కమిటీ బాధ్యతలను పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరాకు అప్పగించగా.. కన్వీనర్‌గా ఆస్కార్ ఫెర్నాండెజ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జ్‌లను నియమించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో డ్రాఫ్ట్ కమిటీకి వేశారు. ఈ కమిటీలోనూ సగానికిపైగా మంది వృద్ధ నేతలే. రాజకీయ తీర్మానాలను సిద్ధం చేసే కమిటీ బాధ్యతలను ఏకే ఆంటోనీకి అప్పగించారు. ఆర్థిక వ్యవహారాల కమిటీకి పి. చిదంబరం చైర్మన్ కాగా.. కన్వీనర్ జైరాం రమేశ్. పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీకి ఏ కమిటీలోనూ స్థానం కల్పించలేదు. స్టీరింగ్ కమిటీ పార్లమెంటు హౌజ్‌లో మార్చి 16వ తేదీన సమావేశమై తీర్మానాల తుదిజాబితాను సిద్ధం చేయనుంది. ప్లీనరీ మార్చి 17, 18 తేదీల్లో జరగనుంది. -
తాడిపత్రి టీడీపీలో ముసలం
తాడిపత్రి తెలుగుదేశంపార్టీలో ముసలం ప్రారంభమైంది. పార్టీలోని సీనియర్లు తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్డెక్కారు. ఇటీవల టీడీపీలో చేరిన నాయకుల మాట విని సీనియర్లను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని ఆందోళనకు దిగారు. తాడిపత్రి: టీడీప్టీలో ఆవిర్భావం నుంచి పార్టీ జెండా మోసిన (పాత టీడీపీ) నాయకులు, ఇతర పార్టీల నుంచి వలసొచ్చిన (కొత్త) నాయకులకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మంగళవారం రాత్రి టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ తమ్ముడు అయిన ‘అన్న ట్రాన్స్‌పోర్టు’ నిర్వాహకుడు శేఖర్‌పై జేసీ అనుచరులు దాడి చేసి, ట్రాన్స్‌పోర్టు కార్యాలయాన్ని, లారీలను, ఇన్నోవా వాహనాన్ని ధ్వంసం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేశారు. నిందితులు నేరుగా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయి.. కౌంటర్ ఫిర్యాదు ఇచ్చారు. బాధితుడు కాకర్ల శేఖర్‌ను రాత్రి నుంచి పోలీస్‌స్టేషన్‌లోనే నిర్బంధించారు. బుదవారం ఏమి జరిగిందంటే.. విషయం తెలుసుకున్న టీడీపీ నేత, మంత్రి పరిటాల సునీత వర్గీయుడు అయిన కాకర్ల రంగనాథ్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గుత్తావెంకటనాయుడు, వేలూరి శ్రీనివాసులనాయుడు, బొమ్మిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి,హీరాపురం ఫయాజ్‌బాషా తదితరులు తమ వర్గీయున్ని వదిలిపెట్టాలని అనుచరులతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పట్టణ సీఐ భాస్కర్‌రెడ్డి అప్పటికి స్టేషన్‌కు రాలేదు. గంటల తరబడి వేచి చూసినా ఆయన రాకపోయే సరికి నాయకులు సహనం కోల్పోయి పోలీస్‌స్టేషన్ ఎదుటే రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. బాధితుడినే నిర్బంధిస్తారా..? టీడీపీ నాయకులు ఆందోళన చేస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న పట్టణ, రూరల్ సీఐలు భాస్కర్‌రెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డి హుటాహుటిన పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని, వెంటనే ఆందోళన విరమించాలని కోరారు. బాధితుడైన కాకర్ల శేఖర్‌ను పోలీస్‌స్టేషన్‌లోనే నిర్బంధించి, కేసు ఎలా పెడతారని సీనియర్ (పాత) టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ ప్రశ్నించారు. పాతికేళ్లుగా పార్టీ జెండా మోసిన టీడీపీ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వలస నేతలు టీడీపీని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారంటూ సీనియర్లు బొమ్మిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ ఒకరి సొత్తేమీ కాదని, జెండా మోసే ప్రతి కార్యకర్తకూ సొంతమని హీరాపురం ఫయాజ్‌బాషా స్పష్టం చేశారు. ఎట్టకేలకు శేఖర్ విడుదల టీడీపీ సీనియర్లకు సీఐలు సర్దిచెప్పి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం స్టేషన్లో చర్చలు జరిపారు. స్టేషన్లో నిర్బంధంలో ఉన్న కాకర్ల శేఖర్‌ను విడిచిపెట్టడంతో వారు శాంతించారు. వారికి జెండా మోసే అర్హత లేదు తాడిపత్రి: టీడీపీ జెండా మోసే అర్హత కాకర్ల రంగనాథ్‌కు, జగదీశ్వర్‌రెడ్డికి, ఫయాజ్‌బాషాకు లేదని మున్సిపల్ వైస్ చైర్మన్ బీఎండీ. జిలాన్‌బాషా ధ్వజమెత్తారు. జేసీ అనుచరులైన వైస్ చైర్మన్‌తోపాటు తెలుగుయువత నాయకులు అయూబ్, కో ఆప్షన్ సభ్యుడు నియాజ్‌బాషా, సర్పంచ్ రమణ తదితరులు బుధవారం సాయంత్రం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పాత తెలుగుదేశం (సీనియర్లు) అని చెప్పుకుంటున్న నాయకులు ఈరోజు చేసిన నిర్వాహకం వల్ల పార్టీ వ్యవస్థాపకుడి విగ్రహానికి మకిలి పట్టిందని, అందుకే క్షీరాభిషేకం చేశామని వివరించారు. వారి నోటి నుండి పాత తెలుగుదేశం పార్టీ కొత్త తెలుగుదేశంపార్టీ నాయకులని రావడం చాలా దారుణమన్నారు. మీ ఆగడాలను ప్రశ్నించినందుకే ఈరోజు జేసీ సోదరులను వీడి మీరు బయటికివచ్చారని, పార్టీని బజారుకీడుస్తే త్వరలోనే పట్టణాధ్యక్షుడి హోదాలో వారికి షోకాజ్ నోటీసు జారీ చేస్తామని జిలాన్ బాషా హెచ్చరించారు. నాతో రూ.5 కోట్లు ఎలా ఖర్చుపెట్టించారు? తాడిపత్రి: తనకు టీడీపీలో సభ్యత్వం లేకుంటే 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనతో రూ.5 కోట్లు ఎలా ఖర్చు పెట్టించారంటూ పరిటాల వర్గీయుడైన కాకర్ల రంగనాథ్ ప్రశ్నించారు. పార్టీ సభ్యతం శాసనసభ్యుడు అందజేయాలి కానీ, తాను జేసీ సోదరులకు ఎక్కడ పోటీ అవుతానోనని తనకు సభ్యత్వం ఇవ్వలేదని వివరించారు. ముళ్లపొదల్లో పేకాటాడే వ్యక్తులకు తనను విమర్శించే స్థాయి లేదన్నారు. తాడిపత్రిలో తెలుగుదేశంపార్టీకి చెందిన ఏ కార్యకర్తకైనా చిన్న కష్టం వస్తే వారికి తాను అండగా ఉంటానని కాకర్ల రంగనాథ్ స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ చతుర్ముఖ వ్యూహం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ సిద్ధాంతం, జాతీయ రాజకీయాలపై విమర్శలు కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. బీజేపీ, ప్రధానిపై ఎదురుదాడికి కాంగ్రెస్ చతుర్ముఖ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. సీనియర్లతో కమిటీ ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన ప్రచారాన్ని ఏఐసీసీ సమీక్షించింది. గుజరాత్ కాంగ్రెస్ నేతలు, రాహుల్‌లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా వివరాలు సేకరించింది. స్థానికులు ఎదుర్కొంటున్న చిన్న సమస్యలపై దృష్టిపెట్టాలని.. మోదీకి రోజుకో ప్రశ్న వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నలుగురు సీనియర్ నేతలు.. ప్రధాని ప్రసంగాలను విశ్లేషించి అందులోని అసత్యాలను ఎత్తిచూపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే.. ‘2012 ఎన్నికల ప్రచారంలో ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తానన్న మోదీ 4.72 లక్షల ఇళ్లనే కట్టించారని మిగిలినవి పూర్తయ్యేందుకు 45 ఏళ్లు పడుతుందా?’ అని రాహుల్ శుక్రవారం నాటి ప్రచారంలో ప్రశ్నించారు. పటేళ్లు, దళితులను చేరుకునేలా! మరోవైపు.. తమకు అనుకూలంగా ఉన్న పటీదార్లు, దళితులను చేరుకునేందుకు కాంగ్రెస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ తమపై చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టేలా పార్టీ కార్యాలయంలో సీనియర్ నేతలు చిదంబరం, ఆనంద్ శర్మ, అశోక్ గెహ్లాట్, రణ్‌దీప్ సుర్జేవాలా, సచిన్ పైలట్, సుష్మిత దేవ్‌లు ఇకపై రోజూ మీడియాతో మాట్లాడనున్నారు. సంఘ్ హిందూత్వ ఎజెండాను తిప్పికొట్టేందుకు స్వాతంత్య్ర పోరాటంలో సంఘ్ శక్తుల పాత్రను తరచూ ప్రస్తావించాలని నిర్ణయించారు. షా హిందువు కాదు జైన్: రాజ్ బబ్బర్ బీజేపీ జాతీయాధ్యక్షుడు జైన మతానికి చెందినా హిందువుగా చెప్పుకుంటారని కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ విమర్శించారు. ‘రాహుల్ గాంధీ కుటుంబంలో శివభక్తి తరతరాలుగా కొనసాగుతోంది. ఇందిర రుద్రాక్ష ధరించేవారు. శివుడిని ఆరాధించేవారే రుద్రాక్ష ధరిస్తారు. అమిత్ జైన్ అయినా హిందువని చెప్పుకుంటారు’ అని బబ్బర్ పేర్కొన్నారు. -
కళతప్పిన టీడీపీ మహానాడు
-
నేడు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ జయంతి కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం (లోటస్ పాండ్)లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు. -
రేవంత్ ఇక ఆటలో అరటి పండేనా?
-
రేవంత్ ప్రోగ్రాంకు సీనియర్లు దూరం
-
ఇక దూకుడే!
* ‘నగర’ సమరానికి కాంగ్రెస్ సై * వరంగల్ లోక్‌సభ స్థానాన్నీ కైవసం చేసుకునే వ్యూహం * ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై విమర్శలు * సమస్యలపై సర్కారును నిలదీస్తూ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం * ఎన్నికల్లో విజయం కోసం ముఖ్య నేతలతో ఆరు కమిటీలు * నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్న టీ పీసీసీ సీనియర్లు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ నగర పాలక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) దూకుడు పెంచింది. వీటితోపాటు వరంగల్ లోక్‌సభ స్థానానికి జరుగనున్న ఉపఎన్నికను సవాలుగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో వ్యూహాలు రూపొందించుకుంటోంది. ఇందుకోసం సీనియర్ నేతల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటుచేసుకుని ముందుకు వెళుతోంది. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పట్టుబడడంతో టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో మళ్లీ ఆదరణ పెరిగిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్న నేపథ్యంలో... ఈ ఎన్నికలను రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు పార్టీకి జీవన్మరణ సమస్యగా భావిస్తున్నారు. ఆ కేసు ఏవిధంగా మలుపులు తిరుగుతుందన్నది జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ నగరపాలక సంస్థల ఎన్నికలతో పాటు వరంగల్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించుకునేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్ష నాయకుడు కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, సీనియర్ నేతలు డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య నేతృత్వంలో ఆరు కమిటీలు ఏర్పాటయ్యాయి. ఒక్కో కమిటీలో ఆరుగురు ముఖ్య నేతలు సభ్యులుగా ఉన్నారు. ఈ ఆరు కమిటీలు ఈనెల 21 నుంచి 25 వరకు 32 నియోజకవర్గాల పరిధిలో పార్టీ పరిస్థితిపై సమీక్ష, భవిష్యత్తు ప్రణాళికపై సమావేశాలను నిర్వహించనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్, సనత్‌నగర్, అంబర్‌పేట, ఉప్పల్ నియోజకవర్గాల్లో ఆదివారం సమావేశాలు జరిగాయి. కార్యకర్తల అభీష్టం మేరకే.. స్థానిక నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకే టికెట్ల కేటాయింపు జరుగుతుందని టీ పీసీసీ నేతలు భరోసాను ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ డివిజన్లకు పార్టీ టికెట్ల విషయంలో నేతల జోక్యం ఉండబోదని చెబుతున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి, పార్టీ శ్రేణుల్లో ఐక్యతను, విశ్వాసాన్ని పెంచడానికే ఈ సమావేశాలు జరుగుతున్నాయని... టికెట్ల కేటాయింపు పూర్తిగా స్థానిక అంశాలపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. టీఆర్ఎస్పై దాడి ముమ్మరం.. రాష్ట్రంలోని పలు అంశాలపై ఇప్పటిదాకా మెతకవైఖరితో వ్యవహరించిన టీపీసీసీ నేతలు.. తాజాగా టీఆర్ఎస్పై దూకుడు పెంచుతున్నారు. అంశాల వారీగా విమర్శలు గుప్పిస్తూ దాడి చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన నియోజకవర్గాల సమావేశాల సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క, డీఎస్, పొన్నాల, జానారెడ్డి, షబ్బీర్ తదితరులు తమ ప్రసంగాల్లో టీఆర్ఎస్ను, కేసీఆర్ వైఖరిని తూర్పారబట్టారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని కేసీఆర్ పట్టించుకోవడం లేదంటూ విమర్శలు చేశారు. పేదలకు రెండు బెడ్రూముల ఇళ్ల ఊసే లేదని ఆరోపించారు. కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే ‘స్వచ్ఛ హైదరాబాద్’ అంటూ కేసీఆర్ హడావుడి చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సొంత ఇంటి దగ్గర పేరుకుపోయిన చెత్తను మీడియాకు చూపించారు. -
మొండి చెయ్యి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎమ్మెల్సీ పదవులపై జిల్లాలో ఆశలు పెట్టుకున్న నాయకులకు నిరాశే ఎదురైంది. ఎమ్మెల్యే కోటా లో తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు అభ్యర్థులకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఉన్నప్పటికీ జిల్లాలో సీనియర్ నాయకులకు మాత్రం చోటు దక్కలేదు. జిల్లా నుంచి మాజీ మంత్రు లు గాలి ముద్దుక్రిష్ణమనాయుడు, గల్లా అరుణకుమారి ఎమ్మె ల్సీ పదవుల కోసం చివరి వరకు తీవ్రంగా ప్రయత్నించారు. శాసనసభ ఎన్నికల్లో వీరిద్దరూ ఓటమిపాలు కావడంతో కనీసం ఎమ్మెల్సీ సీటునైనా దక్కించుకోవాలనే దృఢ సంకల్పంతో చివరి వరకు పావులు కదిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీ సైతం రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్సీ పదవి వేటలో గల్లా అరుణకుమారి, గాలి ముద్దుక్రిష్ణమ నాయుడు మధ్య అధిపత్యపోరు సాగింది. ఇద్దరు ఎమ్మెల్సీ స్థానాలపై కన్నేసి భారీగా లాబీయింగ్ సైతం చేశారు. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో సైతం వారు గ్రూప్‌లుగా విడిపోయి ఎవరికి వారు బాబు వద్ద మెప్పు కోసం ప్రయత్నించారు. తప్పకుండా ఎమ్మెల్సీ అవకాశం దక్కుతుందనే ధీమాతో ఇప్పటి వరకు ఆశల పల్లకిలో ఊరేగారు. ఇలాంటి తరుణంలో సోమవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వీవీ చౌదరి, సంధ్యారాణి, తిప్పేస్వామిలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారికంగా ప్రకటించడంతో జిల్లా నాయకుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రు లు గాలి, గల్లా వర్గీయులు సైతం చంద్రబాబునాయుడుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరుపై పార్టీ శ్రేణులు లోలోపల అసంతృప్తితో రగిలిపోతున్నాయి. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామంటూనే ఇలా తమ నాయకులకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వకుండా మొండి చెయ్యి చూపడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వర్గాలతో సతమతమౌతున్న దేశం పార్టీలో మరిన్ని గ్రూపులు పుట్టుకొచ్చే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తోంది. ముఖ్యమం త్రి సొంత జిల్లానే పార్టీ గ్రూపులుగా విడిపోతే దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని అధిష్టానం సైతం ఆందోళన చెం దుతోంది. ముఖ్యంగా ఎమ్మె ల్సీ పదవుల విషయంలో ముఖ్యమంత్రి ఒకరికి అవకాశం కల్పిస్తే ఇంకొక వర్గం నుంచి ఆగ్రహం చవిచూడక తప్పదనే భావనతో ఇద్దరినీ పక్కన పెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
అంతే సంగతులు!
* పార్టీ పరిస్థితిపై ‘మేడమ్’కు కాంగ్రెస్ సీనియర్ నాయకుల లేఖ * వలస పక్షులకు ప్రాధాన్యత ఇవ్వడమే ప్రధాన కారణం * ఏఐసీసీ బృందాన్ని వెంటనే రాష్ట్రానికి పంపండి సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం తిరోగమన దిశలో పయనిస్తోందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. పదవుల కేటాయింపుల్లో మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన వారికి కాక ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు ఈ లేఖలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి కాలేదు. ఈ విషయంలో సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పరమేశ్వర్ మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలే కారణమని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. వీరిరువురూ వేర్వేరుగా జాబితాలను తయారు చేసి తమ జాబితాకే హైకమాండ్ నుంచి ఆమోద ముద్ర వేయించుకునేందుకు పట్టుదలతో ఉన్నారు. దీంతో దాదాపు ఏడాదిగా నామినేటెడ్ పోస్టుల భర్తీ వాయిదా పడుతూ వస్తోంది. ఇతర పార్టీల నుంచి కొద్ది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి సిద్ధరామయ్య ప్రయత్నిస్తుండటం వల్ల పార్టీనే నమ్ముకున్న వారిలో అసంతృప్తి పెరిగిపోతోంది. ముఖ్యంగా సీఎం సిద్ధరామయ్యతోపాటు ఎమ్మెల్సీ ఉగ్రప్ప, మంత్రి మహదేవ ప్రసాద్, హోంశాఖ మంత్రి కే.జే జార్జ్‌కు సలహాదారుగా ఉన్న మాజీ ఐపీఎస్, సీఎం సిద్ధు ఆప్తుడు కెంపయ్య పార్టీ, ప్రభుత్వంలో అన్నీ తామై వ్యవహరిస్తుండటమే కాకుండా తాజాగా నామినేటెడ్ పోస్టుల జాబితా తయారీలో వీరు సూచించిన వారికే ప్రాధాన్యత కల్పించారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని సీనియర్ నాయకులు ‘మేడమ్’కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈనెల చివర్లో జరగనున్న మంత్రి వర్గ విస్తరణ, పునర్వవస్థీకరణ విషయంలో కూడా సిద్ధరామయ్య వలస పక్షులకే ప్రాధాన్యత ఇవ్వడానికి పావులు కదుపుతున్నట్లు సీనియర్ నాయకులు తెలిపారు. ఈ విషయమై వెంటనే ఏఐసీసీ నుంచి పరిశీలకులను కర్ణాటకకు పంపి పరిస్థితులను చక్కదిద్దక పోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమని వారు లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆ పార్టీ పట్ల వ్యతిరేక ధోరణితో హైకమాండ్‌కు లేఖ రాయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. -
ఛాన్స్ ఎవరికి?
అయ్యన్నా ...బండారా? జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కుతుందో అయ్యన్నవైపే చంద్రబాబు మొగ్గుతారని అంచనాలు అర్ధరాత్రి వరకు బాబు నుంచి ఫోన్ల కోసం ఆశావహుల ఎదురుచూపు ధీమా సడలని గంటా వర్గీయులు సాక్షి, విశాఖపట్నం: టీడీపీ కొత్త ప్రభుత్వంలో జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై సస్పెన్స నెలకొంది. శనివారం అర్థరాత్రికే పదవి లభించే నేతలకు ఫోన్ వస్తుందని భావించినా అది జరగలేదు. సీనియర్ నేతలు అయ్యన్న,బండారు సత్యనారాయణ మూర్తి, ఎన్నికల ముందు పార్టీలో చేరిన గంటా శ్రీనివాసరావులలో ఇద్దరికి ఛాన్స్ రావచ్చని ఊహగానాలు వెలువడుతున్నాయి. తొలివిడత అయ్యన్న, బండారులలో ఒకరికి మాత్రమే పిలుపురావచ్చని తెలుస్తోంది. ఒకే సామాజికివర్గానికి చెందిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. శనివారం రాత్రికే పదవులపై స్పష్టత వస్తుందని నేతలంతా ఆశించారు. తమకు బాబు నుంచి ఫోన్ వస్తుందని అయ్యన్న, బండారు ఎదురు చూశారు. అలాంటి కాల్ రాలేదు. దీంతో సస్పెన్షన్ వీడలేదు. సీనియర్‌తోపాటు గతంలో అనేక పదవులు చేపట్టినందున తనకే అవకాశం ఉంటుందని అయ్యన్న విశ్వసిస్తున్నారు. పార్టీ పెద్దల నుంచి వచ్చిన సమాచారం మేరకు తనకు పంచాయతీరాజ్‌శాఖ దక్కవచ్చని అంచనా వేసుకుంటున్నారు. విశాఖ నగర పరిధిలో భీమిలి నుంచి గంటాకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సిటీ పరిధిలో బండారుకు అవకాశం లేదని,గ్రామీణ జిల్లాలో తనకే పదవి వస్తుందని అయ్యన్న భావిస్తున్నారు. బండారు సైతం అంతే ధీమాతో ఉన్నారు. అయ్యన్నతో పోల్చితే తాను సౌమ్యు డినని విశ్లేషిస్తున్నారు. గంటాకు విస్తరణలో... : కాపు సామాజికవర్గం కింద గంటాకు డిప్యూటీసీఎం పదవి వరిస్తుందని ఆయన వర్గీయులు భావించినా అనుహ్యంగా ఈ పదవి అదే సామాజికవర్గానికి చెందిన నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణకు ఇవ్వడానికి బాబు నిర్ణయించుకోవడంతో ఆశలు గల్లంతయ్యాయి. మంత్రి పదవి వస్తుందనే ధీమాతో ఉన్నారు. ఒకసారి పార్టీనుంచి వెళ్లిపోయి మళ్లీ కొత్తగా వచ్చిన నేపథ్యంలో వెంటనే ఈయకు పదవిస్తే పార్టీ క్యాడర్,నేతలకు వేరే సంకేతాలు వెళ్తాయనే సంశయంతో అధిష్ఠానం కూడా పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో మలివిడతలో ఛాన్స్ ఇద్దామనే ధోరణితో బాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. గంటా మాత్రం తనకు మొదటివిడతలో పదవి వస్తుందని క్యాడర్‌తో చెబుతున్నారు. అయ్యన్న,బండారు ఇద్దరిలో అంతిమంగా చంద్రబాబు అయ్యన్నవైపే మొగ్గుచూపుతారని పార్టీ కీలక నేతల ద్వారా తెలుస్తోంది. -
ఉత్కంఠ
కేసీఆర్ మంత్రివర్గంలో చోటెవరికో... చందూలాల్, చారి, సురేఖ, రాజయ్య ధీమా రేసులో వినయ్‌భాస్కర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ‘గులాబీ’ అధినేత నిర్ణయంపై ఆసక్తి సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ తొలి ప్రభుత్వంలో జిల్లా నుంచి మంత్రులు ఎవరుంటారనే విషయంపై ఉత్కంఠ పెరుగుతోంది. మంత్రివర్గం ఏర్పాటు చేసేందుకు ఒక్క రోజే గడువు ఉండడంతో చోటు కోసం ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 12 అసెంబ్లీ స్థానాలున్న జిల్లాలో టీఆర్ఎస్ ఏకంగా 8 స్థానాలను గెలుచుకుంది. దీనిని బట్టి జిల్లాకు రెండు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ నేతలు అజ్మీరా చందూలాల్, సిరికొండ మధుసూదనాచారి, టి.రాజయ్య హైదరాబాద్‌లోనే ఉండి మంత్రి పదవి విషయంలో కేసీఆర్ వద్ద జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా తమ మార్గాల్లో క్యాబినెట్లో బెర్త్ కోసం ప్రయత్నిస్తున్నారు. ములుగు నుంచి గెలిచిన అజ్మీరా చందూలాల్ మంత్రి పదవిపై ఆశతో ఉన్నారు. గిరిజనుల కోటాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉండడం చందూలాల్‌కు సానుకూలంగా ఉంది. తెలంగాణలో లంబాడ వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో మంత్రి పదవి కోసం చందూలాల్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. బీసీ సామాజికవర్గం కావడం తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. మంత్రి పదవి కోసం ఆయన హైదరాబాద్‌లో మకాం వేసి జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ టీఆర్ఎస్కు సంబంధించి జిల్లాలో సీనియర్ ప్రజాప్రతినిధి. 2009లో జిల్లాలో వినయభాస్కర్ ఒక్కరే టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. వినయభాస్కర్ మూడోసారి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఉద్యమానికి సంబంధించిన అన్ని సమయాల్లోనూ కీలకంగా వ్యవహరించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు విధేయుడిగా ఉన్న వినయభాస్కర్... మంత్రి పదవిపై ఆశతో ఉన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖకు మహిళా కోటా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ నుంచి గెలిచిన మహిళా ఎమ్మెల్యేల్లో కొండా సురేఖ సీనియర్‌గా ఉన్నారు. వరంగల్ తూర్పులో బస్వరాజు సారయ్యపై విజయం సాధించడం.. మహిళా కోటా సురేఖకు అనుకూలంగా ఉండనుంది. డిసెంబరులో జరగనున్న వరంగల్ నగర పాలక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో వరంగల్ జిల్లా కోటాపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని కొండా వర్గీయులు భావిస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య మంత్రివర్గంలో స్థానంపై ధీమాతో ఉన్నారు. సామాజిక సమీకరణలు తనకు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనమవుతుందని రెండేళ్ల క్రితం జరిగిన ప్రచారాన్ని ఎదుర్కొవాలని చూస్తున్న తరుణంలో టి.రాజయ్య కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్లో చేరి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. దళిత వర్గంలో సీనియర్ ఎమ్మెల్యేగా అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై భారీ మెజారిటీతో విజయం సాధించిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి మొదటి నుంచి కేసీఆర్‌తో సాన్నిహిత్యం ఉంది. పార్టీకి ఇబ్బందులున్న సమయాల్లో ‘సహకారం’ అందించినందున ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి మంత్రి పదవి వస్తుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారికి మంత్రి పదవుల ఇవ్వకూడదని ఏమైనా విధానాన్ని అమలు చేస్తే తప్పించి... ముత్తిరెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని జనగామలో గులాబీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో అత్యధిక మెజారిటీ సాధించిన మొదటి మూడో స్థానంలో నిలిచిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు ప్రభుత్వ విప్ వంటి పదవి వరించే పరిస్థితి కనిపిస్తోంది. ఎంఎస్పీ అధినేత మంద కృష్ణపై విజయం సాధించడం రమేశ్‌కు అనుకూలంగా మారింది. -
మంత్రులుగా మసకబారి పోయారు!
సాక్షి, గుంటూరు :రాష్ట్రానికి అమాత్యులుగా ఒక వెలుగు వెలిగి రాజకీయంలో ఉన్నత స్థానాలకు ఎదిగిన ఎంతో మంది సీనియర్, జూనియర్ మంత్రులు అనంతరం టిక్కెట్లు దక్కక పోవడంతో వారి రాజకీయ జీవితం మసకబారిపోయింది. బండ్లు ఓడలు.... ఓడలు బండ్లు కావడమంటే బహుశా ఇదేనేమో.. అనేక మంది ఎమ్మెల్యేలు, ఉన్నత స్థాయి అధికారులను సైతం అనేక సార్లు తమ చుట్టూ తిప్పుకున్న మంత్రులు ప్రస్తుతం జూనియర్ ఎమ్మెల్యేలు, కిందిస్థాయి అధికారుల చుట్టూ ప్రదక్షణలుచేయాల్సిన దుస్థితి నెలకొంది. మంత్రులుగా ఉండి అధిష్టానం వద్ద మంచి పేరు సంపాదించి జిల్లాలో అనేక మందికి టిక్కెట్లు ఇవ్వమంటూ రికమండేషన్లు చేయాల్సిన మంత్రివర్యులు కనీసం వారి టిక్కెట్టు వారు తెచ్చుకోలేకపోవడం నిజంగా అవమానకరమైన పరిస్థితి. వీరు మంత్రిగా ఉన్న సమయంలో ఎంతగా మంచి పనులు చేసినా మరుసటి ఎన్నికల్లో అధిష్టానాలు టిక్కెట్లు ఇవ్వలేదంటే, ఆ మంత్రి సరిగా పనిచేయకపోవడం వల్లే పక్కన పెట్టారనే భావన అందరిలోనూ కలగకమానదు. మంత్రులుగా చేసిన అనుభవం ఉన్నా అధిష్టానం ఆశీస్సులు లేకపోతే ఇలాగే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాకు చెందిన ఏడుగురు మాజీ మంత్రులు, మంత్రిగా పనిచేసి ఆ తరువాతి ఎన్నికల్లో టిక్కెట్లు పొందలేక రాజకీయంగా తెరమరుగయ్యారు. 1983, 1985 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు మంగళగిరి నుంచి టీడీపీ తరఫున ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ సమయంలో ఆయన ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 1989లో టీడీపీ పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని సీపీఎంకు కేటాయించడంతో ఆ ఎన్నికల్లో కోటేశ్వరరావు టిక్కెట్టు పొందలేకపోయారు. ఆ తర్వాత రాజకీయంగా తెరమరుగయ్యారు. పర్చూరు, బాపట్ల నియోజకవర్గాల నుంచి 1967, 1991, 1994, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీచేసిన సీనియర్ కాంగ్రెస్ నేత గాదె వెంకటరెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే ఈ ఎన్నికల్లో అభ్యర్థులజాబితాలో ఆయన పేరు లేకపోవడంతో ఆయన రాజకీయ జీవితానికి తెరపడినట్టు అయింది. గుంటూరు -2 నియోజకవర్గం నుంచి 1999లో టీడీపీ తరఫున పోటీ చేసిన డాక్టర్ శనక్కాయల అరుణ మొట్టమొదటి సారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలిచిన తొలిసారే ఆమె మంత్రి పదవి పొందారు. అయితే అనంతరం జరిగిన 2004 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆమెకు టిక్కెట్టు నిరాకరించింది. దీంతో అరుణ రాజకీయ జీవితానికి అర్ధంతరంగా తెరపడినట్టయింది. తాడికొండ నియోజకవర్గం నుంచి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన డొక్కా మాణిక్య వరప్రసాదరావు వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. -
కలహాల ‘కాషాయం’!
కొత్త నీరు వస్తున్నదంటే పాత నీరు కొట్టుకుపోవాల్సిందే. పెను ప్రభంజనం చుట్టుముట్టినప్పుడు గడ్డిపోచలకైతే ఫర్వాలేదు గానీ...మహా వృక్షాలకు సమస్యే. గత వైభవాన్ని చూపి, చేసిన సేవలను ఏకరువుపెట్టి లాభంలేదు. వినే వారుండరు. ఈ సంగతులన్నీ బీజేపీ అగ్రజులకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నట్టున్నాయి. లోక్‌సభ ఎన్నికల కోసం విడుదలవుతున్న జాబితాలు పార్టీ సీనియర్ నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇన్నాళ్లూ ఎవరెవరికో అలవోకగా మాట సాయం చేయగలిగినవారు ఇప్పుడు తమ స్థానమెక్కడని వెదుక్కుంటున్నారు. ఎందుకిలా జరుగుతున్నదని ఆక్రోశిస్తున్నారు. నిరుడు జూన్‌లో నరేంద్ర మోడీని బీజేపీ జాతీయ ఎన్నికల ప్రచార సంఘం చైర్మన్‌గా నియమించినప్పుడే వీటన్నిటినీ ఎల్.కె. అద్వానీ ఊహించినట్టున్నారు. అందుకే పార్టీ పదవులన్నిటికీ రాజీనామాచేశారు. అందరూ వచ్చి బతిమాలాక ఆయన కొంచెం తగ్గినా నిరుడు సెప్టెంబర్‌లో నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు మళ్లీ అలిగారు. ఇప్పుడిన్నాళ్లకు ఆయనకు మరో అవమానం ఎదురైంది. ఈసారి పోటీకి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ స్థానాన్ని ఎంపిక చేసుకుంటే కుదరదు పొమ్మన్నారు. చాన్నాళ్లుగా ప్రాతినిధ్యంవహిస్తున్న గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానమే కేటాయిస్తామని తేల్చిచెప్పారు. ఎంత అలిగినా లాభం లేకపోయింది. బీజేపీ తొలి జాబితాలో తనవంటి సీనియర్ నేతకు చోటివ్వలేదని మథనపడుతున్న ఆయనకు ఇది ఊహించని పరాభవం. తమదాకా రాలేదని ఊరుకున్న మిగిలిన అగ్ర నేతలకూ ఇప్పుడు అలాంటి అనుభవాలు మొదలయ్యాయి. సీనియర్ నేత మురళీమనోహర్ జోషి మోడీ కోసం వారణాసిని ఖాళీ చేసి కాన్పూర్‌కు వలసపోవలసి వచ్చింది. ఆయన ఎంత పట్టుబట్టినా చివరకు పార్టీ నిర్ణయానికి తలొగ్గక తప్పలేదు. మరో సీనియర్ నేత లాల్జీ టాండన్‌కు లక్నో సీటు దక్కలేదు. ఇప్పుడు జశ్వంత్‌సింగ్ వంతువచ్చింది. ఆయన అడిగిన బార్మార్(రాజస్థాన్) స్థానం కాంగ్రెస్‌నుంచి వచ్చిన కల్నల్ సోనారామ్ చౌధరికి కేటాయించారు. వాస్తవానికి బార్మార్ ఆయన సొంత స్థానమేమీ కాదు. ఆయన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్, చిత్తోర్గఢ్ల నుంచి గతంలో ప్రాతినిధ్యంవహించి తాజాగా డార్జిలింగ్(పశ్చిమబెంగాల్) ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు బార్మార్ కావాలని అడిగిన జశ్వంత్‌కు జాబితా ద్వారా జవాబొచ్చింది! పార్టీ సీనియర్ నాయకుణ్ణి కాదని, ఫిరాయించిన వ్యక్తికి ఎందుకు కట్టబెట్టారు? ఆ స్థానంలో జాట్లు అధిక సంఖ్యలో ఉన్నారు గనుక ఆ కులానికి చెందిన సోనారామ్‌కు ప్రాధాన్యమివ్వాలనుకున్నారా లేక జశ్వంత్‌ను పరాభవించడానికి ఇంతకు మించిన మార్గం లేదనుకున్నారా అన్నది అనూహ్యం. ఏ పార్టీ అయినా గెలుపు గుర్రాలనే నమ్ముకుంటుంది. అందుకోసమని అవసరమనుకున్న చోట అభ్యర్థులను మారుస్తుంది. కురువృద్ధులైన నేతలను బుజ్జగించడమూ సాధారణమే. కానీ, బీజేపీలో జరుగుతున్నది అది కాదు. అద్వానీ అనుయాయులను లక్ష్యంగా చేసుకుని ఈ తంతు సాగుతున్నది. రెండు నెలలక్రితం ఆయననూ, ఆయన మద్దతుదార్లు ఒకరిద్దరినీ లోక్‌సభ స్థానాలు ఖాళీచేయాలని, అందుకు బదులుగా రాజ్యసభ సీట్లు ఇస్తామని బేరం పెట్టారని గుప్పుమంది. అది అంతకుమించి విస్తరించకుండా సర్దుకున్నారు. ఇప్పుడు జశ్వంత్‌కు జరిగిన పరాభవంపై సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ బాహాటంగానే ధ్వజమెత్తారు. ఈ విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయం విచారకరమైనదని విమర్శించారు. పార్టీ ఇప్పుడు చాలా మెరుగైన స్థితిలో ఉండవచ్చు. సర్వేలన్నీ చెబుతున్నట్టు దాని నేతృత్వంలోని ఎన్డీఏకు వచ్చే ఎన్నికల్లో 220 స్థానాలు దాటిరావొచ్చు. కానీ, అందుకోసమని ఫిరాయింపులను గౌరవించి సీనియర్లను చిన్నబుచ్చడం ఎలాంటి ఎత్తుగడో అర్ధంకాని విషయం. ఈ ధోరణులపై పార్టీలో అక్కడక్కడ నిరసన ధ్వనులు వినిపించడం అప్పుడే మొదలైంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, యూపీ, బీహార్లలో కార్యకర్తలు పార్టీ సారథులకు వ్యతిరేకంగా వీధుల్లోకొచ్చారు. హేమమాలిని(మధుర), కిరణ్‌ఖేర్(చండీగఢ్), జనరల్ వీకే సింగ్(ఘజియాబాద్), జగదంబికాపాల్ (దోమరియాగంజ్)వంటివారంతా పార్టీ కార్యకర్తల ఛీత్కారాలను ఎదుర్కోవలసివచ్చింది. ‘విభిన్నమైన పార్టీ’గా చెప్పుకున్న బీజేపీ ఇప్పుడు ‘విభేదాల పార్టీ’గా ముద్రేయించుకుంటున్నది. పార్టీలో అన్నిటా నరేంద్ర మోడీ ముద్ర స్పష్టంగా కనిపిస్తున్నది. ఆయన ఏమనుకుంటే అదే జరుగుతున్నది. మాట వినని వారెవరైనా ఉంటే మోడీ తరఫున ఆరెస్సెస్ రంగంలోకి దిగుతున్నది. బాగానే ఉంది. నిర్ణయాత్మకంగా వ్యవహరించడం, అందుకు అందరూ బద్ధులయ్యేలా చూడటం తప్పని ఎవరూ అనరు. కానీ, దేశాన్నేలబోతున్న పార్టీ ఇలా ఏకపక్షంగా, రోడ్డు రోలర్లా అన్ని రకాల నిరసనలనూ బేఖాతరు చేస్తూ ముందుకు సాగుతున్నదన్న అభిప్రాయం కలిగితే అది పార్టీకి కలగజేసే నష్టమే ఎక్కువ. అందరి అభిప్రాయాలకూ చోటు కల్పిస్తున్నారని, సమష్టి తత్వంతో ముందుకు వెళ్తున్నారని అనుకున్నప్పుడే దానికి సర్వజనామోదం లభిస్తుంది. ఇప్పుడు బీజేపీ అగ్ర నాయకత్వానికి ఇలాంటి హితవచనాలు చెవికెక్కుతున్న దాఖలాలు లేవు. పార్టీ అసలు... నకిలీగా విడిపోయిందని, ఇప్పుడు నకిలీయే రాజ్యమేలుతున్నదని జశ్వంత్ అంటున్నారు. ఆయనకు సుష్మా మద్దతు పలుకుతున్నారు. తమ ఒంటెత్తు పోకడలే ఈ పరిణామాలకు కారణమని, సకాలంలో దీన్ని సరిదిద్దుకోనట్టయితే నష్టం తప్పదని ఇప్పటికైనా పార్టీ నాయకత్వం గుర్తించగలిగితే అది వారికే మంచిది. -
‘జంపింగ్’ జోరు రాజకీయ నేతల్లో ఎన్నికల ‘ఫీవర్’
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మారుతున్న రాజకీయాల నేపథ్యంలో నెల రోజుల్లో జిల్లా రాజకీయ ముఖచిత్రం మారనుంది. భవిష్యత్ రాజకీయాల్లో అధికారంలో ఉండే పార్టీలో చేరేందుకు జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓ పార్టీ నుంచి మరో పార్టీలో చేరేందుకు చ ర్చోప చర్చలు జరుపుతున్న నేతలు ఈ నెలాఖరులో ఆయా పార్టీ ల్లో చేరే అవకాశం ఉంది. ప్రధానంగా టీడీపీ, కాంగ్రె స్ పార్టీలకు చెందిన పలువురు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల తీర్థం పుచ్చుకునేందు కు సిద్ధం కావడంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పార్టీ ఫిరాయింపులపై ప్రచారం దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవలి పరిణామాలతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 2014 సాధారణ ఎన్నికలే అజెం డాగా రాజకీయ పార్టీల నేతలు తమ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. పార్టీలేవైనా పదవిలో ఉండాలనే లక్ష్యంతో పార్టీలు మారడానికి సన్నద్ధం అవుతున్నారు. 2004, 2009 సాధారణ ఎన్నికల ఫలితాలపై లెక్కలు వేస్తున్నా, 2014 ఎన్నికల్లో ఏది బెటరన్న మీమాంసలో జిల్లాకు చెందిన సీనియర్ నేతలున్నారు. కొందరైతే ఏకంగా భవిష్యత్‌లో విజయావకాశలు న్న పార్టీల ముఖ్యనేతలతో రాయబారాలు నెరపుతున్నారు. టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే గులాబీ తీర్థం పుచ్చుకోవడం దాదాపుగా ఖరారైందన్న ప్రచారం ఉంది. ఇదే సమయంలో 2012 ఉప ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పాయల శంకర్ రెండు రోజుల కిందట నిజామాబాద్‌లో బీజేపీ ముఖ్యనేతలను కలిశారు. అంతకు ముందు నిర్మల్‌లో బీజేపీ జిల్లా నేత ఇం ట్లో వివాహమహోత్సవానికి హాజరైన రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు జరిపినట్ల్లు ఆయన అనుచరులు చెప్పారు. అదేబాటలో ముథోల్, చెన్నూరు, నిర్మల్, మంచిర్యాలలకు చెందిన కొందరు టీడీపీ, కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా బీజేపీ, టీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు జరుపుతుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీలో చేరనున్న ఓ పార్లమెంట్ సభ్యుడు జిల్లాకు చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన రెండు రోజుల కిందట ముఖ్య అనుచరులతో కలిసి ఢిల్లీకి పయనమైనట్లు తెలిసింది. ఢిల్లీలో మకాం వేసిన ఆయన బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్‌ను కలిసి పార్టీలో చేరే విషయమై చర్చించినట్లు చెప్తున్నారు. గతంలోను ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వరంగల్ జిల్లాకు చెందిన ఓ కేంద్రమంత్రితో కలిసి జైరాంరమేష్ ద్వారా ఆ పార్టీ ముఖ్యులతో సంప్రదింపులు జరిపారన్న ప్రచారం జరగ్గా.. సదరు ఎంపీ ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. తాజాగా నాలుగు రాష్ట్రాల్లో వెలువడిన ఫలితాల్లో బీజేపీ విజయఢంకా మోగించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో తాజాగా జిల్లాకు చెందిన ఎంపీ బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. కాగా మంచి ర్యాల, ముథోల్లకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు తమకు టిక్కెట్లు లభించే అవకాశం లేదన్న భావనతో బీజేపీలో చేరే యత్నంలో ఉన్నట్లు తెలిసింది. ప్రధానంగా టీడీపీకి చెందిన పలువురు సీనియర్లు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల్లో చేరేందుకు సుముఖంగా ఉండగా, కాంగ్రెస్ పార్టీ టికెట్లు రావన్న నిరాశతో చాలా మంది ఆ పార్టీ ఆశావహులు బీజేపీ, టీఆర్ఎస్ల వైపు చూడటం చర్చనీయాంశం అవుతోంది. ఏదేమైనా వేగంగా దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాల క్రమంలో పార్టీ ఫిరాయింపులు, వలసలతో ఈ నెలాఖరులో జిల్లా రాజకీయ ముఖచిత్రమే మారనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
పార్టీల గుండెల్లో వలసల గుబులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :సీనియర్ నాయకుల తీరుతో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల గుండెల్లో గుబులు మొదలైంది. ఎప్పుడు ఏ నాయకుడు బయటకు వెళతారోనని ఆ పార్టీల అధిష్టానాలు ఆందోళన చెందుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు పలువురు నేతలు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. ఎవరి బుజ్జగింపులూ వీరిపై పనిచేయవని తేటతెల్లమైంది. టీడీపీ ముఖ్య నేతలు కొందరు కూడా బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏకంగా తన పదవికి రాజీనామా చేసి అధిష్టానానికి వణుకు పుట్టించారు. పార్టీలోని మరో ముఖ్య నాయకుడు కూడా బయటకువెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ముఖ్యనేతలు కొందరు ఏ క్షణంలోనైనా పార్టీ మారే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు బహిరంగంగానే చెబుతున్నాయి. పార్టీలో తీవ్రస్థాయికి చేరిన వర్గపోరే దీనికి కారణం. పార్టీలో తమకు సరైన న్యాయం జరగటం లేదని ఓ వర్గం నేతలు చంద్రబాబు వద్ద కూడా పంచాయతీ పెట్టారు. అయినా ప్రయోజనం లేకపోవటంతో వారు పార్టీని వీడొచ్చనే చర్చ ఊపందుకుంది. రాష్ట్ర విభజనతో బయటకు.. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఇక ఏ మాత్రం కొనసాగవద్దని పలువురు నాయకులు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారు. ఆయనతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు త్వరలో వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ఆయన సోదరుడు, పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. ధర్మాన ప్రసాదరావుతోపాటు కొందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ప్రస్తుత సర్పంచ్‌లు వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయినట్లేనని చెప్పవచ్చు. మంత్రి కోండ్రులోనూ ఆందోళన.. రాష్ట్ర వైద్యవిద్య శాఖ మంత్రి కోండ్రు మురళీమోహన్ పైకి గంభీర ప్రకటనలు చేస్తున్నా లోలోపల ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. గురువారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి గంటా శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ల తీరును తప్పుబట్టారు. రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడవద్దని హెచ్చరించారు. పార్టీలు మారేవారే ఇలాంటి చర్యలకు పాల్పడతారని చెప్పారు. వీరిద్దరిపై చర్య తీసుకోవాలని పార్టీ నాయకత్వాన్ని కోరారు. అంటే పార్టీ నుంచి ముఖ్య నాయకులంతా బయటకు వెళుతున్నారనేది మంత్రికి కూడా స్పష్టమైంది. జనం ఎలాగూ వ్యతిరేకిస్తున్నారు.. పార్టీ కేంద్ర నాయకులవద్దయినా మంచి అనిపించుకుంటే పదవులు దక్కుతాయనే ఆలోచనలో కోండ్రు మురళి ఉన్నట్లు స్పష్టమవుతున్నది. -
సమీకరణాలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాజకీయ సమీకరణలు జోరుగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష జేడీఎస్ నుంచి నిష్ర్కమణలు ప్రారంభమయ్యాయి. బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలతో పాటు మైసూరు, ధార్వాడ, చిత్రదుర్గ శాసన మండలి స్థానాలకు ఈ నెల 21, 22 తేదీల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌లు అవగాహనకు వచ్చాయి. దీనిపై జేడీఎస్‌లోని సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు దేవెగౌడ వ్యవహార శైలిపై అనేక మంది నాయకులకు ఆగ్రహం ఉన్నప్పటికీ, సందర్భం కోసం ఎదురు చూస్తున్న వారంతా పార్టీని ఫిరాయించడానికి ఇదే సరైన తరుణమని భావిస్తున్నారు. మాజీ స్పీకర్ కృష్ణ, మాజీ ఎంపీ నారాయణస్వామి కాంగ్రెస్‌లో చేరడం పార్టీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేసింది. పార్టీలో సీనియర్లయిన వీరద్దరినీ దళాధిపతి ఏనాడో పక్కన పెట్టేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ టికెట్ల కోసం ప్రయత్నించి విఫలమైనప్పటి నుంచీ వీరిద్దరూ అధినేతపై గుర్రుగా ఉన్నారు. ఇక బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శాసన సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన మాజీ డీజీపీ శంకర బిదరి సమాజ్ వాదిలో చేరడమే కాకుండా ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే ఆ పార్టీ తరఫున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే సీపీ. యోగీశ్వర్‌ను కాంగ్రెస్‌కు మద్దతునివ్వాల్సిందిగా ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆదేశించారు. బెంగళూరు గ్రామీణ నియోజక వర్గంలోని చన్నపట్టణ అసెంబ్లీ స్థానానికి యోగీశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనిత స్థానం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత వారంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య యోగీశ్వర్‌ను తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించి కాంగ్రెస్‌కు మద్దతునివ్వాలని కోరారు. అయితే తనకు మంత్రి పదవినిస్తే మద్దతునిస్తానని యోగీశ్వర్ షరతు విధించారు. ప్రచార శైలిపై నివేదిక రెండు లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించి నివేదికను సమర్పించాల్సిందిగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ పార్టీ రాష్ట్ర నాయకులను కోరారు. వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఈ ఉప ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న కాంగ్రెస్ ఆరు నూరైనా రెండు స్థానాల్లోనూ గెలిచి తీరాలని గట్టి పట్టుదలతో ఉంది. కేంద్రంలో రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి ఈసారి ఘోర పరాజయం తప్పదని తాజా సర్వేలు సైతం స్పష్టం చేస్తుండడంతో అధిష్టానం కర్ణాటకపై చాలా నమ్మకాలు పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ నష్టాన్ని ఇక్కడ పూడ్చలేక పోయినా, అధికారంలో ఉన్నందున గౌరవప్రదమైన స్థానాలను గెలుచుకోవాలన్నది పార్టీ సంకల్పం. జేడీఎస్ ప్రాబల్యమున్న ఈ రెండు నియోజక వర్గాల్లో పైచేయి సాధిస్తే శ్రేణుల్లో ఉత్సాహం ద్విగుణీకృతమవుతుందనే అంచనాతో విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది. -
రోడ్ మ్యాప్ లీకుల పై సీనియర్ల మండిపాటు