సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మారుతున్న రాజకీయాల నేపథ్యంలో నెల రోజుల్లో జిల్లా రాజకీయ ముఖచిత్రం మారనుంది. భవిష్యత్ రాజకీయాల్లో అధికారంలో ఉండే పార్టీలో చేరేందుకు జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓ పార్టీ నుంచి మరో పార్టీలో చేరేందుకు చ ర్చోప చర్చలు జరుపుతున్న నేతలు ఈ నెలాఖరులో ఆయా పార్టీ ల్లో చేరే అవకాశం ఉంది. ప్రధానంగా టీడీపీ, కాంగ్రె స్ పార్టీలకు చెందిన పలువురు బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల తీర్థం పుచ్చుకునేందు కు సిద్ధం కావడంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
పార్టీ ఫిరాయింపులపై ప్రచారం
దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవలి పరిణామాలతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 2014 సాధారణ ఎన్నికలే అజెం డాగా రాజకీయ పార్టీల నేతలు తమ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. పార్టీలేవైనా పదవిలో ఉండాలనే లక్ష్యంతో పార్టీలు మారడానికి సన్నద్ధం అవుతున్నారు. 2004, 2009 సాధారణ ఎన్నికల ఫలితాలపై లెక్కలు వేస్తున్నా, 2014 ఎన్నికల్లో ఏది బెటరన్న మీమాంసలో జిల్లాకు చెందిన సీనియర్ నేతలున్నారు. కొందరైతే ఏకంగా భవిష్యత్‌లో విజయావకాశలు న్న పార్టీల ముఖ్యనేతలతో రాయబారాలు నెరపుతున్నారు.
టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే గులాబీ తీర్థం పుచ్చుకోవడం దాదాపుగా ఖరారైందన్న ప్రచారం ఉంది. ఇదే సమయంలో 2012 ఉప ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పాయల శంకర్ రెండు రోజుల కిందట నిజామాబాద్‌లో బీజేపీ ముఖ్యనేతలను కలిశారు. అంతకు ముందు నిర్మల్‌లో బీజేపీ జిల్లా నేత ఇం ట్లో వివాహమహోత్సవానికి హాజరైన రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు జరిపినట్ల్లు ఆయన అనుచరులు చెప్పారు. అదేబాటలో ముథోల్, చెన్నూరు, నిర్మల్, మంచిర్యాలలకు చెందిన కొందరు టీడీపీ, కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలతో సంప్రదింపులు జరుపుతుండటం చర్చనీయాంశం అవుతోంది.
బీజేపీలో చేరనున్న ఓ పార్లమెంట్ సభ్యుడు
జిల్లాకు చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన రెండు రోజుల కిందట ముఖ్య అనుచరులతో కలిసి ఢిల్లీకి పయనమైనట్లు తెలిసింది. ఢిల్లీలో మకాం వేసిన ఆయన బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్‌ను కలిసి పార్టీలో చేరే విషయమై చర్చించినట్లు చెప్తున్నారు. గతంలోను ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వరంగల్ జిల్లాకు చెందిన ఓ కేంద్రమంత్రితో కలిసి జైరాంరమేష్ ద్వారా ఆ పార్టీ ముఖ్యులతో సంప్రదింపులు జరిపారన్న ప్రచారం జరగ్గా.. సదరు ఎంపీ ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు.
తాజాగా నాలుగు రాష్ట్రాల్లో వెలువడిన ఫలితాల్లో బీజేపీ విజయఢంకా మోగించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో తాజాగా జిల్లాకు చెందిన ఎంపీ బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. కాగా మంచి ర్యాల, ముథోల్‌లకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు తమకు టిక్కెట్లు లభించే అవకాశం లేదన్న భావనతో బీజేపీలో చేరే యత్నంలో ఉన్నట్లు తెలిసింది. ప్రధానంగా టీడీపీకి చెందిన పలువురు సీనియర్లు బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల్లో చేరేందుకు సుముఖంగా ఉండగా, కాంగ్రెస్ పార్టీ టికెట్లు రావన్న నిరాశతో చాలా మంది ఆ పార్టీ ఆశావహులు బీజేపీ, టీఆర్‌ఎస్‌ల వైపు చూడటం చర్చనీయాంశం అవుతోంది. ఏదేమైనా వేగంగా దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాల క్రమంలో పార్టీ ఫిరాయింపులు, వలసలతో ఈ నెలాఖరులో జిల్లా రాజకీయ ముఖచిత్రమే మారనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
‘జంపింగ్’ జోరు రాజకీయ నేతల్లో ఎన్నికల ‘ఫీవర్’
Published Wed, Dec 11 2013 2:50 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement