‘కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజు’ | congress leader jagga reddy media chit chat in hyderabad | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌కి అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ’

Published Tue, Apr 9 2024 3:06 PM | Last Updated on Tue, Apr 9 2024 3:11 PM

congress leader jagga reddy media chit chat in hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాను తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) పదవి అడగడం కొత్త కాదని.. అవకాశం వచ్చిన ప్రతి సారి తాను అడుగుతానని  కాంగ్రెస్‌ నేత జాగ్గారెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు.

‘ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పీసీసీ అవకాశం ఇస్తే ఓకే.  రెడ్డిలలో ఎవరికైనా అవకాశం ఇస్తే ఆ పోటీ పడే లిస్ట్‌లో  నేను ఉంటాను. రాహుల్ గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ అధికారం కోసం ఎప్పుడు అడ్డదారులు తొక్కలేదు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం. బీజేపీ పదవుల కోసమే ఏర్పడ్డ పార్టీ.  రాజ్యాంగం తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. విషయ అవగాహన లేని మంత్రి కిషన్ రెడ్డి. ఆర్థిక వనరుల సమీకరణ, బతుకు తెరువు కోసం పీకే సర్వే సంస్థ ఏర్పాటు చేసుకున్నాడు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే మాదిగలు. మాదిగలు అంటేనే కాంగ్రెస్ పార్టీ. దామోదర రాజనర్సింహకు, మీరా కుమార్‌కు  అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీకి లాభం చేకూర్చేలా మంద కృష్ణమాదిగ మాట్లాడుతున్నారు. వర్షాకాలంలో వర్షాలు పడుతాయి. ఎండ కాలంలో వర్షాలు పడవు. కనీసం బుద్ధి లేకుండా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. నేను ఒక కాంగ్రెస్ అభిమానిగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజు.

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా ఆయన రాజే. కేసీఆర్ ఫ్రస్ట్రేషన్‌లో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. మా వంద రోజుల పాలన గురించి మమ్మలని అడగకండి. ఆర్టీసి బస్సులలో ప్రయాణం చేసే మహిళలను అడగండి వాళ్ళు చెపుతారు. ఫిరాయింపుల మీద నేను మాట్లాడలేను. నేను కూడా రెండు సార్లు పార్టీ మారాను. పదవుల కోసం నేను కక్కుర్తి పడను’అని జగ్గారెడ్డి అన్నాఉ. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీకి అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ ఉందని, రాజ పూజ్యం 16, అవమానం 2 ఉందని తెలపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement