భువనేశ్వర్: లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫలితాలు వైఫల్యంపై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ( ఒడిశా పీసీసీ)ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రద్దుచేశారు. ఒడిశా అధ్యక్షుడితో సహా మొత్తం పీసీసీని రద్దు చేయాలన్న ప్రతిపాదనను ప్రెసెడెంట్ ఖర్గే ఆదివారం ఆమోదం తెలిపారు.
పీసీసీ అధ్యక్షుడు, పీసీసీ, ఆఫీసు బేరర్లు, ఎగ్జిక్యూటీవ్ కమిటీ, జిల్లా, బ్లాక్, మండల్ కాంగ్రెస్ కమిటి, ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు, పలు విభాగాలు, సెల్స్‌ను రద్దుచేసినట్లు అధ్యక్షుడు ఖర్గే ఒక ప్రకటనలో వెల్లడించారు.
తిరిగి పీసీసీని ఎంపిక చేసే వరకు డీసీసీ ప్రెసిడెంట్లను పీసీపీ ప్రెసిండెంట్లుగా నియమిస్తున్నట్లు తెలిపారు. రద్దు అయిన ఒడిశా పీసీసీకి ఇప్పటివరకు ప్రెసిడెంట్‌గా సరత్ పాట్నాయన్ పనిచేశారు.
ఒడిశాలో మొత్తం 21 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ కేవలం 1 స్థానంలో మాత్రమే గెలుపొంది. బీజేపీ 20 స్థానాల్లో విజయం సాధించింది. ఇక.. బీజేడీ ఖాతా తెరవలేదు. పార్లమెంట్‌తో పాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మూడోస్థానాకి పరిమితమైంది. మొత్తం147 సీట్లు ఉన్న ఒడిశాలో కాంగ్రెస్ పార్టీ కేవలం 14 సీట్లకే పరిమితమైంది. ఇక్కడ బీజేడీ ప్రభుత్వం దించేసిన బీజేపీ 78 స్థానాల్లో విజయం సాధించింది. బీజేడీ 51 స్థానాలను గెలుచుకొని రెండో స్థానంతో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment