హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ కమిటీ జిల్లాలకు పార్టీ ఇన్‌చార్జిలను నియమించింది. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు మల్లు రవి, శ్రావణ్, మహేష్ కుమార్ తెలిపారు. దీంతో పాటు ప్రతి జిల్లాకు ఒక వైస్ ప్రెసిడెంట్‌తో పాటు ముగ్గురు జనరల్ సెక్రటరీలు ఇన్‌చార్జిలుగా ఉంటారు. జిల్లా ఇన్‌చార్జిలు జూన్ 30 వ తేదీలోగా మండల పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు శిక్షణ తరగతులు నిర్వహించే బాధ్యతలను పొన్నం ప్రభాకర్‌కు అప్పగించారు.
ఎన్నికలకు ఏడాది ముందే నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించాలని, 50 పైగా నియోజకవర్గాల్లో ఇప్పుడే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. మిషన్ 2019 లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే దిశగా కార్యాచరణ రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కార్యక్రమాలను రూపోందించేందుకు ఏఐసీసీ నుంచి శ్రీనివాసన్ మానిటరింగ్ చేయనున్నారు.
జిల్లాల ఇన్‌చార్జిలు:
ఆదిలాబాద్- సబితా ఇంద్రారెడ్డి
నిజామాబాద్-గడ్డం ప్రసాద్
మెదక్-పొన్నం ప్రభాకర్
రంగారెడ్డి- డీకే అరుణ
మహబూబ్‌నగర్- మాగం రంగారెడ్డి
నల్లగొండ- మల్లు రవి
వరంగల్- నంది ఎల్లయ్య
ఖమ్మం-శ్రీధర్‌బాబు
హైదరాబాద్- బలరాం నాయక్.