వెబ్‌సైట్‌లో ఫొటోలు పెట్టి... | Man Arrested In Mumbai Due To This | Sakshi
Sakshi News home page

వెబ్‌సైట్‌లో ఫొటోలు పెట్టి...

Published Tue, May 28 2024 6:29 AM | Last Updated on Tue, May 28 2024 10:45 AM

Man Arrested In Mumbai Due To This

 ముంబైలో నిందితుడు అరెస్ట్‌ 

గచ్చిబౌలి: పోర్న్‌ వెబ్‌సైట్‌లో ఫొటోలు పెట్టడం, వాట్సప్‌లో అసభ్య మెసేజ్‌లు పంపి ఐటీ ఉద్యోగిని వేధిస్తున్న ఓ నిందితుడిని ముంబైలో అరెస్ట్‌ చేసినట్లు మాదాపూర్‌ డీసీపీ డాక్టర్‌ వినీత్‌ కుమార్‌ తెలిపారు. ఈస్ట్‌ ముంబై, గారెగాన్, జయజయప్రకాష్ ​​నగర్‌కు చెందిన అభిõÙక్‌ మోహన్‌ కీర్తికర్‌ (42) ముంబైలో ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. 

అక్కడే ఓ కంపెనీలో పని చేసే ఐటీ ఉద్యోగిని పరిచయమైంది. ఆ ఉద్యోగినితో పరిచయం పెరగడంతో ప్రేమించాలని ప్రపోజ్‌ చేయగా.. ఆమె తిరస్కరించింది. అప్పటి నుంచి ఆమెను రోజూ వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం  ఆమె హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో ఐటీ ఉద్యోగినిగా పని చేస్తోంది. వివిధ ఫోన్‌ నెంబర్ల ద్వార వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు పంపడం, పోర్న్‌ వెబ్‌సైట్లలో ఆ ఉద్యోగిని ఫొటోలు, ఫోన్‌ నెంబర్లు పెట్టి వేధిస్తున్నాడు. 

దీంతో గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యంగా ఫోన్‌లో మాట్లాడడంతో తీవ్ర మనో వేదనకు గురైంది. ఈ క్రమంలో బాధితురాలు ఫిబ్రవరిలో గచి్చ»ౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు  అభిõÙక్‌ మోహన్‌ కీర్తికర్‌ ను ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. సోమవారం కూకట్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇతను చాలా మంది యువతులకు మాయమాటలు చెప్పి దగ్గర కావడం, చెప్పినట్లు వినకపోతే అసభ్య మెసేజ్‌లు పెట్టి వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement