
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణపై మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందన్న దామోదర.. శాఖల మార్పులు, చేర్పులు తప్పక ఉంటాయన్నారు. ఈ కేబినెట్ విస్తరణలో సీతక్కకు హోంమంత్రి పదవి దక్కే చాన్స్ ఉందంటూ వ్యాఖ్యానించారు.
ఇక దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రి దక్కే చాన్స్ ఉందన్నారు.