సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. పార్టీకి చెందిన పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లతో ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే సమావేశంలో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన పోలింగ్ బూత్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేయనున్నారు.
కాగా, ఈ సమావేశం ఏర్పాట్లపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సమీక్షించారు. తన నివాసంలో మహేశ్‌తో సమావేశమైన రేవంత్ కార్యక్రమ ఏర్పాట్లు జరుగుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్స్ అందరూ సమావేశానికి హాజరు కావాలని ఈ సందర్భంగా రేవంత్ పిలుపునిచ్చారు.
సీఎంను కలిసిన సలహాదారులు, ఎమ్మెల్సీలు
కాగా, కొత్తగా నియమితులైన సలహాదారులు, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి, ఇద్దరు ఎమ్మెల్సీలు మంగళవారం సీఎం రేవంత్‌ను కలిశారు. సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ, హర్కర వేణుగోపాల్‌రావు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవితో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్‌లు జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారిని సీఎం రేవంత్ అభినందించారు. అదే విధంగా దావోస్ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడం పట్ల సలహాదారులు, ఎమ్మెల్సీలు సీఎం రేవంత్‌కు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment