సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు అవుతోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సైతం 8 సీట్లను గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ మెరుగైన ప్రదర్శన ఇచ్చిది. అయితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త చీఫ్‌ను నియమించాల్సిన సమయం వచ్చింది.
కొత్త చీఫ్‌తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ల మార్పుపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఈ నెలాఖరులోగా కొత్త చీఫ్‌పై ఏఐసీసీ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త చీఫ్ ఎంపికపై కాంగెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. పీసీసీ చీఫ్‌తో పాటు, వర్కింగ్ ప్రెసిండెంట్స్‌కు సీనియర్, కీలక నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. పీసీసీ చీఫ్ పోటీలో మంత్రి పొన్నం ప్రభాకర్, మహేష్‌కుమార్ గౌడ్, మధుయాష్కిలు ఉన్నారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, సంపత్ కుమార్ తదితరులు పీసీసీ చీఫ్ ఆశావహుల్లో ఉన్నారు. మరోవైపు.. పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ పదవులను కోసం సైతం పలువురి మధ్య పోటీ నెలకొంది. వాటిని కాంగ్రెస్ నేతలు రవళి రెడ్డి, కమల్ ఆశిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment