సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల ఎంపికకు కొత్త పద్ధతి రానుంది. ఇంటర్వ్యూల ద్వారా వీరిని ఎంపిక చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. రాష్ట్రానికి సంబంధించి టీపీసీసీ ప్రతిపాదించిన అధికార ప్రతినిధులకు ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్‌ఖేరా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. గతంలో లాగా టీపీసీసీ ప్రతిపాదించిన అందరినీ అధికార ప్రతినిధులుగా నియమించే అవకాశం లేదని, ఇంటర్వ్యూల అనంతరం ఐదుగురు సీనియర్ అధికార ప్రతినిధులు, ఏడుగురు అధికార ప్రతినిధుల పేర్లను ఏఐసీసీనే అధికారికంగా ప్రకటిస్తుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రం నుంచి అధికార ప్రతినిధుల జాబితాను ఏఐసీసీకి పంపగా, త్వరలోనే తాము వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం అధికారికంగా ప్రకటిస్తామని ఏఐసీసీ నుంచి సమాచారం వచి్చంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈనెల 14న మంచిర్యాలకు వచ్చి వెళ్లిన తర్వాత ఈ నియామక ప్రక్రియ జరుగుతుందని సమాచారం. అధికార ప్రతినిధులతో పాటు ముగ్గురి నుంచి ఐదుగురు ఉపాధ్యక్షులు, 12 మంది ప్రధాన కార్యదర్శులను కూడా ప్రకటించనున్నారు.
అప్పుడే సూర్యాపేట, రంగారెడ్డి, భూపాలపల్లి, జనగామ, హనుమకొండ, ఆసిఫాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను కూడా ప్రకటించే అవకాశాలున్నాయి. కోఆప్షన్ శాతాన్ని 25కు పెంచడంతో ఏఐసీసీ సభ్యులుగా ఈసారి రాష్ట్రం నుంచి ఐదుగురికి అదనంగా అవకాశం లభించనుంది.
చదవండి: అడ్డగోలుగా కేసీ అండ్ సీఎస్‌కు నిర్మాణ అనుమతులు
Comments
Please login to add a commentAdd a comment