IT employee
-
ఇన్ఫోసిస్ జీతాల పెంపు.. ఎంత పెరుగుతాయంటే..
జీతాల పెంపు గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇన్ఫోసిస్ (Infosys) కీలక విషయం తెలిపింది. దేశీయ ఐటీ సేవల దిగ్గజం (IT Company) భారత్‌లో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు 6-8 శాతం వార్షిక జీతాల పెంపును ఈ ఏడాది జనవరి నుండి ప్రారంభించనుంది. ఇది దాని ప్రణాళికాబద్ధమైన వేతన సవరణలలో మొదటి దశ. రెండవది వచ్చే ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతుంది."భారత్‌లో కాంప్ (వార్షిక వేతనాల పెంపు) 6-8% ఉంటుందని ఆశిస్తున్నాం. విదేశీ కాంప్‌లు మునుపటి కాంప్ సమీక్షలకు అనుగుణంగా ఉంటాయి" అని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్రాజ్కా డిసెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసిక ఫలితాల (Q3FY25) వెల్లడి సందర్భంగా మీడియాతో అన్నారు.బెంగళూరుకు చెందిన ఈ ఐటీ కంపెనీలో ప్రపంచవ్యప్తంగా 3.23 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇన్ఫోసిస్ చివరిసారిగా 2023 నవంబర్‌లో జీతాల పెంపును అమలు చేసింది. సాధారణంగా సంవత్సరం ప్రారంభంలో అమలు కావాల్సిన వేతన పెంపు ఆలస్యం అవుతూ వస్తోంది. ప్రపంచ డిమాండ్ వాతావరణంలో ప్రత్యేకించి ఐటీ పరిశ్రమలో విస్తృత అనిశ్చితిని ఇది ప్రతిబింబిస్తోంది. బలహీనమైన విచక్షణ వ్యయం, ఆలస్యమైన క్లయింట్ బడ్జెట్లు, కొనసాగుతున్న స్థూల ఆర్థిక అనిశ్చితి నుండి ఐటీ కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.కాగా వేతన పెంపు ప్రభావం మార్జిన్లపై ఏ మాత్రం పడుతుందన్నది లెక్కించలేదని కంపెనీ తెలిపింది. ఈ క్రమంలో 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం, 2026 మొదటి త్రైమాసికంలో "కొన్ని ఎదురుగాలులు" తప్పవని సంఘ్రాజ్కా పేర్కొన్నారు. మరోవైపు భారత్ వెలుపల ఉండే ఉద్యోగులకు కూడా జీతం పెంపు సింగిల్ డిజిట్‌లోనే మునుపటి వేతన సమీక్షలకు అనుగుణంగా ఉంటాయి. ఇక అధిక పనితీరు కనబరిచేవారికి ఎలాగూ వేతన పెంపు కాస్త ఎక్కువగానే ఉంటుందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ క్యూ3 ఫలితాలను ప్రకటించిన తర్వాత విశ్లేషకులతో మాట్లాడుతూ వెల్లడించారు.రూ.6,806 కోట్ల లాభంఏదేమైనా ఇన్ఫోసిస్ మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలను (Q3 Results) సాధించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.6,806 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.6,506 కోట్లతో పోలిస్తే ఇది 11.4 శాతం అధికం. అదే ఇంతకుముందు త్రైమాసికంలో (Q2FY25) నమోదు చేసిన రూ.6,106 కోట్లతో పోలిస్తే 4.6 శాతం ఎక్కువ.ఇదీ చదవండి: ‘ఇన్ఫోసిస్‌లో ఇదీ పరిస్థితి.. అందుకే జాబ్ మానేశా’ టెకీ పోస్ట్ వైరల్ఇక అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఆదాయం రూ. 41,764 కోట్లుగా ఉంది. ఇది గతేడాది క్యూ3తో వచ్చిన రూ. 38,821 కోట్లతో పోలిస్తే 7.6 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో మునుపటి త్రైమాసికంలో ఆర్జించిన (Q2FY25) రూ.40,986 కోట్లతో పోలిస్తే 1.9 శాతం పెరుగుదల. స్థిరమైన కరెన్సీ పరంగా ఆదాయం సంవత్సరం మీద 6.1 శాతం, త్రైమాసికం మీద 1.7 శాతం పెరిగింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో భవిష్యత్ ఆదాయ వృద్ధి అంచనాలను కూడా సైతం ఇన్ఫోసిస్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 4.5 నుంచి 5 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. -
‘ఇన్ఫోసిస్‌లో ఇదీ పరిస్థితి.. అందుకే జాబ్ మానేశా’
దేశంలో టాప్ 2 ఐటీ కంపెనీలో ఉద్యోగం.. ఇంట్లో సంపాదించే వ్యక్తి తనొక్కడే.. చేతిలో మరో జాబ్ ఆఫర్ లేదు.. అయినా ఇన్ఫోసిస్‌లో (Infosys) చేస్తున్న ఉద్యోగాన్ని మానేశాడు పుణేకు చెందిన ఒక ఇంజనీర్ (Pune techie). ఇంత కఠిన నిర్ణయం తాను ఎందుకు తీసుకున్నాడు.. ఇన్ఫోసిస్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి.. జాబ్ వదులుకునేందుకు దారితీసిన కారణాలు ఏమిటి.. అన్నది ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో పంచుకోగా ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.మరో ఆఫర్ చేతిలో లేకుండానే ఇన్ఫోసిస్‌లో తన ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశాడో లింక్డ్ఇన్ పోస్ట్‌లో పంచుకున్నారు పుణేకు చెందిన భూపేంద్ర విశ్వకర్మ. తాను రాజీనామా చేయడానికి ఆరు కారణాలను పేర్కొన్నారు. నారాయణ మూర్తి స్థాపించిన టెక్ దిగ్గజంలోని వ్యవస్థాగత లోపాలను, అనేక మంది ఉద్యోగులు నిశ్శబ్దంగా భరించే సవాళ్లను వెలుగులోకి తెచ్చారు."నేను ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నప్పుడు అనేక వ్యవస్థాగత సమస్యలను ఎదుర్కొన్నాను. చివరికి చేతిలో ఎటువంటి ఆఫర్ లేకపోయినా నిష్క్రమించాలనే కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. కార్పొరేట్ వర్క్‌ప్లేస్‌లలో చాలా ఎదుర్కొంటున్న ఈ సవాళ్ల గురించి నేను బహిరంగంగా మాట్లాడాలనుకుంటున్నాను" అని భూపేంద్ర తన పోస్ట్‌లో పేర్కొన్నారు.జాబ్ మానేయడానికి భూపేంద్ర పేర్కొన్న కారణాలు» ఆర్థిక వృద్ధి లేదు: జీతం పెంపు లేకుండా సిస్టమ్ ఇంజనీర్ నుండి సీనియర్ సిస్టమ్ ఇంజనీర్‌గా ప్రమోషన్ వచ్చింది. మూడేళ్లు కష్టపడి నిలకడగా పనిచేసినా భూపేంద్రకు ఎలాంటి ఆర్థిక ప్రతిఫలం కనిపించలేదు.» అన్యాయమైన పనిభారం: భూపేంద్ర బృందాన్ని 50 నుండి 30 మంది సభ్యులకు కుదించబడినప్పుడు అదనపు పనిభారం మిగిలిన ఉద్యోగులపై పడింది. అయినా పరిహారం, గుర్తింపు లేవు. కేవలం పని ఒత్తిడి మాత్రం పెరిగింది.» అస్పష్టంగా కెరీర్ పురోగతి: నష్టం తెచ్చే పనిని అప్పగించారు. ఇందులో భూపేంద్ర ఎదుగుదలకు అవకాశం కనిపించలేదు. పరిమిత జీతాల పెంపుదల, అస్పష్టమైన కెరీర్ పురోగతి వృత్తిపరమైన డెడ్వెయిట్గా భావించేలా చేసింది.» టాక్సిక్ క్లయింట్ వాతావరణం: తక్షణ ప్రతిస్పందనల కోసం అవాస్తవిక క్లయింట్ అంచనాలు అధిక ఒత్తిడి వాతావరణాన్ని సృష్టించాయి. చిన్నపాటి సమస్యలపైనా పదేపదే ఒత్తిడి పెరగడం వల్ల ఉద్యోగి శ్రేయస్సును దెబ్బతీసే విషపూరితమైన పని సంస్కృతికి దారితీసింది.» గుర్తింపు లేకపోవడం: సహోద్యోగులు, సీనియర్ల నుండి ప్రశంసలు పొందినప్పటికీ, ఇది ప్రమోషన్లు, జీతం పెంపు, లేదా కెరీర్ పురోగతి రూపంలోకి మారలేదు. భూపేంద్ర తన కష్టానికి ప్రతిఫలం కాకుండా దోపిడీకి గురవుతున్నట్లు భావించారు.» ఆన్సైట్ అవకాశాల్లో ప్రాంతీయ పక్షపాతం: ఆన్సైట్ అవకాశాలు మెరిట్ ఆధారంగా కాకుండా మాట్లేడే భాష ఆధారంగా ఇస్తున్నారు. నిర్దిష్ట భాషలు మాట్లాడే ఉద్యోగులు తనలాంటి హిందీ మాట్లాడే ఉద్యోగులను పక్కన పెట్టారని ఆరోపించారు.ఇదీ చదవండి: ముప్పు అంచున మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు.. కలవరపెడుతున్న కంపెనీ ప్లాన్కంపెనీల్లో పని సంస్కృతి, పని ఒత్తిడి పెంచే కార్పొరేట్ అధిపతుల వ్యాఖ్యల నడుమ విస్తృత చర్చలు సాగుతున్న తరుణంలో తాజాగా భూపేంద్ర పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఆన్లైన్లో మరింత చర్చకు దారితీసింది. ఈ పోస్ట్‌పై చాలా మంది యూజర్లు ప్రతిస్పందిస్తున్నారు. భూపేంద్రను సమర్థిస్తూ కొందరు, విభేదిస్తూ మరికొందరు కామెంట్లు పెట్టారు. -
ఇద్దరు పిల్లలను చంపి ఐటీ ఉద్యోగుల ఆత్మహత్య!
సాక్షి బెంగళూరు: అపత్కాలంలో నమ్మించిన వాళ్లే మోసం చేశారు. ఆ మోసాన్ని తట్టుకోలేక, ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఇద్దరు బిడ్డలకు విషం ఇచ్చి చంపడమే కాకుండా.. ఆ తర్వాత దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఆర్‌ఎంవీ ఎక్స్టెన్షన్ రెండో లేఅవుట్లో రెండేళ్లుగా ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌కు చెందిన అనూప్‌కుమార్ (38), ఆయన భార్య రాఖీ (35) నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఐదేళ్ల అనుప్రియా అనే కుమార్తె, రెండేళ్ల ప్రియాంక్ అనే కుమారుడున్నారు. అనూప్‌కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తన కుమార్తె అనుప్రియాకు మానసికంగా సరిగా లేకపోవడంతో ఇంటి పనికోసం, తన పాపను చూసుకునేందుకు ఇద్దరు పనివారిని పెట్టుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ సోమవారం ఉదయం ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి చంపేసి ఆ తర్వాత దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం పనివారు ఉదయాన్నే వచ్చి కాలింగ్ బెల్ కొట్టినా లోపలి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో వెంటనే తలుపులు తోసుకుంటూ లోపలికి వెళ్లి చూడగా వారి హత్యోదంతం బయటపడింది. అనూప్ కుమార్‌కు ఉద్యోగం లేకపోవడంతో దంపతులు తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు తనని ఆపత్కాలంలో ఆదుకుంటాయని ఉద్దేశ్యంతో తెలిసిన బంధువు ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టారు. బంధువులు మోసం చేశారు. పిల్లలకు చుట్టుముడుతున్న అనారోగ్య సమస్యలకు తట్టుకోలేక తనువు చాలించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.👉ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
హలో అన్నాడు.. రూ.11.8 కోట్లు పోగొట్టుకున్నాడు
బెంగళూరు : హలో సార్..! మేం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుంచి కాల్ చేస్తున్నాం. మీ ఆధార్ కార్డ్‌తో మనీ లాండరింగ్, ఆధార్ కార్డ్‌కు జత చేసిన సిమ్‌ను తప్పుడు ప్రకటనల కోసం వినియోగిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ అగంతకుల నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో ఓ ఐటీ ఉద్యోగి రూ.11.8 కోట్లు పోగొట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన 39 ఏళ్ల టెక్కీ డిజిటల్ అరెస్ట్ అయ్యారు. నవంబర్ 11న బాధితుడికి తాను ట్రాయ్ అధికారినంటూ ఓ అగంతకుడు ఫోన్ చేశాడు. ఆధార్ కార్డుతో అనుసంధానం చేసిన సిమ్ కార్డుతో అక్రమ ప్రకటనలు, మహిళల్ని వేదించేలా వారికి మెసేజ్‌లు పంపేందుకు ఉపయోగిస్తున్నారని, దీనిపై ముంబైలోని కోల్బా సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు చెప్పాడు. దీంతో బాధితుడు భయాందోళనకు గురయ్యాడు. మేం మీకు ఫోన్ చేసిన విషయాన్ని గోప్యంగా ఉంచండి. కేసును ఆన్లైన్లో విచారిస్తాం. సహకరించండి. వర్చువల్‌గా విచారించేందుకు మీరు ఓ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి అని కోరాడు. ఆ తర్వాత బాధితుడికి నకిలీ ముంబై పోలీసు యూనిఫాం ధరించిన ఒక వ్యక్తి వీడియో కాల్ చేశాడు. ఓ వ్యాపార వేత్త మీ ఆధార్ కార్డ్‌ను ఉపయోగించి రూ.6 కోట్ల విలువైన లావాదేవీలు నిర్వహించేందుకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. దీనిపై కేసు నమోదైందని మరింత భయపెట్టించాడు. అయితే, నవంబర్ 25న, పోలీసు యూనిఫాంలో ఉన్న మరొక వ్యక్తి బాధితుడికి ఓ యాప్ నుంచి కాల్ చేశాడు. మీ కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. ప్రస్తుతం, మీరు మా విచారణకు సహకరించాలి. లేదంటే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తామని హెచ్చరించాడు. ముందుగా వెరిఫికేషన్ నిమిత్తం చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపండి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బెదిరించాడు. బాధితుడు అరెస్టుకు భయపడి నిందితులు చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు రూ.11.8కోట్లను ట్రాన్స్ ఫర్ చేశాడు. అది సరిపోదని ఇంకా కావాలని డిమాండ్ చేయడం తాను మోసపోయినట్లు గుర్తించారు. వెంటనే తాను మోసపోయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? అయితే తీపి కబురు
ఐటీ రంగంలో 2025లో 15–20 శాతం మేర అధిక నియామకాలు నమోదవుతాయని ఎన్ఎల్బీ సర్వీసెస్ అంచనా వేసింది. ముఖ్యంగా ఈ ఏడాది ద్వితీయ ఆరు నెల్లలో ఈ రంగంలో కదలిక వచ్చిందని, దీంతో 2025లో ఈ పరిశ్రమలోని పలు విభాగాల్లో నియామకాలు ఆశావహంగా ఉంటాయని తెలిపింది.కీలక నైపుణ్యాలు కలిగిన.. కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలైటిక్స్, క్లౌడ్ టెక్నాలజీలకి డిమాండ్ 30–35 శాతం మేర పెరుగుతుందని అంచనా వేసింది. డిమాండ్‌లో పెరుగుదల కేవలం ఈ నైపుణ్యాలకు మాత్రమే పరిమితం కాదని, టెక్నాలజీ నైపుణ్యాలను పెంచుకోవడంపైనా దృష్టి సారించాలని పేర్కొంది.మారుతున్న టెక్నాలజీల నేపథ్యంలో తమ మానవవనరులను అవసరమైన నైపుణ్యాలపై తర్ఫీదు ఇవ్వడంపై కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్టు వివరించింది. పెద్ద కంపెనీలకు ఇప్పటికీ క్యాంపస్ నియామకాలు ప్రాధాన్యంగా కొనసాగుతాయని, 2024–25 ద్వీతీయ ఆరు నెలల్లో ఇవి చురుగ్గా నియామకాలు చేపట్టొచ్చని పేర్కొంది.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్‌తో మాకు పోలికేంటి.. గూగుల్ సీఈవో కామెంట్స్ఏఐ, ఎంఎల్, డేటా అనలైటిక్స్, పైథాన్, క్లౌడ్ టెక్నాలజీలకు నెలకొన్న అధిక డిమాండ్ 2025లో ఐటీలో ఫ్రెషర్ల నియామకాలు పెరిగేందుకు దోహదం చేయనున్నట్టు తెలిపింది. గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు (జీసీసీలు), తయారీ, బీఎఫ్ఎస్ఐ, హెల్త్‌కేర్ కంపెనీలు సైతం 30–35 శాతం అధికంగా ఐటీ నిపుణులను తీసుకోవచ్చని అంచనా వేసింది. -
ఒక్క ఇంటర్వ్యూ కోసం ఏడు నెలల కష్టం.. చివరికి ఏమైందంటే?
బెంగళూరు : మంచి కంపెనీ. సంస్థ పేరుకు తగ్గట్లు ప్యాకేజీ. అందుకే ఓ టెక్కీ ఆ ఆ భారీ మొత్తాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. కేవలం నాలుగు రౌండ్లు జరిగే ఒక్క ఇంటర్వ్యూ కోసమే ఏడు నెలలు కష్టపడ్డాడు. అలా అని సదరు టెక్కీ.. క్ బెంచ్ స్టూడెంటా అంటే అదీ కాదు. చదువులో టాపర్. ఎంఎన్ఎన్ఐటీ అలహాబాద్ పూర్వ విద్యార్థి. మరి ఒక్క ఇంటర్వ్యూ కోసం ఏడు నెలలు ఎందుకు కష్టపడాల్సి వచ్చిందని అడిగితే.. సదరు టెక్కీ ఏం చెప్పారంటే?ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లాకు చెందిన చిత్రాంశ ఆనంద్. భారత్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఒరాకిల్‌లో కంపెనీలో రెండేళ్ల పాటు పనిచేశాడు. ఏడాదికి రూ.40 లక్షలు ప్యాకేజీ. మంచి శాలరీ, అనుభవం కోసం మరో కంపెనీలో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం గట్టి ప్రయత్నాలే చేశాడు. చివరికి ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్‌లో తన అనుభవానికి తగ్గట్లు ఉద్యోగం ఉందని తెలుసుకుని అప్లయి చేశాడు.అనంతరం తన ఇంటర్వ్యూల కోసం ఏడు నెలల రీసెర్చ్ చేశాడు. రేయింబవళ్లు ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యాడు. ఇందుకోసం లీట్‌కోడ్ ఫ్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్నాడు. ఇందులో పెద్ద పెద్ద టెక్ కంపెనీల్లో నిర్వహించే టెక్నికల్ రౌండ్‌ను ఎలా చేధించవచ్చో తెలుసుకోవచ్చు. అలా ఏడు నెలల అనంతరం ఉబెర్ ఇంట్వ్యూకి అటెండ్ అయ్యాడు. నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూలో బోర్డ్ సభ్యులు అడిగిన రెండు ప్రశ్నలకు నేను చదవిన చదువుకు.. సంబంధం లేదు. అయినప్పటికీ వాటికి ఆన్సర్ ఇచ్చాడు. ఇంటర్వ్యూ క్రాక్ చేశాడు. రూ.60లక్షలు ఇచ్చేందుకు ఉబర్ ముందుకు రావడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు.ఈ సందర్భంగా ఆనంద్ ఒరాకిల్,ఉబర్‌లో ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడాడు. ఒరాకిల్‌లో ఐదు రోజులకు మూడురోజులు ఆఫీసు నుండి పని చేయాల్సి వచ్చింది. ఉబర్‌లో వారానికి రెండు రోజులు మాత్రమే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పైగా ఎక్కువ గంటలు పనిచేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఒకవేళ అవసరమైతే ఎక్కువ గంటలు పనిచేస్తా. అందులో నాకెలాంటి అభ్యంతరం లేదు. నా కెరియర్ ప్రారంభంలో ఉంది కాబట్టి ఆఫీస్- పర్సనల్ లైఫ్ విషయాల్లో ఎలాంటి ఆందోళన చెందడం లేదు. నేను అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కష్టపడి పనిచేయాలి. ఆ తర్వాత లైఫ్ బ్యాలెన్స్ విషయాలపై దృష్టిసారిస్తా అని చెప్పుకొచ్చాడు. -
ఆఫీసుల్లోనే ఆగిపోతున్న గుండెలు.. మరో టెకీ మృతి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీ కార్యాలయంలోని వాష్‌రూమ్‌లో ఓ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం జరిగిందని, మృతుడిని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీనియర్ అనలిస్ట్ నితిన్ ఎడ్విన్ మైఖేల్ (40) గా గుర్తించామని పోలీసులు తెలిపారు.శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కార్యాలయంలోని వాష్‌రూమ్‌కి వెళ్లిన మైఖేల్ ఎంతకీ బయటకు రాలేదని, సోనెగావ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి తెలిపారు. అతని సహచరులు వెంటనే అతనిని నాగ్‌పూర్‌లోని ఎయిమ్స్‌కు తరలించగా పరశీలించిన వైద్యులు అతను మృతిచెందినట్లు ప్రకటించారు.సోనేగావ్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేశారు. ప్రాథమిక శవపరీక్షలో ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించినట్లు తేలిందని పోలీసు అధికారి తెలిపారు. మైఖేల్‌కు భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నట్లు తెలిసింది.ఇటీవల కార్పొరేట్ ఉద్యోగులు కార్యాలయాల్లోనే మృత్యువాత పడుతున్నారు. లక్నోలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో సదాఫ్ ఫాతిమా అనే మహిళా ఉద్యోగి బ్యాంకులోనే కుప్పకూలి మరణించారు. అంతకుముందు పుణేలోని ఈవై కంపెనీ కార్యాలయంలో కేరళకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్ మృతిచెందారు. అధిక పనిభారం, విషపూరితమైన పని సంస్కృతే ఉద్యోగుల మరణాలకు కారణమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
‘జైలుకైనా పంపండి.. ఇంటికి మాత్రం వెళ్లను!’ ఎపిసోడ్లో ట్విస్ట్!
తనపై ఏ కేసు అయినా పెట్టుకోవాలని, అవసరమైతే జైలుకైనా పంపండని, ఇంటికి మాత్రం వెళ్లబోనని తేల్చి చెప్పిన 34 ఏళ్ల టెక్కీ విపిన్ గుప్తా ఎపిసోడ్‌పై ఆయన భార్య శ్రీపర్ణ దత్త స్పందించారు. తాను భర్తను వేధించానంటూ వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. భార్య వేధిస్తుంది కాబట్టే ఆమె నుంచి తప్పించుకునేందుకు భర్త తిరుగుతున్నారంటూ వచ్చిన వార్తల్ని ఖండించారు. తన భర్త గత కొంత కాలంగా కెరియర్ గురించి ఆందోళనకు గురైనట్లు చెప్పారు. గతంలో తన భర్తపై మిస్సింగ్ కేసు వేసిన శ్రీపర్ణ దత్తా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. నా భర్త విపిన్ రెండుసార్లు ఉద్యోగం కోల్పోయాడు. దీంతో భవిష్యత్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు తండ్రికి అనారోగ్య సమస్యలు, ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. చికిత్సకు డబ్బు అవసరం కావడంతో మానసికంగా కుంగిపోయాడు. ఉపశమనం పొందేందుకు తిరుమల దర్శనం అనంతరం నోయిడా వెళ్లినట్లు చెప్పారు. అన్నీ అవాస్తవాలేఈ సందర్భంగా తాను విపిన్‌ను వేధిస్తున్నానంటూ వచ్చిన ఆరోపణల్ని కొట్టిపారేశారు. ‘నేను నా భర్తను వేధిస్తే.. ఆయన ఆచూకీ కోసం సోషల్ మీడియాను ఎందుకు ఆశ్రయిస్తాను. నేను నా భర్తను ఎప్పుడూ వేధించలేదు. అదే జరిగితే, అతనిని వెతకాలని పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేస్తాను? ఆచూకి కోసం సోషల్ మీడియాలో పోస్ట్‌లు ఎందుకు పెడతాను’ అని ప్రశ్నించారు. మానసికంగా కృంగిపోయాడు కాబట్టే భర్తను పునరావాస కేంద్రానికి పంపించినట్లు ఆమె చెప్పారు.బెదిరింపులు ఎక్కువయ్యాయ్తన భర్త దొరికిన తర్వాత కూడా తనకు బెదిరింపు మెసేజ్‌లు వస్తున్నాయని వాపోయారు శ్రీపర్ణ దత్త. నా భర్తను కిడ్నాప్ చేశామంటూ పలువురు డబ్బుల్ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని, తనకు సైబర్ నేరస్తులు మెసేజ్‌లు పంపినట్లు వెల్లడించారు. భార్య పోరు పడలేకేగతవారం బెంగళూరు కేంద్రంగా విధులు నిర్వహించే ఐటీ ఉద్యోగి విపిన్ గుప్త ఇంటి నుంచి నోయిడా వెళ్లాడు. అయితే విపిన్ జాడకోసం ఆయన భార్య శ్రీపర్ణ దత్తా పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యల్ని చేపట్టారు. చివరికి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరుకు రప్పించగా, ఇంటికి వెళ్లేందుకు మాత్రం ఒప్పుకోలేదు. తనపై ఏ కేసు అయినా పెట్టుకోవాలని, అవసరమైతే జైలుకైనా పంపండని పోలీసుల్ని కోరాడు. అయితే పోలీసులు విపిన్‌ను బుజ్జగించడంతో కష్టం మీద ఇంటికి వెళ్లేందుకు ఒప్పుకున్నాడు. భార్యే విపిన్ మానసిక సమస్యకు చికిత్స ఇప్పించేందుకు పునరావస కేంద్రానికి పంపించారు. -
జీతం ఇవ్వలేదని సీఈఓ కిడ్నాప్.. 8 మంది అరెస్టు
ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని ఐటీ కంపెనీ సీఈవోను అపహరించిన ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు జూబ్లీహిల్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి.వెంకటగిరి తెలిపారు. నిందితుల నుంచి 84 ల్యాప్‌టాప్‌లు, 18 మొబైల్ ఫోన్లు, ఒక కారు, పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.పోలీసుల కథనం ప్రకారం..హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో రవిచంద్రరెడ్డి గిగ్లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటీ కన్సల్టెన్సీ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతడు వివిధ కన్సల్టెన్సీల ద్వారా రిక్రూట్ అయిన దాదాపు 1,200 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోయాడు. దాంతో ఉద్యోగులు, కన్సల్టెంట్లు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కంపెనీ సీఈఓ రవిచంద్రపై ప్రస్తుత ఉద్యోగులు, పలువురు మాజీ ఉద్యోగులు ఇటీవల రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రవి తమకు జీతాలు చెల్లించకుండా మోసం చేశాడని ఆరోపించారు. తాము రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల రూపాయలు వరకు చెల్లించి ఇతర కన్సల్టెన్సీల ద్వారా ఈ కంపెనీలో రిక్రూట్ అయ్యామని పేర్కొన్నారు. తమ జీతాల బకాయిలు అందకుండా తమను అన్యాయంగా ఉద్యోగంలో నుంచి తొలగించారని ఆరోపించారు.ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న బిజినెస్ కన్సల్టెంట్ ఒకరు, ఇద్దరు సాఫ్ట్వేర్లు, మరో ఐదుగురు ఉద్యోగులు కలిసి రవిచంద్రను కిడ్నాప్ చేయాలనుకున్నారు. ముందుగా అనుకున్న విధంగానే జులై 10 అర్ధరాత్రి వీరు రవి నివాసంలోకి ప్రవేశించి కిడ్నాప్ చేశారు.కిడ్నాప్ అయిన వెంటనే రవి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగే సమయంలో నిందితులు ఆమెపై దాడి చేశారని చెప్పారు. ఇంట్లో ఉన్న 84 ల్యాప్‌టాప్‌లను అపహరించినట్ల పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసు బృందం రవిచంద్రను శ్రీశైలం హైవేలోని ఓ హోటల్లో గుర్తించి రక్షించారు. నిందితులు దొంగలించిన 84 ల్యాప్‌టాప్‌లు, 18 మొబైల్ ఫోన్లు, ఒక కారు, మూడు పాస్పోర్ట్లతోపాటు వారికి చెందిన రెండు కార్లు, ఒక మోటర్‌బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ పి.వెంకటగిరి వివరించారు.ఇదీ చదవండి: ప్లాట్‌ఫామ్ ఫీజు 20 శాతం పెంపు!ఇదిలాఉండగా, ఉద్యోగం కోసం నైపుణ్యాలు పెంచుకుని నేరుగా కంపెనీలను ఆశ్రయించి ఇంటర్వ్యూలకు హాజరుకావాలని నిపుణులు చెబుతున్నారు. అంతేగానీ, దళారుల ద్వారా ఉద్యోగాల్లో చేరితే ఆర్థికంగా, ఉద్యోగపరంగా నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. -
ఐటీ కంపెనీలు ఇంతపని చేస్తున్నాయా?.. రోజులు గడుస్తున్నా..
అసలే ఉద్యోగాలు దొరక్క యువత అల్లాడిపోతుంటే.. ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగాలు కల్పించడంలో జాప్యం చేస్తున్నాయి. భారతదేశంలోని ఐటీ దిగ్గజాలు సైతం ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) పేర్కొంది.గత రెండేళ్ల కాలంలో ఐటీ కంపెనీలు సుమారు 10,000 కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని ఎన్ఐటీఈఎస్ వెల్లడించింది. ఈ జాబితాలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో మొదలైన కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేసి.. ఉద్యోగంలో చేర్చుకోవడంలో చాలా ఆలస్యం చూపిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని.. ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు.ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో ఏర్పడిన వ్యాపార అనిశ్చితి కారణంగా ఫ్రెషర్లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో జాప్యం జరుగుతుందని ఐటీ కంపెనీలు చెబుతున్నాయి. వ్యాపార అవసరాలను బట్టి ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకోవడం జరుగుతుందని, ఉద్యోగంలో చేర్చుకోవాలనుకున్నప్పుడు వారికి ముందుగానే సమాచారం తెలియాజేస్తామని ఇన్ఫోసిస్ మెయిల్స్ పంపినట్లు సమాచారం.విప్రో కూడా రెండేళ్ల క్రితం అభ్యర్థులకు అందించిన క్యాంపస్ ఆఫర్లను ఆన్‌బోర్డ్ చేయలేదు. గత సంవత్సరం ముందు, మేము క్యాంపస్‌కి వెళ్లి చాలా ఆఫర్లు చేసాము. వారందరిని ఇంకా ఉద్యోగాల్లో చేర్చుకోలేదు. వారిని ఉద్యోగాల్లో చేర్చుకున్న తరువాత కొత్త ఫ్రెషర్లను తీసుకుంటామని విప్రో సిహెచ్ఆర్ఓ సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు.తగ్గిన ఐటీ ఉద్యోగుల సంఖ్యభారతదేశంలో కరోనా మహమ్మారి తరువాత చాలామంది ఐటీ ఉద్యోగులు, తమ ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా ప్రభావం తగ్గినా తరువాత కూడా కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే వచ్చాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు విడుదల చేసిన డేటా ప్రకారం.. 20236-24 ఆర్ధిక సంవత్సరంలో 63759 మంది ఉద్యోగులు తగ్గిపోయారని తెలిసింది. -
వెబ్సైట్లో ఫొటోలు పెట్టి...
గచ్చిబౌలి: పోర్న్ వెబ్సైట్లో ఫొటోలు పెట్టడం, వాట్సప్‌లో అసభ్య మెసేజ్‌లు పంపి ఐటీ ఉద్యోగిని వేధిస్తున్న ఓ నిందితుడిని ముంబైలో అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ కుమార్ తెలిపారు. ఈస్ట్ ముంబై, గారెగాన్, జయజయప్రకాష్ నగర్‌కు చెందిన అభిõÙక్ మోహన్ కీర్తికర్ (42) ముంబైలో ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. అక్కడే ఓ కంపెనీలో పని చేసే ఐటీ ఉద్యోగిని పరిచయమైంది. ఆ ఉద్యోగినితో పరిచయం పెరగడంతో ప్రేమించాలని ప్రపోజ్ చేయగా.. ఆమె తిరస్కరించింది. అప్పటి నుంచి ఆమెను రోజూ వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్సీ కంపెనీలో ఐటీ ఉద్యోగినిగా పని చేస్తోంది. వివిధ ఫోన్ నెంబర్ల ద్వార వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు పంపడం, పోర్న్ వెబ్సైట్లలో ఆ ఉద్యోగిని ఫొటోలు, ఫోన్ నెంబర్లు పెట్టి వేధిస్తున్నాడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యంగా ఫోన్లో మాట్లాడడంతో తీవ్ర మనో వేదనకు గురైంది. ఈ క్రమంలో బాధితురాలు ఫిబ్రవరిలో గచి్చ»ౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు అభిõÙక్ మోహన్ కీర్తికర్ ను ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. సోమవారం కూకట్పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇతను చాలా మంది యువతులకు మాయమాటలు చెప్పి దగ్గర కావడం, చెప్పినట్లు వినకపోతే అసభ్య మెసేజ్‌లు పెట్టి వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు. -
కంపెనీ మారే ఆలోచనలో ఉద్యోగి.. స్వయంగా రంగంలోకి గూగుల్ కోఫౌండర్
Google employee: ఖర్చులు తగ్గించుకునే నెపంతో టెక్నాలజీ కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో వేలాదిగా ఉద్యోగులను వదిలించుకోవడం చూస్తున్నాం. అదే సమయంలో ప్రతిభ ఉన్న ఉద్యోగులు ఇతర సంస్థలకు వెళ్లకుండా వారికి కావాల్సింది ఇచ్చి కాపాడుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. ఇలాగే కంపెనీ మారే ఆలోచనలో ఉన్న ఓ ఉద్యోగిని కాపాడుకునేందుకు నేరుగా గూగుల్ కోఫౌండర్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఓపెన్ ఏఐ కంపెనీ కోసం గూగుల్‌ను వీడేందుకు సిద్ధమైన తమ ఉద్యోగికి గూగుల్ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ వ్యక్తిగతంగా ఫోన్ చేశారు. ఉద్యోగిని పోస్ట్‌లో కొనసాగేలా ఒప్పించేందుకు అదనపు వేతనం ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. కాగా కంపెనీ మారేందుకు సిద్ధమైన ఆ ఉద్యోగి గూగుల్‌లో చాలా కాలంగా ఏఐ రీసెర్చర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. సదరు గూగుల్ ఉద్యోగి తమకు స్నేహితుడని, అతనికి కోసం స్వయంగా కంపెనీ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ రంగంలోకి దిగడం బిగ్ టెక్ కంపెనీల్లో ఏఐ టాలెంట్‌కు ఉన్న డిమాండ్ ట్రెండ్‌ను సూచిస్తోందని ఓ అజ్ఞాత వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం అధునాతన ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ బిగ్ టెక్ కంపెనీల్లో అత్యధికంగా ఉంది. ఇదీ చదవండి: సందట్లో సడేమియా.. ఐటీ కంపెనీలకు వల వేస్తున్న కేరళ! -
Viral Video: స్కూటీ నడుపుతూ వర్క్ కాల్.. ఈ ఐటీ ఉద్యోగి కష్టం చూడండి..
ఏ ఉద్యోగంలో అయినా పని ఒత్తిడి మామూలే. అయితే ఇది ఐటీ పరిశ్రమలో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. బెంగళూరులో ఓ వ్యక్తి ల్యాప్‌టాప్‌లో వర్క్ కాల్లో అటెండ్ అవుతూ స్కూటర్ నడుపుతున్న వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన తర్వాత వర్క్-లైఫ్ బ్యాలెన్స్, 70 గంటల వర్క్ వీక్ చర్చ సోషల్ మీడియాలో తిరిగి మొదలైంది. పీక్ బెంగుళూరు అనే హ్యాండిల్‌పై ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేసిన ఈ క్లిప్ దేశ ఐటీ రాజధాని మూసచిత్రాన్ని చూపించింది. ఇక్కడ టెక్ నిపుణులు బహిరంగ ప్రదేశాల్లో తమ ల్యాప్‌టాప్‌లపై పనిలో నిమగ్నమై ఉండటం సర్వసాధారణమే. అయితే ఈ ఉద్యోగి మాత్రం ఓ వైపు స్కూటర్ నడుపుతూ.. మరోవైపు ల్యాప్‌టాప్‌ను ఒళ్లో పెట్టుకుని వర్క్ కాల్ అటెండ్ అవుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజనులు పలు విధాలుగా స్పందించారు. "బ్రో ఐటీ కంపెనీలో ఉండాలంటే పని చేస్తూనే ఉండాలి. వారానికి 70 గంటల సమయం కూడా సరిపోదు" అని ఓ యూజర్ కామెంట్ చేశారు. "క్లయింట్ కాల్, మరణం ఎప్పుడైనా రావచ్చు" అని మరో యూజర్ చమత్కారంగా రాసుకొచ్చారు. "ఈ రోజుల్లో పని ఒత్తిడి చాలా ఎక్కువే. అయినా ఇలా మాత్రం చేయొద్దు" అని ఇంకొక యూజర్ హితవు పలికారు. Bengaluru is not for beginners 😂 (🎥: @nikil_89) pic.twitter.com/mgtchMDryW — Peak Bengaluru (@peakbengaluru) March 23, 2024 -
షాకింగ్ లేఆఫ్.. ఇంతకంటే దారుణమైన తొలగింపు ఉంటుందా?
Google shocking layoff: టెక్ పరిశ్రమలో ఇప్పుడు తొలగింపులు సాధారణంగా మారిపోతున్నాయి. అయితే గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు సైతం లేఆఫ్‌ల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. గూగుల్ తనను ఎంత దారుణంగా తొలగించిందో ఓ ఉద్యోగి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ముందు యాక్సెస్ పోయింది.. తర్వాత మెసేజ్ జెమిని ఏఐ మోడల్ అల్గారిథమ్‌లపై పని చేసే తనను గూగుల్ తొలగించిన క్రమాన్ని అలెక్స్ కోహెన్ అనే ఉద్యోగి ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో షేర్ చేసిన పోస్ట్‌లో వివరించారు. "గూగుల్ నన్ను ఈ రోజు తొలగించిందని పంచుకోవడం విచారంగా ఉంది. జెమిని కోసం అల్గారిథమ్‌ల రూపకల్పనకు ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న నాకు ఈరోజు ఉన్నట్టుండి హ్యాంగ్అవుట్స్, గూగుల్ డ్రైవ్‌కు యాక్సెస్ పోయింది. ఆ తర్వాత నన్ను తొలగించినట్లు మేనేజర్ నుంచి మెసేజ్ వచ్చింది" అని అలెక్స్ కోహెన్ వాపోయాడు. అయితే తాను 12 నెలల తొలగింపు పరిహారాన్ని (సుమారు రూ.22 కోట్లు ) అందుకుంటున్నానని, ఇది చేతికందిన తర్వాత తాను తదుపరి ఏమి చేయాలో నిర్ణయించుకుంటానని అలెక్స్ కోహెన్ తెలియజేశారు. అయితే గత 5 నెలల్లో ఎల్ఎల్ఎంల గురించి, ఏఐ గురించి ఎంతో నేర్చుకున్నానని, ఆ ప్రయాణం బాగుందని రాసుకొచ్చారు. కాగా ఇంతకుముందు గూగుల్ ఒకప్పుడు ఏఐ విభాగంతో ప్రత్యక్ష ప్రమేయం లేని 'సెర్చ్ టీమ్'లో భాగమైన ఒక ఉద్యోగికి జీతంలో 300 శాతం పెంపును అందించిందని పర్ప్లెక్సిటీ ఏఐ సీఈవో అరవింద్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పెట్టుబడుల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కంపెనీ "కఠినమైన ఎంపికలు" చేయాల్సిన అవసరం ఉన్నందున మరిన్ని ఉద్యోగాల కోతలు ఉంటాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. Sad to share that I was laid off from Google today. I was in charge of making the algorithms for Gemini as woke as possible. After complaints on Twitter surfaced today, I suddenly lost access to Hangouts and Google Drive, and my manager (he/him), texted me to let me know that i… — Alex Cohen (@anothercohen) February 22, 2024 -
సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్
-
కారు ఢీకొని ఐటీ ఉద్యోగి దుర్మరణం.. భార్య నిండు గర్భిణి
విశాఖపట్నం: కారు ఢీకొని ఓ ఐటీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. రెండు మూడు రోజుల్లో మృతుని భార్య ప్రసవించనుండగా ఈ దుర్ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రక్తం పంచుకుని పుట్టబోయే బిడ్డను చూడకుండానే ఈ లోకాన్ని వీడిపోయాడని గుండెలవిసేలా రోదిస్తున్నారు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిఽధిలో ఆదివారం చోటుచేసుకున్న ప్రమాదానికి సంబంధించి స్థానిక సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అడవివరం వెంకటాద్రినగర్‌కు చెందిన బోడ సూరిబాబు, భార్య నిర్మలకు వివాహితులైన ఇద్దరు కుమారులు సందీప్, ఉదయ్ కుమార్ సంతానం. ప్రస్తుతం వీరంతా కలిసి నివసిస్తున్నారు. సింహాద్రి అప్పన్న కొండపై ప్లాస్టిక్ బొమ్మలు దుకాణం నడుపుతూ కుమారులు ఇద్దరినీ చదివించడంతో వారు ప్రయోజకులై ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. చిన్న కుమారుడు ఉదయ్ కుమార్ (32) బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్లుగా వర్క్ హోమ్ నేపథ్యంలో ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఏడాది కిందటే అతనికి సరిహ అనే యువతితో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. రెండుమూడు రోజుల్లో ప్రసవిస్తుందని వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో మధురవాడలోని మిత్రుడిని కలిసేందుకు మరో స్నేహితుడు జగన్‌ను తీసుకుని ద్విచక్ర వాహనంపై ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి ఉదయ్‌కుమార్ బయలుదేరాడు. క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న జాతీయ రమదారిపై వెళ్తూ ఎంవీవీ సిటీ ముందు గల రోడ్డు మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వస్తున్న కారు బలంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఉదయ్ కుమార్ అక్కడికక్కడే మరణించగా అతని స్నేహితుడు జగన్‌కు గాయాలుయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రుని ఆస్పత్రికి తరలించారు. మృతుని సోదరుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు. -
ఐటీ ఉద్యోగాలని ముంచేశారు
అనంతపురం క్రైం: ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరిట నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన ఉదంతం అనంతపురంలో వెలుగు చూసింది. బాధితులు సోమవారం అనంతపురం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్‌ను ‘స్పందన’లో కలసి జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాప్తాడుకు చెందిన టీడీపీ నేత కనుసన్నల్లో అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన శశి, ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన గుర్రం వెంకటరామ్, భానుచంద్రతో పాటు మరికొంత మంది ఘరానా కేటుగాళ్లు.. సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాల పేరిట బీటెక్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు వల వేశారు. ప్రధానంగా కంప్యూటర్ శిక్షణ కేంద్రాల వద్ద పాగా వేసిన వీరు అనతి కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 150 మందికి పైగా నిరుద్యోగులను ముగ్గులోకి దింపారు. శాలరీ ప్యాకేజీని బట్టి ధర ఉంటుందంటూ ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా వసూలు చేశారు. ఇలా రూ. 5 కోట్లకు పైగా దండుకున్నారు. డబ్బిచ్చిన వారికి ఆరు నెలల శిక్షణ కూడా ఇస్తామన్నారు. శిక్షణ కాలంలో రూ.10 వేల నుంచి రూ.18 వేల దాకా గౌరవ వేతనం కూడా చెల్లిస్తామని నమ్మబలికారు. నకిలీ కంపెనీ పెట్టి... బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ‘సార్టీస్ టెక్నాలజీ లిమిటెడ్’ పేరుతో నకిలీ కంపెనీ ఏర్పాటు చేశారు. నిజమని నమ్మి డబ్బు కట్టిన వారు అదే ప్రాంతంలో అద్దెకు గదులు తీసుకుని ఆరు నెలల పాటు వారు చెప్పిన పని చేసుకుంటూ వచ్చారు. అయితే.. వారికి కంపెనీ పనులు పూర్తి కాలేదంటూ గౌరవ వేతనం కూడా చెల్లించలేదు. చేసేది లేక చాలా మంది నిరుద్యోగులు ‘ఎలాగూ ఇన్ని నెలలు ఉన్నాం కదా?! మిగిలిన కాలం పూర్తి చేస్తే ఉద్యోగం దొరుకుతుంద’న్న ఆశతో అప్పులు చేసి మరీ కాలం గడిపారు. తీరా నిర్వాహకులు రాత్రికి రాత్రే కంపెనీకి తాళాలు వేసి అనంతపురానికి చేరుకున్నారు. బాధితులు బెంగళూరు నుంచి ఇళ్లకు రాలేక, అయిన వారికి ముఖం చూపించలేక నరకయాతన అనుభవించారు. నాన్న ఆరోగ్యం బాగోలేదన్నా కనికరించలేదు పుట్టపర్తికి చెందిన ఓ యువకుడు తండ్రికి తెలియకుండా లక్షలాది రూపాయలు అప్పుగా తెచ్చి వారికి చెల్లించాడు. ప్రస్తుతం తండ్రి ఆరోగ్యం బాగా క్షీణించి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. దీంతో అతను అనంతపురం వచ్చి వారిని కాళ్లా వేళ్లా పడినా డబ్బివ్వలేదు. పైగా మరోసారి వస్తే నీపైనే ఎదురు కేసు పెట్టి లోపలేయిస్తామని బెదిరించారు. డబ్బడిగితే బెదిరిస్తున్నారు! నిరుద్యోగులను వంచించిన వారు అనంతపురంలో జల్సాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. వారిని బాధితులు కలసి తమ డబ్బు తిరిగివ్వాలని కోరితే... బెదిరింపులకు దిగుతున్నారు. ‘మా వెనుక రాప్తాడుకు చెందిన టీడీపీ నేతలు ఉన్నారు. ఖబడ్దార్’ అంటూ దాడులకు సైతం తెగబడుతున్నారు. రెండు రోజుల క్రితం జిల్లా పరిషత్‌లోని చిత్రావతి అతిథి గృహం వద్దకు బాధితులను పిలిపించుకుని టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారు. ‘అన్నీ మూసుకుని వెళతారా? లేక తన్నులు తింటారా’ అంటూ బెదిరించారు. డబ్బు తిరిగివ్వకపోగా బెదిరింపులు ఎక్కువ కావడంతో కొంత మంది బాధితులు సోమవారం జిల్లా ఎస్పీని కలసి ఫిర్యాదు చేశారు. -
అప్పుల భాదతో ఐటీ ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య!
సాక్షి, చైన్నె: కరోనా రూపంలో ఎదురైన కష్టాలతో అప్పుల పాలైన ఐటీ ఉద్యోగి తన తల్లిదండ్రులకు, భార్య, కుమారుడితో విషపు మాత్రలను మింగిచ్చి తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే స్పృహలోకి వచ్చిన తల్లి ఇంటిలోని దృశ్యాలను చూసి పెట్టిన కేకలతో ఇరుగు పొరుగు వారు తరలి వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. సేలం జిల్లా గోరిమేడు న్యాయ కళాశాల సమీపంలోని ఎంజీఆర్ నగర్లో శివరామన్(85), వసంత(56) దంపతుల కుటుంబం నివాసం ఉంటోంది. శివరామన్ బెంగళూరు విమానాశ్రయంలో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈ దంపతులకు చంద్ర(40), తిలక్(38) కుమారులు. చంద్ర బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. తిలక్ చైన్నెలోని ఓ ఐటీ సంస్థలో పనిచేసేవాడు. తిలక్‌కు భార్య మహేశ్వరి(35), సాయి కిషోర్ ప్రశాంత్(6) కుమారుడు ఉన్నారు. కరోనా పరిస్థితుల అనంతరం తిలక్‌కు వర్క్ ఫ్రం హోం విధులను కేటాయించారు. జీతం తగ్గడంతో పాటు మాటలు రాని స్థితిలో ఉన్న తన కుమారుడికి వైద్య చికిత్స తిలక్‌కు భారంగా మారింది. దీంతో పలు చోట్ల అప్పులు చేశాడు. అందరికీ విషం ఇచ్చి.. మంగళవారం సాయంత్రం భార్య మహేశ్వరితో కలిసి తిలక్ మార్కెట్‌కు వెళ్లాడు. వారికి కావాల్సిన వస్తువులను కొని తెచ్చాడు. ఫుడ్ కూడా ఆర్డర్ చేసి మరీ తెప్పించాడు. రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు. బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో ఈ ఇంట్లో నుంచి వసంత పెట్టిన కేకలతో ఇరుగు పొరుగు వారు పరుగులు తీశారు. ఓ గదిలో నురగలు కక్కిన స్థితిలో శివరామన్, మరో గదిలో మహేశ్వరి, సాయి కిషోర్ పడి ఉండటం, అదే గదిలో తిలక్ ఉరివేసుకుని వేలాడుతుండంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ దృశ్యాలన్నీ చూసిన వసంత స్పహ తప్పింది. ఆమెను చికిత్స నిమిత్తం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఆ ఇంట్లో ఆంగ్లంలో తిలక్ రాసి పెట్టిన లేఖబయట పడింది. వర్క్‌ఫ్రం హోం రూపంలో ఎదురైన పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, కుమారుడి ఆరోగ్య పరిస్థితి, అప్పుల భారం పెరగడం వెరసి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తల్లిదండ్రుల తో నిద్ర మాత్రలుగా పేర్కొంటూ, విషపు మాత్రలను మింగిచ్చినట్లు అందులో వివరించాడు. భార్యకు ఆహారంతో పాటు, కుమారుడికి యథా ప్రకారం ఇచ్చే మాత్రలతో కలిపి విషపు మాత్రలను మింగిచ్చినట్లు పేర్కొన్నారు. తానూ ఆత్మహత్య చేసుకుంటున్నానని ముగించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. బెంగళూరులో ఉన్న పెద్దకుమారుడు చంద్రకు సమాచారం అందించారు. -
సింగపూర్‌లో ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
సాక్షి, సింగపూర్/ హైదరాబాద్: ఆగస్టు 6వ తేదీన సింగపూర్‌లో జరగనున్న ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలలో పాల్గొని విజయవంతం చేయాలని సింగపూర్‌లోని ప్రవాస తెలుగు వారికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు టెకీలకు సింగపూర్‌లోని ఇండియన్ హై కమిషనర్ కుమరన్ పిలుపునిచ్చారు. మహాసభలకు పూర్తి మద్దతు ఇస్తామని ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మన్ సందీప్ కుమార్ మఖ్తల నాయకత్వంలోని బృందానికి హామీ ఇచ్చారు. సింగపూర్ ప్రభుత్వ సహకారం అందించేందుకు కృషి చేస్తానని సింగపూర్‌లోని ఇండియన్ హై కమిషనర్ కుమరన్ భరోసా ఇచ్చారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మన్ సందీప్ మఖ్తల నాయకత్వంలోని బృందం నేడు కుమరన్‌తో సమావేశం జరిపింది. ఈ సందర్భంగా తెలుగు ఐటీ పరిశ్రమకు చెందిన నిపుణులు, ఇన్వెస్టర్లు, స్టార్టప్‌లు, టెక్నోక్రాట్స్ ఇటు పరిశ్రమ అభివృద్ధి అటు స్వరాష్ట్రంలో పెట్టుబడులు అనే అంశంపై విస్తృత అవకాశాలు అందించేందుకు సింగపూర్‌లో అంతర్జాతీయ మహాసభలను నిర్వహిస్తున్న విషయాన్ని బృందం వివరించింది. దాదాపు 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్న ఈ మహాసభ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి సత్తాను చాటి చెప్పనున్నారని పేర్కొంటూ, తెలుగు రాష్ట్రాలు ప్రవేశ పెట్టిన ముఖ్యమైన విధానాలు, నిర్ణయాలకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. టెక్నికల్ ప్రజెంటేషన్, థాట్ ప్రొవొకింగ్ డిస్కషన్స్ వంటివి ఈ మహాసభల్లో భాగం చేయడం వల్ల కేవలం ప్రొఫెషనల్ నెట్వర్క్ విస్తరించుకోవడమే కాకుండా వారి సాంకేతిక పరిజ్ఞానం సైతం పెంపొందించుకునే అవకాశం దక్కుతుందని వెల్లడించింది. సింగపూర్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సింగపూర్‌లోని ఇండియన్ హై కమిషనర్ కుమరన్ తమ పూర్తి మద్దతు ఇస్తామని ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మన్ సందీప్ మఖ్తల నాయకత్వంలోని బృందానికి హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు, ఇండియాకు, సింగపూర్‌కు మధ్య అనుసంధానత కల్పించనుందని సంతోషం వ్యక్తం చేశారు. సింగపూర్‌లోని తెలుగు టెక్నోక్రాట్స్ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని భాగం చేస్తామని, సింగపూర్ ఐటీ మంత్రిని పాల్గొనేలా తాను సహకరిస్తామని హైకమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఫ్లయర్‌ను సింగపూర్‌లోని ఇండియన్ హై కమిషనర్ కుమరన్, ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మన్ సందీప్ మఖ్తల తదితరులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండలి సభ్యులు రాకేష్, సింగపూర్ మండలి సభ్యులు కోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ప్రత్యేక ఆకర్షణగా నాటా విమెన్ ఫోరమ్) -
ఐటీ ఉద్యోగిని.. ఎన్జీవో.. ఓ డేటింగ్ యాప్.. వీళ్ల ప్లానే వేరు..
గురుగ్రామ్: ఇటీవలి కాలంలో హానీట్రాప్ కేసులు పెరుగుతున్నాయి. ఎరక్కపోయి కొందరు కిలేడీల చేతికి చిక్కి మోసపోతున్నారు. తాజాగా ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఓ కిలేడీ డేటింగ్ యాప్‌లో ఓ వ్యక్తిని పరిచయం చేసుకుని హోటల్‌కు తీసుకెళ్లింది. అక్కడ సదరు వ్యక్తికి అనుకోని అనుభవం ఎదురైంది. అనంతరం, లైంగిక వేధింపులకు పాల్పడినట్టు డ్రామా క్రియేట్ చేసి డబ్బు కాజేయాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలో హానీట్రాప్‌కు దిగిన జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన బినితా కుమారి(27) గురుగ్రామ్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. అలాగే, హర్యానా రోహతక్‌లోని భాలతో గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహేశ్ ఫోగట్ ఓ ఎన్జీవోలో పని చేస్తున్నాడు. వీరిద్దరు కలిసి డేటింగ్ యాప్(బంబుల్ డేటింగ్ యాప్)లో అమాయకులకు గాలం వేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. కాగా, డేటింగ్ యాప్‌లో బినితా కుమారి.. ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఈ క్రమంలో గురుగ్రామ్ సెక్టార్-23లోని ఓ హోటల్‌కు రావాలని ఆఫర్ ఇచ్చింది. దీంతో, దొరికిందిలే ఛాన్ అని బాధితుడు హోటల్‌కు వెళ్లాడు. అయితే, హోటల్‌కు వెళ్లిన తర్వాత మనోడికి ఊహించని విధంగా షాక్ తగిలింది. బినితా కుమారి సదరు వ్యక్తిని బీర్ తాగమని బలవంతం చేసింది. తాను ఊహించినదానికి పరిస్థితులు వేరుగా కనిపించడంతో బాధితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, ఆ తర్వాత ఆయనకు ఫోన్ చేసి తనతో అసభ్యంగా ప్రవర్తించావని, లైంగికంగా వేధించావని బెదిరించింది. రూ. 5 లక్షలు ఇవ్వాలని లేదంటే.. పోలీసు కేసు పెడతానని వార్నింగ్ ఇచ్చింది. She is Binita Kumari Known as B on Bumble Befriended men on dating apps Chose hotel as meeting place Said she wants to have "beer & fun" Few minutes into meeting cried Rape Went to police & filed complaint NGO guy then called to "strike deal" The gang Extorted LACS ARRESTED!! pic.twitter.com/rXDmX95HvM — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) June 8, 2023 అనంతరం, ఆమె గురించి ఆలోచించేలోపే మహేష్ ఫోగట్ నుంచి బాధితుడికి ఫోన్ వెళ్లింది. రూ. 5 లక్షలు ఇస్తేనే సమస్య సెటిల్మెంట్ అవుతుందని బెదిరింపులకు దిగాడు. దీంతో, కంగారుపడిన బాధితుడు చేసేదేమీలేక డీల్‌కు ఒప్పుకుంటూ రూ.2 లక్షలు మాత్రమే ఇవ్వగలనని చెప్పాడు. ఈ క్రమంలోనే వారిద్దరికీ రూ. 50 వేలు ఇచ్చి భరోసా ఇచ్చాడు. మిగిలిన డబ్బులు త్వరలోనే ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. భాదితుడి ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై డీఎల్ఎఫ్ ఫేజ్-3 పోలీసు స్టేషన్లో కేసు ఫైల్ అయింది. I was previously contacted by a victim in October too. Same modus operandi. Girl was different in that case. So we don't yet know how big is the gang or how many total victims Their latest victims got in touch We approached higher authorities and @gurgaonpolice swung in action pic.twitter.com/qlVB0b7auk — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) June 8, 2023 కాగా, ఈ కేసుపై రంగంలోకి దిగిన పోలీసులు.. మిగిలిన డబ్బులు తీసుకోవడానికి మౌల్సరి మార్కెట్ సమీపంలోని సాయి టెంపుల్‌కు రావాలని బాధితుడు ఆ ఇద్దరికీ కాల్ చేశాడు. డబ్బులు తీసుకుంటుండగా మహేష్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత బినితా కుమారిని డీఎల్ఎఫ్-3 యూ బ్లాక్ నుంచి అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇక, వీరిద్దరూ ఇప్పటి వరకు 12 మందిని మోసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: వీడియో: అప్సరను పూజారి సాయికృష్ణ అందుకే చంపాడు.. షాకింగ్ విషయాలు వెల్లడి -
వర్క్ ఫ్రం హోం: మాకొద్దు మహా ప్రభో ఆఫీసుకు వచ్చేస్తాం.. అసలేం జరిగింది!
మళ్లీ ఆఫీసుల్లో ప్రత్యక్షంగా విధుల నిర్వహణకు ఉద్యోగులు సై అంటున్నారు. సహోద్యోగులతో సరదా సంభాషణలు, మాట్లాడుతూనే విధులు నిర్వర్తించడం, అంతా కలిసి కాఫీ, టీ బ్రేక్‌లు తీసుకోవ డం, వీకెండ్ ఎంజాయ్మెంట్లు..ఆ మజానే వేరు అని అధికశాతం మంది అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో తలెత్తిన పరిస్థితులతో ఐటీ కంపెనీలు మూడేళ్లకు పైగా వర్క్ ఫ్రం హోం, ఇటీవలి కాలంలో హైబ్రిడ్, ఇతర పని విధానాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కంపెనీలు ఇప్పటికీ వర్క్ ఫ్రం హోంనే కొనసాగిస్తుండగా, మూన్‌లైటింగ్ (2 లేదా అంతకు మించి ఉద్యోగాలు చేయడం) వెలుగులోకి రావడంతో కొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానాన్ని చేపట్టాయి. మరికొన్ని ఉద్యోగుల్ని పూర్తిగా ఆఫీసులకు రప్పిస్తున్నాయి. హైబ్రిడ్ విధానంలో టెకీలు 2,3 రోజులు ఆఫీసుకు వెళుతూ, మిగతా రోజుల్లో ఇంటి నుంచి పని చేస్తున్నారు. అయినప్పటికీ 86 శాతం మంది భారతీయ వృత్తి నిపుణులు, టెకీలు రెగ్యులర్‌గా ఆఫీసుకు వెళ్లడం పైనే ఆసక్తి కనబరుస్తున్నట్లు తేలింది. రోజూ ప్రత్యక్షంగా తమ తోటి ఉద్యోగుల్ని కలుసుకోవాలని, వారితో స్నేహ సంబంధాలు కొనసాగించాలని 78% కోరుకుంటున్నట్లు వెల్లడైంది. ఆఫీసులకు వెళితే మనోబలం, మానసికస్థైర్యం పెరుగుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ‘సెన్సస్ వైడ్’అధ్యయనం ఆధారంగా ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ సైట్ లింక్డ్ ఇన్ రూపొందించిన తాజా నివేదికలో పలుఅంశాలు వెల్లడయ్యాయి. నివేదికలో ముఖ్యాంశాలు... ► వర్క్ ప్లేసెస్‌లో ‘చాయ్ బ్రేక్ బాండింగ్’ (కలిసి టీ తాగే మంచి సమయం) మిస్సవుతున్నామన్న 72 శాతం మంది. ► వర్క్ ఫ్రం హోం విధానానికే పరిమితమైతే ‘కెరీర్ గ్రోత్’(వృత్తి పరమైన ఎదుగుదల) తగ్గిపోతుందనే భావనలో 63% ఉన్నారు. ► ఆఫీసులో గురువారం కల్లా మొత్తం పని పూర్తిచేసుకుని, ఆ రోజునే ‘న్యూ ఫ్రైడే’గా మార్చుకోవాలని, శుక్రవారం ఆఫీసుకు వెళ్లకుండా లాంగ్ వీకెండ్ గడపాలని 79 శాతం మంది కోరుకుంటున్నారు. ► శుక్రవారాల్లో మరింత ఎక్కువ సమయం కుటుంబం, మిత్రులతో గడపాలని 50 శాతం మంది భావిస్తున్నారు. ► రిమోట్ వర్కింగ్ పద్ధతి వల్ల తమ వృత్తులపై ప్రతికూల ప్రభావం పడలేదని 63 శాతం మంది పేర్కొన్నారు. ► కేవలం కొలీగ్స్‌తో సోషల్ ఇంటరాక్షన్ కోసం ఆఫీసుకు వెళ్లాలనుకుంటున్నట్లు 43 శాతం మంది చెప్పారు. ► సహోద్యోగులతో ముఖాముఖి, ఆఫీసు మీటింగ్‌లు మరింత కార్యదక్షతతో పని చేసేందుకు దోహదపడతాయని 42 శాతం మంది చెప్పారు. మంచి స్నేహ సంబంధాలు పెరుగుతాయని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► శని, ఆదివారాల బ్రేక్ తర్వాత మొదలయ్యే సోమవారాన్ని ‘మోస్ట్ ఫోకస్డ్ డే’గా 39% మంది పేర్కొన్నారు. నైతిక బలం పెరుగుతుందని విశ్వసిస్తున్నారు వృత్తి నిపుణులు, టెకీల వంటి వారు ఫ్లెక్సిబుల్ పని విధానాన్ని కోరుకుంటున్నారు. అదే సమయంలో ఆఫీసులకు రావడానికి అత్యంతప్రాధాన్యతనివ్వడంతో పాటు టీమ్‌వర్క్ ద్వారా తమ నైతిక బలం పెరుగుతుందని విశ్వసిస్తున్నారు. చాయ్ బ్రేక్‌లు, కొలీగ్స్‌తో సరదా చర్చలు తమను చైతన్యపరచడంతో పాటు మరింత మెరుగైన ఫలితాల సాధనకు దోహదపడతాయని భావిస్తున్నారు.– నిరజిత బెనర్జీ, లింక్డ్ఇన్(ఇండియా) మేనేజింగ్ ఎడిటర్ -
తిరుపతిలో దారుణం.. వివాహేతర సంబంధమే కారణం!
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చంద్రగిరిలోని గంగుడుపల్లెలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ నాగరాజు హత్యకు గురయ్యాడు. కారులో ఉన్న నాగరాజుపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అతను అక్కడే సజీవ దహనమయ్యాడు. అయితే, నాగరాజు హత్యకు తన తమ్ముడి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజు.. తిరుపతి నుంచి వెళ్తుండగా గంగుడుపల్లె దగ్గర ఆయన కారు మంటల్లో కాలి బూడిదైంది. నాగరాజు ఆ కారులోనే సజీవ దహనం అయ్యాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడున్న వస్తువులు, కారు నంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడు నాగరాజుగా గుర్తించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ సాయంతో విచారణ కొనసాగుతోంది. అయితే, నాగరాజును సర్పంచ్ చాణిక్య హత్య చేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగా పంచాయితీ పేరుతో నాగరాజును సర్పంచ్ తీసుకెళ్లాడు. అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, నాగరాజు తమ్ముడు పురుషోత్తం అదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సర్పంచ్ చాణిక్య సోదరుడు వితింజయ్ భార్యతో పురుషోత్తంకు అక్రమ సంబంధం ఉండటంతో దీనిపై ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ విషయమై శివరాత్రి రోజు కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం.. పంచాయితీ పెట్టించినట్టు సమాచారం. అక్రమ సంబంధం కారణంగా రెండు కుటుంబాల మధ్య కొద్దిరోజులుగా పంచాయితీ నడుస్తోంది. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ చాణిక్య.. తాజాగా నాగరాజుతో మాట్లాడాలని పిలిపించాడు. ఈ క్రమంలోనే మాటల సందర్భంగా ఆగ్రహంతో సర్పంచ్ చాణిక్య.. ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక, సర్పంచ్ చాణిక్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. కాగా, నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మరణ వార్త తెలుసుకొని వారంతా బోరునవిలపిస్తున్నారు. ఈ సందర్బంగా నాగరాజు భార్య సులోచన సంచలన వ్యాఖ్యలు చేశారు. నా భర్తను గోపి, రుపేంజయ, చాణిక్య, సుబ్రహ్మణ్యం చంపేశారు. రాజీచేస్తామని పిలిచి కారుతో సహా కాల్చారు. నాకు న్యాయం చేయకపోతే వారిని కూడా చంపేస్తాం అని ఆవేదనలో సీరియస్ కామెంట్స్ చేశారు. -
వీధి కుక్కలకు తిండి పెడుతోందని మహిళా టెక్కీపై
బనశంకరి(బెంగళూరు): పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు జంతు ప్రేమికురాలికి దౌర్జన్యం ఎదురైంది. వీధి కుక్కలకు తిండి పెడుతోందని మహిళా టెక్కీ పై ఇద్దరు దాడికి పాల్పడిన బెంగళూరు ఆనేకల్ తాలూకా జిగణిలో చోటుచేసుకుంది. బృందావన లేఔట్లో గల వరుణ్ అపార్టుమెంట్ నివాసి మీరా తివారి బాధితురాలు. జిగణిలోని బృందావన లేఔట్లో వీధి కుక్కలు ఉన్నాయి. మహిళా టెక్కీ మీరా తివారి సొంత ఖర్చుతో వీధికుక్కలకు తిండి పెట్టేవారు. దీనిపై కొందరు ముందు నుంచి గుర్రుగా ఉన్నారు. కోడిగుడ్లు తేవడానికి వెళ్లగా మీరా తివారి కోడిగుడ్లు తీసుకురావడానికి సమీపంలోని కిరాణా అంగడికి వెళ్లగా అనుసరిస్తూ వీధి కుక్కలు కూడా వెళ్లాయి. ఈ సమయంలో షెడ్లో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఆమెతో గొడవకు దిగారు. కట్టెలతో దాడికి పాల్పడడంతో కేకలు వేయగా ఆమె తల్లి పరుగున రావడంతో దుండగులు ఉడాయించారు. తరువాత బాధితురాలు 112 నంబరుకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. బాధితురాలి ఆక్రోశం పోలీసులు చేరుకుని మీరా తివారిని ఆసుపత్రికి తరలించారు. కుక్కలకు సాయం చేస్తోందని గత మూడేళ్లలో మీరాతివారిపై దాడికి పాల్పడటం ఇది రెండోసారి. పోలీసులు దుండగులను అరెస్ట్ చేయడానికి బదులు కట్టుకథలు చెబుతున్నారని మీరా తివారి ఆరోపించింది. నిమ్హాన్స్ ఆసుపత్రిలో చికిత్సపొందిన అనంతరం ఆమె బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ వివాదం భాష రంగు పులుముకోవడం గమనార్హం. నేను కన్నడలో బాగా మాట్లాడానని, కానీ నేను నాన్ లోకల్ అని, అహంకారి అని దూషించారని ఆమె తెలిపింది. నేను బెంగళూరులో పుట్టి పెరిగానని, 2018 నుంచి లేఔట్లో అద్దె ఇంట్లో ఉంటున్నానని పేర్కొంది. కేసు దర్యాప్తులో ఉందని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని, ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
భార్యకు బీమా పత్రాలు, డెత్‌నోట్ వాట్సాప్ చేసి..
సాక్షి, యశవంతపుర: ఇంటికి ఆలస్యంగా వస్తానని భార్యకు చెప్పాడు, తరువాత బీమా పత్రాలను, డెత్‌నోట్‌ను వాట్సప్ చేసి నడుస్తున్న రైలు కిందకు దూకి కేంద్ర ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ఇన్స్పెక్టర్ ఒకరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవేంద్ర దూబె 10 ఏళ్ల నుంచి బెంగళూరులో ఐటీ శాఖలో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. ఆయన యశవంతపురలోని బీడీఏ ఆఫీసు వద్ద నడుస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక పోలీసులు శనివారం తెలిపారు. సుమారు 10 రోజుల కిందటే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెప్పారు. దూబె చివరిసారిగా యూపీలో ఉంటున్న తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి తరువాత బెంగళూరులో భార్య ఆరతి మాళవికి కాల్ చేసి మాట్లాడి, ఇంటికి ఆలస్యంగా వస్తానని చెప్పాడు. కొంతసేపటికి తన ఇన్సూరెన్స్ పత్రాల కాపీలను, సూసైడ్ నోట్‌ను భార్యకు వాట్సాప్ చేశాడు. నా మరణానికి నాదే బాధ్యత అని డెత్‌నోటులో రాశాడు. తన భర్త కనిపించడం లేదంటూ భార్య యశవంతపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు గాలించగా రైలు పట్టాల వద్ద మృతదేహం కనిపించింది. మృతిపై పలు అనుమానాలు వ్యక్తం కావటంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: అనుమానిత ఉగ్రవాది బెంగళూరులో అరెస్టు) -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. కారణం అదేనా?
కృష్ణరాజపురం: మానసిక ఆందోళనతో మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఈ విషాద ఘటన గురువారం రాత్రి కర్నాటకలోని కృష్ణరాజపురం నగరంలోని బసవేశ్వర నగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఆత్మహత్య చేసుకున్న టెక్కీ స్వాతి (26) ఇక్కడి గ్లోబల్ విలేజ్‌లో విధులు నిర్వహిస్తోంది. అయితే, రెండేళ్ల క్రితం ఐటీ ఉద్యోగి దామోదర్‌ను వివాహం చేసుకుంది. తన ఇంటిలోనే ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.