సాక్షి, అమరావతి: సదావర్తి భూములకు అదనంగా రూ.5 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చినా ప్రభుత్వం స్పందించక పోవడంలో ఆంతర్యమేమిటని పీసీసీ ప్రధాన కార్యదర్శి పక్కాల సూరిబాబు ప్రశ్నించారు. గురువారం విజయవాడలో విలేకర్లతో మాట్లాడుతూ ఎకరం రూ. 6 కోట్లు ఉన్న సదావర్తి భూములను చౌకగా ఎకరం రూ. 27 లక్షలకే టీడీపీ నేతలకు కట్టబెట్టారన్నారు. విమర్శలు రావడంతో ఎవరైనా రూ. 5 కోట్లు అదనంగా చెల్లిస్తామని ముందుకొస్తే వేలంపాట రద్దుచేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఆ తర్వాత చేతులెత్తేసిందని ఆరోపించారు.