సాధారణ టెకీ.. రూ.5 కోట్ల నెట్‌వర్త్‌.. | Accenture Employee Shares How He Went From Zero To Rs 5 Crore In 11 Years | Sakshi
Sakshi News home page

జీరో నుంచి రూ.5 కోట్ల నెట్‌వర్త్‌.. మూడే సూత్రాలు

Published Thu, Feb 6 2025 2:14 PM | Last Updated on Thu, Feb 6 2025 3:20 PM

Accenture Employee Shares How He Went From Zero To Rs 5 Crore In 11 Years

కోటీశ్వరులు కావాలని, సంపద పెంచుకోవాలని చాలా మంది కలలు కంటారు.  కానీ కొంత మంది మాత్రమే వాటిని నిజం చేసుకుంటారు. అలాంటి వారిలో ఒకరు గుర్గావ్‌కు చెందిన యాక్సెంచర్ ఉద్యోగి గుర్జోత్ అహ్లువాలియా.  కేవలం 11 ఏళ్లలో జీరో నుండి రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌ను నిర్మించుకున్నారు. తన అద్భుతమైన ఆర్థిక ప్రయాణాన్ని ఆయనే వెల్లడించారు.

2025లో ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్న అహ్లువాలియా..  తాను సాధించిన మైలురాయిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 2024 తనకు అతిపెద్ద విజయంగా అభివర్ణించారు.  రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌ను చూపుతున్న తన ఆర్థిక ట్రాకింగ్ యాప్ స్క్రీన్‌షాట్‌ను కూడా అహ్లువాలియా పోస్ట్ చేశారు. ఇందులో రూ. 2.7 లక్షల మేర మాత్రమే అప్పులు చూపుతోంది.

మూడే సూత్రాలు 
తన విజయానికి మూడు అంశాల విధానం కారణమని అహ్లువాలియా చెబుతున్నారు. అవి అధిక ఆదాయాల కోసం కెరీర్ పురోగతి, ఆలస్యమైన సంతృప్తి ద్వారా క్రమశిక్షణతో కూడిన పొదుపు,  వ్యూహాత్మక ఈక్విటీ పెట్టుబడులు. ఇవే కేవలం 11 ఏళ్లలో తాను రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌ను చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన చెబుతున్నారు.

జీతం పొందే మధ్యతరగతి వ్యక్తి నుండి రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌కు చేరడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయని ఆయన గుర్తించారు. ఒకటి అప్పు లేకపోవడం (విద్యకు తల్లిదండ్రులు నిధులు సమకూర్చినందున)  అద్దె ఖర్చు లేకపోవడం (ఆయన తల్లిదండ్రులతో కలిసే ఉంటున్నారు). అయితే ఇటీవలి మార్కెట్ దిద్దుబాట్లు తన నెట్‌వర్త్‌లో 8-10% క్షీణతకు దారితీశాయని కూడా ఆయన అంగీకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement