PCC
-
కీలక పదవులు ఎవరికో?!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఇప్పటికే పార్టీ అధిష్టానంతో పలుమార్లు జరిగిన చర్చల అనంతరం బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీలు అన్ని కోణాల్లో కస రత్తు చేసి తుది జాబితాను సిద్ధం చేశారు. తాజాగా ఏఐసీసీ ఆమోదం కోసం ఈ జాబితాను ఢిల్లీకి పంపారు. అధిష్టానం ఆమోదం లభించిన వెంటనే అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో టీపీసీసీ కార్యవర్గాన్ని జాగ్రత్తగా కసరత్తు చేసి ఎంపిక చేశా రనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. దీంతో కీలక పదవులు ఎవర్ని వరిస్తాయనే దానిపై ఆశావహులు, పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఐదుగురు కాదు.. నలుగురేపార్టీ అధ్యక్ష పదవి తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న పదవి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ హోదా కోసం పార్టీలోని చాలామంది సీనియర్లు పోటీ పడుతున్నారు. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ (ఆర్గనైజేషన్)గా ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్‌కు పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం వచ్చిన నేపథ్యంలో ఈ పదవికి డిమాండ్ ఏర్పడింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయ కులు, గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉన్న వారితో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చాలా మంది ఈ పదవిని కోరుకుంటు న్నారు. గత కార్యవర్గంలో మొత్తం ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌తో పాటు జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్‌లు ప్రస్తుతం ఈ హోదాలో ఉన్నారు. ఈసారి ఆ 4 కేటగిరీల వారికి.. గతంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్‌రెడ్డి అధ్యక్షుడిగా ఉండడంతో ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. ఎమ్మెల్యే కోటాలో జగ్గారెడ్డికి అవకాశం కల్పించారు. అయితే ఈసారి బీసీ వర్గాలకు చెందిన నాయకుడు అధ్యక్షుడిగా ఉండడంతో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన నలుగురు నాయకులకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ రేసులో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ (ఎస్టీ) పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. మరోవైపు ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, నాగరిగారి ప్రీతం, అద్దంకి దయాకర్, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, మైనార్టీ కోటాలో ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, నాంపల్లి నియోజకవర్గ నేత ఫిరోజ్‌ఖాన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. అజారుద్దీన్, ఫిరోజ్‌ఖాన్‌లలో ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం ఇస్తే మరొకరికి అధికారిక పదవి వస్తుందని తెలుస్తోంది. ఇదే సామాజిక వర్గానికి చెందిన నేత షబ్బీర్ అలీని ఎమ్మెల్సీగా ఎంపిక చేసి ఆయన్ను కేబినెట్లోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. ఈ కోణంలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు సామాజికవర్గాల వారీగా రెండేసి చొప్పున పేర్లు ఢిల్లీకి పంపినట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాకు ఒకటి లేదా రెండు వైస్లువర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు పీసీసీ ఉపాధ్యక్ష పదవులకు కూడా డిమాండ్ కనిపిస్తోంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో పీసీసీలో ముఖ్య హోదా అయిన వైస్ ప్రెసిడెంట్ పదవి వచ్చినా బాగానే ఉంటుందనే ఆలోచనలో చాలామంది కాంగ్రెస్ నేతలున్నారు. ఈ పదవులను పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇవ్వాలని తొలుత భావించినా సామాజిక, ప్రాంతీయ సమీకరణలు కుదరకపోవడంతో ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. కొన్ని జిల్లాల్లో సమీకరణలను బట్టి రెండు పదవులను కూడా ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక ప్రధాన కార్యదర్శి పదవులకు కూడా ఇదే సూత్రాన్ని వర్తింపజేయనున్నారు. ప్రస్తుతమున్న 33 జిల్లాలకు జిల్లాకో ప్రధాన కార్యదర్శిని నియమించాలని అనుకున్నా ఉపా«ధ్యక్షుల తరహాలోనే ఉమ్మడి జిల్లాకు ఒకటి లేదా అవసరాన్ని బట్టి రెండు పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. సీనియర్ వైస్ లేనట్లే..గతంలో ఉన్న సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హోదా ఈసారి ఉండదని, ఆ హోదాలో ఉన్న ఎంఆర్జీ వినోద్‌రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులను ముఖ్యమైన కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమిస్తారని తెలుస్తోంది. అధికార ప్రతినిధుల విషయానికి వస్తే గతంలో కాకుండా 10 మంది వరకే పరిమితం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ జాబితాలో ఈసారి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉండే అవకాశముందని అంటున్నారు. కాగా పీసీసీ కార్యవర్గాన్ని ఏఐసీసీ త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రచార కమిటీ చైర్మన్ నియామకం ఇప్పుడా.. తర్వాతా?పీసీసీ అధ్యక్షుడిగా బీసీ ఉన్నందున ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి టీపీసీసీలో కీలకమైన ప్రచార కమిటీ చైర్మన్ పోస్టు ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో రేవంత్‌రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీసీ వర్గాలకు చెందిన మధుయాష్కీ గౌడ్‌ను ఈ పదవిలో నియమించారు. ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన మహేశ్‌గౌడ్ పీసీసీ అ«ధ్యక్షుడిగా ఉన్నందున యాష్కీకి సముచిత పదవి ఇచ్చి ప్రచార కమిటీ చైర్మన్ స్థానాన్ని రెడ్డి సామాజిక వర్గానికి అప్పగిస్తారని అంటున్నారు. ఈ పోస్టు రేసులో మొదటి నుంచి ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి పేరు మాత్రమే వినిపిస్తుండడం గమనార్హం. అయితే ఈ పదవిని ఇప్పుడే భర్తీ చేయాలా? లేక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతా అన్న విషయంలో అధిష్టానం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. -
హిమాచల్ కాంగ్రెస్ సంచలన నిర్ణయం
షిమ్లా: కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. హిమాచల్‌లో పీసీసీ యూనిట్‌తో పాటు జిల్లా, బ్లాక్ కమిటీలు రద్దు చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘హిమాచల్ ప్రదేశ్ పీసీసీ యూనిట్, జిల్లా అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలను రద్దు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఈ ప్రతిపాదనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది’ అని ప్రకటనలో తెలిపారు. Congress dissolved the entire state unit of the PCC, District Presidents and Block Congress Committees of Himachal Pradesh Congress Committee, with immediate effect. pic.twitter.com/zfXcnb2S2o— ANI (@ANI) November 6, 2024కాంగ్రెస్ యూనిట్ రద్దు అనంతరం హిమాచల్ మంత్రి అనిరుధ్ సింగ్ మాట్లాడుతూ.. త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్‌ని నియమిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌లో ఇది సాధారణ చర్యగా పేర్కొన్నారు. పీసీసీ, డీసీసీ, బ్లాక్ యూనిట్ల పదవీకాలం ముగిసినందున వాటిని రద్దు చేయాలనేది హిమాచల్ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.కాగా ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేసి, కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించాలని కోరుతూ ఇటీవల హిమాచల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ పార్టీ హైకమాండ్‌కు లేఖ రాశారు. దీని ద్వారా కొత్త కమిటీలలో క్రియాశీల సభ్యులకు ప్రాధాన్యత లభిస్తుందని ఆమె తెలిపారు. దీనిపై ఆమె సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖుతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. -
ఆ ఇద్దరిలో ఒక్కరికి పీసీసీ చీఫ్ పదవి
-
ఎన్నికల ఎఫెక్ట్: ఒడిశా పీసీసీ రద్దు
భువనేశ్వర్: లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫలితాలు వైఫల్యంపై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ( ఒడిశా పీసీసీ)ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రద్దుచేశారు. ఒడిశా అధ్యక్షుడితో సహా మొత్తం పీసీసీని రద్దు చేయాలన్న ప్రతిపాదనను ప్రెసెడెంట్ ఖర్గే ఆదివారం ఆమోదం తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు, పీసీసీ, ఆఫీసు బేరర్లు, ఎగ్జిక్యూటీవ్ కమిటీ, జిల్లా, బ్లాక్, మండల్ కాంగ్రెస్ కమిటి, ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు, పలు విభాగాలు, సెల్స్‌ను రద్దుచేసినట్లు అధ్యక్షుడు ఖర్గే ఒక ప్రకటనలో వెల్లడించారు.తిరిగి పీసీసీని ఎంపిక చేసే వరకు డీసీసీ ప్రెసిడెంట్లను పీసీపీ ప్రెసిండెంట్లుగా నియమిస్తున్నట్లు తెలిపారు. రద్దు అయిన ఒడిశా పీసీసీకి ఇప్పటివరకు ప్రెసిడెంట్‌గా సరత్ పాట్నాయన్ పనిచేశారు.ఒడిశాలో మొత్తం 21 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ కేవలం 1 స్థానంలో మాత్రమే గెలుపొంది. బీజేపీ 20 స్థానాల్లో విజయం సాధించింది. ఇక.. బీజేడీ ఖాతా తెరవలేదు. పార్లమెంట్‌తో పాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మూడోస్థానాకి పరిమితమైంది. మొత్తం147 సీట్లు ఉన్న ఒడిశాలో కాంగ్రెస్ పార్టీ కేవలం 14 సీట్లకే పరిమితమైంది. ఇక్కడ బీజేడీ ప్రభుత్వం దించేసిన బీజేపీ 78 స్థానాల్లో విజయం సాధించింది. బీజేడీ 51 స్థానాలను గెలుచుకొని రెండో స్థానంతో నిలిచింది. -
తెలంగాణ కేబినెట్ విస్తరణపై మంత్రి దామోదర కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణపై మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందన్న దామోదర.. శాఖల మార్పులు, చేర్పులు తప్పక ఉంటాయన్నారు. ఈ కేబినెట్ విస్తరణలో సీతక్కకు హోంమంత్రి పదవి దక్కే చాన్స్ ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇక దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రి దక్కే చాన్స్ ఉందన్నారు. -
‘కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజు’
సాక్షి, హైదరాబాద్: తాను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) పదవి అడగడం కొత్త కాదని.. అవకాశం వచ్చిన ప్రతి సారి తాను అడుగుతానని కాంగ్రెస్ నేత జాగ్గారెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పీసీసీ అవకాశం ఇస్తే ఓకే. రెడ్డిలలో ఎవరికైనా అవకాశం ఇస్తే ఆ పోటీ పడే లిస్ట్‌లో నేను ఉంటాను. రాహుల్ గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ అధికారం కోసం ఎప్పుడు అడ్డదారులు తొక్కలేదు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం. బీజేపీ పదవుల కోసమే ఏర్పడ్డ పార్టీ. రాజ్యాంగం తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. విషయ అవగాహన లేని మంత్రి కిషన్ రెడ్డి. ఆర్థిక వనరుల సమీకరణ, బతుకు తెరువు కోసం పీకే సర్వే సంస్థ ఏర్పాటు చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాదిగలు. మాదిగలు అంటేనే కాంగ్రెస్ పార్టీ. దామోదర రాజనర్సింహకు, మీరా కుమార్‌కు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీకి లాభం చేకూర్చేలా మంద కృష్ణమాదిగ మాట్లాడుతున్నారు. వర్షాకాలంలో వర్షాలు పడుతాయి. ఎండ కాలంలో వర్షాలు పడవు. కనీసం బుద్ధి లేకుండా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. నేను ఒక కాంగ్రెస్ అభిమానిగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా ఆయన రాజే. కేసీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. మా వంద రోజుల పాలన గురించి మమ్మలని అడగకండి. ఆర్టీసి బస్సులలో ప్రయాణం చేసే మహిళలను అడగండి వాళ్ళు చెపుతారు. ఫిరాయింపుల మీద నేను మాట్లాడలేను. నేను కూడా రెండు సార్లు పార్టీ మారాను. పదవుల కోసం నేను కక్కుర్తి పడను’అని జగ్గారెడ్డి అన్నాఉ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ ఉందని, రాజ పూజ్యం 16, అవమానం 2 ఉందని తెలపారు. -
39 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన తొలి జాబితాను విడుదల చేసింది. శుక్రవారం సాయంత్రం ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో 39 మంది పేర్లతో కూడిన జాబితాను ప్రకటించారు. ఈ 39 మందిలో రాహుల్ గాంధీ, శశిథరూర్‌లాంటి కీలక నేతలు ఉన్నారు. తొలి జాబితాలో ఉన్న 39మందిలో 15మంది జనరల్.. 24 మంది ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మైనార్టీ కేటగిరీకి చెందినవారు ఉన్నట్లు వేణుగోపాల్ తెలిపారు. 12 మంది అభ్యర్థులు 50 ఏళ్లు లోపువారేనన్నారు. ఆ పార్టీ కీలక నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే పోటీ చేయబోతున్నారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్‌ను.. రాజ్‌నంద్‌గావ్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించబోతోంది కాంగ్రెస్. అలాగే కన్నడ హీరో శివరాజ్ కుమార్ భార్య గీతకు శివమొగ్గ టికెట్‌ను కేటాయించింది ఏఐసీసీ. కిందటి ఏడాదే ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఈ నెల 11వ తేదీన మరోసారి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. మిగిలిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీపీ నేత సోనియాగాంధీ, కేసీ వేణుగోపాల్‌ల నేతృత్వంలో పార్టీ ‘కేంద్ర ఎన్నికల కమిటీ’ సమావేశమై తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, హర్యానా, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపుర్ రాష్ట్రాల్లోని అభ్యర్థులను ఖరారుచేసే అంశంపై కసరత్తు చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌మున్షీతోపాటు పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేశ్, అధీర్‌రంజన్ చౌధరి, అంబికాసోని, ముకుల్‌వాస్నిక్, టీఎం సింగ్‌దేవ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ వర్చువల్‌గా హాజరయ్యారు. తెలంగాణకు నాలుగు.. ఇక తెలంగాణలో నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి నల్లగొండ నుంచి కందూరు రఘువీర్‌రెడ్డి, జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కార్, మహబూబ్‌నగర్ నుంచి చల్లా వంశీ చంద్ రెడ్డి, మహబూబాబాద్ బలరామ్ నాయక్ పేర్లు ఉన్నాయి. అంతకు ముందు కాంగ్రెస్ సీఈసీ నుంచి వచ్చిన జాబితాలో చేవెళ్ల అభ్యర్థిగా సునీతా మహేందర్‌రెడ్డి ఉన్నప్పటికీ.. తుది జాబితాలో ఆ స్థానం అభ్యర్థి పేరును ప్రకటించకపోవడం గమనార్హం. 39 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా -
ఇక అంతా అధిష్టానం చేతుల్లోనే!
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఢిల్లీకి చేరింది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక దఫాలుగా చర్చలు జరిపిన స్క్రీనింగ్ కమిటీ ఇప్పుడు దేశ రాజధాని హస్తినలో అభ్యర్థుల వడపోతపై దృష్టి సారించింది. ఏఐసీసీ కార్యాలయంలో రెండురోజులపాటు సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. ఇదే చివరి భేటీ కాగా.. ఆ తర్వాతి బంతి హైకమాండ్ కోర్టుకు చేరుతుంది. దీంతో.. టీ కాంగ్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ రూపొందించిన జాబితా ఆధారంగా.. స్క్రీనింగ్ కమిటీ తొలుత ఈనెల ఆరో తేదీన హైదరాబాదులో సమావేశమైంది. వరుసగా పీఈసీ సభ్యులను, డీసీసీ అధ్యక్షులను, మాజీ మంత్రుల అభిప్రాయాలు తీసుకుంది. అయితే సమయం సరిపోక మరోసారి భేటీ అవ్వాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇప్పుడు హస్తినలో భేటీ అయింది. స్క్రీనింగ్ కమిటీలో ఛైర్మన్ మురళీధరన్ ,జిగ్నేష్ మేవాని, సిద్దిఖీ ,ఎక్స్ అఫిషియో సభ్యులు ఇంఛార్జి ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఉన్నారు. ఏకాభిప్రాయం కుదిరితే 25 నుంచి 30 సీట్లలో అభ్యర్థుల ఖరారు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు అభ్యర్థులున్న చోట మరోసారి స్క్రీనింగ్ కమిటీ దృష్టి పెట్టాలని భావిస్తోంది.ఈ నెలాఖరుకల్లా అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తిచేయాలని లక్ష్యం తో ముందుకు వెళ్తుంది. దాదాపు.. 35 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి దశలో ఉండే నియోజకవర్గాలు..(అంచనా) 1. కొడంగల్ - రేవంత్ రెడ్డి, 2. హుజూర్ నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి, 3.కోదాడ - పద్మావతి , 4. మధిర - భట్టి విక్రమార్క , 5. మంథని - శ్రీధర్ బాబు , 6. జగిత్యాల - జీవన్ రెడ్డి , 7. ములుగు - సీతక్క , 8. భద్రాచలం - పొడెం వీరయ్య, 9. సంగారెడ్డి - జగ్గారెడ్డి , 10. నల్గొండ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 11. అలంపూర్ - సంపత్ కుమార్, 12. నాగార్జునసాగర్ కుందూరు జైవీర్ రెడ్డి , 13. కామారెడ్డి - షబ్బీర్ అలీ , 14. పాలేరు - తుమ్మల నాగేశ్వరరావు , 15. కొత్తగూడెం - పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 16. పరిగి - రామ్మోహన్ రెడ్డి, 17. వికారాబాద్ - గడ్డం ప్రసాద్ కుమార్, 18. మహేశ్వరం - చిగురింత పారిజాత, 19. ఆలేరు - బీర్ల ఐలయ్య, 20. ఖైరతాబాద్ - రోహిన్ రెడ్డి, 21. దేవరకొండ - వడ్త్య రమేష్ నాయక్, 22. వేముల వాడ - ఆది శ్రీనివాస్, 23. ధర్మపురి - లక్ష్మణ్ , 24. జడ్చర్ల - అనిరుద్ రెడ్డి, 25. హుజూరాబాద్ - బల్మూర్ వెంకట్ , 26. నాంపల్లి - ఫిరోజ్ ఖాన్, 27. కోరుట్ల- జువ్వాడి నర్సింగ్ రావు, 28.అచ్చంపేట - వంశీకృష్ణ, 29 జహీరాబాద్ - ఏ. చంద్రశేఖర్ , 30. ఆందోల్ - దామోదర రాజనర్సింహ, 31.మంచిర్యాల - ప్రేమ్ సాగర్ రావు, 32. కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు , 33. ఆదిలాబాద్ - కంది శ్రీనివాస్ రెడ్డి, 34. వరంగల్ ఈస్ట్ - కొండా సురేఖ, 35. భూపాల పల్లి - గండ్ర సత్యనారాయణ హైకమాండ్‌ను ఓ నివేదిక ఇచ్చేయాలని.. కాంగ్రెస్ అధిష్టానానికి నివేదిక ఇచ్చే ఉద్దేశంతో ఉన్న స్క్రీనింగ్ కమిటీ.. కంటిన్యూగా మీటింగ్ నిర్వహిస్తోంది. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ ఉన్న నియోజకవర్గాలపై ఈ భేటీల్లో ఫోకస్ చేసినట్లు స్పష్టం అవుతోంది. అలాగే.. డిస్టబెన్స్ ఉన్న నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు పేర్లతో కూడిన నివేదిక ను సిద్ధం చేయనుంది. దాదాపు 70 సెగ్మెంట్ లలో ఇలాంటి పరిస్థితి చోటుచేసుకోవడంతో.. నివేదికను హైకమాండ్‌కు అందించి భారం దింపేసుకోవాలనే ఆలోచనతో ఉంది స్క్రీనింగ్ కమిటీ. కాంగ్రెస్ లో రెండు నుంచి మూడు అభ్యర్థులు పోటీ పడే నియోజకవర్గాలు.. 1.వనపర్తి - చిన్నారెడ్డి/మెఘారెడ్డి/ శివసేన రెడ్డి 2. అంబర్ పేట - నూతి శ్రీకాంత్ గౌడ్ / మోతా రోహిత్ / లక్ష్మణ్ యాదవ్, 3.మహబూబాబాద్ - బలరాం నాయక్/ మరళీ నాయక్ /బెల్లయ్య నాయక్ , 4.జనగామ - పొన్నాల లక్ష్మయ్య/ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి/ మొగుళ్ళ రాజిరెడ్డి 5.షాద్ నగర్ - ఈర్లపల్లి శంకర్/ ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్, 6 . వైరా - పి.నాగేశ్వర్ రావు/బానోతు విజయ్ భాయి, 7. నిజామాబాద్ అర్బన్ - మహేష్ కుమార్ గౌడ్ / ఎర్రావత్రి అనిల్, 8.వరంగల్ వెస్ట్ - నాయిని రాజేందర్ రెడ్డి/ జంగా రాఘవ రెడ్డి, 9.స్టేషన్ ఘన్ పూర్ - ఇందిరా/ దొమ్మటీ సాంబయ్య , 10.మునుగోడు - పున్న కైలాష్ నేత/పాల్వాయి స్రవంతి, 11.ఎల్బీ నగర్ - మధుయాష్కీ/ మల్ రెడ్డి రాంరెడ్డి, 12.కల్వకుర్తి - వంశీచంద్ రెడ్డి/ రాఘవేందర్ రెడ్డి, 13.ఆశ్వరావు పేట్ - తాటి వెంకటేశ్వర్లు/సున్నం నాగమణి, 14.ఎల్లారెడ్డి - సుభాష్ రెడ్డి/ మధన్ మోహన్ రావు, 15.జూబ్లీహిల్స్ - విష్ణు వర్దన్ రెడ్డి/ అజారుద్దీన్, 16. సూర్యాపేట - దామోదర్ రెడ్డి/ పటేల్ రమేష్ రెడ్డి, 17. మిర్యాలగూడ - రఘువీర్ రెడ్డి/ బి. లక్ష్మారెడ్డి, 18. దేవరకద్ర - ప్రదీప్ గౌడ్ / జీఎంఆర్ , 19. మక్తల్ - శ్రీహరి / నాగరాజు గౌడ్ /కొత్తకోట సిద్ధార్థ రెడ్డి, 20. గద్వాల - సరితా తిరుపతయ్య / రాజీవ్ రెడ్డి, 21. నాగర్ కర్నూల్ - కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి / నాగం జనార్ధన్ రెడ్డి, 22. మేడ్చల్ - తోటకూర జంగయ్య యాదవ్ / హరివర్ధన్ రెడ్డి, 23. ఉప్పల్ - రాగిడి లక్ష్మారెడ్డి / సోమశేఖర్ రెడ్డి / పరమేశ్వర రెడ్డి , 24. కుద్బుల్లాపూర్ - భూపతిరెడ్డి నర్సారెడ్డి / కొలను హన్మంతు రెడ్డి, 25. ముషీరాబాద్ - అంజన్ కుమార్ యాదవ్ / సంగిశెట్టి జగదీశ్వర్ రావు, 26. మలక్ పేట్ - చెక్లోకర్ శ్రీనివాస్ / అశ్వక్ , 27. గోషామహల్ - మెట్టు సాయికుమార్ / ప్రేమ్ లాల్ /ఆనంద్ రావు , 28. సనత్ నగర్ - కోటా నీలిమ / మర్రి ఆదిత్య రెడ్డి , 29. శేర్లింగంపల్లి - జర్పెటీ జైపాల్ / రఘునాథ్ యాదవ్/సత్యనారాయణ రావు , 30. తుంగతుర్తి - అద్దంకి దయాకర్ / జ్ఞానసుందర్ / ప్రీతం , 31. డోర్నకల్ - రామచంద్ర నాయక్ / నెహ్రూ నాయక్, 32. నారాయణ్ ఖేడ్ - సురేష్ శట్కర్ / సంజీవరెడ్డి, 33. కూకట్ పల్లి - శ్రీరంగం సత్యం / వెంగల్ రావు, 34. ముదోల్ - ఆనంద్ రావు షండే/పత్తిరెడ్డి విజయ్ కుమార్ , 35. సత్తుపల్లి - సంబాని చంద్రశేఖర్ / మానవతా రాయ్, 36. బోద్ - శివాలాల్ రాథోడ్ / నరేష్ జాదవ్ , 37. బెల్లంపల్లి - గడ్డం వినోద్ కుమార్ / దుర్గం భాస్కర్, 38. ఇల్లందు - కోరం కనకయ్య / ప్రవీణ్ నాయక్, 39.చొప్పదండి - మేడిపల్లి సత్యం/జిల్లెల భానుప్రియ, 40. నారాయణ్ పేట్ - ఎర్ర శేఖర్ /శివకుమార్ రెడ్డి, 41. ఆసీఫాబాద్ - విశ్వప్రసాద్ / గణేష్ రాథోడ్, 42. రామగుండం - రాజ్ ఠాకూర్ / హర్కల వేణుగోపాల్ రావు /జనక్ ప్రసాద్, 43. నర్సాపూర్ - గాలి అనిల్ కుమార్ / రాజి రెడ్డి, 44. గజ్వేల్ - నర్సారెడ్డి / బండారు శ్రీకాంత్ రావు , 45. నిర్మల్ - శ్రీహరి రావు / పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి , 46. భువనగిరి - జిట్టా బాలకృష్ణ రెడ్డి/చెవిటి వెంకన్న యాదవ్, 47. పెద్దపల్లి - విజయ రమణా రావు / గంటా రాములు యాదవ్/ఈర్ల కొమురయ్య, 48. నర్సంపేట -దొంతి మాధవరెడ్డి / మేకల వీరన్న యాదవ్, 49. పాలకుర్తి - ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి/ఝాన్సీ రెడ్డి, 50. మహబూబ్ నగర్ - యెన్నం శ్రీనివాసరెడ్డి/ఒబెదుల్లా కొత్వాల్/ఎంపి.వెంకటేష్, 51. ఇబ్రహీంపట్నం - మల్ రెడ్డి రంగారెడ్డి /దండెం రాంరెడ్డి, 52. కరీంనగర్ - రోహిత్ రావు / కొత్త జైపాల్ రెడ్డి/రమ్యా రావు / కొనగాల మహేష్ , 53. సిద్దిపేట - భవానీ రెడ్డి / పూజల హరికృష్ణ /శ్రీనివాస్ గౌడ్ , 54. ఖానాపూర్ - బొజ్జు/ భారత్ చౌహాన్ / చారులతా రాథోడ్, 55. ఆర్మూర్ - గోర్త రాజేందర్ / వినయ్ కుమార్ రెడ్డి , 56. బాల్కొండ - సునీల్ రెడ్డి / బాణాల మోహన్ రెడ్డి / అన్వేష్ రెడ్డి, 57. రాజేంద్రనగర్ - గౌరీ సతీష్ /ముంగి జైపాల్ రెడ్డి /నరేందర్ ముదిరాజ్, 58. హుస్నాబాద్ - పొన్నం ప్రభాకర్/ ప్రవీణ్ రెడ్డి, 59. తాండూర్ - రఘువీర్ రెడ్డి/కేఎల్ఆర్, 60. చెన్నూర్ - డాక్టర్ శ్రీనివాస్/నల్లాల ఓదెలు/బోడ జనార్థన్, 61.నిజామాబాద్ రూరల్ - అరికెల నర్సారెడ్డి / భూపతి రెడ్డి , 62. పినపాక - దనసరి సూర్యం/పాయం వెంకటేశ్వర్లు, 63. వర్ధన్నపేట - సిరిసిల్ల రాజయ్య/కేఆర్.నాగరాజు/పరంజ్యోతి, 64. జుక్కల్ - గంగారాం/గైక్వాడ్ విద్య/అయ్యాల సంతోష్, 65. బాస్నువాడ - కాసుల బాలరాజు/అనిల్ కుమార్ రెడ్డి, 66. సిరిసిల్ల - కేకే.మహేందర్ రెడ్డి/సంగీతం శ్రీనివాస్, 67. దుబ్బాక - కత్తి కార్తీక/చెరుకు శ్రీనివాస్ రెడ్డి, 68. మల్కాజ్ గిరి - నందికంటి శ్రీధర్/అన్నే వెంకట సత్యనారాయణ/సురేష్ యాదవ్, 69. చేవెళ్ల - షాబాద్ దర్శన్/భీమ్ భారత్/రాచమల్ల సిద్దేశ్వర్/సులోచనమ్మ, 70. కంటోన్మెంట్ - పిడమర్తి/ బొల్లు కిషన్ అభ్యర్థుల ఎంపిక పై టీ పీసీసీస్థాయిలో ఇదే చివరి భేటీ.. ఇక అభ్యర్థులను ప్రకటించే పూర్తి బాధ్యత హైకమాండే. దీంతో కీలక నేతలంతా తమకు అనుకూలంగా ఉండేవాళ్లకు టిక్కెట్ ఇప్పించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనెలాఖరులో మొదటి లిస్ట్ ,వచ్చే నెల రెండో వారంలో రెండో లిస్ట్ ప్రకటించే అవకాశం ఉందని హస్తం శ్రేణులు భావిస్తున్నాయి. -
పీసీసీ సర్వే.. ట్విట్టర్లో విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: పీసీసీ సర్వే ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్ 45, కాంగ్రెస్ 45, బీజేపీ 7, ఎంఐఎం 7 , మిగిలిన 15 సీట్లులలో త్రీవ్రమైన పోటీ... ఆ సర్వే నమ్మాలంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలిచే ఆ సీట్లు ఏవో కూడా పీసీసీ తెలియజేస్తే ప్రజలకు అర్థం అయ్యే అవకాశం ఉంది.. లేదంటే జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఎన్నికలలో వచ్చిన ఫలితాల దృష్ట్యా (పోయిన కాంగ్రెస్ డిపాజిట్స్), ఆ సర్వే ఆసమంజసమైన అంశంగా అందరు అనుకునే అవకాశమున్నది. అంటూ పీసీసీ సర్వే పై కాషాయ పార్టీ నేత విజయశాంతి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు. -
పీసీసీ కమిటీలు నేను పట్టించుకోను : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
-
తెలంగాణ పీసీసీలో విభేదాలపై నజర్.. రంగంలోకి ప్రియాంక!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీలో విభేదాల పరిష్కారానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగనున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ సీనియర్ల మధ్య విభేదాల పరిష్కారం దిశగా నేతల మధ్య సమన్వయం కోసం వారితో చర్చించనున్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిశాక ఈ నెల 23 తర్వాత ఈ భేటీ ఉంటుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ కమిటీలపై సీనియర్లు బహిరంగంగానే విమర్శలు చేయడం, పీసీసీ కమిటీ సమావేశాలకు హాజరు కాకపోవడం తదితర అంశాలపై ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావెద్, రోహిత్ చౌదరి ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకలకు సమాచారం పంపారు. ఈ వివాదం మరింత ముదరకముందే నష్ట నివారణ చర్యలకై నదీమ్‌ను ఏఐసీసీ రంగంలోకి దించినా అది ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కమిటీ భేటీలకు రావాలని కోరినా సీనియర్లు ఎవరూ స్పందించకుండా భేటీకి డుమ్మాకొట్టారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలను ప్రియాంకాగాంధీకి అప్డేట్ చేశారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచే అవకాశాలకు తావివ్వొద్దని, కొద్దిరోజులు అంతా మౌనం పాటించేలా చూడాలని ఆమె కోరినట్లుగా తెలుస్తోంది. కాగా పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే అసమ్మతి అంశంపై భేటీలు నిర్వహించాలని అటు ఖర్గే, ఇటు ప్రియాంకలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి నేరుగా హైదరాబాద్‌కే వెళ్లి పీసీసీ, సీనియర్లతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ప్రియాంక ఈ విషయమై మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు చెబుతున్నా, ఉత్తమ్ సన్నిహితులు మాత్రం కొట్టిపారేశారు. ప్రియాంక నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని వారు స్పష్టం చేశారు. చదవండి: రేవంత్‌ను విమర్శిస్తే ఊరుకోం -
టీపీసీసీ ‘జంబో జట్టు’
సాక్షి, న్యూఢిల్లీ: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ పీసీసీ కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో కార్యవర్గాన్ని ఎంపిక చేసింది. అన్ని సామాజిక వర్గాలను సమతుల్యం చేస్తూ.. జంబో జట్టును ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. ఇందులో 24 మంది ఉపాధ్యక్షులు, 84 మంది ప్రధాన కార్యదర్శులు ఉండగా, 26 జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. వీరితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ అ«ధ్యక్షతన ఏర్పాటు చేసిన రాజకీయ వ్యవహారాల కమిటీలో 17 మంది సభ్యులు, నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. అంతేగాక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా 40 మందితో ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏఐసీసీ ఏర్పాటు చేసింది. ఇదీ జాబితా.. రాజకీయ వ్యవహారాల కమిటీ(22) : మాణిక్యం ఠాగూర్ (చైర్మన్), రేవంత్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, వి.హనుమంత రావు, పొన్నాల లక్ష్మయ్య, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కె.జానారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, జె.గీతారెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్, దామోదర సి. రాజనరసింహ, రేణుకా చౌదరి, పి.బలరాం నాయక్, మధుయాష్కీ గౌడ్, చిన్నారెడ్డి, శ్రీధర్‌బాబు, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్. అలాగే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న ఎండీ అజారుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్ రాజకీయ వ్యవహారాల కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (40) .. రేవంత్‌రెడ్డి (చైర్మన్), మల్లు భట్టివిక్రమార్క, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కె.జానారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, జె.గీతారెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్, దామోదర రాజనరసింహ, రేణుకా చౌదరి, పి.బలరాం నాయక్, మధుయాష్కీ గౌడ్, డి.శ్రీధర్‌బాబు, జి.చిన్నారెడ్డి, చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎ.సంపత్ కుమార్, పి. సుదర్శన్‌రెడ్డి, ఆర్.దామోదర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్, నాగం జనార్దన్‌రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, సి.రామచంద్రారెడ్డి, కొండా సురేఖ, జి.వినోద్, మహమ్మద్ అజారుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్ గౌడ్, డి.సీతక్క, పొదెం వీరయ్య, ఎ.మహేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, కోదండరెడ్డి, ఈరవత్రి అనిల్‌కుమార్, వేం నరేందర్‌రెడ్డి, మల్లు రవి, సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని. టీపీసీసీ ఉపాధ్యక్షులు (24) .. పద్మావతిరెడ్డి, బండారు శోభా భాస్కర్, కొండ్ర పుష్పలీల, నేరెళ్ల శారదాగౌడ్, సీహెచ్.విజయ రమణారావు, చామల కిరణ్‌రెడ్డి, చెరుకు సుధాకర్‌గౌడ్, దొమ్మటి సాంబయ్య, శ్రవణ్‌కుమార్ రెడ్డి, ఎర్ర శేఖర్, జి.వినోద్, గాలి అనిల్‌కుమార్, హర్కర వేణుగోపాల్‌రావు, జగదీశ్వరరావు, మదన్మోహన్రావు, మల్రెడ్డి రంగారెడ్డి, ఎంఆర్జీ వినోద్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, పొట్ల నాగేశ్వరరావు, రాములు నాయక్, సంజీవరెడ్డి, సిరిసిల్ల రాజయ్య, టి.వజ్రేశ్ యాదవ్, తాహెర్‌బిన్ హందాని. టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు (84) .. మధుసూదన్‌రెడ్డి, అద్దంకి దయాకర్, బి.కైలాశ్‌కుమార్, బి.సుభాష్‌రెడ్డి, భానుప్రకాశ్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, భూపతిగల్ల మహిపాల్, బొల్లు కిషన్, సీహెచ్. బాల్‌రాజు, చలమల కృష్ణారెడ్డి, చరణ్‌కౌషిక్ యాదవ్, చారుకొండ వెంకటేశ్, చేర్యాల ఆంజనేయులు, చిలుక మధుసూదన్‌రెడ్డి, చిలుక విజయ్‌కుమార్, చిట్ల సత్యనారాయణ, దారాసింగ్ తాండూర్, సుధాకర్ యాదవ్, దుర్గం భాస్కర్, ఈ.కొమురయ్య, ఎడవల్లి కృష్ణ, ఫక్రుద్దీన్, ఫిరోజ్‌ఖాన్, గడుగు గంగాధర్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, గోమాస శ్రీనివాస్, గౌరీ శంకర్, జానంపల్లి అనిరుధ్‌రెడ్డి, జెరిపేటి జయపాల్, కె.నాగేశ్వరరెడ్డి, కైలాష్ నేత, కాటం ప్రదీప్‌కుమార్ గౌడ్, కొండేటి మల్లయ్య, కోటంరెడ్డి వినయ్‌రెడ్డి, కోటూరి మానవతారాయ్, కుందూరు రఘువీరారెడ్డి, ఎం.నాగేశ్ ముదిరాజ్, ఎం.వేణుగౌడ్, ఎం.ఎ. ఫహీం, మొగల్‌గుండ్ల జయపాల్‌రెడ్డి, మహ్మద్ అబ్దుల్ ఫహీం, ఎన్.బాలు నాయక్, నర్సారెడ్డి భూపతిరెడ్డి, నూతి సత్యనారాయణ, పి.హరికృష్ణ, పి.ప్రమోద్ కుమార్, పి.రఘువీర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి, పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, ప్రేమ్‌లాల్, ఆర్.లక్ష్మణ్ యాదవ్, నర్సాపూర్ రాజిరెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, రంగినేని అభిలాశ్‌రావు, రంగు బాలలక్ష్మిగౌడ్, రాపోలు జయప్రకాశ్, ఎస్.ఎ. వినోద్‌కుమార్, సంజీవ ముదిరాజ్, సత్తు మల్లేశ్, సొంటిరెడ్డి పున్నారెడ్డి, శ్రీనివాస్ చెక్లోకర్, తాటి వెంకటేశ్వర్లు, వల్లె నారాయణరెడ్డి, వెడ్మ భొజ్జు, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, జహీర్ లలాని, భీమగాని సౌజన్యగౌడ్, లకావత్ ధన్వంతి, ఎర్రబెల్లి స్వర్ణ, గండ్ర సుజాత, గోగుల సరిత వెంకటేశ్, జువ్వాడి ఇంద్రారావు, కందాడి జ్యోత్స్న శివారెడ్డి, కోట నీలిమ, మందుముల్ల రజితారెడ్డి, మర్సుకోల సరస్వతి, పి.విజయారెడ్డి, పారిజాత నర్సింహారెడ్డి, కుచన రవళిరెడ్డి, శశికళా యాదవ్, సింగారపు ఇందిర, ఉజ్మా షకీర్ జిల్లా అధ్యక్షులు (26) : సాజిద్ ఖాన్ (ఆదిలాబాద్), పొదెం వీరయ్య (భద్రాద్రి కొత్తగూడెం), ఎన్.రాజేందర్‌రెడ్డి(హనుమకొండ), వలీయుల్లా సమీర్ (హైదరాబాద్), ఎ.లక్ష్మణ్ కుమార్ (జగిత్యాల). పటేల్ ప్రభాకర్‌రెడ్డి (జోగుళాంబ గద్వాల), కైలాశ్ శ్రీనివాస్‌రావు (కామారెడ్డి), కె.సత్యనారాయణ (కరీంనగర్), రోహిన్‌రెడ్డి (ఖైరతాబాద్), జె.భరత్‌చంద్రారెడ్డి(మహబూబాబాద్), జి.మధుసూదన్‌రెడ్డి (మహబూబ్‌నగర్), కె.సురేఖ (మంచిర్యాల), టి.తిరుపతిరెడ్డి (మెదక్), నందికంటి శ్రీధర్ (మేడ్చల్ మల్కాజ్గిరి), ఎన్.కుమారస్వామి (ములుగు), సి.వంశీకృష్ణ (నాగర్‌కర్నూల్), టి.శంకర్‌నాయక్(నల్లగొండ), శ్రీహరి ముదిరాజ్ (నారాయణపేట), ప్రభాకర్‌రెడ్డి (నిర్మల్), మానాల మోహన్‌రెడ్డి (నిజామాబాద్), ఎం.ఎస్. రాజ్‌ఠాకూర్ (పెద్దపల్లి), ఆది శ్రీనివాస్ (రాజన్న సిరిసిల్ల), టి.నర్సారెడ్డి (సిద్దిపేట), టి.రామ్మోహన్‌రెడ్డి (వికారాబాద్), ఎం.రాజేంద్రప్రసాద్ యాదవ్ (వనపర్తి), కె.అనిల్‌కుమార్ రెడ్డి (యాదాద్రి భువనగిరి) -
RPO Hyderabad: పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీకి కొత్త విధానం
మోర్తాడ్ (బాల్కొండ): విదేశాలకు వెళ్లేవారికి అవసరమయ్యే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ)ల జారీకి హైదరాబాద్‌లోని రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పాస్‌పోర్టు సేవా కేంద్రాలతో పాటు తపాలా శాఖ ప్రధాన కార్యాలయాల ద్వారా వీటిని జారీ చేయాలని నిర్ణయించింది. గతంలో పీసీసీల కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని విదేశాంగ శాఖ ఆధ్వర్యంలోని పాస్‌పోర్టు కార్యాలయాల్లో అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉండేది. అయితే పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో కొత్త పాస్‌పోర్టులు, పాత పాస్‌పోర్టుల రెన్యువల్ల కోసం క్యూ కట్టే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఫలితంగా ఈ కేంద్రాల్లో రద్దీ కారణంగా పీసీసీల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సౌదీ, కువైట్ దేశాలలో ఉపాధి, ఇతర దేశాల్లో చదువు కోసం వెళ్లేవారికి పీసీసీలు తప్పనిసరి కావడంతో ఆన్లైన్లో స్లాట్‌ను బుక్ చేసుకుని నిర్ణీత సమయంలో రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయాలకు వెళ్తున్నారు. పాస్‌పోర్టు కార్యాలయాల ద్వారా పీసీసీలు పొందాలనుకుంటే స్లాట్ బుకింగ్‌కు నెలకు మించి ఎక్కువ సమయం పడుతోంది. పీసీసీలు సకాలంలో పొందని వారికి వీసాల గడువు ముగిసిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీసీసీల జారీని వేగవంతం చేయడానికి ప్రతి శనివారం పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పని చేసేలా రీజనల్ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య చొరవ తీసుకున్నారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో రెండు వారాల పాటు ‘వాక్ ఇన్ పీసీసీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు.సిబ్బందికి వారంలో ఐదు రోజులే పనిదినాలు ఉన్నాయి. పీసీసీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో శనివారం కూడా పని చేయాల్సి వచ్చింది. తక్కువ సిబ్బంది ఉండడంతో పని భారం ఎక్కువైంది. దీంతో పీసీసీల కోసం శనివారం ప్రత్యేక కౌంటర్లను నిర్వహించడం రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు లేని జిల్లా కేంద్రాలలో ప్రధాన తపాలా కార్యాలయాల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. తపాలా కార్యాలయాల్లో స్లాట్లు.. పోస్టల్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలుగా పని చేస్తున్న ఆదిలాబాద్, వరంగల్, సిద్దిపేట, మెదక్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, భువనగిరిల తపాలా కార్యాలయాల ద్వారా పీసీసీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు స్లాట్లను కేటాయించారు. ఒక్కో పోస్టల్ పాస్‌పోర్టు సేవా కేంద్రం ద్వారా రోజుకు 10 నుంచి 15 పీసీసీల జారీకి స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. తపాలా పాస్‌పోర్టు సేవా కేంద్రాల ద్వారా గతంలో కొత్త పాస్‌పోర్టులను మాత్రమే జారీ చేసేవారు. తాజాగా పీసీసీలకు అనుమతి ఇచ్చారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాలలో పీసీసీల కోసం రద్దీని తగ్గించడానికి రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. (క్లిక్: ‘మూన్ లైటింగ్’ వివాదం: ఐటీ ఆఫీసులకు పాత కళ..) -
Chiranjeevi: ఏపీసీసీ డెలిగేట్‌గా మెగాస్టార్ చిరంజీవి
న్యూఢిల్లీ: మెగాస్టార్ చిరంజీవిని ఏపీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ కొత్త గుర్తింపు కార్డును జారీ చేసింది. కొవ్వూరు నుంచి చిరంజీవి పీసీసీ డెలిగేట్‌గా ఉన్నారు. 2027వరకు చిరంజీవిని పీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కొత్త ఐడీ కార్డు మంజూరు చేసింది. ఈ డెలిగేట్లకు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది. దాదాపు తొమ్మిది వేల మంది డెలిగేట్లు త్వరలో జరగబోయే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. అయితే చిరంజీవి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా.. రాజకీయంగా ఇన్ యాక్టివ్‌గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపసంహరణకు అక్టోబర్ 8వరకు గడువు. ఎన్నికల అనంతరం రెండు రోజుల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. చదవండి: (కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు) -
కాంగ్రెస్‌లో కీలక మార్పులు.. పటోలే, జగ్తాప్ ఔట్?.. చవాన్ ఇన్!
సాక్షి, ముంబై: జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కూడా సమీకరణాలు మారనున్నట్లు వార్తలు రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ బీజేపీలో చేరుతుండవచ్చనే వదంతులు వస్తున్నాయి. దీంతో ఆయన అసంతృప్తిని తొలగించేందుకు ప్రస్తుతం మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న నానా పటోలేను తొలగించి ఆ స్ధానంలో అశోక్ చవాన్‌ను నియమించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే నానా పటోలేకు మొండిచేయి, పీసీసీ అధ్యక్ష పదవి అశోక్ చవాన్‌కు దక్కడం ఖాయమని స్పష్టమవుతోంది. శివసేనపై తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ శిందే దేవేంద్ర ఫడ్నవీస్‌తో జతకట్టి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అసంతృప్తులందరు శిందే, దేవేంద్ర ఫడ్నవీస్‌తో కాంటాక్ట్‌లో ఉన్నారు. అందులో అశోక్ చవాన్ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గణేశోత్సవాల సమయంలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కూడా అశోక్ చవాన్ భేటీ అయ్యారు. దీంతో కొద్ది రోజులుగా వస్తున్న వార్తల్లో వాస్తవముందని పలువురు నేతలు గుర్తించారు. దీంతో ఆయన పార్టీ మారక ముందే అసంతృప్తిని తొలగించి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇదిలాఉండగా చవాన్ బీజేపీలో చేరకుండా నిరోధించాలన్నా, శాశ్వతంగా పార్టీలో కొనసాగాలన్నా, లేదా పార్టీని బలోపేతం చేయాలన్నా ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఈ కోణంలో సీనియర్ పార్టీ శ్రేణులు ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ముంబైలోని తిలక్ భవన్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రదేశ్ ప్రతినిధుల సమావేశానికి మహారాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి హెచ్.కె.పాటిల్, ప్రదేశ్ ఎన్నికల అధికారి పల్లం రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు నానా పటోలేకు వ్యతిరేకంగా అనేక మంది నేతలు, పదాధికారులు ఫిర్యాదులు చేశారు. ఆయన పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన్ని మార్చే అధికారం కాంగ్రెస్ అధ్యక్షునికి అప్పగించారు. దీంతో నానా పటోలేను మార్చాలని అప్పుడు ప్రాథమికంగా నిర్ణయానికొచ్చారు. కానీ సమయం కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అశోక్ చవాన్ అసంతృప్తి వ్యవహారం బయటపడింది. ఆయన బీజేపీలో చేరనున్నట్లు వదంతులు రావడంతో దీన్ని అదనుగా చేసుకుని పటోలేను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి అశోక్ చవాన్‌ను నియమించాలనే అంశం తెరమీదకు వచ్చింది. పీసీసీతోపాటు ముంబై రీజియన్ కాంగ్రెస్ కమిటీ (ఎమ్మార్సీసీ) అధ్యక్ష పదవి నుంచి భాయి జగ్తాప్ను కూడా తొలగించే అవకాశాలున్నాయి. జగ్తాప్ పనితీరుపై కూడా కొందరు అసంతృప్తితో ఉన్నారు. త్వరలో బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకు ముంబైలో ఓ పట్టిష్టమైన నాయకత్వం కావాలి. దీంతో జగ్తాప్ను కూడా ఆ పదవి నుంచి తొలగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ స్ధానంలో ఎవరిని నియమిస్తారనే దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. కానీ ఈ పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై అందరు దృష్టి సారించారు. -
కాంగ్రెస్‌లో భారీ సంస్కరణలు!
న్యూఢిల్లీ: అంతర్గతంగా బలోపేతం కావాలంటే కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా భారీ సంస్కరణలు తప్పనిసరి అని సీనియర్ నేతల్లో అత్యధికులు భావిస్తున్నారు. అత్యున్నత నిర్ణాయక విభాగమైన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మొదలుకుని ఏఐసీసీ, పీసీసీ నుంచి బ్లాక్ స్థాయి దాకా అన్ని కమిటీల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం వారి జనాభాకు అనుగుణంగా బాగా పెరగాలని అభిప్రాయపడుతున్నారు. దాన్ని ఇప్పుడున్న 20 శాతం నుంచి కనీసం 50 శాతానికి పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. వచ్చే వారం రాజస్తాన్‌లో జరగనున్న కాంగ్రెస్ చింతన్ శిబిర్‌లో చర్చించాల్సిన ప్రతిపాదనల ముసాయిదాల తయారీకి ఏర్పాటైన ఏఐసీసీ ప్యానళ్లు ఇదే అభిప్రాయం వెలిబుచ్చాయి. ఈ ప్రతిపాదనలు కార్య రూపం దాల్చాలంటే ఏఐసీసీ ప్యానళ్లతో పాటు సీడబ్ల్యూసీ, చింతన్ శిబిర్ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉంటుంది. చింతన్ శిబిర్ సన్నాహకాల్లో భాగంగా సోమవారం జరిగే సీడబ్ల్యూసీ భేటీలో వీటిని సమర్పించనున్నారు. పదవులనూ తగ్గించాలి ఏఐసీసీలోనూ, పీసీసీల్లోనూ అన్ని విభాగాల్లో పదవులను కనీస స్థాయికి తగ్గించాలని సంస్థాగత వ్యవహారాల కమిటీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం సంఖ్యపై గరిష్ట పరిమితి విధించాలని పేర్కొన్నట్టు చెప్తున్నారు. ‘‘ఉదాహరణకు ఏఐసీసీలో 100 మందికి పైగా కార్యదర్శులున్నారు. ఈ సంఖ్యను 30కి తగ్గిస్తే మేలు. పీసీసీల్లోనూ ఈ పరిమితిని పాటించాలి’’ అని ప్యానల్ సభ్యులు అభిప్రాయపడ్డారు. ముకుల్ వాస్నిక్ సారథ్యంలోని సంస్థాగత వ్యవహారాల కమిటీలో రమేశ్ చెన్నితాల, తారిఖ్ అన్వర్, అజయ్ మాకెన్ తదితరులున్నారు. అలాగే డీసీసీ అధ్యక్షులను ఢిల్లీ నుంచి ఏఐసీసీ స్థాయిలో నామినేట్ చేసే పోకడకు స్వస్తి పలికి పీసీసీ నాయకత్వమే నియమించుకునేలా చూడాలన్న ప్రతిపాదన కూడా ఉంది. -
సయోధ్య సాధ్యమేనా..?
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అసమ్మతికి చెక్ పెడుతూ కాంగ్రెస్ అధిష్టానం వ్యూహ రచన పూర్తి చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన ప్రణాళికను హైకమాండ్ సిద్ధం చేసింది. అందులో భాగంగా పంజాబ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హరీష్ రావత్ కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే వచ్చే ఎన్నికల్లో పార్టీ పోరాడనున్నట్లు ఆయన గురువారం స్పష్టం చేశారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవజోత్ సింగ్ సిద్ధూని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమించవచ్చని హరీష్ రావత్ సూచించారు. గతంలో సిద్ధూ, అమరీందర్ సింగ్ ఇద్దరూ ఒకరిపై ఒకరు బహిరంగంగానే మాటల యుద్ధం చేశారు. ఇద్దరి మధ్య నెలకొన్న అంతరాన్ని తగ్గించేందుకు పార్టీ హైకమాండ్ ఏర్పాటు చేసిన మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్ పంజాబ్‌లో పర్యటించి ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించి నివేదికను హైకమాండ్‌కు సమర్పించింది. అనంతరం ఇరువురు నాయకులు పార్టీ పెద్దలతో వేరువేరుగా భేటీ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. 2022 అసెంబ్లీ ఎన్నికలలో కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే కాంగ్రెస్ పోరాడనుండగా, అదే సమయంలో నవజోత్ సింగ్ సిద్ధూకు కూడా పూర్తి గౌరవం ఇచ్చేలా ఒక వ్యూహాన్ని సిద్ధం చేశారు. పంజాబ్‌లో తిరిగి అధికారంలోకి రావడం ఎంత అవసరమో, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం భవిష్యత్ నాయకులను కాపాడటం కూడా అంతే ముఖ్యమని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందుకే నవజోత్‌సింగ్ సిద్ధూకి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు త్వరలో కీలక ప్రకటన జరగవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పంజాబ్ కాంగ్రెస్‌కు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఫార్ములా సిద్ధం చేసిందని సమాచారం. ఒకవేళ నవజోత్‌సింగ్ సిద్ధూ పంజాబ్ పీసీసీ అధ్యక్షుడైతే, ఇద్దరు లేదా ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే యోచనలో ఉంది. అదే సమయంలో ఇటీవల నవజోత్ సింగ్ సిద్దూ చేసిన ట్వీట్ పంజాబ్ రాజకీయాల్లో ప్రకంపనలను తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో అమరీందర్, సిద్ధూల మధ్య దూరాన్ని తగ్గించేందుకు సిద్ధూని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా చేయడంవల్ల పరిస్థితి ఇప్పుడు చల్లబడినప్పటికీ, రాబోయే రోజుల్లో గొడవ మరింత ముదిరే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల తర్వాత సిద్ధూ ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నందున అమరీందర్ విధేయులు ఎమ్మెల్యేలుగా గెలవాలని ఆయన కోరుకొనే పరిస్థితి ఉండదని తెలిపారు. ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపులో తమ విధేయులకు ఎక్కువ టికెట్లు కోరుతూ ఎవరికి వారు పోటీపడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ పంజాబ్‌లో సిద్ధూకి ఉన్న ప్రజాదరణ కారణంగా ఆయనను పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ హైకమాండ్ ముందు నెలకొంది. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి రిస్క్ చేయదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సైతం సిద్ధూపై దృష్టి సారించినందుకు వీలైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దాలని హైకమాండ్ యోచిస్తోంది. -
పీసీసీ అధికార ప్రతినిధిగా పూజల హరికృష్ణ
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పూజల హరికృష్ణను నియమిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో నియామక పత్రాన్ని అందించారు. అనంతరం సిద్దిపేటకు వచ్చిన హరికృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల కష్టాలపై గళం విప్పుతానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చి, వాటిని అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. తనకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. సిద్దిపేట పట్టణానికి చెందిన పూజల హరికృష్ణ ఎన్ఎస్యూఐలో చురుకుగా పాల్గొన్నారు. పట్టణ అధ్యక్షుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. -
జిల్లాల వారీగా కోఆర్డినేటర్ల నియామకం
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాల వారీగా పీసీసీ సమన్వయ కర్తలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం నియమించారు. అలాగే 4వ తేదిన జిల్లా కేంద్రాలలో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ పీసీసీ కార్యదర్శిగా కొండేటి మల్లయ్య ను నియమిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ప్రధాన కార్యదర్శి ని నియమిస్తామని హామీ ఇచ్చారు. ఏఐసీసీ సిఫారసు రాగానే ప్రధాన కార్యదర్శిగా మార్పు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. జిల్లాల వారిగా కో ఆర్డనేటర్ల వివరాలు ⇒ కోమరంభీం అసిఫాబాద్ జిల్లా నమిండ్ల శ్రీనివాన్ ⇒మంచిర్యాల జిల్లాకు ప్రేమలతఅగర్వాల్ ⇒ఆదిలాబాద్ జిల్లాకు జి.నిరంజన్ ⇒ నిర్మల్ జిల్లాకు ఫిరోజ్ ఖాన్ ⇒ నిజామాబాద్ జిల్లాకు టి.నిరంజన్ ⇒ కామారెడ్డి జిల్లాకు మక్సూద్ అహ్మాద్ ⇒ జగిత్యాల జిల్లాకు గడుగు గంగాధర్ ⇒పెద్దపల్లి జిల్లాకు మహేశ్‌కుమార్ గౌడ్ ⇒కరీంనగర్ జిల్లాకు నర్సింహ్మరెడ్డి ⇒ రాజన్నసిరిసిల్ల జి.సుజాత ⇒ సంగారెడ్డి జిల్లాకు బక్కా జడ్సాన్ ⇒ మెదక్ జిల్లాకు నాగేశ్, ⇒సిద్దిపేట జిల్లాకు గడ్డం ప్రసాద్‌కుమార్ ⇒రంగారెడ్డి జిల్లాకు జువ్వాడి ఇందిరారావు ⇒ వికారాబాద్ జిల్లాకు జాఫర్ జావేద్ ⇒మేడ్చల్ జిల్లాకు వేణుగోపాల్‌రావు ⇒ మహబూబ్‌నగర్ జిల్లాకు రంగారెడ్డి ⇒నాగర్‌కర్నూల్ జిల్లాకు బొల్లు కిషన్ ⇒ వనపర్తి జిల్లాకు శ్రీనివాసరావు ⇒ నారాయణపేటకు ఫయీమ్ ⇒ గద్వాల జిల్లాకు అఫ్జలుద్దీన్ ⇒ సూర్యపేట ప్రేమ్‌లాల్ ⇒నల్లగొండ జిల్లాకు వినోద్‌కుమార్ ⇒ యాదాద్రి జిల్లాకు బండి నర్సాగౌడ్ ⇒ జనగాం జిల్లాకు జగదీశ్వర్ రావు ⇒ మహబూబాబాద్ జిల్లాకు మానవతారాయ్ ⇒వరంగల్ రూరల్ జిల్లాకు అజ్మతుల్లా హుస్సేనీ ⇒వరంగల్ అర్బన్ జిల్లాకు బీ.ఎం.వినోద్‌కుమార్ ⇒జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు పి.శ్రవణ్‌కుమార్‌రెడ్డి ⇒భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు డి.శ్రీధర్‌బాబు ⇒ఖమ్మం జిల్లాకు ఆదాం సంతోష్‌కుమార్‌లను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియమించారు, -
‘పీసీపీ పదవికి వీహెచ్ అర్హుడే’
సాక్షి, హైదరాబాద్ : పీసీసీ పదవికి సీనియర్ నేత వి. హనుమంతరావు అర్హుడేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. హైకమాండ్ బీసీలకు పీసీపీ ఇవ్వాలనుకుంటే వీహెచ్ సమర్థుడైన నాయకుడని జగ్గారెడ్డి చెప్పారు. బీసీలలో వీహెచ్ స్టార్ అని ప్రశంసించారు. వీహెచ్‌కి పీసీపీ ఇస్తే అన్ని విధాలా ఆయనకు సహకరిస్తానని తెలిపారు. పీపీసీ పదవిని ఎస్సీలకు ఇవ్వాలని అధిష్టానం భావిస్తే దామోదర రాజనర్సింహకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెడ్డిలలో పీసీసీ పదవి తనతో పాటు మిగతావారిలో ఎవరికిచ్చినా సమర్థవంతంగా పనిచేస్తారని జగ్గారెడ్డి అన్నారు. కాగా పీసీపీ పదవి తనకు ఇవ్వాలని జగ్గారెడ్డి అధిష్టానాన్ని కోరడంపై వీహెచ్ మండిపడ్డ విషయం తెలిసెందే. ఎప్పుడూ ఒకే సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. మొదటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉన్న వారికే పీసీసీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను పార్టీలో సీనియర్ నేతనని, తనకే పీసీసీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్‌కు మరో పీసీసీ రాజీనామా
చండీగఢ్: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. ఇప్పటికే పలు రాష్ట్రాల పీసీసీలు పదవి నుంచి వైదొలగగా.. తాజాగా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునిల్ జక్కర్ పదవికి రాజీనామా చేశారు. గురుదాస్ పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి, నటుడు సన్నీ డియోల్ చేతిలో ఆయన ఓటమిచెందారు. అయితే 2017లో బీజేపీ ఎంపీ వినోద్ ఖన్నా మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఉప ఎన్నిక జరగగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన సునిల్ జక్కర్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా వీచిన మోదీ గాలి.. గురుదాస్పూలోర్నూ ప్రభావం చూపించింది. దీంతో సన్నీ డియోల్ చేతిలో ఆయన ఓటమి చెందారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ..తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జక్కర్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ పంపారు. కాగా జక్కర్ రాజీనామాపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. ఓటమి చెందినంత మాత్రనా పదవికి రాజీనామ చేయాల్సిన అవసరంలేదని అన్నారు. కాగా పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లో అధికార కాంగ్రెస్ ఎనిమిది స్థానాలను సొంతం చేసుకున్న విజయం తెలిసిందే. -
విజయశాంతి విమర్శలకు నో కామెంట్...
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి స్పందించారు. విజయశాంతి తనపై చేసిన విమర్శలకు తాను కౌంటర్ ఇవ్వబోనంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మల్యే జగ్గారెడ్డి బుధవారమిక్కడ విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ‘విజయశాంతికి పీసీసీ చీఫ్ కావాలనే కోరిక ఉందమో. ఆమె సినిమా స్టార్‌గా ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. విజయశాంతి వల్ల కాంగ్రెస్‌కు ఉపయోగమే. ఆమె సేవలను దక్షిణాది రాష్ట్రాల్లో వాడుకుంటే పార్టీకి ఉపయోగం. పార్టీ కోసం మరింత సమయం వెచ్చిస్తే విజయశాంతికి మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుంది. రాబోయే రోజుల్లో పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టేవాళ్లు...ముఖ్యమంత్రి పదవిపై ఆశలు లేకుండా పార్టీ కోసం పని చేయాలి. పీసీసీ పీఠం కావాలనుకునేవాళ్లు తమ సొంత ఖర్చులతో పార్టీని నడిపేలా ఉండాలి. అప్పుడే పీసీసీకి కాబోయే సీఎంకు మధ్య సమన్వయం ఉంటుంది. పదవుల కోసం, డబ్బు కోసం కాకుండా పార్టీ కోసం పనిచేసేవాళ్లు కాంగ్రెస్‌లో పుష్కలంగా ఉన్నారు. ఈ అంశంపై త్వరలో పార్టీ అధినేత రాహుల్ గాంధీకి లేఖ రాస్తా. పార్టీ కోసం పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుల్లో ఉన్నారనేది వాస్తవం. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ ఎదుగదలకే పని చేశారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశతో ఆయన పనిచేయలేదు. ఆయన పీసీసీ పగ్గాలు చేపట్టాక పార్టీకి ఫాయిదా లేదన్నది సరికాదు. పార్టీ క్యాడర్లో ఉత్తమ్ మనోధైర్యం నింపగలిగారు. సీనియర్లు అంతా పీసీసీకి సమన్వయంతో పనిచేసినప్పుడే పార్టీకి మనుగడ. ఎమ్మెల్యేలు పార్టీ వీడటం ఉత్తమ్ వైఫల్యం కాదు. సొంత ప్రయోజనాల కోసమే ఫిరాయింపులు. ఉత్తమ్, కుంతియ అమ్ముడుపోయారనేది సరికాదు. వాళ్లను ఎవరు కొనలేరు. ఇక పార్టీలో కోవర్టులు ఎవరనేది సమయం వచ్చినప్పుడు చెబుతా.’ అని అన్నారు. -
సీనియర్లకు త్యాగాలు తప్పవు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ జోరుపెంచారు. ఇటీవల ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశమైన రాహుల్ శనివారం దేశవ్యాప్తంగా ఉన్న పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని కాంగ్రెస్ వార్‌రూమ్‌లో దాదాపు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నియంతృత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ సూచించారు. రైతన్నల కష్టాలు, నిరుద్యోగం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి కీలకాంశాలను ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా మలచుకోవాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రఫేల్ కుంభకోణమే ప్రధాన ప్రచారాంశంగా ఉంటుందన్న రాహుల్.. మోదీ ప్రభుత్వం తీసుకున్న రైతు, మహిళా, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒక కుటుంబం–ఒకే టికెట్ యువ నాయకత్వం కోసం పార్టీలోని సీనియర్ నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో 2–3 సార్లు ఓటమిపాలైన నేతలకు ఈసారి టికెట్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ‘ఓ కుటుంబానికి ఒక టికెట్’ మాత్రమే ఇస్తామనీ.. తమ సన్నిహితులు, కుటుంబసభ్యుల కోసం నేతలు లాబీయింగ్ చేయొద్దని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు నేతలంతా త్యాగాలకు సిద్ధం కావాలన్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్న నేతలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయొద్దన్నారు. తప్పని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయడంపై ఆయా రాష్ట్రాల పీసీసీలు నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. పొత్తులపై పీసీసీలకు పూర్తి స్వేచ్ఛ లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఫిబ్రవరి 25లోగా సమర్పించాలని పీసీసీ, సీఎల్పీ నేతలను రాహుల్ ఆదేశించారు. ఒక్కో లోక్‌సభ స్థానానికి గరిష్టంగా ముగ్గురు అభ్యర్థుల పేర్లను సూచించాలన్నారు. ఎన్నికల్లో విజయం కోసం స్థానిక, ఉపప్రాంతీయ పార్టీలతో పొత్తుల విషయంలో పీసీసీలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిపారు. బూత్‌స్థాయిలో పార్టీని పటిష్టం చేసి ‘శక్తి యాప్’ ద్వారా కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక సమస్యలపై దృష్టి సారించాలనీ, వాటిని ఏఐసీసీ మేనిఫెస్టో కమిటీకి పంపాలని రాహుల్ సూచించారు. అలాగే ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన సార్వత్రిక కనీస ఆదాయ పథకాన్ని, యూపీఏ–1, యూపీఏ–2 హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో మోదీ హయాంలో జరిగిన అవినీతిని ఎండగట్టాలన్నారు. భేటీ అనంతరం రాహుల్ స్పందిస్తూ..‘ఈరోజు సీఎల్పీ నేతలు, పీసీసీ అధ్యక్షులతో సమావేశమయ్యాను. ఈ భేటీలో ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఎన్నికల సన్నద్ధత, అనుసరించాల్సిన వ్యూహాలు సహా పలు అంశాలపై చర్చించాం’ అని ట్వీట్ చేశారు. -
‘లోక్‌సభ’ జాబితాను 20లోగా పంపండి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లను కాంగ్రెస్ వేగవంతం చేసింది. ఈనెల 20వ తేదీలోగా అభ్యర్థుల జాబితా పంపాలని అన్ని ప్రదేశ్ ఎన్నికల కమిటీ(పీఈసీ)లకు శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది. అయితే, ఈసారి స్క్రీనింగ్ కమిటీలకు బదులు ప్రత్యేక కమిటీలకు ఎంపిక బాధ్యతలు అప్పగించింది. గతంలో ఎన్నికలప్పుడు రాష్ట్రాల స్థాయిలో స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటయ్యేవి. ఈ కమిటీలే అభ్యర్థులను ఎంపిక చేసి ఏఐసీసీకి పంపించేవి. తాజాగా ఈ విధానానికి స్వస్తి చెప్పారు. లోక్‌సభ అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను ముందుగా ప్రదేశ్ ఎన్నికల కమిటీ(పీసీసీ)లు రూపొందించి రాష్ట్ర స్థాయిలోని ప్రత్యేక కమిటీలకు అందజేస్తాయి. ఈ కమిటీల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి లేదా ఆ రాష్ట్ర పార్టీ ఇన్చార్జి, రాష్ట్ర పీసీసీకి కేటాయించిన ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత సభ్యులుగా ఉంటారు. వీరు పీసీసీ జాబితాను పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పులతో ఏఐసీసీ స్థాయిలోని కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ)కి పంపుతారు. తెరపైకి కొత్త విధానం గతంలో స్క్రీనింగ్ కమిటీలు పంపిన జాబితాల్లో చాలాసార్లు.. ఎవరికీ పరిచయం లేని వ్యక్తులు, రాష్ట్రంపై అవగాహన లేని వారు, అసలు స్క్రీనింగ్ కమిటీ సభ్యులకే తెలియని వారి పేర్లు కూడా ఉండేవని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇటీవల జరిగిన రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా చోట్ల పెద్దగా పరిచయం లేని వ్యక్తులు పోటీలోకి దిగగా తిరుగుబాట్లు తలెత్తడం, స్థానిక నేతల సహాయ నిరాకరణ వంటివి జరిగాయని ఆ నేత తెలిపారు. పార్టీ సీనియర్ నేతలు రాజకీయాలు చేస్తూ ఎవరికీ పరిచయం లేని వారికి కూడా స్క్రీనింగ్ కమిటీ జాబితాలో చోటు కల్పించే వారని అన్నారు. ఇలాంటప్పుడు భారీగా డబ్బు కూడా చేతులు మారేదని ఆరోపణలు వచ్చాయన్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు రాహుల్ గాంధీ కొత్త విధానాన్ని తెచ్చారని ఆ నేత తెలిపారు. రాష్ట్రాల స్థాయిలో కీలకమైన పార్టీ బాధ్యతలను నెరవేర్చేవారు, విధాన నిర్ణయాలను అమలు చేసేవారికి ఎంపికలో బాధ్యతలు అప్పగిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని రాహుల్ భావిస్తున్నారు. దీనివల్ల అభ్యర్థుల ఎంపిక సత్వరం పూర్తవడంతోపాటు, వారు ఎన్నికల ప్రచారాన్ని ముందుగానే ప్రారంభించేందుకు కూడా సమయం దొరుకుతుందని తెలిపారు. అయితే, ముఖ్యమైన విధానపర నిర్ణయాల్లో కాంగ్రెస్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాత్ర కీలకంగా మారింది. కేరళ నుంచి లోక్‌సభకు ఎన్నికైన వేణుగోపాల్ అన్ని పీసీసీల్లోనూ సభ్యుడే. అదేవిధంగా కర్ణాటక పార్టీకి ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి కూడా. రానున్న లోక్‌సభ ఎన్నికలకు గెలిచే అభ్యర్థుల జాబితా తయారీతోపాటు, ఇతర వివరాలను ఇప్పటికే రాహుల్ గాంధీ తీసుకుంటున్నారని సమాచారం. కొన్ని రాష్ట్రాల్లో కుల సమీకరణాలు, బాగా పరిచయం ఉన్న వ్యక్తులు, వారి గెలుపోటములపై సొంతంగా సర్వేలు కూడా చేయించినట్లు తెలుస్తోంది. -
సొంత పార్టీపై రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
సొంత పార్టీపై రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నల్గొండ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సొంత పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. గాంధీభవన్‌లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటే సరిపోదనీ.. ప్రజల్లో ఏ నాయకుడికి ఎంత ప్రాధాన్యముందో తెలుసుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వానికి హితవు పలికారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన పీసీసీ కమిటీల నియామకాలపై ఆయన మండిపడ్డారు. వార్డు మెంబర్‌గా కూడా గెలిచే సత్తా లేనివారికి కమిటీలలో ప్రాధాన్యమిచ్చారని విస్మయం వ్యక్తం చేశారు. ప్రజల్లో బలంగా ఉన్న నాయకులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. నిన్న, మొన్న పార్టీలో చేరిన వారికి... జైలుకు వెళ్లొచ్చిన వారికి పదవులు ఇచ్చారని పరోక్షంగా రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా, ఓటుకు కోట్లు కేసులో జైలుకెళ్లొచ్చిన టీడీపీ నేత రేవంత్‌రెడ్డి తదనంతర జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం నియమించారు. దీని పట్ల రాజగోపాల్‌రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలోని మునుగోడు నుంచి పోటీ చేస్తానని రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. పీసీసీ కమిటీల్లో భాగంగా రాజగోపాల్‌రెడ్డికి ఎలక్షన్ కమిటీలో కాంగ్రెస్ స్థానం కల్పించింది. మరోవైపు టీఆర్ఎస్ను ఎదుర్కోవమే ధ్యేయంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, వామపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. దీంతో తాము ఆశించిన స్థానానికి టికెట్లు వస్తాయో.. రావోనని కాంగ్రెస్ నేతల్లో అలజడి మొదలైంది. 2014 ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసిన రాజగోపాల్ రెడ్డి బూర నర్సయ్య గౌడ్ చేతిలో ఓడిపోయారు. చదవండి : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్, పొన్నం -
రేపు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ మేళా
హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం, కేంద్ర ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖ పరిధిలోని హైదరాబాద్ సచివాలయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24న పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ మేళా(పీసీసీ)ను నిర్వహిస్తున్నట్లు పాస్‌పోర్ట్ అధికారి డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి గురువారం తెలిపారు. బేగంపేట్‌లోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో ఈ మేళా జరుగుతుందన్నారు. ఈ మేళాలో ఎలాంటి రుసుము లేకుండానే బ్రాంచ్ సెక్రటెరీయెట్ అధికారులు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అటెస్టేషన్ చేస్తారన్నారు. ఇటీవల రాష్ట్రం నుంచి గల్ఫ్‌కు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్‌కు డిమాండ్ పెరిగిందని.. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మేళాలో పాల్గొనే వారు వెబ్సైట్ www.passportindia.gov.in ద్వారా ఈ నెల 20 నుంచి అందుబాటులో ఉంచిన స్లాట్స్‌ను బుక్ చేసుకుని సరైన డాక్యుమెంట్లతో హాజరుకావాలని సూచించారు. 1,000 స్లాట్లు అందుబాటులో ఉంచగా ఇప్పటివరకు 250 స్లాట్లు బుక్ అయ్యాయన్నారు. -
దేశంలో హిట్లర్ పాలన సాగుతోంది
నెల్లూరు: దేశంలో హిట్లర్ పాలన నడుపుతున్న ప్రధాని నరేంద్రమోదీకి నెహ్రూ వంశాన్ని, రాహుల్‌గాంధీని విమర్శించే అర్హత లేదని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చెంచలబాబుయాదవ్ అన్నారు. నగరంలోని మైపాడుగేట్ సెంటర్ వద్ద ఉన్న తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు గొప్ప నాయకులన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పీఠాన్ని అదిష్టించే రాహుల్‌ను చూచి ఓర్వలేక, గుజరాత్లో ఆదరణ తగ్గుతోందని మోదీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్‌పాలనలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 9 శాతంపైగా ఉండగా, ప్రస్తుతం మూడు శాతానికి తగ్గడం చూస్తే మోదీ పాలన ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌పార్టీ జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు ఉడతా నరసింహారావు, శ్రీధర్‌రెడ్డి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి..
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేయాలని పీసీసీ డిమాండ్ చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం ఒక్క నోటిఫికేషన్‌ను మాత్రమే నామమాత్రంగా విడుదల చేసిందని ఆరోపించింది. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ‘ ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం’ అని హామీ ఇచ్చింది. ఈ మూడున్నరేళ్ల ఏటా ఒక డీఎస్సీ చొప్పున మూడు డీఎస్సీలు నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కేవలం ఒక డీఎస్సీని మాత్రమే నిర్వహించి చేతులు దులుపుకుంది. ఈ నోటిఫికేషన్ కూడా 2013లో ప్రభుత్వం 15 వేలు పోస్టులు ప్రకటించి కేవలం 10వేల పోస్టులకు మాత్రమే పరీక్షలు నిర్వహించింది. దాదాపుగా రాష్ట్రంలో 6 లక్షల మంది బీఈడీ, టెట్ తదితర కోర్సులు పూర్తి చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నారు. వేలాది రూపాయాలు ఖర్చుపెట్టి కోచింగులు తీసుకుని నోటిఫికేసన్ కోసం పడిగాపులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపుగా45 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులు తక్కువగా ఉన్నరనే కారణం చూసి వందలాది పాఠశాలలను ప్రభుత్వం మూసివేసింది. ఇవికాకుండా మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలలో కొన్ని సంవత్సరాల నంచి టీచర్ పోస్టులను భర్తీ చేయడం లేదు. ఏటా రిటైరయ్యే పోస్టులు వేలల్లో ఉన్నాయి. ఇవేకాక కస్తూరీభా, గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పోస్టులు వేలాదిగా ఉన్నాయి. పాఠశాలలను మూసివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ, యువకులకు తీరని అన్యాయం చేస్తోంది. 2015లో ఆంధ్రప్రదేశ్‌లో 15 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్ సంబంధిత కేంద్రమంత్రి లిఖిత పూర్వకమైన సమాధానాన్ని ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలకు మేలు కలిగేలా వ్యవహరిస్తోంది. నిరుద్యోగులకు నష్టం కలిగించే ఇలాంటి చర్యలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నిటినీ తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున డిమాండ్ చేస్తున్నాం. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్ని పార్టీలకు అనుబంధమైన విద్యార్థి, యువజన సంఘాలను కలుపుకుని ఐక్యంగా నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఉద్యమిస్తామని పీసీసీ తరపున హెచ్చరిస్తున్నాం.’ అని పీసీసీ ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్ పేర్కొన్నారు. -
పీసీసీ సభ్యుడిగా చిరంజీవి
ఏలూరు(సెంట్రల్) : జిల్లా నుంచి పీసీసీ సభ్యుడిగా రాజ్య సభ సభ్యుడు చిరంజీవి నియమితులయ్యారు. జిల్లాల వారీగా పీసీసీ సభ్యులను నియమిస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 17 మంది సభ్యులను నియమించారు. ముందుగా కొవ్వూరు బ్లాక్–1 పీసీసీ సభ్యురాలిగా కాపవరం పంచాయతీ సర్పంచ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు ఎండీ.అమరజహా బేగ్‌ను నియమించారు. అయితే రాజ్య సభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లా నుంచి పీసీసీ సభ్యుడిగా స్థానం కావాలని కోరడంతో అమరజహా బేగ్ తన స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించాలని సూచించారు. దాంతో చిరంజీవిని కొవ్వూరు బ్లాక్–1 పీసీసీ సభ్యుడిగా నియమించారు. గురువారం సాయంత్రం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు మహమ్మద్ రఫీఉల్లా బేగ్ విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ ఉదయం 9 గంటలకు విజయవాడలో పీసీసీ సభ్యులతో సమావేశం నిర్వహిస్తున్నామని, అనంతరం పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి జిల్లా నుంచి సభ్యత్వం కావాలని కోరడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని, ఆయన కోసం తన పీసీసీ పదవిని వదులుకున్న అమరజహా బేగ్‌ను ఈ సందర్భంగా అభినందించారు. సమావేశంలో నాయకులు గెడ్డం సాయిబాబు, ఎం.థామస్, అజర్త్, రిజ్వన్, దాసు పాల్గొన్నారు. -
నేడు పీసీసీ విస్తృతస్థాయి సమావేశం
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: పీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ఈనెల 29న గాంధీభవన్‌లో జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారని వివరించారు. బీసీలపై చిన్నచూపెందుకు: వీహెచ్ బీసీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ, మైనారిటీ సమస్యలపై, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్.. బీసీలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. బీసీ సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
హోదాతోనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్
పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి l ప్రకటించాలని డిమాండ్ ∙ విద్యార్థి, యువజన బ్యాలెట్ ప్రారంభోత్సవం తరలివచ్చిన కళాశాల విద్యార్థులు రాజమహేంద్రవరం సిటీ : ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని పీసీసీ చీఫ్ ఎ¯ŒS.రఘువీరారెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్లబొల్లి కబుర్లుమాని ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా అమలు, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ఇచ్చిన 600 హామీలను నేరవేర్చిందా? లేదా అనే అంశాలపై కాంగ్రెస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు బోడా వెంకట్ అధ్యక్షతన మంగళవారం రాజమహేంద్రవరం కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విద్యార్థి, యువజన బ్యాలెట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 13 జిల్లాల్లో జరిగే ఈ కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని మిగిలిన నాయకులతో కలిసి రఘువీరా విద్యార్థుల వద్దకు వెళ్లి బాక్సుల్లో బ్యాలెట్ వేయించారు.ఈ సందర్భంగా ఆయన వినూత్న ప్రయోగం చేశారు. ప్రసంగం మాని ప్రత్యేకహోదా, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయనే ప్రశ్నలను విద్యార్థులకు సంధించి సమాధానాలు రాబట్టారు.ఇంటర్ విద్యార్థులకు బస్‌పాస్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇస్తానన్న చంద్రబాబు రెండున్నరేళ్లలో ఇచ్చారా.?లక్షా అరవై వేల ఉద్యోగాలు ఇస్తానన్న చంద్రబాబు మీఇంటి చుట్టుపక్కల వారికి ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారా.? ఉద్యోగం ఇవ్వని నిరుద్యోగులకు రూ. రెండువేల నిరుద్యోగ భృతి ఇస్తానన్న చంద్రబాబు ఎవరికైనా ఇచ్చారా? ఇస్తే ఇప్పటికి రూ.60 వేలు వచ్చి ఉండాలి? వచ్చిందా అంటూ విద్యార్థులను ప్రశ్నించారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశాల్లోని రూ. 80 లక్షల కోట్ల నల్లధనాన్ని తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షల చొప్పున వేస్తానన్న ప్రధాని మోదీ పెద్దనోట్లు రద్దు చేసి సామాన్యుడిని ఇబ్బందులకు గురిచేశారని రఘువీరా అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చింది, తెచ్చేది కాంగ్రెస్ పార్టీయే నన్నారు. 2019లో రాహుల్ ప్రధాని అయిన వెంటనే తొలి ప్రత్యేక హోదాపైనేనన్నారు. కోటి బ్యాలెట్లు సేకరించాలని కాంగ్రెస్ యువజన, విద్యార్థి విభాగాలను ఆదేశించారు. మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటూ టీడీపీ, బీజేపీ హామీఇచ్చి ఇప్పుడు మాటతప్పి హోదా వల్ల వరిగేదేమీ లేదంటూ మోసం చేస్తున్నారన్నారు.డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ మాట్లాడుతూ యువత చేతిలో భారతదేశ భవిష్యత్ ఉందనే విషయం గుర్తించిన రాజీవ్‌గాంధీ 18 ఏళ్ల యువతకు ఓటు హక్కు కల్పించారన్నారు. టీటీడీ బోర్డు మాజీ చైర్మ¯ŒS కనుమూరి బాపిరాజు తనదైన శైలిలో విద్యార్థులు భగవత్ స్వరూపులంటూ చలోక్తులు విసిరి ఆకట్టుకున్నారు.అనంతరం 10 బ్యాలెట్ బాక్సులతో నాయకులు విద్యార్థుల వద్దకు వెల్లి బ్యాలెట్లను సేకరించారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, జేడీ శీలం, ఏఐసీసీ ఎస్సీసెల్ నాయకుడు డాక్టర్ ప్రసాద్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పంతం నానాజీ, గిడుగురుద్రరాజు, కామన ప్రభాకరరావు, ఎస్ఎ¯ŒS రాజా, రామినీడి మురళి, మార్టి¯ŒS లూథర్, రాజీవ్ రతన్, అంకం గోపి తదితరులు పాల్గొన్నారు. -
గ్రూప్-2లో అక్రమాలు: పీసీసీ
-
గ్రూప్-2లో అక్రమాలు: పీసీసీ
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ నిర్వహిం చిన గ్రూప్-2 పరీక్షల్లో అక్రమాలు, లోపా లు జరిగాయని పీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్ ఆరోపించారు. గాంధీ భవన్లో శనివారం ఆయన మాట్లాడుతూ, డీకోడింగ్ లేకుండా పరీక్ష జరిగిందని, ఓఎంఆర్ షీటుపై ఫొటోలు లేకుండా, బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయ కుండా.. ఎవరి పరీక్ష ఎవరు రాశారో తెలి యకుండా నిర్వహించారన్నారు. సింగరేణి ప్రశ్నపత్రాల లీకు, ఎంసెట్ లీకు, తాజాగా గ్రూప్-2 జరిగిన తీరుతో ప్రభుత్వ అసమ ర్థత బయటపడిందన్నారు. అవగాహన లేని ఇన్విజిలేటర్లతో పరీక్ష జరిగిందని, దీనివల్ల ఒకరి ప్రశ్నపత్రం మరొకరికి ఇచ్చారని.. తర్వాత తప్పులు తెలుసుకుని వైట్నర్తో తుడిచి, మరోసారి పేర్లు, నంబర్లు రాశారని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను కోర్టులు అంగీకరించవని, వీటిపై న్యాయ నిపుణులను సంప్రదించి నిరుద్యోగ అభ్యర్థుల తరఫున పోరాడు తామని ప్రకటించారు. -
రైతు సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం
-
రైతు సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం: టీ.పీసీసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై క్షేత్రస్థాయిలో నిరంతర పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ ఉపాధ్యక్షులు, ముఖ్య నేతలు శనివారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. సీఎల్పీ నేత కె.జానారెడ్డితో పాటు షబ్బీర్ అలీ, మల్లు భట్టివిక్రమార్క, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీఐ చట్టం ఒక మాఫియాగా మారిందని గవర్నరు ఈఎస్ఎల్ నరసింహన్ మాట్లాడటం సరికాదని వీహెచ్ అన్నారు. దీనిపై పార్టీ తరపున పోరాటం చేయాలని కోరారు. గవర్నర్‌పై రాష్ట్రపతికి, ప్రధానికి ఫిర్యాదు చేయాల్సిందిగా డిమాండ్ చేయాలని సూచించారు. వీహెచ్ ప్రతిపాదనను పీసీసీ పరిశీలిస్తోంది. కరువు బారిన రైతులను ఆదుకోవడంపై, వరదల వల్ల దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేయడంపై టీఆర్ఎస్ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని నేతలు విమర్శించారు. -
ఎత్తిపోతల పథకాలపై దృష్టిసారించాలి
మఠంపల్లి : పులిచింతల బ్యాక్ వాటర్ ప్రాంతంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వం దృష్టిసారించాలని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి మట్టపల్లి వద్ద కృష్ణానది వరద ముంపును, బాధితుల ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన కృష్ణానదిపై బల్లకట్టులో ఆవలిభాగం ఒడ్డు వరకు వెళ్లారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణపట్టె ప్రాంతంలో రెండు రోజులు పర్యటించి బాధితుల సమస్యలను తెలుసుకుంటానన్నారు. ముఖ్యంగా పులిచింతల బ్యాక్ వాటర్ ఆధారంగా వందల కోట్ల రూపాయలతో నిర్మించిన వెల్లటూరు, బుగ్గమాదారం, మట్టపల్లి, పెదవీడు, అమరవరం ఎత్తిపోతల పథకాల నిర్వహణపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించాలన్నారు. మట్టపల్లిలో పూర్తిస్థాయిలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించాలని కోరారు. మట్టపల్లి దేవస్థానం, గ్రామం అభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ఆయన వెంట భూక్యామంజీనాయక్, శ్రీనివాస్‌గౌడ్, రాజారెడ్డి, ఎండి.నిజాముద్దీన్, యరగాని నాగన్న గౌడ్, ఎం.ఎం.యాదవ్, బచ్చలకూరి బాబు, భాస్కర్‌రెడ్డి, యల్లారెడ్డి, ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసరావు, బుజ్జి భీముడు, పిచ్చిరెడ్డి, రవినాయక్, బాబునాయక్, హనుమ, సక్రు,వెంకటరమణ,రామయ్య,నారాయణస్వామి,శ్రీనివాసరెడ్డి,సైదిరెడ్డి తదితరులున్నారు. -
ఇక ప్రభుత్వంపై పోరాటమే
క్షేత్రస్థాయి పోరాటానికి పీసీసీ కసరత్తు సాక్షి,హైదరాబాద్: టీఆర్ఎస్ ఇచ్చిన హామీల వైఫల్యం, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటానికి పీసీసీ కసరత్తు చేస్తోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్న క్రమంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో నెల కొన్న పరిస్థితిపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రైతులు, యువత, విద్యార్థులు, దళితులు, మైనారిటీలకు టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలు, వైఫల్యం తది తరాలపై సమగ్ర అధ్యయనం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొందరికి బాధ్యతలు అప్పగించారు. లక్ష లోపు పంట రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేస్తామని చెప్పి, ఇప్పటిదాకా కేవలం రెండు విడతలే చేయడంపై రైతుల అభిప్రాయాలను సేకరించనుంది. దళితులకు మూడెకరాల భూమి హామీ అమలుపై గ్రామాల్లో పరిస్థితులను తెలుసుకోనుంది. కేజీ టు పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్య, లక్ష ఉద్యోగాల కల్పన, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితరాలపైనా నివేదికను తెప్పించుకోనుంది. అనంతరం అంశాల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని ఉత్తమ్ యోచి స్తున్నారు. ఇతర పార్టీలను, వివిధ ప్రజా సంఘాలను క్షేత్రస్థాయి సమరంలో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి వ్యూహరచన చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్తగా తలెత్తే సమస్యలు, ప్రభుత్వ కదలికలను బట్టి కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్నారు. -
రూ.5 కోట్లు ఇస్తామన్నా స్పందన ఏదీ? : పీసీసీ
సాక్షి, అమరావతి: సదావర్తి భూములకు అదనంగా రూ.5 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చినా ప్రభుత్వం స్పందించక పోవడంలో ఆంతర్యమేమిటని పీసీసీ ప్రధాన కార్యదర్శి పక్కాల సూరిబాబు ప్రశ్నించారు. గురువారం విజయవాడలో విలేకర్లతో మాట్లాడుతూ ఎకరం రూ. 6 కోట్లు ఉన్న సదావర్తి భూములను చౌకగా ఎకరం రూ. 27 లక్షలకే టీడీపీ నేతలకు కట్టబెట్టారన్నారు. విమర్శలు రావడంతో ఎవరైనా రూ. 5 కోట్లు అదనంగా చెల్లిస్తామని ముందుకొస్తే వేలంపాట రద్దుచేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఆ తర్వాత చేతులెత్తేసిందని ఆరోపించారు. -
దేశాన్ని కాషాయీకరణ చేసేందుకు కుట్ర: పీసీసీ
మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశాన్ని కాషాయీకరణ చేసేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని పీసీసీ ఉపాధ్యక్షులు మాదాసు గంగాధరం పేర్కొన్నారు. సోమవారం ఇందిర భవన్లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మొదటి నుంచి లౌకిక వాదానికి కట్టుబడి ఉందన్నారు. కొన్ని స్వార్థశక్తులు తమ స్వలాభం కోసం కుట్రలు పన్నుతూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఆ నాడు దేశం కోసం పోరాడిన స్పూర్తితోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సి వస్తోందన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలు, ఏపీకి ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు ప్రవేశ పెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు జాతీయ స్థాయిలో అన్ని పార్టీల వారు మద్దతు తెలపడం సంతోషకరం అన్నారు. బడుగు, బలహీన వర్గాల గుండెల్లో కాంగ్రెస్ పార్టీకి సుస్థిర స్థానం ఉందని, ఎన్ని కష్టాలు ఎదురైనా మున్ముందు పటిష్టం చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు, ప్రధాన కార్యదర్శులు జంగా గౌతం, గిడుగు రుద్రరాజు, ఉపాధ్యక్షులు సాకే శైలజానాథ్, ఎన్.తులసిరెడ్డి, సూర్యానాయక్, కిసాన్ సెల్ చైర్మన్ రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నీటిపారుదల పథకాల అభివృద్ధికి కృషి
వెల్లటూరు(మేళ్లచెర్వు) : నియోజకవర్గంలో నీటి పారుదల పథకాల అభివృద్ధికి తన వంతు కృషి చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం 99 కోట్ల రూపాయలతో నిర్మించిన మండలంలోని వెల్లటూరు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 20 వేల ఎకరాలకు నీరందించేందుకు వెల్లటూరు, మఠంపల్లి మండలంలోని అమరవరం ఎత్తిపోతల పథకాల ఏర్పాటుకు కృషి చేసినట్లు తెలిపారు. అంతకుముందు మండలకేంద్రంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణరెడ్డి, జెడ్పీటీసీ కర్నె వెంకటలక్ష్మీ, ప్రతాపరెడ్డి, మన్సారలీ, యరగాని నాగన్నగౌడ్, నియోజకవర్గ యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకర శివరాం యాదవ్, జక్కుల మల్లయ్య, ఐల వెంకన్న, బాణోతు బాబు, మైల నాగిరెడ్డి, మోర్తాల వెంకటరెడ్డి, లిప్టు చైర్మన్ సీతరాంరెడ్డి, అణివిరెడ్డి, గోనె అంకయ్య,నారాయణరెడ్డి, అమరబోయిన శ్రీనివాస్‌యాదవ్, సాధం గంగయ్య, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పీసీసీ పగ్గాలు స్వీకరించేందుకు రెడీ
ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చండూరు: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ పగ్గాలు అప్పగిస్తే స్వీకరించేందుకు కోమటిరెడ్డి సోదరులు రెడీగా ఉన్నారని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. గురువారం నల్లగొండ జిల్లా చండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షపదవి అందిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో పాదయూత్ర చేసైనా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని స్పష్టంచేశారు. ఎన్నికల్లో తమకు సీట్లు ఇవ్వకపోయినా అభ్యర్థుల గెలుపుకోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తామన్నారు. పార్టీలో గ్రూపు తగాదాలకు నాయకులు, కార్యకర్తలు దూరంగా ఉండాలని కోరారు. కేసీఆర్ మాయ మాటలకు మోసపోయిన జనం నేడు టీఆర్ఎస్ పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. -
‘ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టండి’
ప్రత్యేక హోదా విషయంలో ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టి టీడీపీ, కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయించాలని పీసీసీ అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఇందిర భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక గంటలోపే ప్రత్యేక హోదా ఇవ్వొచ్చన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం నాడు ఎన్‌టి రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నేడు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నరేంద్రమోదీ వద్ద తాకట్టు పెట్టి తెలుగుదేశం పార్టీని తెలుగు ద్రోహుల పార్టీగా మార్చాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉంటూ కేంద్రంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా అమలు చేయించడంలో ప్రధాన బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. -
టీఆర్ఎస్ది నిరంకుశ పాలన
తుర్కపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తూ రైతులపైన లాఠీచార్జి, కాల్పులు జరిపిస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని మాజీమంత్రి, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మంగళవారం మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ నిర్వాసితులను పరామర్శించడానికి వెళ్లిన ఆయనను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి నల్లగొండ జిల్లా తుర్కపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. 4 గంటల పాటు పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2013 చట్టానికి మద్దతు తెలిపి పార్లమెంట్లో ఓటేసిన కేసీఆర్ నేడు 123 జీఓ పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారని దుయ్యబట్టారు. మల్లన్నసాగర్‌పై అసెంబ్లీ చర్చచకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం బహిరంగ చర్చకు సిద్ధం కావాలని కోరినా ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. 2013 చట్టం ప్రకారం రైతులను ఆదుకోవాల్సి ప్రభుత్వం.. వారి జీవితాలతో చలగాటమాడుతోందని ఆరోపించారు. రైతులకు న్యాయం చేస్తే వరకు కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన నిలిచి పోరాడుతుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి కల్వకుంట్ల రమ్యరావు, బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్, తంగెళ్ల రవికుమార్, పొత్నక్ ప్రమోద్‌కుమార్, ఉదయ్‌చందర్‌రెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
దుబార ఖర్చు చేస్తున్న సీఎం కేసీఆర్
నిజామాబాద్ సిటీ : ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు ఆర్థిక క్రమశిక్షణ లేదని పీసీసీ అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి బొమ్మ మహేశ్ కుమార్‌గౌడ్ విమర్శించారు. రాష్ట్రంలో అవసరం లేని చోట ప్రాజెక్టుల నిర్మాణం, వాస్తు పేరిట ఉన్నవాటిని కూల్చి కొత్త నిర్మాణాలు చేపట్టడం ప్రజల సొమ్మును దుబార చేయడమే నన్నారు. శనివారం నిజామాబాద్‌లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చక్కని సీఎం క్యాంపు కార్యాలయం నిర్మించారని, ఏ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినా అన్ని విధాల ఉపయోగపడేలా క్యాంపు కార్యాలయం నిర్మిస్తే దానికి వాస్తు లేదని కూల్చివేసి రూ. 33 కోట్లతో కొత్త క్యాంపు కార్యాలయం నిర్మించేయత్నంలో కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. రూ. ఒక లక్ష 60 వేల కోట్లు అప్పులున్న ఈ రాష్ట్రంలో ఇంత దుబార ఖర్చు అవసరమా అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో నీటి నిపుణులు 1.5 టీఎంసీలకు నిర్దేశిస్తే, సీఎం ఏకంగా 30 నుంచి 40 టీఎంసీలకు వెళ్లి మల్లన్నసాగర్‌ను నిర్మాణం చేస్తున్నారంటే దాని వెనుక మతలబు ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇదంతా డబ్బులు దండుకోడానికేనని అన్నారు. కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు అవసరమే లేదని ఆరునెలల పాటు లిఫ్టు ద్వారా పంటలకు ఇవ్వవచ్చన్నారు. అక్కడక్కడ చిన్న ప్రాజెక్టులు కట్టుకోవచ్చన్నారు. -
పావలా కోడికి ముప్పావలా మసాలా
ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి పావలా కోడికి ముప్పావలా మసాలా ఖర్చు చందంగా ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఇందిర భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం రూ. 300 కోట్ల ఒప్పందాలు చేసుకొని అందుకు ప్రచార నిమిత్తం వెయ్యి కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. సీఆర్డీఏ చైర్మన్‌గా సీఎం చంద్రబాబు తన ప్రయోజనాలకు సంబంధించిన డాక్యుమెంట్లపై మాత్రమే సంతకాలు చేస్తూ వాటి పనులు మాత్రమే వేగవంతం అయ్యేలా చేస్తున్నారన్నారు. ఒక పక్క ప్రభుత్వ భూములను సింగపూర్ కంపెనీలకు ఇస్తూనే రూ. 5,500 కోట్లతో మౌళిక వసతులను కల్పించడానికి పలువురితో ఒప్పందాలు కుదుర్చుకున్నాడని పేర్కొన్నారు. రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ సంస్థను తొలగిస్తే అపరాధ రుసుం కింద 20 శాతం చెల్లించాలనే నిబంధనను సవరించాలనే ఆర్థిక శాఖ అభ్యంతరానికి చంద్రబాబు ఎందుకు మిన్నకుండి పోయారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్ కంపెనీలు అసెండాస్, సిన్బ్రిడ్జ్, సెంబ్ కార్బలతో ప్రభుత్వం చేసుకున్న స్విస్ ఛాలెంజ్ ఒప్పందాలను తీవ్రంగా తాము వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. రైతులను బెదిరించి పోలీసులు, తహసీల్దార్లు, ఆర్డీవోల ద్వారా బలవంతంగా భూములను సేకరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం సేకరించిన భూముల్లో ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములు కూడా ఉన్నాయన్నారు. విభజన చట్టంలో హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధానిగా ఉండాలని పొందుపరచినా అర్థాంతరంగా తన ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. -
లోకేష్, చంద్రబాబు జైళ్లకు వెళ్లడం ఖాయం
-పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మడకశిర (అనంతపురం) అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ 2019లో జైళ్లకు వెళ్లడం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. రెండేళ్ల టీడీపీ పాలనలో సీఎం చంద్రబాబు అవినీతికి పాల్పడుతూ దేశంలోనే రాష్ట్రాన్ని అవినీతి రాష్ట్రంగా తీర్చిదిద్దారని ఆయన ఆరోపించారు. ఆదివారం ఆయన తన స్వగ్రామం అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి టీడీపీ నాయకులు అవినీతికి పాల్పడుతూ అభివృద్ధిని విస్మరిస్తున్నారన్నారు. హెరిటేజ్ కంపెనీని ప్రోత్సహించేందుకే విజయా డెయిరీ రైతులకు ఇచ్చే పాలధరను తగ్గించి పాడి రైతులను నట్టేట ముంచుతున్నారన్నారు. గోదావరి పుష్కరాల్లో అరకొరగా భక్తులకు సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం రూ.1,600 కోట్లు అవినీతికి పాల్పడి 27 మందిని పొట్టను పెట్టుకుందన్నారు. ఇక కృష్ణా పుష్కరాల్లో కూడా భారీగా అవినీతికి పాల్పడటానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారన్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు పోటీ పడి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తూ విదేశీ పర్యటనలు చేయడం వల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప, లాభమేమీ ఉండబోదన్నారు. విజయవాడలో దేవాలయాలు కూల్చకూడదంటూ పీఠాధిపతులు, మతాధిపతులు ధర్నాలు చేస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలో అవినీతికి రహస్య ట్రెజరర్‌గా ఉన్న సీఎం కుమారుడు నారా లోకేష్, సీఎం 2019 తర్వాత జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. దేశంలో అవినీతిలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని సర్వేలు చెబుతున్నాయని గుర్తు చేశారు. -
సదావర్తి సత్రం భూ కుంభకోణాలపై పీసీసీ కమిటీ
హైదరాబాద్: అమరావతిలోని సదావర్తి సత్రం భూముల అమ్మకాల్లో జరిగిన భారీ కంభకోణంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాస్తవాలను సేకరించి అక్రమాలను నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలను కాంగ్రెస్ పార్టీకి కమిటీ నివేదిక ఇవ్వనుంది. కమిటీలో రామచంద్రయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలీ, పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ సుందరరామ శర్మ, ప్రధాన కార్యదర్శి పాకల సూరిబాబు ఉన్నారు. -
జిల్లాల ఇన్చార్జిలను నియమించిన టీపీసీసీ
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ కమిటీ జిల్లాలకు పార్టీ ఇన్చార్జిలను నియమించింది. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు మల్లు రవి, శ్రావణ్, మహేష్ కుమార్ తెలిపారు. దీంతో పాటు ప్రతి జిల్లాకు ఒక వైస్ ప్రెసిడెంట్‌తో పాటు ముగ్గురు జనరల్ సెక్రటరీలు ఇన్చార్జిలుగా ఉంటారు. జిల్లా ఇన్చార్జిలు జూన్ 30 వ తేదీలోగా మండల పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు శిక్షణ తరగతులు నిర్వహించే బాధ్యతలను పొన్నం ప్రభాకర్‌కు అప్పగించారు. ఎన్నికలకు ఏడాది ముందే నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించాలని, 50 పైగా నియోజకవర్గాల్లో ఇప్పుడే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. మిషన్ 2019 లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే దిశగా కార్యాచరణ రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కార్యక్రమాలను రూపోందించేందుకు ఏఐసీసీ నుంచి శ్రీనివాసన్ మానిటరింగ్ చేయనున్నారు. జిల్లాల ఇన్చార్జిలు: ఆదిలాబాద్- సబితా ఇంద్రారెడ్డి నిజామాబాద్-గడ్డం ప్రసాద్ మెదక్-పొన్నం ప్రభాకర్ రంగారెడ్డి- డీకే అరుణ మహబూబ్‌నగర్- మాగం రంగారెడ్డి నల్లగొండ- మల్లు రవి వరంగల్- నంది ఎల్లయ్య ఖమ్మం-శ్రీధర్‌బాబు హైదరాబాద్- బలరాం నాయక్. -
వెంకట్‌రెడ్డి కుటుంబీకులకే!
పాలేరు టికెట్‌పై పీసీసీ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: పాలేరు అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దివంగత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబసభ్యుల్లోనే ఒకరిని అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించనుంది. కుటుంబంలో ఎవరిని పోటీకి నిలుపుతారో నిర్ణయించుకోవాలంటూ వెంకట్‌రెడ్డి సతీమణి సుచరితకు పీసీసీ ఇప్పటికే సూచించింది. పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఉన్న అనుచరవర్గం, వెంకట్‌రెడ్డికి ఉన్న పేరు దృష్ట్యా ఆయన భార్యగా సుచరిత వైపే పీసీసీ మొగ్గు చూపుతోంది. వెంకట్‌రెడ్డి సోదరులు, ఆయన కుమార్తెలతో చర్చించాకే అభ్యర్థి ఎవరన్నది తేలనుంది. టీఆర్ఎస్కు దీటుగా వ్యూహరచన టీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలోకి దిగుతుండటంతో కాంగ్రెస్ కూడా దీటుగా వ్యూహరచన చేయాలని భావిస్తోంది. ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) చైర్మన్‌గా ఉంటూ అకాలమరణం చెందిన వెంకట్‌రెడ్డి స్థానంలో ఆయన కుటుంబీకులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశమివ్వాలని టీపీసీసీ గతంలోనే ప్రతిపాదించింది. కానీ అధికార టీఆర్ఎస్ స్పందించలేదు. కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేయడం, తాను కాదనడం, ఇదంతా ఎందుకనే యోచనతోనే సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇప్పుడు కా్రంగెస్నేతలు మిగతా పార్టీల మద్దతుకోసం యోచిస్తున్నారు. సీపీఐ, సీపీఎం, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలతో మాట్లాడుతున్నారు. -
పార్టీ పదవులకు పొంగులేటి సుధాకర్ రెడ్డి రాజీనామా
హైదరాబాద్ : ఏఐసీసీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి బుధవారం పార్టీ పదవులకు రాజీనామా చేశారు. పీసీసీ కార్యవర్గ, సమన్వయ కమిటీ సభ్యత్వ పదవులకు ఆయన రాజీనామా చేసి, ఆ లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీకి ఫ్యాక్స్ ద్వారా పంపారు. పీసీసీ పదవుల పంపకం సరిగా లేదనే అసంతృప్తితో పొంగులేటి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పదవుల భర్తీలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారని పొంగులేటి ఆరోపించారు. పీసీసీ పదవుల భర్తీలో మల్లు భట్టి విక్రమార్కను, రేణుకా చౌదరిని మాత్రమే సంప్రదించారని, ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను విస్మరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తొందరపడవద్దని షబ్బీర్ అలీ ఈ సందర్భంగా పొంగులేటిని బుజ్జగించినట్లు తెలుస్తోంది. మరోవైపు పొంగులేటి పదవులకు రాజీనామా చేయటం పార్టీలో కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'పోలీసుల వేధింపులు సరికావు'
హైదరాబాద్: పీసీసీ కార్యవర్గ కూర్పు బాధ్యత హైకమాండ్‌దేనని టీపీసీసీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పీసీసీ కార్యవర్గ కూర్పు బాగా లేదని వచ్చిన వార్తలపై తాను స్పందించబోనని ఆయన చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థలపై పోలీసుల వేధింపులు సరికావని ఉత్తమ్ అన్నారు. స్కాలర్ షిఫ్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ లకు సంబంధించిన రూ.3,600 కోట్లు తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండేళ్లుగా ఈ బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారని ఉత్తమ్ అన్నారు. యూనివర్సిటీలు, ప్రభుత్వ కాలేజీల్లో, పీజీ స్టాఫ్‌ను భర్తీ చేయడం లేదని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పొన్నాల వర్గానికి చెక్
పీసీసీ కమిటీల్లో దక్కని ప్రాధాన్యం {పత్యర్థుల్లో ఎక్కువ మందికి పదవులు 11 మంది జిల్లా నేతలకు చోటు వరంగల్ : పీసీసీ తాజా కమిటీల్లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వర్గానికి ప్రాధాన్యం దక్కలేదు. పొన్నాల వర్గంగా ముద్రపడిన జిల్లా నేతల్లో ఎవరికీ పీసీసీ కమిటీల్లో పదవులు రాలేదు. శనివారం పార్టీ అధిష్టానం పీసీసీ పదవులను ప్రకటించింది. అందులో 11 మంది జిల్లా నేతలకు పదవులు దక్కారుు. పీసీసీ మాజీ అధ్యక్షుడి హోదాలో పొన్నాల లక్ష్మయ్య పీసీసీ కార్యనిర్వాహక కమిటీలో, సమన్వయ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసే పీసీసీ కార్యనిర్వాహక కమిటీలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి చోటు కల్పించారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పీసీసీ సమన్వయ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. పీసీసీ ఉపాధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్, ప్రధాన కార్యదర్శిగా బక్క జడ్సన్ నియమితులయ్యారు. పీసీసీ శాశ్వత ఆహ్వానితులుగా డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పొదెం వీరయ్య, మాజీ ఎంపీ డి.రవీంద్రనాయక్, పార్టీ నేతలు కొండపల్లి దయాసాగర్‌రావు, నమిండ్ల శ్రీనివాస్‌లకు చోటు దక్కింది. కాగా, పీసీసీ కమిటీల్లో పదవులు వచ్చిన వారంతా పొన్నాలకు వ్యతిరేకంగా ఉన్న వారే కావడం గమనార్హం. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎంపీ బలరాంనాయక్, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మొదటి నుంచి పొన్నాల వ్యతిరేక వర్గంగానే ఉంటున్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన బక్క జడ్సన్ 2014 ఎన్నికల్లో పొన్నాలపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. పొన్నాలకు దూరంగా ఉంటున్న గండ్ర వెంకటరమణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కొండపల్లి దయాసాగర్, నమిండ్ల శ్రీనివాస్ శాశ్వత ఆహ్వానితులుగా నియమితులయ్యారు. పీసీసీ కమిటీల్లో నియామకంతో జిల్లాలో పొన్నాల వర్గానికి పూర్తిగా చెక్ పెట్టినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కమిటీల నియామకంపై పొన్నాల వర్గం నేతల్లో అసంతృప్తి నెలకొంది. -
‘ప్రత్యేక హోదా సాధించే వరకు విశ్రమించం’
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు రాజీలేని పోరాటం చేస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో అన్ని జాతీయ పార్టీల మద్దతు కూడగట్టడం కోసం ఈ నెల 12న ఏపీసీసీ ఆధ్వర్వంలో ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ నాయకుల బృందం శుక్రవారం మధ్యాహ్నం ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ చేరుకుంది. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 14, 15, 16తేదీల్లో అన్ని జాతీయ పార్టీల నాయకులను కలిసి ప్రత్యేక హోదాతో పాటుగా, పోలవరం ప్రాజెక్టు, రెవెన్యూ లోటు భర్తీ, ప్రత్యేక రైల్వే జోన్ తదితర అంశాలపై చర్చించామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరచి అన్ని పార్టీలతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం బడ్జెట్లో కంటి తుడుపుగా విడుదల చేసిన నిధులు ఏమాత్రం సరిపోవన్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తవ్వాలంటే తక్షణం రూ. 10 వేల కోట్లు విడుదల చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
వాటర్ గ్రిడ్ అంతా అవినీతి మయం: భట్టి విక్రమార్క
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన వాటర్ గ్రిడ్ పథకం అంతా అవినీతి మయం అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. వైరా రిజయర్వాయర్ వద్ద విలేకరుల తో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్ కుమార్తె కవితకు చోటు కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం వద్ద రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టాడని ధ్వజమెత్తారు. వాటర్ గ్రిడ్ పథకంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీని బహిరంగ విచారణకు రావాలని సవాల్ విసిరారు. -
సారయ్యపై సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత బస్వరాజు సారయ్యను పీసీసీ సస్పెండ్ చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆమోదం మేరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ చర్య తీసుకున్నట్టుగా గాంధీభవన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. బస్వరాజు సారయ్య టీఆర్ఎస్లో చేరిక గురించి వాస్తవాలు తెలుసుకోవడానికి పీసీసీ ప్రయత్నించినా ఆయన ఉద్దేశపూర్వకంగానే అందుబాటులోకి రావడం లేదని ఖరారు చేసుకున్న తర్వాత పీసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. -
గ్రామస్థాయి నుంచి పునర్వ్యవస్థీకరణ
♦ త్వరలో పార్టీ ప్రక్షాళనకు పీసీసీ నిర్ణయం ♦ మీడియాలో చర్చలకు ప్రత్యేక ప్యానల్ ♦ గ్రేటర్, రంగారెడ్డి జిల్లాలకు త్వరలోనే కొత్త సారథులు సాక్షి, హైదరాబాద్: గ్రామస్థాయి నుంచి పార్టీని ప్రక్షాళన చేసి, కమిటీలను పునర్వ్యవస్థీకరించాలని పీసీసీ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాలు ఎక్కడా ఖాళీగా ఉండకూడదని ఏఐసీసీ నుంచి టీపీసీసీకి స్పష్టమైన ఆదేశాలు అందాయి. పీసీసీకి అధ్యక్షునిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షునిగా మల్లు భట్టి విక్రమార్క నియామకం జరిగి దాదాపు ఏడాది కావస్తోంది. వారం పది రోజుల్లోనే పీసీసీకి పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని, జిల్లాల వారీగా క్రియాశీల నాయకులను ఇన్చార్జిలుగా నియమిస్తామని ఏడాది క్రితమే ప్రకటించారు. అయితే వరుసగా వస్తున్న ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, శాసనమండలి ఎన్నికలు, ఇతర సమావేశాలు.. వంటివాటితో పాటు పార్టీలో నేతల మధ్య, గ్రూపుల మధ్య సమన్వయంలోపం వంటి అంశాలతో ఎప్పటికప్పుడు పీసీసీ కార్యవర్గం ఏర్పాటు వాయిదా పడుతూ వస్తోంది. కాగా, ఇటీవలి కాలంలో పీసీసీకి అన్నీ ఎదురుదెబ్బలే తగిలాయి. మెదక్, వరంగల్ లోక్‌సభ సీట్లకు ఉప ఎన్నికలు, శాసనమండలి ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగితే రెండు ఎమ్మెల్సీ సీట్లు రావడం మినహా కాంగ్రెస్‌పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలే తగిలాయి. అయితే ఎప్పటికప్పుడు వచ్చే తాత్కాలిక అంశాలను పట్టించుకోకుండా పార్టీని రాష్ట్రం యూనిట్‌గా తీసుకుని బలోపేతం చేయాలని పీసీసీకి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ గట్టిగా ఆదేశించారు. దీంతో వీలైనంత వేగంగా గ్రామస్థాయి నుంచి మొదలుపెట్టి మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలకు పూర్తిస్థాయి కార్యవర్గాలను నియమించుకోవాలని పీసీసీ భావిస్తోంది. ఈ కమిటీల ఏర్పాటు తర్వాత ఎప్పటికప్పుడు కార్యాచరణకోసం గ్రామ, మండల స్థాయి నుంచి పీసీసీ దాకా ప్రతీ నెల మొదటివారంలో సమావేశాలు నిర్వహించాలని నాయకత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లోనే చర్చించుకుని స్థానికంగా సమస్యలపై పోరాటాలు చేయాలని నిర్ణయానికి వచ్చారు. వీటితోపాటు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు అధ్యక్షుల నియామక ప్రక్రియను కూడా ఈ నెలాఖరుతో కాంగ్రెస్ అధిష్టానం పూర్తిచేసే అవకాశాలున్నట్టు టీపీసీసీ ముఖ్యుడొకరు వెల్లడించారు. మీడియాలో చర్చలపై ప్రత్యేక దృష్టి ప్రజా సమస్యలపై ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాతో మాట్లాడటానికి, చర్చించడానికి ప్రత్యేక ప్యానల్‌ను ఏర్పాటు చేయాలని పీసీసీ నిర్ణయించింది. పార్టీ విధానాలు, నిర్ణయాలు, అభిప్రాయాలపై స్పష్టత లేకుండా మీడియా చర్చల్లో ఎవరికివారే పాల్గొనడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని పీసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే చాతుర్యం, అంశాల వారీగా పట్టు, అవగాహన, పార్టీ విధానాలపై స్పష్టత ఉన్నవారితో ఒక ప్యానల్‌ను అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించింది. ఈ జాబితాను అన్ని మీడియా సంస్థలకు పంపాలని భావిస్తోంది. టీపీసీసీలో కొత్త ముఖాలకు చోటు పీసీసీ కార్యవర్గంలో ఇప్పుడున్న వారిలో నిష్క్రియాపరత్వంగా ఉన్న కొందరు నాయకులను తొలగించి, కొన్ని కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని టీపీసీసీకి, ఏఐసీసీ నుంచి సూచనలు అందాయి. కార్యవర్గంలో ప్రతీ నాయకునికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించాలని ఏఐసీసీ సూచించింది. దీని ప్రకారం ఉపాధ్యక్షులు, కార్యదర్శులు వంటివారిని జిల్లాల బాధ్యులు, విభాగాల బాధ్యులుగా నియమించాలని పీసీసీ యోచిస్తోంది. -
దానం నాగేందర్ రాజీనామాకు ఆమోదం
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ చేసిన రాజీనామాను పీసీసీ ఆమోదించింది. హైకమాండ్ సూచన మేరకు దానం రాజీనామాకు పీసీసీ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ దానం నాగేందర్ శనివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పంపించారు. -
ఈసీ రూల్స్ కాగితాలకే పరిమితమా?- నిరంజన్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం సభ్యులపై నిషేధం విధించాలని పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఎన్నికల నియామలికి విరుద్దంగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నా... ఎన్నికల పరిశీలకులకు వినపడటం లేదా అని అడిగారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాత నగరంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారంతో ప్రజల్లోకి దూసుకెళ్లి వారి ఆదరాభిమానాలు పొందుతుంటంతో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ పిచ్చికుక్కలా మెరుగుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. ఈ సందర్భంగా అసిఫ్‌నగర్‌లో అక్బరుద్దీన్ చేసిన ప్రసంగ వీడియోను ప్రదర్శించారు. కొంత కాలంగా ఎంఐఎం నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నా ఈసీ నిమ్మకు నీరెత్తినట్లు ఉండానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమా? అని అడిగారు. ఎంఐఎం నేతలపై చర్యలు తీసుకునే ధైర్యం ఈసీకి లేకపోతే అదే విషయాన్ని ప్రజలకు చెప్పాలని వారే చూసుకుంటారన్నారు. ఎన్నికల నియామావలి 243-కె, 243 జెడ్ఏ ప్రకారం ఎంఐఎం నేతలను ఎన్నికల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఐఎం సోదరులు అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లను పాతబస్తీ నుంచి తరిమికొట్టే రోజు త్వరలోనే వస్తుందన్నారు. -
80 మందితో కాంగ్రెస్ 2 జాబితాలు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆదివారం రెండు జాబితాలను విడుదల చేసింది. ఒక జాబితాలో 49, మరో జాబితాలో 31తో కలిపి 80 మంది అభ్యర్థులను పీసీసీ వెల్లడించింది. మొత్తం కలిపి ఇప్పటిదాకా మూడు జాబితాల్లో 125 మంది పేర్లను ప్రకటించింది. మిగిలిన వారికి ఈ నెల 21న పీసీసీ పరిశీలకుల ద్వారా బీ ఫారాలు అం దించాలని నిర్ణయించింది. టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం పార్టీలకు కాంగ్రెస్ అభ్యర్థులే లక్ష్యంగా మారారని పీసీసీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి, బెదిరించి, ప్రలోభపెట్టి ఎన్నికల నుంచి ఉపసంహరించుకునేలా టీఆర్ఎస్ సహా మిగిలిన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని పీసీసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుసరించిన విధానాన్ని గ్రేటర్ ఎన్నికల్లోనూ అమలుచేసే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారపార్టీ ఎత్తులను చిత్తుచేసి, ఎన్నికల్లో చివరిదాకా కాంగ్రెస్ అభ్యర్థులను పోటీలో ఉంచాలని పీసీసీ స్థిర నిశ్చయంతో ఉంది. ఇప్పటికే ప్రకటించిన 125 మందికి ఈ నెల 21న(నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు) బీ ఫారాలను అందించాలని నిర్ణయించింది. ఇంకా అనుమానం ఉన్న డివిజన్లలో అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకుండా, నామినేషన్లు వేయాలంటూ స్వయంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచనలను అందించినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. వారి పేర్లను అధికారికంగా వెల్లడించకుండా, పీసీసీ పరిశీలకుల ద్వారా నేరుగా ఎన్నికల అధికారికే సమర్పించాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. కాగా, పాతబస్తీలోని పలు డివిజన్లలో కాంగ్రెస్‌పార్టీకి సరైన అభ్యర్థులు దొరకడం లేదని పీసీసీ ముఖ్య నాయకుడొకరు వెల్లడించారు. పాతబస్తీలోని కొన్ని డివిజన్లలో నామమాత్రంగా కూడా పోటీ ఇవ్వలేని స్థితిలో పార్టీ ఉందని ఆ నేత చెప్పారు. రంగారెడ్డి నేతల అసంతృప్తి గ్రేటర్ ఎన్నికల్లో తాము సూచించిన అభ్యర్థులకు టికెట్టు రాలేదని రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశం, మాజీ ఎమ్మెల్యేలు డి.సుధీర్‌రెడ్డి, భిక్షపతియాదవ్, కూన శ్రీశైలంగౌడ్, నియోజకవర్గాల ఇన్చార్జీలు బండారు లక్ష్మారెడ్డి(ఉప్పల్), నందికంటి శ్రీధర్(మల్కాజిగిరి) తదితరులు హైదరాబాద్‌లో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాము ప్రతిపాదించిన అభ్యర్థులకు తమ నియోజకవర్గాల్లోనే టికెట్లు రాకపోతే ఇక పార్టీలో కొనసాగడం ఎందుకంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముందు వాపోయారు. స్పందించిన ఉత్తమ్... సమస్యలున్న కొన్ని డివిజన్లలో మార్పులు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జీలు సూచించిన వారికి టికెట్లు కేటాయించడంతో సమస్య సద్దు మణిగింది. -
ఎంఐఎం, బీజేపీ మధ్య రహస్య అవగహన
-
'ఆ రెండు బిల్లులను తిరస్కరించండి'
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన ప్రైవేట్ వర్సిటీల బిల్లు, రాజధాని భూములను 99 ఏళ్ల పాటు లీజ్ కు ఇచ్చే బిల్లు ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేవని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆ బిల్లులను తిరస్కరించాలని కోరుతూ గవర్నర్ నరసింహన్ కు రఘువీరా లేఖ రాశారు. పేదలకు ఉన్నత విద్యను దూరం చేసేలా చంద్రబాబు సర్కారు ప్రైవేటు వర్సిటీలను తెస్తోందని రఘువీరా ఆ లేఖలో పేర్కొన్నారు. రాజధాని భూములను విదేశీ సంస్థలకు కట్టబెట్టేందుకే ఆ బిల్లును అసెంబ్లీలో హడావుడిగా ఆమోదం పొందేలా చేశారన్నారు. రాష్ట్రం ప్రయోజనాలను విఘాతం కల్గించేలా ఉన్న ఆ రెండు బిల్లులను నిలుపుదల చేయాలని గవర్నర్ కు రఘువీరా విజ్ఞప్తి చేశారు. -
ముఖేష్ గౌడ్‌కు కీలక బాధ్యతలు?
హైదరాబాద్ : మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించేందుకు సన్నద్ధమయ్యారు. త్వరలోనే ఆయనకు కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం కనిపిస్తోంది. నగర కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తారా? లేక పీసీసీలో మరేవైనా బాధ్యతలు ఇస్తారా? అన్న అంశంపై ఏఐసీసీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. రెండు రోజుల క్రితం పీసీసీ ముఖ్య నేతలు ముఖేష్‌తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు విక్రమ్ గౌడ్‌ను కాంగ్రెస్ పార్టీ తరపున మేయర్ అభ్యర్థిగా ప్రకటించే అంశం చర్చకు వచ్చింది. ఒకవేళ ముఖేష్ గౌడ్‌కు నగర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తే... దానం నాగేందర్‌కు ఏఐసీసీ లేదా పీసీసీ కీలక బాధ్యతలు అప్పగించే అంశంపైనా చర్చించినట్లు సమాచారం. -
బిహార్ వెళ్లి చెబుతాం: రఘువీరా
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయం పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టత ఇవ్వాలని.. లేదంటే.. ఏపీకి జరిగిన మోసాన్ని ఎన్నికలు జరుగుతున్న బిహార్ లో ప్రచారం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి హెచ్చరించారు. రాజధాని శంకుస్థాపనకు ఈనెల 22న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని .. ప్రత్యేక హోదా.. విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందిరాభవన్ లో రఘువీరా శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని స్పందించక పోతే.. బీజేపీ మోసాన్ని ఎండగడతామని వ్యాఖ్యానించారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు ఈనెలాఖరున బిహార్ వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా వల్ల ఉత్తరాఖండ్ లో జరిగిన అభివృద్ది తీరుతెన్నులను పరిశీలించేందుకు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు వివరించారు. వారం రోజులుగా ప్రధాని అపాయింట్ మెంట్ అడుగుతున్నా స్పందించక పోవడం ఇవ్వక పోవడం దారుణమన్నారు. -
ఒక్క ఎస్ఎంఎస్ కూడా రాలేదట!
కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ఇంత వరకు తనకు ఒక్క ఎస్సెమ్మెస్ కూడా రాలేదంటున్నారు కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ (పీసీసీ) ఇటీవలే కోటి ఎస్సెమ్మెస్ సందేశాల ఉద్యమాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా రాష్ట్రానికి చెందిన, రాష్ట్రంతో సంబంధం ఉన్న కేంద్ర మంత్రులు ఎం. వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరిల ఫోను నెంబర్లను ప్రకటించి.. ఆయా నెంబర్లకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడాలని కోరుతూ ఈ నెల 23వ తేదీ నుంచి 30 వ తేదీల మధ్య కోటి ఎస్సెమ్మెస్ సందేశాలను పంపాలని పీసీసీ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది.ఎనిమిది రోజుల పాటు సాగే ఈ ఉద్యమం మరో రెండు రోజులలో ముగియనుంది. అయితే, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఎస్సెమ్మెల ఉద్యమానికి సంబంధించి ఇప్పటి వరకు తన ఫోన్లో ఒక్క సందేశం కూడా రాలేదని వెంకయ్యనాయుడు సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ వ్యవహారంపై మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఏవేవో నెంబర్లు ఇచ్చారట. నాకైతే ఒక్క ఎస్సెమ్మెస్ రాలేదు. ఎవరెవరికో ఇలాంటి ఎస్సెమ్మెస్‌లు వెళ్లుతుండొచ్చు అని వ్యాఖ్యానించారు. -
టీడీపీకి అంత దమ్ము లేదు: రఘువీరా
హైదరాబాద్: రైతుల్లో నెలకొన్న వ్యతిరేకతను ఎదుర్కొనే దమ్ము లేక సాగునీటి సంఘాలకు దొడ్డిదారిన ఎన్నికలు నిర్వహించారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి ఆరోపించారు. సాగునీటి సంఘాల కమిటీ ఎంపిక విధానాన్ని రద్దు చేసి, 1997 చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పీసీసీ నేతలు గురువారం రోజున గవర్నర్ నరసింహన్‌కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. 6,138 నీటి వినియోగదారుల సంఘాలు, 245 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 53 ప్రాజెక్టు కమిటీలకు రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీ 90 శాతం స్థానాల్లో ఓటమి చెందడం ఖాయం అన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో ఒక పార్టీ మాత్రమే ఉంటుందంటూ ఇటీవల కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ.. అది వారి అహంకారానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఎమ్మెల్సీ చెంగలరాయుడు, నాయకులు ఆనం రామనారాయణరెడ్డి, కాసు వెంకటకృష్ణారెడ్డి, కొండ్రు మురళీమోహన్, గంగాభవాని, సుంకర పద్మశ్రీ, జంగా గౌతం, రవి చంద్రారెడ్డి, సుందరరామశర్మ, ఎన్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
'తెలంగాణ చరిత్రలో సోనియా పాత్రను చేర్చాల్సిందే'
హైదరాబాద్:తెలంగాణ చరిత్రపై రూపొందిస్తున్న పాఠ్యాంశాల్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాత్రను చేర్చాల్సిందేనని టీ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సోమవారం బీజేపీ భూసేకరణ ఆర్డినెన్స్ పై పీసీసీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ చరిత్రపై రూపొందిస్తున్న పాఠ్యాంశాల్లో సోనియా పాత్రను తప్పకుండా చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై పార్టీ తరుపున కేసీఆర్ కు లేఖ రాస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి డీఎస్ అధ్యక్షతన కమిటీని నియమించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అకాల వర్షంతో రైతులు నష్టపోయారని.. నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
కాంగ్రెస్ పీసీసీలకు కొత్త ముఖాలు
- రాహుల్ ముద్రతో ఏఐసీసీలోకి యువనేతలు న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడినప్పట్నుంచీ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో పార్టీ నాయకత్వాలను మార్చే దిశగా కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తోంది. దీంతో ఏఐసీసీలోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయని.. కొందరు యువనేతలను ప్రధాన కార్యదర్శులుగా నియమించే అవకాశముందని తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లోనూ, ఏఐసీసీలోనూ యువనేతలకు ప్రాధాన్యమిస్తూ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముద్రతో జరగనున్న మార్పుచేర్పులను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. ఢిల్లీలో అరవింద్‌సింగ్ లవ్లీ స్థానంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మాకెన్, గుజరాత్లో మోధ్వాడియా స్థానంలో కేంద్ర మాజీమంత్రి భరత్‌సింగ్ సోలంకిలు పీసీసీ పగ్గాలు చేపట్టనున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కశ్మీర్, హరియాణాలకూ కొత్త పీసీసీ చీఫ్‌లు రానున్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ చేసిన ప్రచారం కాంగ్రెస్‌కు పీడకలలా గుర్తుండిపోతుందని ప్రముఖ జర్నలిస్టు వీర్ సంఘ్వి నిప్పులు చెరిగారు. రాహుల్ నాయకత్వంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సింఘ్వి కాంగ్రెస్‌పై రాసిన ‘మాండేట్: విల్ ఆఫ్ ది పీపుల్’ పుస్తకం ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఇది త్వరలో విడుదల కానుంది. -
కాంగ్రెస్ కన్నెర్ర
సాక్షి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ శ్రేణులు కన్నెర్రచేశాయి. సచివాలయం, ఛాతీ ఆస్పత్రిని తరలింపునకు నిరసనగా పీసీసీ ఆధ్వర్యంలో గాంధీభవన్ నుంచి చేపట్టిన ర్యాలీని అడ్డుకోవడం పట్ల ప్రభుత్వ తీరును ఖండిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆదివారం జిల్లావ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు జిల్లాకేంద్రంలోని పాలమూరు చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు ఓబేదుల్లా కొత్వాల్, మునిసిపల్ చైర్పర్సన్ రాధాఅమర్, ముత్యాలప్రకాష్ తదితర ముఖ్యనేతలు పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్‌లో నగర పంచాయతీ చైర్మన్ వంగ మోహన్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మణెమ్మతోపాటు 30 మంది కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. తిమ్మాజిపేట మండలంలో పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. గద్వాలలో కాంగ్రెస్ నేతలు డీకే బంగ్లా నుంచి ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక వైఎస్ఆర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మునిసిపల్ చైర్పర్సన్ పద్మావతి, వైస్ చైర్మన్ శంకర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సలాం ప్రభుత్వ పాలనాతీరుపై నిప్పులు చెరిగారు. మక్తల్ నియోజకవర్గంలో మక్తల్, ఆత్మకూరులో ఆందోళనలు జరిగాయి. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వనపర్తి పట్టణంలోని రాజీవ్‌చౌక్‌లో కాంగ్రెస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. పెద్దమందడిలో పార్టీ మండలాధ్యక్షుడు ఐ.సత్యారెడ్డి నేతృత్వంలో ధర్నా చేపట్టారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ, ఆమనగల్లు మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. షాద్‌నగర్ పట్టణ ముఖ్యకూడల్లతో పాటు కొత్తూరు మండల కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నేతృత్వంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. కొడంగల్ నియోజకవర్గం కోస్గి, మద్దూరు, బొంరాస్‌పేట మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకోలు చేపట్టారు. కొల్లాపూర్‌లో కొందరు నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దేవరకద్రలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. -
టీ పీసీసీ ర్యాలీ ఉద్రిక్తం
గాంధీభవన్ నుంచి భారీ ర్యాలీగా నేతలు, కార్యకర్తలు సచివాలయం, ఛాతీ ఆస్పత్రి తరలింపు యోచన విరమించుకోవాలని డిమాండ్ ర్యాలీకి అనుమతి లేదంటూ నిలువరించిన పోలీసులు ప్రతిఘటించిన కాంగ్రెస్ కార్యకర్తలు.. ఇరువర్గాల తోపులాట ఘర్షణలో స్వల్పంగా గాయపడిన పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్య విరుద్ధం..: జానారెడ్డి నేడు రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో ధర్నాలు సాక్షి, హైదరాబాద్: సచివాలయం మార్పు, ఛాతీ ఆసుపత్రి తరలింపు యోచనను వ్యతిరేకిస్తూ గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్‌కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా... కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్రంగా తోపులాట జరిగింది.. ఈ తోపులాటలో కింద పడిపోయిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్వల్పంగా గాయపడ్డారు. చివరికి పోలీసులు ఈ ర్యాలీని భగ్నం చేశారు. ఈ ర్యాలీని భగ్నం చేయడాన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత జానారెడ్డి గోషా మహల్ పోలీస్ స్టేడియంలో ధర్నా చేయగా... టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ నేతృత్వంలో కార్యకర్తలు రాజ్‌భవన్ ముట్టడికి ప్రయత్నించారు. టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతో పాటు ఆ పార్టీ మాజీ మంత్రులు, సీనియర్ నేతల నేతృత్వంలో కార్యకర్తలు గాంధీభవన్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. వారు నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు నిలువరించారు. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వారిని ప్రతిఘటించారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య కొంతసేపు తీవ్రంగా తోపులాట జరిగింది. ‘తెలంగాణ సీఎం కేసీఆర్ డౌన్ డౌన్, తుగ్లక్ పాలన చేస్తున్న కేసీఆర్ డౌన్ డౌన్’ అంటూ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అయితే పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల తోపులాటలో పొన్నాల లక్ష్మయ్యతో పాటు పలువురు కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు. పొన్నాల చేయి మెలితిరగడంతో పాటు పలు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ర్యాలీతో దాదాపు గంట పాటు నాంపల్లి రైల్వేస్టేషన్ దగ్గర రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కాంగ్రెస్ నేతలు డి.శ్రీనివాస్, గీతారెడ్డి, దానం నాగేందర్, శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్ యాదవ్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ, సిరిసిల్ల రాజయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేడియానికి తరలించారు. పోలీసులు ర్యాలీని భగ్నం చేసి, తమను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. గోషామహల్ స్టేడియంలోనే కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ నేతృత్వంలో కార్యకర్తలు రాజ్‌భవన్ ముట్టడికి ప్రయత్నించారు. రాజ్‌భవన్ గేటు దగ్గరకు చేరుకుని, లోపలికి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది, పోలీసులు వారిని నిలువరించడంతో... కొంతసేపు తోపులాట జరిగింది. కాగా... ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఆదివారం ధర్నాలు, ఆందోళనలు చేపడతామని టీపీసీసీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు సూచనలు జారీ చేసింది. నిర్భంధాలతో ప్రజల పోరాటం ఆగదు.. ప్రజల ఆకాంక్షలను, కోరికలను నెరవేర్చకుండా పోలీసులతో నిర్భంధిస్తే పోరాటాలు ఆగవని సీఎల్పీ నేత కె.జానారెడ్డి పేర్కొన్నారు. పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించిన కాంగ్రెస్ నేతలను పరామర్శించిన జానారెడ్డి అక్కడే పొన్నాల, డి.శ్రీనివాస్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడితే ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతారని ఆయన హెచ్చరించారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న తమ ర్యాలీని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని జానారెడ్డి వ్యాఖ్యానించారు. సచివాలయం, ఛాతీ ఆసుపత్రి తరలింపు యోచనను కేసీఆర్ వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గాంధేయమార్గంలో, ప్రజాస్వామ్య యుతంగా జరుగుతున్న ర్యాలీని అడ్డుకోవడం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను బయటపెట్టుకుందని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. సినిమాకు క్లైమాక్స్ చూపిస్తాం..: శ్రీధర్‌బాబు, దానం అసలు సినిమా చూపిస్తామంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు చూపించే సినిమాకు క్లైమాక్స్ తామే చూపిస్తామంటూ మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, దానం నాగేందర్ హెచ్చరించారు. అధికారం ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించిన వారంతా చరిత్రలో కొట్టుకుపోయారని వ్యాఖ్యానించారు. తప్పుడు కేసులు పెడితే ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రులు అహంకారంతో వ్యవహరించడం మంచిది కాదని ఎమ్మెల్యే డి.కె.అరుణ హెచ్చరించారు. నిరసన తెలియజేయకుండా అడ్డుకుని, అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం తన భయాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. -
హైదరాబాద్‌కి రానున్న దిగ్విజయ్
-
పొన్నాల, డీఎస్ లతో విభేదాలు లేవు: జానారెడ్డి
న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఆశించడంలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడ్ని ఒకవేళ అధిష్టానం మార్చాలనుకుంటే సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని జానా అన్నారు. ప్రస్తుత తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. సందర్భానుసారంగా పొన్నాల మాట్లాడలేకపోతున్నారని, మేధోమథనం సదస్సు ఎప్పుడనేది పొన్నాల నాతో చెప్పలేదని జానా అన్నారు. సీఎల్పీ కమిటీ ఏర్పాటుపై ఆయనతో నేను చర్చించలేదన్నారు. పీఎసీ ఛైర్మన్ ఎవరనేది నేనే నిర్ణయిస్తానని మరో ప్రశ్నకు జానారెడ్డి సమాధానమిచ్చారు. -
చంద్రబాబువి మోసపూరిత సంతకాలు
హైదరాబాద్: టీడీపీలోకి చేరికలను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విలువలు లేవని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు ఎందుకంత అభద్రతాభావమని ప్రశ్నించారు. టీడీపీలోకి చేరాలని భావిస్తున్న ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరుతున్నవారికి సిగ్గులేదని రఘువీరా ధ్వజమెత్తారు. చంద్రబాబుతో పాటు టీడీపీలో ఇప్పుడున్నవారంతా నకిలీలేనని రఘువీరా రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా వందల హామీలిచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మోసపూరిత సంతకాలు చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్సీలు శనివారం సాయంత్రం టీడీపీలో చేరుతున్నారనే వార్తలు రావడంతో రఘువీరా పైవిధంగా స్పందించారు. -
రాజీనామా చేయకుండా సమీక్షలా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామాపై పార్టీలో ఒత్తిడి పెరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తన పదవికి రాజీనామా చేయకుండా పార్టీ సమీక్షలు నిర్వహించడాన్ని సొంత పార్టీ నేతలు బాహాటంగానే తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ ఓటమికి పూర్తి బాధ్యత తానే వహిస్తానని ఎన్నికల ముందు ప్రకటించిన పొన్నాల.. ఇంకా ఆ పదవిని పట్టుకుని వేలాడటం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. పొన్నాల తీరుకు నిరసనగా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ టీ-పీసీసీ ఉపాధ్యక్ష పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. పొన్నాలను తప్పించకపోతే రాబోయే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం పొన్నాల తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. -
పొన్నాలపై వేటు లేనట్టే(నా)?!
-
పిసిసి అధ్యక్షులు, మాజీ అధ్యక్షుల ఓటమి
హైదరాబాద్: ఈ సార్వత్రిక ఎన్నికలలో దేశవ్యాప్తంగానే కాకుండా, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం చవిచూడవలసి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి అక్కడ లబ్దిపొందుదామని చూసింది. అక్కడ కూడా చావుదెబ్బతింది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే చావు దెబ్బతింది. అటు తెలంగాణలో ఇటు ఏపిలో పిసిసి అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రులు ఓడిపోయారు. పిసిసి మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అందరూ కట్టగట్టుకొని ఓటమిని చవిచూశారు. రఘువీరా రెడ్డిది దయనీయ స్థితి. ఆయన మూడవ స్థానానికి పరిమితమయ్యారు. నిజామాబాద్ రూరల్ శాసనసభ స్థానంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి శ్రీనివాస్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్థన్పై 20 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లా జనగామ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విజయం సాధించారు. మరో పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి కిమిడి మృణాళిని చేతిలో ఓడిపోయారు. ఏపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అనంతపురం జిల్లా పెనుకొండలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ టిడిపి అభ్యర్థి పార్ధసారధి విజయం సాధించారు. రఘువీరా రెడ్డి మూడవ స్థానానికి వెళ్లారు. -
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను గెలిపించాలి
డిచ్పల్లి, న్యూస్‌లైన్ : ఇచ్చిన మాట మీద నిలిచి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం డిచ్పల్లి మండలం గన్నారం, తిర్మన్‌పల్లి, రాంపూర్, మిట్టాపల్లి, కమలాపూర్, ఘన్పూర్, డిచ్పల్లి రైల్వే స్టేషన్, నడిపల్లి, ధర్మారం(బి), బర్ధిపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఇచ్చిన మాట ప్రకారమే సోనియా తెలంగాణ ఇచ్చారని అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు, ఈనెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారు.. రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారని ప్రతి గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో డీఎస్ ఆయా గ్రామస్తులను ప్రశ్నించారు. దీనికి డి.శ్రీనివాస్‌ను అని వారు సమాధానం ఇవ్వడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మీరందరూ చెబితే తప్పకుండా ఎన్నికల్లో నిలబడతానన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి కూరపాటి అరుణతో పాటు, ఎంపీటీసీ అభ్యర్థులు లంబాని లక్ష్మి, డాక్టర్ శివప్రసాద్, దెగావత్ లక్ష్మి, కూతురు సువర్ణ, ఒడ్డెం సవిత, పొలసాని లక్ష్మి, కడ్దూరం రవికిరణ్, సలీం, పాయల్, పార్టీ నాయకులు గజవాడ జైపాల్, కంచెట్టి గంగాధర్, అమృతాపూర్ గంగాధర్, సుజాత, చింతశ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, చిన్నయ్య, మురళి, గాండ్ల లక్ష్మీనారాయణ, ధర్మాగౌడ్, దేవాగౌడ్, అంబర్‌సింగ్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. -
''నాయకులే వెళ్లారు! కార్యకర్తలు కాదు''
-
బీజేపీలోకి బొత్స!
జిల్లా వ్యాప్తంగా పుకార్లు సాక్షి ప్రతినిధి, విజయనగరం : పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై రోజుకో రూమర్ వస్తోంది. ఈసారి పోటీ చేసేదెక్కడ అన్నదానిపై నిన్నటి వరకు రకరకాల ప్రచారం జరగ్గా నేడు ఆయన ఏకంగా పార్టీయే మారిపోతున్నారన్న ప్రచారం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌కు బద్ధ శత్రువైన బీజేపీలో చేరుతారని, సీట్ల కోసం బేరసారాలు సాగిస్తున్నారని మంగళవారం జిల్లా వ్యాప్తంగా చర్చ జరిగింది. ఇవన్నీ రూమర్సేనని కొంతమంది తేలికగా తీసుకోగా, లోపాయికారీగా ఏదో జరుగుతోందని మరికొంతమంది చెబుతున్నారు. ప్రజాదరణ, అనుచరగణాన్ని కోల్పోయిన బొత్స సత్యనారాయణ పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా ఉంది. తనతో పాటు పదిహేనేళ్లుగా నడిచిన నాయకులు, కార్యకర్తలు కనీసం పట్టించుకోవడం లేదు. రోజుకొకరు జారిపోతున్నారు. చెప్పాలంటే కాంగ్రెస్ రాజకీయాల్లో ఒంటరైపోతున్నారు. తన కుటుంబానికి చెందిన ప్రజాప్రతినిధులు, మరో ఐదేళ్లు ఎమ్మెల్సీ పదవి ఉన్న కోలగట్ల వీరభద్రస్వామి తప్ప మరెవరూ ఆయనతో ఉన్నట్టు కనిపించడం లేదు. దీంతో ఆయన దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్‌పై రకరకాల ఊహాగానాలొస్తున్నాయి. శృంగవరపుకోటలో పోటీ చేస్తారని ఒకసారి, చీపురుపల్లిలో అని మరోసారి, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి అని ఇంకోసారి ప్రచారం జరిగింది. కాదు...కాదు ఈసారి విజయనగరం ఎంపీగా పోటీ చేస్తారని మరో వాదన వినిపించింది. కానీ ఏ రోజూ ఆయన నోరు విప్పలేదు. తన రాజకీయ భవిష్యత్‌పై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ తరుణంలో బీజేపీలో చేరుతున్నారని బొత్సపై కొత్త ప్రచారం మొదలైంది. ఇప్పటికే ఆ పార్టీ అధినాయకులతో మంతనాలు చేస్తున్నారని, తనతో పాటు తన కుటుంబంలోని పలువురికి టిక్కెట్లు కోసం చర్చిస్తున్నారని, త్వరలోనే పార్టీ జంప్ చేయడం ఖాయమని జిల్లా వ్యాప్తంగా పుకార్లు షికార్లు చేశాయి. పలువురు పత్రికా కార్యాలయాలకు ఫోన్లు చేసి వాస్తవమేనా అని అడుగుతున్నారు. దీన్నిబట్టి బొత్సపై ఏమేర ప్రచారం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఎంతమేర వాస్తవం ఉందో ఆయనే చెప్పాలి. -
కొనసాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు