IT Employee Suicide In Chennai: ఐటీ సంస్థ మహిళా అధికారి ఆత్మహత్య - Sakshi
Sakshi News home page

ఐటీ సంస్థ మహిళా అధికారి ఆత్మహత్య

Published Mon, Jun 28 2021 6:40 AM | Last Updated on Mon, Jun 28 2021 11:04 AM

IT Company Employee Ends Her Life In Tamil Nadu - Sakshi

ఐటీ సంస్థ అధికారిణి అనిత

తిరువొత్తియూరు: కుటుంబ కలహాలతో ఐటీ సంస్థ మహిళా అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నై కొళత్తూరు సుబ్రమణియ 3వ వీధికి చెందిన వినోద్‌కుమార్‌ ప్రైవేటు సంస్థ ఉద్యోగి. అతని భార్య అనిత (45) తాంబరంలో ఉన్న ప్రైవేటు ఐటీ సంస్థలో పని చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం దంపతుల మధ్య గొడవ జరిగింది. విరక్తి చెందిన అనిత ఇంటి మిద్దెపై ఉన్న గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 

టవర్‌ ఎక్కి మహిళ ఆత్మహత్యాయత్నం 
టవర్‌ ఎక్కి మహిళ ఆత్మహత్యకు యత్నించిన సంఘటన పూందమల్లి మహిళా పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. తిరువేర్కాడుకు చెందిన రాజేష్‌ (42), రాజులా పూందమల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్నారు. వీరికి పిల్లలు లేరు. కుటుంబ కలహాలతో  రాజులా భర్త నుంచి విడిపోయింది. ఈ క్రమంలో ఆమెకు భర్తతో గొడవలు ఏర్పడ్డాయి. దీనిపై పూందమల్లి మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లింది.

టవర్‌పైకి ఎక్కిన రాజులా
పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి ఆలస్యం చేయడంతో ఆమె పోలీసుస్టేషన్‌ పక్కన వున్న 200 అడుగుల ఎత్తు ఉన్న వాకీ, టాకీ టవర్‌పైకి ఎక్కింది. తనకు న్యాయం చేయకపోవతే కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. పోలీసులు మూడు గంటలు శ్రమించి ఆమెను కిందకు దించారు.
చదవండి:  తన ఇద్దరు చిన్నారులను చిదిమేసి ఆపై..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement