సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం.. దాన్ని చక్కదిద్దేందుకు హైకమాండ్ దిగ్విజయ్‌సింగ్‌ను బరిలోకి దింపడం.. ఆయన సుదీర్ఘంగా పది గంటల పాటు నేతలతో విడివిడిగా భేటీ అయి చర్చించడం ఉత్కంఠ రేపింది. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘తెలంగాణలో సీనియర్ నేతలు సమన్వయం పాటించాలి. పార్టీలో అంతర్గతంగా మాత్రమే చర్చించాలి. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవద్దు. ఎంతపెద్ద నాయకులైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటాం’’ అని ఆయన హెచ్చరించారు.
బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకోవాలి. పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేయాలి. కాంగ్రెస్ నేతలంతా ప్రజాక్షేత్రంలో ఉండాలి.ఇప్పటికే రేవంత్‌రెడ్డి నన్ను కలిశారు. చిన్న వయస్సులో ఉన్నవారికి పీసీసీ ఇస్తే తప్పేంటి?. కొత్తవారికి పీసీసీ చీఫ్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి’’ అని ద్విగిజయ్ పేర్కొన్నారు.
కేంద్రం అన్ని రంగాల్లో విఫలమయ్యిందని మోదీ పాలనలో మధ్య తరగతి ప్రజలు నలిగిపోతున్నారన్నారు. ఈ స్థాయిలో ధరలు ఎప్పుడూ పెరగలేదన్నారు. ‘‘రాహుల్ యాత్రకు మంచి స్పందన వస్తోంది. దేశంలో నిరుద్యోగ సమస్య భారీగా పెరిగింది.కార్పొరేట్ల సంస్థలకే మోదీ ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది.ప్రత్యర్థులపై ప్రభుత్వ సంస్థలను ఉసిగొల్పుతున్నారు.ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు.మనుషుల మధ్య ద్వేషాన్ని పెంచుతున్నారు. జోడో యాత్రను అడ్డుకోవడానికి కేంద్రం కుట్రలు చేస్తోంది’ అని ద్విగిజయ్ అన్నారు.
‘‘ఇద్దరు టీఆర్‌ఎస్ ఎంపీలే తెలంగాణను సాధించారా?. ప్రజలకు హామీ ఇచ్చాం. తెలంగాణను ఏర్పాటు చేశాం. ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారు. కాంగ్రెస్ నేతలను బెదిరిస్తున్నారు.తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోంది. అవినీతిపై తెలంగాణ రికార్డు సాధిస్తోంది.బీజేపీకి మద్దతు పలికేందుకు బీఆర్‌ఎస్ ఏర్పాటు చేశారు. మైనార్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేసింది. తెలంగాణలో మైనార్టీ రిజర్వేషన్లపై ఓవైసీ మౌనంగా ఎందుకున్నారు?. కేసీఆర్‌కు ఓవైసీ ఎందుకు మద్దతు ఇస్తున్నారు?. బీజేపీని గెలిపించేందుకు ఓవైసీ పోటీ చేస్తున్నారు’’ అని ద్విగిజయ్ సింగ్ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment