
సాక్షి, న్యూఢిల్లీ : పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కరువైంది. నోయిడాలోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి 2016 నుంచి ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తాను పనిచేసే కార్యాలయంలో ఏకంగా 43 మంది సహచర ఉద్యోగులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నోయిడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది నుంచి ఉద్యోగులు తనను వేధిస్తున్నారని, కొంత మంది వాట్సప్‌లో తమ ప్రైవేటు అవయవాలను కూడా చూపిస్తూ తనన వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కోన్నారు.
దీనిపై యూపీ సీఎం యోగి ఆధిత్యానాథ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి కూడా గతంలో ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి 21 మంది పేర్లను ఫిర్యాదులో తెలిపానని, మరికొంత మంది పేర్లు తనకు తెలిదని ఆమె తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు స్పందించిన నోయిడా పోలీసులు విచారణ చేపట్టునున్నట్లు తెలిపారు. పూర్తి విచారణ చేయకుండా ఎవరిని అరెస్ట్ చేయమని, యువతి ఆఫీసులో సీసీ కెమెరాలు పరిశీలించి, నిందితులకు విచారించిన తరువాతనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment