
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఆత్మహత్యలు వద్దని, ప్రత్యేక రాష్ట్రాన్ని చూసేందుకు బతికి ఉండాలని యువతలో ధైర్యం నింపిన గొప్ప నాయకురాలు సుష్మాస్వరాజ్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఆమె పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు. ఆమె మరణం తెలంగాణ ప్రజలతో పాటు దేశానికి తీరని లోటని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం సుష్మా సంతాప కార్య క్రమం నిర్వహించారు. ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అరి్పంచారు.అనంతరం లక్ష్మణ్ మాట్లాడారు. సుష్మాస్వరాజ్ లేరన్న విషయాన్ని ఊహించుకోలేక పోతున్నామన్నారు.
ఆరి్టకల్ 370, 35ఏ వల్ల కశీ్మర్ ప్రజలు ఎంతో నష్టపోయారని, అభివృద్ధి జరగలేదన్నారు. 41 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, వాటి రద్దు వల్ల కశీ్మర్ అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. వచ్చే ఐదేళ్లలో మార్పు సుస్పష్టంగా కనిపిస్తాయన్నారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సుష్మా స్వరాజ్ వల్లే తెలంగాణకు ఎయిమ్స్ వచి్చందన్నారు. ఆమెతో తనకు 37 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ నేతలు నల్లు ఇంద్రసేనా రెడ్డి, ధర్మారావు, చింతల రామచంద్రా రెడ్డి, యెండెల లక్ష్మీనారాయణ, చింతా సాంబమూర్తి, యెడ్ల గీత, ఛాయాదేవి, తదితరులు సుష్మాస్వరాజ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అరి్పంచారు.
ప్రముఖుల సంతాపం :
సుష్మ మృతి పట్ల గవర్నర్ నరసింహన్ సంతాపం
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతి పట్ల గవర్నర్ నరసింహన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆకస్మిక మరణం తనను కలచి వేసిందని సంతాప సందేశంలో తెలియజేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుష్మా అద్భుతమైన వక్త అని, అత్యంత ప్రజాదరణ పొందిన మహిళా జాతీయ నాయకుల్లో ఒకరన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నట్టు వెల్లడించారు.
దేశ మహిళలందరికీ సుష్మ స్ఫూర్తిదాయకం
సాక్షి, అమరావతి : మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ మృతికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సంతాపం తెలిపారు. ‘సుష్మా స్వరాజ్ హఠాన్మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. జాతీయ స్థాయిలో ఆమె సత్తా గల ఓ గొప్ప నాయకురాలు. ఆమెను పార్టీలకతీతంగా అందరూ అభిమానించారు. ఒక సమర్థ పరి పాలకురాలిగా ఆమె సాహసానికి, దయా గుణానికి మారు పేరుగా నిలిచారు. దేశంలోని మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సుష్మా కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సాను భూతిని తెలియజేస్తున్నాను’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
ఆమె వాక్పటిమకు అభిమానిని : కవిత
‘సుష్మాజీ లేరనే విషయాన్ని జీరి్ణంచుకోలేక పోతున్నా. ఎంతో మంది అభిమానాన్ని ఆమె చూరగొన్నారు. సుష్మా స్వరాజ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఆమె అద్భుత వాక్పటిమకు నేను అభిమానిని’అంటూ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సంతాపం ప్రకటించారు.
సుష్మ మృతి దేశానికి తీరని లోటు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతి దేశానికి తీరని లోటని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ చిన్నమ్మగా గుర్తింపు పొందిన సుష్మ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు వెల్లడించారు.
సుష్మా స్వరాజ్ కృషి మరువలేనిది: చెరుకు సుధాకర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన కృషి మరువలేని దని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రీలో ఆ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. అనంతరం సుధాకర్ మాట్లాడుతూ.. ఆరి్టకల్ 370పై పార్లమెంట్ చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణపై చేసిన వ్యాఖ ్యలు బాధాకరమన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకే జరిగిన విభజనను కించపరచేలా మాట్లాడటం సబబు కాదన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సూచించిన ఎత్తిపోతల పథకం మంచి ఆలోచనని, అయితే సీఎం కేసీఆర్ కాళేశ్వరాన్ని తిప్పిపోతల పథకంగా మార్చారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment