ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై : భార్య, ఇద్దరు బిడ్డల్ని చెట్లు కోసే రంపంతో కోసి చంపేసి, ఆ పై అదే రంపంతో తన గొంతు కోసుకుని ఓ ఐటీ ఉద్యోగి చెన్నైలో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై పల్లావరం సమీపంలోని పులిచ్చలూరు వెంకటేశ్వర నగర్ వినాయక ఆలయం వీధికి చెందిన ప్రకా‹Ù(41) ఓ ప్రైవేటు సంస్థలో ఐటీ ఉద్యోగి. ఆయనకు భార్య గాయత్రి(39), కుమార్తె నిత్యశ్రీ(13), కుమారుడు హరికృష్ణ (9) ఉన్నారు. అదే ప్రాంతంలో గాయత్రి నాటు మందుల దుకాణం సైతం నడుపుతున్నారు.
తొలుత అనుమానాస్పదంగా..
శనివారం ఉదయం వీరి ఇంటి తలుపులు తెరిచే ఉన్నా, ఎవ్వరు బయటకు రాకపోవడంతో ఇరుగు పొరుగు వారు ఇంట్లోకి వెళ్లి చూడగా, రక్తం ఏరులై పారుతుండడంతో ఆందోళనకు గురయ్యారు. శంకర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరణించిన వారి గొంతులు రంపంతో కోయబడి ఉండటంతో అనుమానాస్పద మరణాలుగా భావించారు. నలుగురు మరణించినా రంపం మాత్రం ఆన్‌లోనే ఉండటంతో అనుమానాలు బయలు దేరాయి. అయితే, అక్కడి గోడకు అంటించిన లేఖ, డైరీలో ఉన్న మరో లేఖను బట్టి.. ఇది ప్రకాష్ ఘాతుకంగా వెలుగు చూసింది. తమ నలుగురి మరణానికి ఎవ్వరూ కారకులు కాదు అని ఆలేఖలో ప్రకాష్ వివరించాడు.
అప్పులు అధికం కావడంతోనే..
అప్పులు పాలైన ప్రకాష్ బలన్మరణానికి సిద్ధమయ్యాడు. ఇందు కోసం ఆన్‌లైన్‌లో ఈనెల 19వ తేదీన బ్యాటరీతో నడిచే రంపంను కొనుగోలు చేశాడు. శుక్రవారం రాత్రి పిల్లలు నిద్రకు ఉపక్రమించినానంతరం రంపంతో గొంతు కోసి చంపేశాడు. అలాగే, భార్యను కూడా చంపేసి, అదే రంపంతో తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో లభించిన లేఖ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తాంబరం పోలీసు కమిషనర్ రవి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: అత్తింటి పోరుకు బావిలో శవాలైన ముగ్గురు అక్కాచెళ్లెళ్లు, ఇద్దరు చిన్నారులు.. కారణం?
Comments
Please login to add a commentAdd a comment