Rs 5 crore
-
ఐఐటీ మద్రాస్‌కు పూర్వ విద్యార్థి రూ.5 కోట్లు
సాక్షి, చెన్నై: ఐఐటీ మద్రాస్‌కు పూర్వ విద్యార్థి డాక్టర్ పరశురామ్ బాల సుబ్రమణియన్ రూ.5 కోట్లు విరాళంగా అందజేశారు. ఆక్వామాప్ పరిశోధన కేంద్రానికి ఈ మొత్తాన్ని అందించారు. ఈ సందర్భంగా మద్రాస్ ఐఐటీ ఆయన్ను విశిష్ట పూర్వ విద్యార్థి అవార్డుతో సత్కరించింది. ఆక్వామాప్ పరివర్తనాత్మక నీటి నిర్వహణ, విధానాల పరిష్కారాల కోసం పనిచేస్తుంది. ఈ కేంద్రం భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు(పీఎస్ఏ) కార్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 2022లో డాక్టర్ పరశురామ్ బాలసుబ్రమణియన్, ఇతిహాస రీసెర్చ్ అండ్ డిజిటల్ అధ్యక్షుడు శ్రీకృష్ణన్ నారాయణన్ కలిసి ఆక్వా మాప్‌ను స్థాపించారు. పరశురామ్ ఐఐటీ మద్రాస్ నుంచి ఇంజినీరింగ్, మేనేజ్మెంట్లో పట్టభద్రుడయ్యారు. -
సాధారణ టెకీ.. రూ.5 కోట్ల నెట్‌వర్త్..
కోటీశ్వరులు కావాలని, సంపద పెంచుకోవాలని చాలా మంది కలలు కంటారు. కానీ కొంత మంది మాత్రమే వాటిని నిజం చేసుకుంటారు. అలాంటి వారిలో ఒకరు గుర్గావ్కు చెందిన యాక్సెంచర్ ఉద్యోగి గుర్జోత్ అహ్లువాలియా. కేవలం 11 ఏళ్లలో జీరో నుండి రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌ను నిర్మించుకున్నారు. తన అద్భుతమైన ఆర్థిక ప్రయాణాన్ని ఆయనే వెల్లడించారు.2025లో ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్న అహ్లువాలియా.. తాను సాధించిన మైలురాయిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 2024 తనకు అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌ను చూపుతున్న తన ఆర్థిక ట్రాకింగ్ యాప్ స్క్రీన్‌షాట్‌ను కూడా అహ్లువాలియా పోస్ట్ చేశారు. ఇందులో రూ. 2.7 లక్షల మేర మాత్రమే అప్పులు చూపుతోంది.మూడే సూత్రాలు తన విజయానికి మూడు అంశాల విధానం కారణమని అహ్లువాలియా చెబుతున్నారు. అవి అధిక ఆదాయాల కోసం కెరీర్ పురోగతి, ఆలస్యమైన సంతృప్తి ద్వారా క్రమశిక్షణతో కూడిన పొదుపు, వ్యూహాత్మక ఈక్విటీ పెట్టుబడులు. ఇవే కేవలం 11 ఏళ్లలో తాను రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌ను చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన చెబుతున్నారు.జీతం పొందే మధ్యతరగతి వ్యక్తి నుండి రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌కు చేరడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయని ఆయన గుర్తించారు. ఒకటి అప్పు లేకపోవడం (విద్యకు తల్లిదండ్రులు నిధులు సమకూర్చినందున) అద్దె ఖర్చు లేకపోవడం (ఆయన తల్లిదండ్రులతో కలిసే ఉంటున్నారు). అయితే ఇటీవలి మార్కెట్ దిద్దుబాట్లు తన నెట్‌వర్త్‌లో 8-10% క్షీణతకు దారితీశాయని కూడా ఆయన అంగీకరించారు.Hitting this milestone was my biggest achievement in 2024.A salaried middle class person like me went from 0 to ₹5,00,00,000 in 11 years.3 Key Elements1. Professional Growth - high income2. Aggressive savings - delay gratification3. Equity investing - owning businesses pic.twitter.com/t3niPluPW7— Gurjot Ahluwalia (@gurjota) February 2, 2025 -
ఐటీ సోదాల్లో రూ. 5 కోట్ల నగదు పట్టివేత.. ఎన్నికల కోసమేనా?
నల్లగొండ: జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఐటీ సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది. జిల్లాకు చెందిన పలువురు రైస్ మిల్లర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ. 5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మహాశక్తి, వైదేహి, వజ్రతేజ, సుమాంజలి, కీర్తి, వెంకటసాయి రైస్ మిల్లర్ల వద్ద నుంచి డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికల కోసం ఈ డబ్బును సిద్ధం చేసినట్లుగా ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, నిడమనూరు, త్రిపురారంలో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. -
అద్దె భవనంలో ప్రపంచ కుబేరుడు 'జెఫ్ బెజోస్' - రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైన అమెజాన్ ఫౌండర్ 'జెఫ్ బెజోస్' (Jeff Bezos) ఇటీవల తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఇతడు వేలకోట్ల ఆస్తిని పక్కన పెట్టి నెలకు సుమారు రూ. 5 కోట్లు రెంట్ చెల్లిస్తూ అద్దె ఇంట్లో ఉన్నట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనల్లో తెలుసుకుందాం. దాదాపు రూ. 12 లక్షల కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగిన జెఫ్ బెజోస్ కాబోయే భార్యతో కలిసి కాలిఫోర్నియాలోని మాలిబు మాన్షన్‌లో ఉన్నట్లు సమాచారం. హాలీవుడ్ మ్యుజిషియన్ కెన్నీ జీ (Kenny G)కి చెందిన ఈ భవనం 5500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ భవనంలో రికార్డింగ్ స్టూడియో, స్విమ్మింగ్ పూల్ వంటి అనేక లగ్జరీ సదుపాయాలు ఉన్నాయి. దీనికి నెలకు 600000 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 5 కోట్లు) అద్దె చెల్లిస్తున్నారు. ఇదీ చదవండి: లాంచ్‌కి ముందే 'సైబర్‌ట్రక్' డ్రైవ్ చేసిన మస్క్ - ఫోటో వైరల్ సముద్ర తీరంలో ఉన్న ఈ భవనంలో గత మార్చి నుంచి వీరిరువురు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బెజోస్ ప్రస్తుతం ఒక విశాలమైన భవనం నిర్మించుకుంటున్నట్లు సమాచారం. అది పూర్తి కావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు అద్దె భవనంలోనే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి జెఫ్ బెజోస్ 2018లో తన మాజీ భార్య 'మెకంజీ స్కాట్'కి విడాకులిచ్చి, పెద్ద మొత్తంలో భరణం కూడా చెల్లించాడు. ఆ తరువాత లారెన్ శాంచెజ్‌తో డేటింగ్ చేస్తున్నారు. కాగా వీరికి ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి తరువాత కొత్తగా నిర్మించుకున్న భవనంలోకి మారనున్నట్లు సమాచారం. -
డ్రగ్స్ రాకెట్ కలకలం: కాలేజీ స్టూడెంట్స్, టెక్కీలే టార్గెట్
బనశంకరి: కర్ణాటకలో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగు చూసింది. బెంగళూరు సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులు శుక్రవారం బెంగళూరులోని హెణ్ణూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంటిపై దాడి చేసి అస్సాంకు చెందిన ప్రముఖ డ్రగ్స్ పెడ్లర్ నబరన్‌చెక్మా, అతని అనుచరులు మోబీన్బాబు, రోలాండ్ రోడ్నిరోజర్, తరుణ్‌కుమార్ లాల్‌చంద్‌ను అరెస్ట్ చేశారు. రూ.6 కోట్ల విలువైన 15 కిలోల ఆశీశ్ ఆయిల్, 11 కిలోల గంజాయి, 530 గ్రాముల సెరస్ ఉండలు స్వాధీనం చేసుకున్నట్లు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ మీడియాకు తెలిపారు. రాష్ట్ర పోలీస్ చరిత్రలో 15 కిలోల ఆశీశ్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని తెలిపారు. గత ఏడాది సీసీబీ యాంటీ డ్రగ్స్ పోలీసులు పక్కా సమాచారంతో బెంగళూరులోని రామమూర్తినగరలో దాడులు నిర్వహించి నబరన్‌చెక్మా అనుచరుడు సింటోథామస్ను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నబరన్‌చెక్మా తప్పించుకున్నాడు. అతని కోసం గాలిస్తుండగా హెణ్ణూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు అందిన సమాచారంతో దాడులు నిర్వహించగా నబరన్‌చెక్మా గ్యాంగ్, అతని అనుచరులు పట్టుబడ్డారని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. నబరన్‌చెక్మా తన అనుచరులతో కలిసి కాలేజీ విద్యార్థులు, ఐటీ, బీటీ కంపెనీలకు చెందిన టెక్కీలకు ఆశీశ్ ఆయిల్, గంజాయిని విక్రయించేవాడని తెలిపారు. (Mirabai Chanu: మరోసారి మనసు దోచుకున్న చాను, ప్రాక్టీస్ షురూ, ఫోటో వైరల్) Yet another drug haul by CCB Anti Narcotics Wing..Rs 5 cr worth of 15 Kgs Hashish, 10 Kg Cannabis, Charas, Cocaine, Ecstacy pills, LSD strips, Hydro Ganja plants seized.. 5 accused arrested..& r main kingpin of hashish supply in Blore..@CPBlr @BlrCityPolice pic.twitter.com/RdGi70EBJX — Sandeep Patil IPS (@ips_patil) August 6, 2021 -
తాగునీటికి రూ.5 కోట్లు అవసరం
ఆమనగల్లు: జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.5కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావ్ చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేయవచ్చని ఆయన చెప్పారు. ఆమనగల్లు మండలం రాంనుంతల, ఆమనగల్లులో ఉన్న నర్సరీలను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రాంనుంతలలోని అయ్యసాగరం నర్సరీలో కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వానికి నీటి సమస్యల పరిష్కారానికి రూ.5కోట్లతో ప్రతిపాదనలు పంపించామని.. రెండుమూడు రోజుల్లో నిధులు మంజూరు కావచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వం కేటాయించే నిధులతో నూతనంగా బోర్ల డ్రిల్లింగ్ చేపట్టకుండా అవసరమైన బోర్లను లీజుకు తీసుకుని నీటిని సరఫరా చేస్తామని ఆయన వివరించారు. గతంలో బోర్ల లీజు, నీటి ట్యాంకర్ల సరఫరాకు సంబంధించిన బకాయిలు రూ.9 కోట్లు ఉన్నాయని వాటిని ఈ నెలాఖరు లోగా చెల్లిస్తామని ఆయన చెప్పారు. జిల్లాలో 51 అటవీశాఖ, 16 ఎన్ఆర్ఈజీఎస్ వననర్సరీలు ఉన్నాయని ఈ నర్సరీలలో 2.37 కోట్ల మొక్కలను హరితహారం కోసం పెంచుతున్నామని కలెక్టర్ వివరించారు. వీటితో పాటు ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో పదిలక్షల మొక్కలు పంపిణీ చేస్తామని ఆయన వివరించారు. ప్రతి గ్రామంలో 40వేల మొక్కలను నాటుతామని ఆయన తెలిపారు. జిల్లాలో ఉపాధిహామీ పథకంలో రూ.5.36కోట్ల బకాయిలు కూలీలకు చెల్లించాల్సి ఉందని.. వీలైనంత త్వరలో బకాయిలు చెల్లిస్తామని కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. ప్రస్తుతం ఈజీఎస్‌లో 34వేల మంది కూలీలు పనులు చేస్తున్నారని.. మరికొన్ని రోజుల్లో 50వేల మంది కూలీలు పనుల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి వినోద్‌కుమార్, ఎఫ్డీఓ జానకిరాం, ఆమనగల్లు మండల ప్రత్యేకాధికారి, జేడీఏ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, కందుకూరు ఆర్డీఓ నర్సింహారెడ్డి, తహసీల్దార్ అనిత, ఎంపీడీఓ వెంకట్రాములు, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ కమాలుద్దీన్ తదితరులున్నారు. అటవీశాఖ అధికారుల తీరుపై అసంతృప్తి అటవీశాఖ అధికారులు, సిబ్బంది తీరుపై జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో అయ్యసాగరం నర్సరీ, చంద్రాయణపల్లితండా నర్సరీలలో మొక్కలు ఎండిపోవడం పట్ల కలెక్టర్ అసంతప్తి వ్యక్తం చేశారు. నీటి ఇబ్బందులు ఉంటాయని తెలిసినప్పటికి పెద్ద మొత్తంలో మొక్కలు ఎందుకు పెంచారని ఆయన ప్రశ్నించారు. దీనికితోడు రికార్డుల నమోదు కూడా సరిగా లేకపోవడంతో అటవీశాఖ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రూ.5 కోట్లు ఇస్తామన్నా స్పందన ఏదీ? : పీసీసీ
సాక్షి, అమరావతి: సదావర్తి భూములకు అదనంగా రూ.5 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చినా ప్రభుత్వం స్పందించక పోవడంలో ఆంతర్యమేమిటని పీసీసీ ప్రధాన కార్యదర్శి పక్కాల సూరిబాబు ప్రశ్నించారు. గురువారం విజయవాడలో విలేకర్లతో మాట్లాడుతూ ఎకరం రూ. 6 కోట్లు ఉన్న సదావర్తి భూములను చౌకగా ఎకరం రూ. 27 లక్షలకే టీడీపీ నేతలకు కట్టబెట్టారన్నారు. విమర్శలు రావడంతో ఎవరైనా రూ. 5 కోట్లు అదనంగా చెల్లిస్తామని ముందుకొస్తే వేలంపాట రద్దుచేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఆ తర్వాత చేతులెత్తేసిందని ఆరోపించారు. -
గుజరాత్లో రూ. 5 కోట్ల విలువైన సొమ్ము దోపిడీ
అహ్మదాబాద్: గుజరాత్లో జాతీయ రహదారిపై భారీ దోపిడీ జరిగింది. దాదాపు రూ. 5 కోట్ల విలువైన బంగారం, వెండిని దుండగులు దోచుకున్నారు. ఈ ఘటన అహ్మదాబాద్‌కు చేరువలోని భాల్యా గ్రామం వద్ద చోటుచేసుకుంది. రూ. 5 కోట్ల విలువైన సొత్తును ఒక ట్రక్‌లో అహ్మదాబాద్ నుంచి రాజ్‌కోట్‌కు తరలిస్తుండగా దాదాపు ఐదు మంది దుండగులు ట్రక్‌ను అడ్డగించారు. ట్రక్‌లోని 25 సొమ్ముతో కూడిన బాక్సులను కారులోకి తరలించి పోలీసులు రాకముందే పారిపోయారు. అంతకు ముందే ట్రక్కు జీపీఎస్‌ను ఏర్పాటు చేసిన యజమాని ఈశ్వర్ బేచర్ అంగాడియా ట్రక్ నిర్మానుష్య ప్రదేశంలో ఆగి ఉండడం గమనించి డ్రైవర్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు. వెంటనే ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరేసరికే దుండగులు అక్కడి నుంచి సొమ్ముతో ఉడాయించారు. ఆ సొత్తు విలువ రూ. 5 కోట్లని అహ్మదాబాద్ గ్రామీణ పోలీస్ నిర్లిప్త్ రాయ్ తెలిపారు. -
దిగొచ్చిన రవిశంకర్
న్యూఢిల్లీ :ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవిశంకర్ ఎట్టకేలకు దిగి వచ్చారు. నిన్నటివరకు పైన్ కట్టేది లేదని భీష్మించిన రవిశంకర్ చివరికి అంగీకరించారు. కోర్టు తమకు విధించిన ఫైన్ చెల్లించేందుకు గడువు కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నాలుగు వారాల్లోగా అయిదు కోట్ల జరిమానాను చెల్లిస్తామని శుక్రవారం కోర్టును ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వేడుకుంది. అంత పెద్ద మొత్తాన్ని ఇప్పటికిపుడు చెల్లించలేమని తెలిపింది. తమది స్వచ్ఛంధ సంస్థ అని, కల్చరల్ ఫెస్టివల్ ఆరంభమయ్యేలోపు అంత మొత్తాన్ని సమీకరించలేమని పిటిషన్లో పేర్కొంది. అటు జైలుకైనా వెళతాకానీ, ఫైన్ కట్టేదిలేదన్న రవిశంకర్ వ్యాఖ్యలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆయన లాంటి వారినుంచి అలాంటి ప్రకటనను ఊహించలేమని, ట్రిబ్యునల్ ను వివాదాస్పదం చేయొద్దని హెచ్చరించింది. బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. అయితే తక్షణమే రూ.25 లక్షలు చెల్లించాలని, మిగిలిన రూ 4.75 కోట్లు చెల్లించడానికి వీలుగా 3 వారాల గడువును ఇస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఒకవేళ ఈరోజు రూ .25 లక్షల చెల్లించడంలో సంస్థ విఫలమైతే ప్రభుత్వం జారీ చేసే 2.5 కోట్ల రూపాయలు ఎటాచ్ చేయబడతాయని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను ఏ్రపిల్ 4వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యమునా నది తీరంలో వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్ కు గ్రీన్ సిగ్నల్ పడినట్టయింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఫెస్టివల్ ను ప్రారంభించనున్నారు. అటు పండిట్ రవిశంకర్ నిర్వహిస్తున్న ప్రపంచ సంస్కృతి ఉత్సవంపై ఇవాళ కూడా పార్లమెంట్ దద్దరిల్లింది. రాజ్యసభలో రవిశంకర్ వైఖరిపై జేడీయూ నేత శరద్ యాదవ్ మండిపడ్డారు. కల్చర్ ఈవెంట్‌తో పర్యావరణాన్ని పాడు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేశ్ ఆరోపించారు. -
’ఆ జ్యువెలరీ విలువ ఐదు కోట్లు’
-
రేటు రూ. 5 కోట్లు.. స్పీడు 100 కి.మీ.
-
రూ.5 కోట్లతో ఉగాది ఉత్సవాలు
మంత్రి పల్లె ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు పుట్టపర్తి టౌన్ : మన్మథనామ సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఆయన న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్‌లో మన్మథనామ సంవత్సర ఉగాది వేడుకలను శనివారం గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలంలోని అనంతరంవరంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేడుకలను ప్రారంభిస్తారన్నారు. వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన తెలుగు జాతి కీర్తిని ఇనుమడింపజేసిన 32 మంది కళాకారులకు కళారత్న పురష్కారాలు, 67 మందికి ఉగాది పురస్కారాలను సీఎం చేతులు మీదుగా అందజేస్తారన్నారు. ప్రముఖ వాగ్గేయకారుడు డాక్టర్ బాలాంత్రపు రజనీ కాంతారావుకు తెలుగు-వెలుగు విశిష్ట పురస్కారంతో పాటు లక్ష రూపాయల నగదును బహుమతిగా అందజేయనున్నట్లు తెలిపారు. 32 మంది కళారత్న పురస్కాకర గ్రహితలకు రూ.10 వేల నగదు బహుమతి అందిస్తామన్నారు. అనంతపురం జిల్లా నుంచి 8 మంది రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారన్నారు. పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు ఆయన ప్రత్యేక ఉగాధి శుభాకాంక్షలు తెలిపారు.