susma swaraj
-
సుష్మ మరణంపై పాకిస్తానీల పిచ్చికామెంట్లు
సాక్షి, హైదరాబాద్ : కశ్మీర్ విభజన అంశం ట్వీట్ల వార్‌కు దారి తీస్తోంది. ఈ విభజనను వ్యతిరేకించే పాకిస్తానీలు భారత నాయకులపై ట్వీట్ల రూపంలో ద్వేషాన్ని చిమ్ముతున్నారు. వారి కామెంట్లు మన నాయకులకు ట్యాగ్ చేస్తూ తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. తాజాగా పలువురు పాక్ నెటిజన్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు, బీజేపీ నాయకురాలు కరుణాగోపాల్‌ను తమ ట్వీట్లతో విసిగించాలని చూసి భంగపాటుకు గురయ్యారు. షోయబ్ అన్సారీ అనే పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ సానుభూతిపరుడు కశ్మీర్‌ను విభజించిన పాపం.. కేంద్రానికి తగిలింది అందుకే, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ ఆకస్మికంగా మరణించారంటూ ట్వీట్ చేస్తూ శాపనార్థాలు పెట్టాడు. దీనికి కేటీఆర్ కూడా దీటుగానే స్పందించారు. ‘ఒక నాయకురాలి మరణంపై ఇంత దారుణంగా స్పందించిన మీ సంకుచిత మనస్తత్వం మీ ట్వీట్లతో బయటపడింది. నువ్వు పాకిస్తాన్‌కు చెందిన వాడివైనా సరే.. జీవితాంతం ప్రజాసేవకు పాటుపడ్డ సుష్మాస్వరాజ్ లాంటి వారిని చూసి కాస్త ధైర్యం, మర్యాద, హుందాతనం నేర్చుకో..’అంటూ చురకలంటించారు. నాజియా అనే మరో నెటిజన్ దేవుడి దయ వల్ల సుష్మాస్వరాజ్ ఇప్పటికే నరకంలోకి వెళ్లి ఉంటుంది, తర్వాత వంతు నరేంద్రమోదీదే అంటూ బీజేపీ నాయకురాలు కరుణాగోపాల్‌ను వెక్కిరిస్తూ ట్యాగ్ చేసింది. దీనికి కరుణాగోపాల్ కూడా అదేస్థాయిలో సమాధానమిచ్చింది. మీలాంటి మనస్తత్వం ఉన్న వారు ఎన్నటికీ మారరు అంటూ ప్రతిస్పందించి ఆమె నోరు మూయించింది. -
యువతలో ధైర్యం నింపిన నాయకురాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఆత్మహత్యలు వద్దని, ప్రత్యేక రాష్ట్రాన్ని చూసేందుకు బతికి ఉండాలని యువతలో ధైర్యం నింపిన గొప్ప నాయకురాలు సుష్మాస్వరాజ్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఆమె పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు. ఆమె మరణం తెలంగాణ ప్రజలతో పాటు దేశానికి తీరని లోటని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం సుష్మా సంతాప కార్య క్రమం నిర్వహించారు. ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అరి్పంచారు.అనంతరం లక్ష్మణ్ మాట్లాడారు. సుష్మాస్వరాజ్ లేరన్న విషయాన్ని ఊహించుకోలేక పోతున్నామన్నారు. ఆరి్టకల్ 370, 35ఏ వల్ల కశీ్మర్ ప్రజలు ఎంతో నష్టపోయారని, అభివృద్ధి జరగలేదన్నారు. 41 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, వాటి రద్దు వల్ల కశీ్మర్ అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. వచ్చే ఐదేళ్లలో మార్పు సుస్పష్టంగా కనిపిస్తాయన్నారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సుష్మా స్వరాజ్ వల్లే తెలంగాణకు ఎయిమ్స్ వచి్చందన్నారు. ఆమెతో తనకు 37 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ నేతలు నల్లు ఇంద్రసేనా రెడ్డి, ధర్మారావు, చింతల రామచంద్రా రెడ్డి, యెండెల లక్ష్మీనారాయణ, చింతా సాంబమూర్తి, యెడ్ల గీత, ఛాయాదేవి, తదితరులు సుష్మాస్వరాజ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అరి్పంచారు. ప్రముఖుల సంతాపం : సుష్మ మృతి పట్ల గవర్నర్ నరసింహన్ సంతాపం సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతి పట్ల గవర్నర్ నరసింహన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆకస్మిక మరణం తనను కలచి వేసిందని సంతాప సందేశంలో తెలియజేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుష్మా అద్భుతమైన వక్త అని, అత్యంత ప్రజాదరణ పొందిన మహిళా జాతీయ నాయకుల్లో ఒకరన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నట్టు వెల్లడించారు. దేశ మహిళలందరికీ సుష్మ స్ఫూర్తిదాయకం సాక్షి, అమరావతి : మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ మృతికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సంతాపం తెలిపారు. ‘సుష్మా స్వరాజ్ హఠాన్మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. జాతీయ స్థాయిలో ఆమె సత్తా గల ఓ గొప్ప నాయకురాలు. ఆమెను పార్టీలకతీతంగా అందరూ అభిమానించారు. ఒక సమర్థ పరి పాలకురాలిగా ఆమె సాహసానికి, దయా గుణానికి మారు పేరుగా నిలిచారు. దేశంలోని మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సుష్మా కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సాను భూతిని తెలియజేస్తున్నాను’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఆమె వాక్పటిమకు అభిమానిని : కవిత ‘సుష్మాజీ లేరనే విషయాన్ని జీరి్ణంచుకోలేక పోతున్నా. ఎంతో మంది అభిమానాన్ని ఆమె చూరగొన్నారు. సుష్మా స్వరాజ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఆమె అద్భుత వాక్పటిమకు నేను అభిమానిని’అంటూ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సంతాపం ప్రకటించారు. సుష్మ మృతి దేశానికి తీరని లోటు: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతి దేశానికి తీరని లోటని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ చిన్నమ్మగా గుర్తింపు పొందిన సుష్మ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు వెల్లడించారు. సుష్మా స్వరాజ్ కృషి మరువలేనిది: చెరుకు సుధాకర్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన కృషి మరువలేని దని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రీలో ఆ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. అనంతరం సుధాకర్ మాట్లాడుతూ.. ఆరి్టకల్ 370పై పార్లమెంట్ చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణపై చేసిన వ్యాఖ ్యలు బాధాకరమన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకే జరిగిన విభజనను కించపరచేలా మాట్లాడటం సబబు కాదన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సూచించిన ఎత్తిపోతల పథకం మంచి ఆలోచనని, అయితే సీఎం కేసీఆర్ కాళేశ్వరాన్ని తిప్పిపోతల పథకంగా మార్చారని ఎద్దేవా చేశారు. -
‘జంపింగ్’ జోరు రాజకీయ నేతల్లో ఎన్నికల ‘ఫీవర్’
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మారుతున్న రాజకీయాల నేపథ్యంలో నెల రోజుల్లో జిల్లా రాజకీయ ముఖచిత్రం మారనుంది. భవిష్యత్ రాజకీయాల్లో అధికారంలో ఉండే పార్టీలో చేరేందుకు జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓ పార్టీ నుంచి మరో పార్టీలో చేరేందుకు చ ర్చోప చర్చలు జరుపుతున్న నేతలు ఈ నెలాఖరులో ఆయా పార్టీ ల్లో చేరే అవకాశం ఉంది. ప్రధానంగా టీడీపీ, కాంగ్రె స్ పార్టీలకు చెందిన పలువురు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల తీర్థం పుచ్చుకునేందు కు సిద్ధం కావడంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పార్టీ ఫిరాయింపులపై ప్రచారం దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవలి పరిణామాలతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 2014 సాధారణ ఎన్నికలే అజెం డాగా రాజకీయ పార్టీల నేతలు తమ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. పార్టీలేవైనా పదవిలో ఉండాలనే లక్ష్యంతో పార్టీలు మారడానికి సన్నద్ధం అవుతున్నారు. 2004, 2009 సాధారణ ఎన్నికల ఫలితాలపై లెక్కలు వేస్తున్నా, 2014 ఎన్నికల్లో ఏది బెటరన్న మీమాంసలో జిల్లాకు చెందిన సీనియర్ నేతలున్నారు. కొందరైతే ఏకంగా భవిష్యత్‌లో విజయావకాశలు న్న పార్టీల ముఖ్యనేతలతో రాయబారాలు నెరపుతున్నారు. టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే గులాబీ తీర్థం పుచ్చుకోవడం దాదాపుగా ఖరారైందన్న ప్రచారం ఉంది. ఇదే సమయంలో 2012 ఉప ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పాయల శంకర్ రెండు రోజుల కిందట నిజామాబాద్‌లో బీజేపీ ముఖ్యనేతలను కలిశారు. అంతకు ముందు నిర్మల్‌లో బీజేపీ జిల్లా నేత ఇం ట్లో వివాహమహోత్సవానికి హాజరైన రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు జరిపినట్ల్లు ఆయన అనుచరులు చెప్పారు. అదేబాటలో ముథోల్, చెన్నూరు, నిర్మల్, మంచిర్యాలలకు చెందిన కొందరు టీడీపీ, కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా బీజేపీ, టీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు జరుపుతుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీలో చేరనున్న ఓ పార్లమెంట్ సభ్యుడు జిల్లాకు చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన రెండు రోజుల కిందట ముఖ్య అనుచరులతో కలిసి ఢిల్లీకి పయనమైనట్లు తెలిసింది. ఢిల్లీలో మకాం వేసిన ఆయన బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్‌ను కలిసి పార్టీలో చేరే విషయమై చర్చించినట్లు చెప్తున్నారు. గతంలోను ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వరంగల్ జిల్లాకు చెందిన ఓ కేంద్రమంత్రితో కలిసి జైరాంరమేష్ ద్వారా ఆ పార్టీ ముఖ్యులతో సంప్రదింపులు జరిపారన్న ప్రచారం జరగ్గా.. సదరు ఎంపీ ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. తాజాగా నాలుగు రాష్ట్రాల్లో వెలువడిన ఫలితాల్లో బీజేపీ విజయఢంకా మోగించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో తాజాగా జిల్లాకు చెందిన ఎంపీ బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. కాగా మంచి ర్యాల, ముథోల్లకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు తమకు టిక్కెట్లు లభించే అవకాశం లేదన్న భావనతో బీజేపీలో చేరే యత్నంలో ఉన్నట్లు తెలిసింది. ప్రధానంగా టీడీపీకి చెందిన పలువురు సీనియర్లు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల్లో చేరేందుకు సుముఖంగా ఉండగా, కాంగ్రెస్ పార్టీ టికెట్లు రావన్న నిరాశతో చాలా మంది ఆ పార్టీ ఆశావహులు బీజేపీ, టీఆర్ఎస్ల వైపు చూడటం చర్చనీయాంశం అవుతోంది. ఏదేమైనా వేగంగా దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాల క్రమంలో పార్టీ ఫిరాయింపులు, వలసలతో ఈ నెలాఖరులో జిల్లా రాజకీయ ముఖచిత్రమే మారనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.