wife killed by husaband
-
భార్యను అతికిరాతకంగా చంపిన మాజీ మంత్రి
అస్తానా: మధ్య ఆసియా దేశం కజకస్తాన్ నిరసనలతో అట్టుడికిపోతోంది. ఓ మాజీ మంత్రి తన భార్యను అతికిరాతకంగా కొట్టి చంపిన వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ మానవ మృగం కోర్టు విచారణ ఎదుర్కొంటుండగా.. కఠిన శిక్ష పడాలంటూ ఆందోళనలు చేపట్టారు అక్కడి ప్రజలు.కువాన్దిక్ బిషింబయెవ్(44) కజకస్తాన్ దేశపు మాజీ ఆర్థిక మంత్రి. ఈయన బంధువు పేరిట ఉన్న ఓ రెస్టారెంట్లో గతేడాది నవంబర్‌లో ఆయన సతీమణి సల్తానత్ నుకెనోవా(31) అనుమానాస్పద రీతిలో మృతి చెందిది. అంతకు ముందు ఒకరోజు అంతా ఆ జంట ఆ హోటల్లోనే గడిపింది.అయితే విచారణలో ఆయనే ఆమెను దారుణంగా హింసించి చంపినట్లు తేలింది. దీంతో ఆయన కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. ఈలోపు ఆ హోటల్ సీపీ టీవీ ఫుటేజీలు బయటకు వచ్చాయి. జుట్టుపట్టి ఈడ్చి కొట్టి.. ఇష్టానుసారం తన్ని.. సుమారు ఎనిమిది గంటల పాటు ఆ కిరాతకం కొనసాగింది. రక్తపు మడుగులో అచేతనంగా భార్య పడి ఉన్నప్పటికీ ఆమె బాగానే ఉందంటూ హోటల్ సిబ్బందితో బిషింబయెవ్ చెప్పడం కూడా వీడియోలో రికార్డయ్యింది. చివరకు 12 గంటల తర్వాత ఆంబులెన్స్ అక్కడికి చేరుకోగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు.తలకు, ముక్కుకు బలమైన గాయం కావడం, ఒంటిపై పలు చోట్ల గాయాల్ని శవ పరీక్షలో గుర్తించారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో.. సీసీ టీవీ ఫుటేజీ సహా సాక్ష్యాలన్నింటిని మాయం చేసేందుకు బిషింబయెవ్ ప్రయత్నించారని పోలీసులు తేల్చారు. అంతేకాదు.. తన భార్య మానసిక స్థితి బాగోలేదని, ఈ క్రమంలోనే తనకు తాను గాయాలు చేసుకుని ఆమె చనిపోయిందని న్యాయస్థానాల్ని నమ్మించే యత్నం చేశాడు కూడా.అయితే.. 8 గంటలపాటు సాగిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియో ఫుటేజీ బయటకు రావడంతో ఆ భర్త అకృత్యం వెలుగు చూసింది. భార్యను అలా ఎందుకు చంపాడో మాత్రం ఇంకా నోరు విప్పలేదు నిందితుడు. అయితే ఆమెను అంత క్రూరంగా చంపిన ఆ మాజీ మంత్రిని కఠినంగా శిక్షించాలంటూ అక్కడి ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గృహ హింస చట్టం గురించి విస్తృతంగా చర్చ జరిగింది అక్కడ. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఆ దేశపు సుప్రీం కోర్టులో జరుగుతోంది. కజకస్తాన్ చరిత్రలోనే తొలిసారి ఈ కేసు విచారణను లైవ్ టెలికాస్ట్ చేయబోతోంది ఆ దేశ అత్యున్నన్యాయస్థానం. బిషింబయెవ్ నేరం గనుక రుజువు అయితే అక్కడి చట్టాల ప్రకారం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షపడుతుంది. -
ఐదేళ్లుగా దూరం..బిడ్డ పెళ్లిలో ఒక్కటయ్యారు
ఇల్లంతకుంట(మానకొండూర్):కట్టుకున్న భార్య... కన్న కొడుకే కసాయివాళ్లుగా మారారు. భూమి అమ్మిన డబ్బులు ఇవ్వడం లేదని భర్తను భార్య, కొడుకు కలిసి కత్తితో పొడిచి.. గొంతి నులిమి హత్య చేశారు. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన దర్పల్లి శంకర్(55) వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడు. భార్య చంద్రకళ, ఇద్దరు కూతుళ్లు మౌనిక, మమత, కుమారుడు వంశీకృష్ణతో కలిసి ఐదేళ్లకు పైగా భర్తకు దూరంగా సిద్దిపేటలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈనెల 5వ తేదీన పెద్ద కూతురు మౌనిక వివాహం చేసేందుకు స్వగ్రామం వచ్చి భర్త శంకత్తో కలిసి ఉంటున్నారు. పెద్ద కూతురు వివాహం జరిపించారు. కొన్ని నెలల క్రితమే చిన్నకూతురు మౌనిక ప్రేమవివాహం చేసుకుంది. శంకర్ రెండెకరాల వ్యవసాయ భూమిని విక్రయిస్తే రూ.46 లక్షలు వచ్చాయని.. కూతురు పెళ్లి చేయగా మిగిలిన డబ్బులు కావాలని భార్యభర్తల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఈక్రమంలో ఆదివారం రాత్రి తండ్రీకొడుకులు శంకర్, వంశీకృష్ణ మధ్య డబ్బుల విషయం గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో భార్య చంద్రకళ, కుమారుడు వంశీకృష్ణ కలిసి శంకర్‌పై కత్తితో పొట్ట భాగంలో దాడి చేశారు. అంతటితో ఆగకుడా వంశీకృష్ణ గొంతు నులుమడంతో శంకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఉదయం శంకర్ హత్య విషయం బయటకు రావడంతో ఎస్సై రాజేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలు తెలుసుకున్నారు. మృతుడి సోదరి సుగుణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్, ఎస్సై రాజేశ్ తెలిపారు. బిడ్డ పెళ్లికి ఒక్కటై... డబ్బుల కోసం హత్య ? ఐదేళ్లుగా దూరంగా ఉంటున్న చంద్రకళ–శంకర్ దంపతులు పెద్ద కూతురు మౌనిక వివాహం కోసమే ఒక్కటయ్యారు. బిడ్డ పెళ్లి చేయగా మిగిలిన డబ్బులు తమకు ఇవ్వాలని భార్య, కుమారుడు పట్టుబట్టడం.. శంకర్ ససేమిరా అనడంతోనే ముగ్గురి మధ్య గొడవ ముదిరి హత్యకు దారితీసిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ ఐదు ఫుల్ బాటిళ్లు ఎక్కడివి ? శంకర్‌కు మద్యం తాగే అలవాటు ఉందని, ఆదివారం ఐదు ఫుల్ బాటిళ్లు తెచ్చుకొని.. ఫుల్లుగా తాగి తమతో గొడవపడ్డాడని, తనను చంపేందుకు కత్తి దగ్గర పెట్టుకున్నాడని మృతుడి భార్య పోలీసుల ముందు చెప్పినట్లు తెలిసింది. గ్రామస్తుల వాదన ఇలా ఉంది శంకర్ ఎవరితో గొడవ పడే వ్యక్తి కాదని, వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడంటున్నారు. అసలు ఆ ఐదు మద్యం బాటిళ్లు తెచ్చుకోవాల్సిన అవసరం అతడికి ఏముందని, పథకం ప్రకారమే అందరిని నమ్మించేందుకే భార్య, కొడుకు మద్యం బాటిళ్లను ఇంట్లో పెట్టి ఉంటారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. పోలీసుల అదుపులో నిందితులు శంకర్ భార్య చంద్రకళ, కుమారుడు వంశీకృష్ణను పోలీసులు ఉదయాన్నే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. నేడో, రేపో అరెస్టు చూపే అవకాశం ఉంది. మృతదేహాన్ని పరిశీలించిన సీఐ శంకర్ మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రి మార్చురీలో సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్ పరిశీలించారు. సీఐ ఉపేందర్ మాట్లాడుతూ శంకర్‌ను హత్య చేసిన భార్య, కుమారుడిని పట్టుకుని హత్యకు గల కారణాలను తెలుసుకుని, త్వరలోనే అరెస్టు చూపనున్నట్లు చెప్పారు. -
ఊరంతా జాతరలో బిజీ.. భార్యాభర్తలు ఇద్దరూ మద్యం తాగి.. చివరికి
యశవంతపుర: ఊరు ప్రజలంతా జాతరలో నిమగ్నమై సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఇద్దరు దంపతులు మద్యం తాగి గొడవ పడ్డారు. మాటామాటా పెరిగింది. ఆవేశం తాళలేక భార్య తన కుమారుడితో కలిసి భర్తపై ఇనుపరాడ్లతో దాడిచేయగా అతను మృతి చెందాడు. ఈ ఉదంతం బెళగావి జిల్లా మూడలగి తాలూకా హళ్లూరు గ్రామంలో జరిగింది. హళ్లూరులో ద్యామవ్వ, మహాలక్ష్మిదేవి జాతర 12 ఏళ్లకు ఒక పర్యాయం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి జాతర ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. గ్రామానికి చెందిన చంద్రకాంత మావరకర్(42), సావిత్రి దంపతులు మద్యం తాగి సంబరాల్లో పాల్గొన్నారు. ఆదివారం తెల్లవారుజామున ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య సావిత్రి తన కుమారుడు సునీల్‌తో కలిసి చంద్రకాంతపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మూడలగి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లికి ముందే అతడితో ఎఫైర్.. ప్రియుడి కోసం ప్రియురాలు కిరాక్ ప్లాన్
తిరువొత్తియూరు: తెన్కాశి సమీపంలోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న దంపతులు రాత్రి సమయంలో ఇంటికి బైక్‌లో వస్తుండగా కారులో వచ్చిన ఓ ముఠా అడ్డుకుంది. తర్వాత భర్తను హత్య చేసి, భార్య మెడలో ఉన్న బంగారు నగలను దోచుకెళ్లింది. అయితే పోలీసుల విచారణలో అదంతా హైడ్రామా అని తేలింది. భార్యే ప్రియుడితో కలసి భర్తను హత్య చేయించినట్లు తెలిసింది. వివరాల ప్రకారం.. తెన్కాశి జిల్లా, సెందామరం సమీపంలోని వెండ్రిలింగాపురానికి చెందిన వైరస్వామి (31). ఇతనికి వీర శిఖామణికి చెందిన ముత్తుమారి (25)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరూ వెండ్రిలింగాపురంలో నివాసం ఉంటున్నారు. వీరికి పిల్లలు లేరు. వీర శిఖామణిలో ఉన్న ఓ హోల్‌సేల్ ఫర్నీచర్ దుకాణంలో దంపతులిద్దరూ పని చేస్తున్నారు. రోజూ ఉదయం ద్విచక్ర వాహనంలో వెళ్లి రాత్రి ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి వైరస్వామి, అతని భార్య ముత్తుమారి వీరశిఖామణి నుంచి బయలుదేరారు. రాత్రి 9 గంటల సమయంలో వీర శిఖామణికి, నడుంకురిచ్చికి మధ్య వస్తుండగా వారిని వెంబడిస్తూ వచ్చిన నలుగురు సభ్యుల ముఠా బైక్‌ను అడ్డుకుంది. ఆ తర్వాత ముత్తుమారి మెడలో ఉన్న మూడున్నర సవర్ల నగను లాక్కోవడానికి ప్రయత్నించారు. దీన్ని వైరస్వాసామి అడ్డుకోవడంతో అతన్ని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి దాడిచేసి, పారిపోయారు. అడవి ప్రాంతంలో దిక్కుతోచక నిలబడిన ముత్తుమారి భర్తను లాక్కొచ్చిన ప్రాంతంలోకి వెళ్లి చూడగా అక్కడ వైరస్వామి తీవ్ర గాయంతో మృతదేహంగా కనిపించాడు. దీంతో ముత్తుమారి ఏడుపు విన్న వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వైరస్వామి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, శంకరన్ కోయిల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో.. కేసు నమోదు చేసి ముత్తుమారిని ప్రశ్నించారు. ఆ సమయంలో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆమెపై పోలీసులకు సందేహం కలిగింది. ఖాకీ స్టైల్లో దర్యాప్తు చేయడంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించినట్లు తేలింది. వివాహానికి ముందే ముత్తుమారికి మరో యువకుడితో సంబంధం ఉందని ఈ సంగతి వైరస్వామికి తెలియడంతో భార్యను తీవ్రంగా మందలించాడు. దీంతో, భర్తను హత్య చేయడానికి పథకం వేసిన ముత్తుమారి రాత్రి సమయంలో బైక్‌లో వస్తున్న సమయంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు నాటకమాడింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ప్రియుడు, మరో ఇద్దరు హంతకుల కోసం గాలిస్తున్నారు. జిల్లా ఎస్పీ కృష్ణరాజు, పులికుడి డిప్యూటీ సూపరింటెండెంట్ అశోక్, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మహేశ్వరి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని దర్యాప్తు కోసం ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: ఫోన్ కాల్ లిఫ్ట్ చేసిన యువతి.. మాటలు కలిపి.. -
నా భార్యను చంపేశాను.. డయల్ 100కు ఫోన్ చేసి..
అర్ధరాత్రి దాటింది. ఊళ్లన్నీ నిశ్శబ్దంగా నిద్రపోతున్న సమయంలో ఓ వ్యక్తి 100 నంబర్‌కు ఫోన్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసిన పోలీసులతో ‘నా భార్యను చంపేశాను. నన్ను తీసుకెళ్లండి’ అంటూ చెప్పాడు. విన్న పోలీసులకు ఓ క్షణం ఏమీ అర్థం కాలేదు. ఆకతాయిలు ఎవరైనా ఫోన్ చేశారా..? నిజంగానే హత్య జరిగిందా..? అని ఆలోచించారు. ఏమై ఉంటుందో అని అవతలి వ్యక్తి చెప్పిన అడ్రస్‌కు వెళ్లి చూసి నిశ్చేషు్టలయ్యారు. నిద్రపోతున్న భార్యను గొంతు నులిమి చంపేసిన ఓ ప్రబుద్ధుడు తాపీగా పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయాడు. ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలం పూడివలసలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎచ్చెర్ల మండలం పూడివలస గ్రామానికి చెందిన జరుగుళ్ల రామా రావు (ఆనంద్ పాల్) భార్య నాగరత్నం(45)ను మంగళవారం రాత్రి హత్య చేశాడు. రామారావు పాస్టర్‌గా పనిచేస్తున్నారు. నాగరత్నం ఫరీదుపేట సచివాలయం ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. పూడివలసలో నివాసం ఉంటూ ఫరీదుపేట రాకపోకలు సాగిస్తుంటారు. రామారావు రోజూ భార్యను బైక్‌పై సచివాలయం వద్ద దించి సాయంత్రం పూట మళ్లీ ఇంటికి తీసుకెళ్తుంటారు. అయితే కొన్ని రోజులుగా రామారావు ఇంటి వద్దనే ఉంటున్నారు. ఆయనకు సాయంత్రం అయితే కనిపించదు. తొమ్మిదేళ్ల కిందట పెళ్లి చేసుకున్న వీరికి ఆరేళ్ల రాజ్‌కుమార్ పాల్ అనే కుమారుడు ఉన్నాడు. కొన్ని నెలలుగా ఈ దంపతుల మధ్య మనస్ఫర్థలు తలెత్తాయి. చీటి కీ మాటికీ గొడవలు పడడం ప్రారంభించారు. నాగరత్నంను కన్నవారింటికి వెళ్లవద్దని రామా రావు చెబుతుండేవాడు. అయినా ఆమె టెక్కలి సమీపంలోని నందిగాంలోని కన్నవారికి వెళ్లడంతో అప్పట్లో ఓ సారి చేయి చేసుకున్నాడు కూడా. తన మాట వినడం లేదని తరచూ ఆమెపై ఆంక్షలు పెట్టేవాడు. దీంతో కుటుంబ కలహాలు పెచ్చుమీరాయి. మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గంటల కొద్దీ వాదించుకున్నాక.. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రపోతున్న భార్యను రామారావు గొంతు నులిమి చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక క్రైమ్ స్టాపర్ 100కు ఫోన్ చేసి తాను భార్యను చంపేశానని, తనను తీసుకోపోవాలని తానే సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంశయిస్తూనే సంఘటన స్థలానికి వచ్చారు. ఇంటిలోకి వెళ్లి చూస్తే నాగరత్నం మృతదేహం మంచంపై పడి ఉంది. దీంతో హంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. శవ పంచనామా నిర్వహించి అనంతరం మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పాపం కుమారుడు.. రాత్రి పడుకున్నప్పుడు పక్కనే ఉన్న అమ్మ ఉదయానికి మృతదేహంగా మారడంతో కుమారుడు రాజ్‌కుమార్ కన్నీరుమున్నీరయ్యాడు. అమ్మ కావాలంటూ గుక్కపట్టి ఏడిచాడు. ఒక్కడే కుమారుడు కావడంతో తల్లి గారాబంగా పెంచుకుంది. అమ్మ హత్యకు గురి కావడం, తండ్రి జైలుకు వెళ్లడంతో కుమారుడి పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైపోయింది. ప్రస్తుతం అతడిని అమ్మమ్మ, తాతయ్యలు తీసుకువెళ్లారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని నందిగాం తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య , బిడ్డల్ని రంపంతో కోసి చంపేశాడు!
సాక్షి, చెన్నై : భార్య, ఇద్దరు బిడ్డల్ని చెట్లు కోసే రంపంతో కోసి చంపేసి, ఆ పై అదే రంపంతో తన గొంతు కోసుకుని ఓ ఐటీ ఉద్యోగి చెన్నైలో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై పల్లావరం సమీపంలోని పులిచ్చలూరు వెంకటేశ్వర నగర్ వినాయక ఆలయం వీధికి చెందిన ప్రకా‹Ù(41) ఓ ప్రైవేటు సంస్థలో ఐటీ ఉద్యోగి. ఆయనకు భార్య గాయత్రి(39), కుమార్తె నిత్యశ్రీ(13), కుమారుడు హరికృష్ణ (9) ఉన్నారు. అదే ప్రాంతంలో గాయత్రి నాటు మందుల దుకాణం సైతం నడుపుతున్నారు. తొలుత అనుమానాస్పదంగా.. శనివారం ఉదయం వీరి ఇంటి తలుపులు తెరిచే ఉన్నా, ఎవ్వరు బయటకు రాకపోవడంతో ఇరుగు పొరుగు వారు ఇంట్లోకి వెళ్లి చూడగా, రక్తం ఏరులై పారుతుండడంతో ఆందోళనకు గురయ్యారు. శంకర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరణించిన వారి గొంతులు రంపంతో కోయబడి ఉండటంతో అనుమానాస్పద మరణాలుగా భావించారు. నలుగురు మరణించినా రంపం మాత్రం ఆన్‌లోనే ఉండటంతో అనుమానాలు బయలు దేరాయి. అయితే, అక్కడి గోడకు అంటించిన లేఖ, డైరీలో ఉన్న మరో లేఖను బట్టి.. ఇది ప్రకాష్ ఘాతుకంగా వెలుగు చూసింది. తమ నలుగురి మరణానికి ఎవ్వరూ కారకులు కాదు అని ఆలేఖలో ప్రకాష్ వివరించాడు. అప్పులు అధికం కావడంతోనే.. అప్పులు పాలైన ప్రకాష్ బలన్మరణానికి సిద్ధమయ్యాడు. ఇందు కోసం ఆన్లైన్లో ఈనెల 19వ తేదీన బ్యాటరీతో నడిచే రంపంను కొనుగోలు చేశాడు. శుక్రవారం రాత్రి పిల్లలు నిద్రకు ఉపక్రమించినానంతరం రంపంతో గొంతు కోసి చంపేశాడు. అలాగే, భార్యను కూడా చంపేసి, అదే రంపంతో తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో లభించిన లేఖ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తాంబరం పోలీసు కమిషనర్ రవి వెల్లడించారు. ఇది కూడా చదవండి: అత్తింటి పోరుకు బావిలో శవాలైన ముగ్గురు అక్కాచెళ్లెళ్లు, ఇద్దరు చిన్నారులు.. కారణం? -
నాకు ప్రియుడే ముఖ్యం.. భార్య ఏం చేసిందంటే..?
యశవంతపుర: వివాహేతర సంబంధం కారణంగా భార్యే భర్తను కాటికి పంపింది. వివరాలు .. ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న శంకర్‌రెడ్డి (44) బెంగళూరులోని యశవంతపుర పీఎస్ పరిధిలోని మోహన్‌కుమార్ నగరలో నివాసం ఉంటున్నాడు. ఏప్రిల్ 28న రాత్రి 12:30 గంటల సమయంలో శంకర్‌రెడ్డి హత్యకు గురయ్యాడు. ప్రియునితో కలిసి భార్యే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. చేతికి గాయాలతో ఉన్న శంకర్‌రెడ్డి భార్యను పోలీసులు విచారించారు. దుండగులు తమపైన దాడి చేశారని, తాళి లాక్కెళ్లారని కట్టుకథ చెప్పింది. అయితే తాళి మెడలోనే ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి గట్టిగా ప్రశ్నించారు. తమ ఆనందానికి అడ్డుగా ఉన్నాడని ప్రియునితో కలిసి అంతమొందించినట్లు నిజం ఒప్పుకుంది. ప్రియుడు ఆమె సొంతూరికి చెందిన దూరపు బంధువని తెలిసింది. ఆమెను అరెస్టు చేసి ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ప్రియుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తండ్రి పోయి, తల్లి జైలుకెళ్లి ఇద్దరు చిన్న పిల్లలు అనాథలయ్యారు. ఇది కూడా చదవండి: వీడియో కలకలం.. నర్సుపై అత్యాచారం చేసి.. -
సమోస.. కచొరికి చట్నీ రుచిగా వండలేదని భార్యపై..
భోపాల్: దుకాణంలో విక్రయించే సమోస, కచొరికి భార్య చేసిన చట్నీని రుచి చూసిన భర్త రుచిగా రాలేదని చెప్పాడు. మళ్లీ చేసుకురా అని చెప్పడంతో భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలో మాటామాట పెరిగి ఆమెపై తీవ్రంగా దాడి చేసి భర్త పరారయ్యాడు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఆమె చివరకు ప్రాణం కోల్పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధాటియా జిల్లా ఉపరాయంగావ్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా సమోస కచోరి దుకాణాన్ని ఆనంద్ గుప్తా నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య ప్రీతి. అయితే సమోస.. కచోరి కోసం చట్నీ తయారు చేయమని ఆనంద్ ఆదివారం ఇంట్లో ఉన్న భార్యకు చెప్పాడు. కొద్దిసేపటి అనంతరం భార్య చట్నీ తయారుచేసి భర్తకు రుచి చూపించింది. అయితే రుచి లేకపోవడంతో భర్త ఆమెకు మళ్లీ చేయమని చెప్పాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. క్షణికావేశానికి లోనైన భర్త భార్యపై దాడి చేశాడు. కోడలిని కొడుతుండడంతో భర్త తల్లి వచ్చి వారించింది. ఆమెను పక్కకు నెట్టి కర్రతో తలపై గట్టిగా బాదాడు. తీవ్ర గాయాలపాలైన భార్య ప్రీతిని వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. దాడి చేసిన అనంతరం భర్త ఆనంద్ గుప్తా పరారయ్యాడు. సమాచారం అందుకున్న గోరాఘాట్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు అనంతరం నిందితుడు ఆనంద్ కోసం గాలిస్తున్నారు. -
బైక్ కొనివ్వలేదన్న కోపంతో దారుణం
సాక్షి, పామిడి: అదనపు కట్నంలో భాగంగా ద్విచక్ర వాహనం కొనివ్వలేదన్న నెపంతో ఓ ప్రబుద్ధుడు కట్టుకున్న భార్యను కడతేర్చాడు. ఈ ఘటన మండలంలోని నెమళ్ళపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలమేరకు... వజ్రకరూరు మండల కేంద్రానికి చెందిన చిక్కన్నయ్య, రమణమ్మ దంపతుల కుమార్తె లక్ష్మీ (26)ని 11 నెలల క్రితం మండలంలోని నెమళ్ళపల్లికి చెందిన కొట్టం సుబ్బరాయుడికిచ్చి పెళ్లి చేశారన్నారు. కట్నకానుల కింద 6 తులాల బంగారు, రూ.50 వేలు ఇచ్చి వివాహం చేశారని చెప్పారు. పెళ్లి అయినప్పటికీ.. భార్య అంటే సుబ్బరాయునికి ఇష్టం ఉండేది కాదన్నారు. దీనికితోడు ఏడు నెలల నుంచి అదనపు కట్నం కింద బైక్ కొనివ్వాలంటూ భర్త సుబ్బరాయుడు తన భార్య లక్ష్మీని వేధించేవాడన్నారు. ఇదే సమయంలో సుబ్బరాయుడుతో పాటు అతని తల్లి రాజమ్మ, అన్నలు లింగమయ్య, సుంకప్ప కలిసి లక్ష్మీని మరింత వేధింపులకు గురి చేసేవారని పేర్కొన్నారు. అయితే లక్ష్మీ తల్లిదండ్రులు మాత్రం కుమార్తెకు సర్దిచెప్పి కాపురానికి పంపేవారన్నారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి నిద్రపోతున్న భార్య లక్ష్మీని భర్త సుబ్బరాయుడు గొంతునులిమి చంపేశాడని చెప్పారు. అనంతరం సుబ్బరాయుడు.. లక్ష్మీ తల్లిదండ్రులకు ఫోన్‌చేసి లక్ష్మీ నిద్రమాత్రలు మింగిందని, పామిడి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తున్నట్లు సమాచారం ఇచ్చాడన్నారు. వారు ఆసుపత్రికి వచ్చి చూడగా లక్ష్మి గొంతు, మెడపై గాయాలతో చనిపోయి ఉండటాన్ని గమనించారని తెలిపారు. దీంతో మృతురాలి తల్లి రమణమ్మ... అల్లుడు సుబ్బరాయుడు, అతని తల్లి రాజమ్మ, అన్నలు లింగమయ్య, సుంకప్ప నలుగురు కలిసి తన కుమార్తెను గొంతు నులిమి చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
భార్యను హతమార్చి.. ఆత్మహత్యగా
సాక్షి, మెదక్: కలకాలం కష్టసుఖాల్లో తోడుంటానని అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యను కట్టుకున్నోడే కడతేర్చాడు. మూడు నెలల గర్భిణీ అనే కనికరం లేకుండా చిన్నపాటి కలహాలకే క్షణికావేశానికి గురై గొంతునులిమి హతమార్చి, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసాడో కసాయి భర్త. ఆ తర్వాత ఇంట్లోనే మృతదేహాన్ని వదిలేసి కుటుంబంతో పరారయ్యాడు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబీకులు తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం సర్దన గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాదిత కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. క్షణికావేశంలో.. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన రాములు–యాదవ్వ దంపతుల కుమార్తె అంజలిని(మహేశ్వరి)(23) హవేళిఘణాపూర్ మండలం సర్దన గ్రామానికి చెందిన అభిలాష్‌కు ఇచ్చి 2018 ఏప్రిల్‌లో వివాహం జరిపించారు. ఆ తర్వాత కొంతకాలం సాఫీగా సాగిన సంసారంలో చిన్నపాటి కలహాలు మొదలైనట్లు తెలిపారు. ఏడాది క్రితం అడిగితే బైక్ కొనివ్వడంతో పాటు అవసరానికి రూ. 50 వేలు సమకూర్చినట్లు మృతురాలి తల్లిదండ్రులు వాపోయారు. కాగా అదనంగా రూ.లక్ష కట్నం ఇవ్వాల్సింది వేధింపులకు గురిచేయగా గతంలో మూడుసార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ జరిపినట్లు తెలిపారు. ప్రస్తుతం అంజలి మూడు నెలల గర్భిణీ కావడంతో మొదటిసారి తల్లిగారు ఆసుపత్రిలో చూపించాలనే సాంప్రదాయం ప్రకారం రంగంపేట ఆసుపత్రిలో చెకప్‌లు చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన అంజలిని స్నేహితుడి వివాహం ఉందంటూ భర్త అభిలాష్ సోమవారం మధ్యాహ్నం సర్దన గ్రామానికి తీసుకెళ్లినట్లు వివరించారు. కాగా పుస్తెల తాడు కనిపించడం లేదని, కట్నం లక్ష రూపాయలు తీసుకురావాలని సోమవారం రాత్రి ఘర్షణ పడ్డట్లు తెలిపారు. అదే విషయంలో మంగళవారం ఉదయం గొడవపడగా కోపోద్రేక్తుడైన అభిలాష్ తన భార్య అంజలిని గొంతునులిమి హతమార్చాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. స్థానికుల సహకారంతో సమాచారం అందుకున్న వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అంజలి మృతి చెందిన విషయాన్ని అత్తమామలకు సమాచారమిచ్చి మృతదేహాన్ని ఇంట్లోనే వదిలేసి కుటుంబీకులతో కలిసి పరారయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అంజలి తల్లిదండ్రులు, కుటుంబీకులు బోరునవిలపించారు. కుటుంబీకుల ఆందోళన.. ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో మృతదేహంతో ఇంటి ఎదుటే ఆందోళనకు దిగారు. ప్రాణానికి ప్రాణం తీసే వరకు కదిలేదిలేదని సుమారు ఆరు గంటల పాటు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బైఠాయించారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ శేఖర్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి వెళ్ళి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా వర్షంలోనే విధులు నిర్వర్తించారు. ఆవేశంతో ఉన్న ఆందోళనకారులను పోలీసులు ఎంతో చాకచక్యంగా ప్రదర్శించి పరిస్థితిని అదుపుచేశారు. ఈ క్రమంలో మృతురాలి భర్త అభిలాష్ తన తల్లి సాయవ్వ, అమ్మమ్మ నర్సమ్మ, చెల్లెలు సోనితో కలిసి హవేళిఘణాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి పోలీసులకు లొంగిపోయినట్లు తెలిపారు. చిన్నపాటి ఘర్షణతో క్షణికావేశంలో తన భార్య అంజలి గొంతునులిమి హతమార్చినట్లు నిందితుడు అభిలాష్ అంగీకరించినట్లు తెలిపారు. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
ఖతం చేసి కథ అల్లి..
వర్ని(బాన్సువాడ): కట్టుకున్న భార్యను అడవిలోకి తీసుకెళ్లి తండ్రి సహకారంతో చంపాడో భర్త. మృతదేహాన్ని ఒర్రెలో పడేసి, ఏమీ తెలియనట్లు భార్య కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్తపై అనుమానంతో విచారించగా అసలు నిజం బయట పడింది. రెండు నెలల క్రితం జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆదివారం నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపిన వివరాలు.. బాన్సువాడ మండలం హన్మాజీపేట్‌కు చెందిన తాడేం సావిత్రికి(28), వర్ని మండలం జలాల్‌పూర్‌కు చెందిన బాలరాజ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. అప్పటికే బాలరాజ్‌కు పెళ్లి జరగగా భార్యతో విడిపోయాడు. సావిత్రికి రెండు పెళ్లిళ్లు జరిగాయి. రెండో భర్తతో కుమారుడు ఉన్నాడు. భర్తను వదిలేసి దూరంగా ఉంటోంది. (అత్యాచారం.. ఆపై అశ్లీల వీడియోలు తీయాలని..) ఈ నేపథ్యంలో సావిత్రిని బాలరాజ్ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు వసుంధర జని్మంచింది. ఏడాది నుంచి సావిత్రి ప్రవర్తన సరిగా లేనందున బాలరాజ్ నిలదీసేవాడు. ఘర్షణ పడేవాడు. ఈ నేపథ్యంలో సావిత్రి భర్త, మామ సాయిలుపై గ్రామంలో పంచాయతీ పెట్టింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్న బాలరాజ్ ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం బీడీల ఆకు, మొర్రి పండ్ల కోసమని ఆమెను తీసుకొని బాలరాజ్, సాయిలు తెల్లవారుజామునే అడవిలోకి వెళ్లారు. అడవిలోకి వెళ్లగానే తండ్రికొడుకులు కలిసి సావిత్రి గొంతు పిసికి చంపేశారు. (ఇట్టే దొరికిపోతారు!) అనంతరం మృతదేహాన్ని సమీపంలోని ఒర్రెలో పడేశారు. వారం తర్వాత బాలరాజ్ తన భార్య కనబడడం లేదని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు విచారణ చేయగా ఆచూకీ లభించలేదు. భర్తపై అనుమానంతో విచారించగా తన తండ్రి సాయిలుతో కలిసి హత్య చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిని తీసుకెళ్లి హత్య చేసిన ప్రాంతాన్ని రుద్రూర్ సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సై అనిల్‌రెడ్డి పరిశీలించారు. మృతదేహానికి ఘటన స్థలంలో పోస్టుమార్టం నిర్వహించి, నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై వివరించారు. -
కంటిపాపకు తెలియకుండా కాటికి..
సాక్షి, రేపల్లె: అనుమానం పెనుభూతంగా మారి కట్టుకున్న భార్యనే అతి కిరాతకంగా కడతేర్చాడో భర్త.. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి చనిపోయిందని తెలియని కుమార్తెలు రక్తసిక్తమైన ఆమె గుండెలను హత్తుకుని పడుకున్నారు.. అమ్మ బతికే ఉందని భావించారు. పోలీసుల అలికిడితో నిద్ర లేచారు. ఉలుకుపలుకూ లేకుండా పడి ఉన్న అమ్మకు ఏమైందో తెలియదు... నాన్న ఎక్కడికి వెళ్లాడో తెలియని ఆయోమయ పరిస్థితుల్లో చిన్నారులు దీనంగా వచ్చిపోయేవారి వంక చూస్తున్న తీరు హృదయ విదారకంగా మారింది. రేపల్లె పట్టణంలోని 13వ వార్డు ఉప్పూడి రోడ్డులో శనివారం తెల్లవారుజామున ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉప్పుటూరి వీరేంద్ర, సౌజన్య భార్యాభర్తలు. అద్దె ఇంటిలో కాపురం ఉంటున్నారు. వారికి భవ్యశ్రీ, జన్సిక అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వీరేంద్ర తెనాలిలోని ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసున్నాడు. (మిగిలిన టెన్త్ పరీక్షలు రద్దు.. సీఎం కీలక నిర్ణయం) భార్య సౌజన్య(30)కు వేరేవారితో వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తూ తరచూ గొడవ పెట్టుకుంటుండేవాడు. అనుమానం పెనుభూతంగా మారింది. ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం పిల్లలు నిద్రపోయిన అనంతరం భార్యను కత్తితో నరికి చంపాడు. అనంతరం పురుగులు మందు తాగి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, 13వ వార్డులోని ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ నిర్వహిస్తున్నట్లు పట్టణ సీఐ ఎస్.సాంబశివరావు తెలిపారు. వీరేంద్ర పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాపట్ల డీఎస్సీ శ్రీనివాసరావు, తహసీల్దార్ విజయశ్రీ ఘటన స్థలానికి చేరకుని కేసు పూర్వాపరాలను తెలుసుకున్నారు. బంధువులను వివరాలు అడిగితెలుసుకున్నారు. పెళ్ళైన నాటి నుంచి చిత్రహింసలు పట్టణంలోని రామశాస్త్రి కల్యాణ మండపం వద్ద నివాసం ఉంటున్న సౌజన్య తల్లిదండ్రులు పమిడిమళ్ల శ్రీరామమూర్తి, కనకమహాలక్ష్మి, బంధువులు చిన్నారులను దగ్గరకు తీసుకుని ఘటన స్థలం వద్ద విలపిస్తున్న తీరు వర్ణనాతీతం. పెళ్లైన నాటి నుంచి తమ బిడ్డను చిత్రహింసలకు గురిచేస్తూనే ఉన్నాడని వారు ఆరోపించారు. వీరేంద్ర ఏ పాఠశాలలో పట్టుమని నెలరోజులు కూడా పని చేయకుండా తరచూ తన కూతురిని బాధపెడుతుండే వాడని తెలిపారు. సొంతూరు చీరాల నుంచి సంవత్సరం క్రితం రేపల్లె వచ్చి ఉంటున్నాడని, ఇద్దరు ఆడపిల్లలు కావడంతో అవసరం అన్నప్పుడల్లా డబ్బులు ఇచ్చే వారమని చెప్పారు. అనుమానంతో తమ బిడ్డను కిరాతకంగా చంపాడని విలపిస్తున్నారు. చదవండి: గ్రేటర్లో మళ్లీ కరోనా అలజడి.. -
తరచూ సెల్ఫోన్లో మాట్లాడుతోందని..
రాజేంద్రనగర్: సెల్‌ఫోన్ భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టింది. తరచూ ఫోన్లో మాట్లాడుతోందని భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఆమెను అంతమొందించాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం విఠలాపురం ప్రాంతానికి చెందిన శాంతయ్య, సున్నాల శ్రీదేవి (30) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇటీవలే సన్‌సిటీ ప్రాంతంలోని ఓ ఇంటిలో శాంతయ్య వాచ్‌మెన్‌గా పనిలోకి చేరగా.. శ్రీదేవి ఆ ఇంటి పనులు చూసుకుంటోంది. అయితే, శ్రీదేవి తరచుగా సెల్ఫోన్లో మాట్లాడుతుండడంతో శాంతయ్య ఆమెను మందలించాడు. ఇదే విషయమై సోమవారం ఉదయం ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఆవేశం పట్టలేని శాంతయ్య, శ్రీదేవి తలపై రోకలి బండతో బలంగా బాదాడు. దీంతో శ్రీదేవి అక్కడికక్కడే కుప్పకూలింది. స్థానికుల సహాయంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతిచెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గొడ్డలితో నరికి.. పొలంలో పూడ్చి
బంట్వారం: వివాహేతర సంబంధంపై భార్యను పలుమార్లు మందలించినా మార్పులేకపోవడంతో భర్త ఆమెను గొడ్డలితో నరికి మృతదేహాన్ని పొలంలో పూడ్చిపెట్టాడు. కొన్ని రోజులు తప్పించుకుని తిరిగి శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం బార్వాద్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బార్వాద్‌కు చెందిన ఆనందం అలియాస్ నందు బంట్వారం లక్ష్మి (30)ని పన్నెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. లక్ష్మి కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతోంది. ఈ విషయమై ఆమెను భర్త మందలించినా మార్పు రాలేదు. ఈనెల 24న భార్యాభర్తలు కలిసి పొలం పనులకు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన ఆనందం భార్య లక్ష్మిని గొడ్డలితో నరికి చంపాడు. రాత్రి పొలంలోనే గుంత తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఇంటికి వెళ్లిన అతడు పిల్లలను తీసుకుని బంధువుల వద్దకు వెళ్లాడు. అను మానంతో అతడిని బంధువులు ప్రశ్నించగా విషయం చెప్పాడు. వారి సూచన మేరకు ఆనందం ధారూరు సీఐ రాజశేఖర్ ఎదుట లొంగిపోయాడు. నిందితుడు చెప్పిన వివరాల మేరకు పొలంలో పాతి పెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి డాక్టర్‌తో పోస్టుమార్టం చేయించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు. -
అన్నం పెట్టలేదని అంతం చేశాడు
మెట్పల్లి(కోరుట్ల) : కుటుంబ కలహాలు ఓ వివాహిత ప్రాణాలను బలి తీసుకున్నాయి. కడదాకా తోడుంటానని ప్రమాణం చేసిన కట్టుకున్నడే అన్నంపెట్టలేదని ఆలిని కొట్టిఅర్ధంతరంగా కడతేర్చాడు. కన్నబిడ్డలకు తల్లి ప్రేమను అందకుండా చేశాడు. పట్టణంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై శంకర్రావు కథనం ప్రకార.. నిర్మల్ జిల్లా బోథ్‌కు చెందిన కోసగంటి శ్రీనివాస్(40)కు అదే గ్రామానికి చెందిన మంజుల(35)తో ఇరవై ఏళ్లక్రితం వివాహం జరిగింది. వండ్రంగి పని చేసే శ్రీనివాస్ ఆ తర్వాత ఏడాదికి భార్యతో కలిసి ఉపాధి నిమిత్తం మెట్‌పల్లికి వచ్చి స్థిరపడ్డాడు. వీరికి కుమార్తె శ్రావణి(19), కుమారుడు విఘ్నేష్(17) ఉన్నారు. కాగా దుబ్బవాడలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్న శ్రీనివాస్ దంపతులకు గత కొన్ని నెలల నుంచి తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఇంటికి మద్యం సేవించి వచ్చిన శ్రీనివాస్ భార్యను అన్నం పెట్టమని అడిగాడు. దీనికి అమె నిరాకరించడంతో అగ్రహం చెంది ఇంట్లో ఉన్న సుత్తెతో తలపై గట్టిగా కొట్టాడు. తీవ్రంగా గాయం కావడంతో అమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుమార్తె, కుమారుడితో పాటు బంధువులు ఇంటికి వచ్చి మంజుల మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ శంకర్రావు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా నిందితుడు భార్యను చంపిన తర్వాత పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. -
భార్యను చంపి.. ఆత్మహత్యాయత్నం
కోరుట్ల : జులాయిగా తిరుగుతూ అప్పులు పెరిగి.. మద్యం మత్తులో ఓ భర్త తన భార్యను పొడిచి చంపాడు. తాను పొడుచుకున్నాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం కోరుట్ల పట్టణంలో చోటు చేసుకుంది. కోరుట్ల సతీష్ చందర్రావు కథ నం ప్రకారం.. కరీంనగర్ పట్టణంలోని అల్లమయ్యగుట్ట కాల నీలో పేర్ల మల్లేశం(42)- సాయమ్మ(38) దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఈ కుటుంబం కూలీనాలీతో పొట్ట పోసుకు ని జీవనం గడుపుతున్నారు. కొంతకాలంగా మల్లే శం ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు. సాయ మ్మ కుటుంబభారాన్ని చూసుకుంటోంది. ఈ క్రమంలో మల్లేశం మద్యానికి బానిసయ్యాడు. కు టుంబపోషణ.. మద్యం కోసం చేసిన అప్పులు సుమారు రూ.లక్షకు మించిపోయాయి. దీంతో తరుచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మల్లేశం భార్య సాయమ్మతో గొడవకు దిగాడు. వివాదం పెరగడంతో కత్తితో సాయమ్మ డొక్కలో పొడిచాడు. సాయమ్మ అక్కడిక్కడే చనిపోయింది. అన ంతరం మల్లేశం అదే కత్తితో ఛాతీతో పొడుచు కోగా స్వల్పగాయాలు అయ్యాయి. మల్లేశంను ఆ సుపత్రికి తరలించి చికిత్స అందించిన తరువాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన స్థలాన్ని సీఐ సతీష్ చందర్రావు, ఎస్సై రవికుమార్ పరిశీలిచి.కేసు నమోదు చేశారు. -
అనుమానంతో హత్య..
యాలాల : భార్య ప్రవర్తన నచ్చకపోవడంతో గొంతు నులిమి హత్య చేశాడో భర్త. అనంతరం మృతదేహం ఉన్న గదికి తాళం వేసి నేరుగా పీఎస్‌లో లొంగిపోయాడు. ఈ సంఘటన మండల పరిధిలోని రాజీవ్ స్వగృహ కాలనీలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. తాండూరు రూరల్ సీఐ సైదిరెడ్డి, నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం మిట్టబాస్పల్లికి చెందిన అక్తర్ బేగం(33), అబ్దుల్ రహీం 2007లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి ముందు అక్తర్ బేగంకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. మొదటి భర్తకు దూరంగా ఉంటున్న అక్తర్ బేగంను అబ్దుల్ రహీం రెండో వివాహం చేసుకున్నాడు. రహీం కర్ణాటక సరిహద్దులో ఉన్న సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో కూలీ పనులు చేస్తుండగా, అక్తర్ బేగం టైలరింగ్ పనులతో జీవితం గడుపుతున్నారు. ఏడాదిన్నరగా మండల పరిధిలోని రాజీవ్ కాలనీలోని 5వ బ్లాక్‌లో 1వ నెంబరు గదిలో నివాసం ఉంటున్నారు. కాగా ఇటీవల అక్తర్ బేగం ప్రవర్తనలో మార్పు గమనించిన రహీం తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. ఇదే క్రమంలో ఈనెల 12న ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్తర్ బేగం 14న తిరిగి వచ్చింది. ఇదే విషయమై ఆదివారం తమ సమీప బంధువుల వద్ద పంచాయతీ నిర్వహించారు. కాగా సోమవారం ఉదయం తమ కూతురు అఫియా బేగంను పాఠశాలకు పంపించిన అనంతరం భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఈ క్రమంలో రహీం.. అక్తర్ బేగం గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గదిలోనే ఉంచి బయట నుంచి తాళం వేసి నేరుగా యాలాల పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. విషయం నిందితుడి ద్వారా తెలుసుకున్న పోలీసులు కాలనీలో వారు ఉంటున్న గదిని తెరచి పంచనామ నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పాపం ఆఫియా..! కాగా తల్లి హత్యకు గురైన విషయం తెలియని అఫియా పరిస్థితి స్థానికులను కంటతడి పెట్టించింది. అఫియా పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన అనంతరం పోలీసులు అఫియాను పాఠశాల నుంచి కాలనీకి తీసుకొచ్చారు. తమ ఇంటి ముందు గుమిగూడిన జనాలను చూస్తూ, ఏం జరిగిందోనని ఆందోళనకు గురవుతున్న అఫియాకు స్థానికులు ధైర్యం చెప్పారు. -
కట్టుకున్నోడే కడతేర్చాడు..
కొలిమిగుండ్ల : కడదాకా ఏకష్టం రాకుండా చూసుకుంటానని బాస చేసిన భర్తే అనుమానంతో భార్యను కడతేర్చాడు. ఈఘటన కనకాద్రిపల్లెలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దూదేకుల చిన్నదస్తగిరికి బండిఆత్మకూరు మండలం బి.కోడూరుకు చెందిన ఖాశీంబి(35)తో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. దస్తగిరి లోడింగ్ కార్మికుడిగా పని చేసేవాడు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకోవడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈనేపథ్యంలో రెండు నెలల నుంచి జి.కోడూరులోని అత్తగారింట్లోనే ఉంటున్నారు. దస్తగిరికి నంద్యాలలోని ఓ కిరాణా దుకాణంలో పని చూపించారు. పొదుపు గ్రూపులో బ్యాంక్‌లో రుణం పొందేందుకు ఐదు రోజుల క్రితం భార్యభర్తలు స్వగ్రామానికి పిల్లలతో కలసి ఇద్దరు వచ్చారు. ఉదయమే ఉపాధి పనికి వెళ్లి మధ్యాహ్నం 12 గంటల్లోపే భార్య ఇంటికి చేరుకుంది. పవిత్ర రంజాన్ మాసం కావడంతో 11 ఏళ్ల కుమారుడు ఇంటికి అతి సమీపంలో ఉన్న మసీదుకు ప్రార్థనకు వెళ్లాడు. ఇద్దరు కుమార్తెలు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. ఈసయమంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన భర్త భార్య తల వెనుక భాగంలో కత్తితో దాడి చేశాడు. మసీదులో ఉన్న కుమారుడి దగ్గరకు వెళ్లి ‘మీ అమ్మ చావుబతుకుల మ«ధ్య ఉందంటూ’ చెప్పి పరారయ్యాడు. కుమారుడు బోరున ఏడ్చుకుంటూ పరుగున ఇంటి వద్దకు చేరుకున్నాడు. చుట్టు పక్కల ప్రజలు లోపలకు వెళ్లి చూడగా ఆమె కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. మానవతా ఆంబులెన్స్‌లో అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ బీటీ వెంకటసుబ్బయ్య ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
వివాహేతర సంబంధంతో..
చేవెళ్ల(రంగారెడ్డి) : వివాహేతర సంబంధం పెట్టుకొని కట్టుకున్న భార్య ఐదు నెలల గర్భిణి అని కూడా చూడకుండా చీరతో ఉరివేసి భార్యను హత్య చేశాడు ఓ కీచక భర్త. చేవెళ్ల మండలంలోని దేవునిఎర్రవల్లి గ్రామంలో ఈనెల 7న జరిగిన ఈ హత్యను పోలీసులు వరకట్నం వేధింపుల కేసుగా దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధం మోజులో పడి భార్యను హత్యచేసి అనారోగ్యంతో మృతి చెందినట్లుగా నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీస్ విచారణలో తెలింది. ఈ కేసులో నిందితులను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చేవెళ్ల పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ స్వామి, సీఐ గురువయ్యలతో కలిసి వివరాలను వెల్లడించారు. చేవెళ్ల మండలంలోని దేవునిఎర్రవల్లి గ్రామానికి చెందిన పత్తి శ్రీనివాస్ అలియాస్ శేఖర్‌కు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంద్రానగర్‌కు చెందిన మల్లేశం, లక్ష్మీల కూతురు శిరీష అలియాస్ మమత (23)ను ఇచ్చి గతేడాది జూన్‌లో పెద్ద సమక్షంలో పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో వరకట్నంగా రూ.14 లక్షల వరకు కట్నకానుకలు ముట్టజెప్పారు. కొన్ని నెలల తరువాత శిరీషకు వరకట్నం వేధింపులు మొదలయ్యాయి. శ్రీనివాస్ ఓడీఎఫ్ దగ్గర సొంతంగా మెడికల్ షాపు పెట్టాడు. చిన్న చెల్లెలు వివాహం నిశ్చయం కావడంతో మరో రూ. 2 లక్షల కావాలని భార్య శిరీషను నిత్యం అత్తింటివారు వేధింపులకు గురిచేసేవారు. కట్నం విషయంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగి శిరీష పుటింటికి వెళ్లింది. కాగా గర్భవతి కావడంతో పెద్దలు నచ్చజెప్పి మళ్లీ కాపురానికి పంపించారు. అయినా అత్తింట్లో ఆమెకు భర్త అత్తమామ, ఆడపడుచుల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. కడుపునొప్పి అని నాటకం.. భర్త శ్రీనివాస్‌కు గ్రామంలోనే మరో యువతితో పెళ్లికి ముందే పరిచయం ఉంది. వారి పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసినా బయటకు రాకుండా శిరీషతో పెళ్లి చేశారు. పెళ్లైన తరువాత కూడా ఆ యువతితో శ్రీనివాస్ సంబంధం కొనసాగుతూనే ఉంది. వేరొకరి మోజులో పడి అదనపు కట్నం తీసుకురావాలని చెప్పినా తీసుకురాకపోవడంతో ఎలాగైనా భార్యను వదిలించుకోవాలని శ్రీనివాస్ నిర్ణయించకున్నాడు. ఈ నెల 6వ తేదీ రాత్రి భార్యతో గొడవపడ్డాడు. భార్య గర్భిణి అని కూడా చూడకుండా కడుపులో తన్నడంతో తీవ్ర రక్తస్రావమైంది. తెల్లవారు జామున మూడు గంటల సమయంలో చీరతో ఉరివేసి శిరీషను చంపి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. తనపై అనుమానం రాకుండా ఉండాలని ఇరుగుపొరుగు వారికి తన భార్యకు కడుపునొప్పి వచ్చిందని చెప్పి మొయినాబాద్ మండలంలోని భాస్కర ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పటంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. అప్పుడు అత్తామామలకు శ్రీనివాస్ ఫోన్ చేసి శిరీష కడుపునొప్పితో బాధపడుతున్నట్లు బొంకాడు. వారు వచ్చే లోపు ఆమె చనిపోయినట్లు చిత్రీకరించారు. శరీరంపై గాయాలతో అనుమానం.. కుటుంబసభ్యులు మృతదేహంపై ఉన్న గాయాలు గుర్తులతో మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన గొడవలు కూడా ఉండడంతో అత్తింటివారే కట్నం కోసం వేధించి చంపేశారని చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. అయితే ఈ కేసులో భర్త శ్రీనివాస్, అత్తామామలు కాంతమ్మ, శ్రీశైలం, ఆడపడుచులు మంగమ్మ, శారద, అనిత, శ్రీనివాస్ ప్రియురాలి ప్రోత్సాహం కూడా ఉందని పోలీసుల విచారణలో తేలింది. విచారణలో భర్త శ్రీనివాస్ తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో కేసుతో సంబంధం ఉన్న ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో ఎస్ఐ శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు. -
భార్యను హత్యచేసి ఆత్మహత్య
వేలూరు, న్యూస్‌లైన్: కుటుంబ కలహాలతో క్షణికావేశంతో భార్యను హత్య చేసి కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తిరువణ్ణామలై జిల్లాలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. తిరువణ్ణామలైలోని గాంధీనగర్‌కు చెందిన పుగళేంది(36) సినిమా థియేటర్లో క్యాంటీన్లో పనిచేస్తున్నాడు. ఇతని భార్య భవాని(30). వీరికి సంజయ్(14), సౌమ్య(12) పిల్లలు. వీరు తిరువణ్ణామలైలోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. వీరు పాఠశాల ముగించుకొని రామ్‌జీనగర్‌లోని తాత మారిముత్తు ఇంటికి ప్రతిరోజూ వెళ్లేవారు. బుధవారం సాయంత్రం కూడా వెళ్లారు. గురువారం ఉదయం గాంధీనగర్‌లోని ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో ఇంటికి వెళ్లి చూడగా తల్లి భవాని రక్తపు మడుగులో మృతి చెంది ఉండగా, తండ్రి పుగళేందిఉరి వేసుకొని ఉండడాన్ని చూసి కేకలు వేశారు. కేకలు విన్న స్థానికులు వచ్చి చూడగా అప్పటికే ఇద్దరూ మృతి చెంది ఉండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా పుగళేంది భార్యను అనుమానించేవాడని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ ఏర్పడి భవానిని హత్య చేసి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో చిన్నారుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు మున్నీరు అయ్యారు. -
ఆలిని కత్తితో నరికి చంపిన భర్త
ఎంత నచ్చజెప్పినా భార్య ప్రవర్తన మార్చుకోకపోగా, కాపురానికి కూడా రావడం లేదని ఆగ్రహించిన భర్త అతి కిరాతకంగా ఆమెను నరికి చంపాడు. అడ్డొచ్చిన అత్తయ్య, ఇద్దరు బావమరుదుల పైనా దాడి చేశాడు. తూర్పుగోదావరి జిల్లా సీతాపురం మండలం సింగవరంలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సామర్లకోట మండలం నవరకు చెందిన కోరుమిల్లి శ్రీనివాస్ తాపీ పని చేస్తుంటాడు. అతడికి మూడేళ్ల క్రితం రెండో వివాహమైంది. సింగవరానికి చెందిన వీరమణి (28)ని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఏడాదిన్నర కుమార్తె ఉంది. పెళ్లయినప్పటి నుంచి సింగవరంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. శ్రీనివాస్ మొదటి భార్య గ్యాస్ స్టౌపై వంట చేస్తుండగా చీరకొంగు అంటుకుని మరణించింది. అప్పట్లో శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేయగా, కోర్టులో అతడిపై నేరం నిరూపణ కాలేదు. శ్రీనివాస్‌తో వీరమణిది నాలుగో వివాహం. అంతకు ముందు పెళ్లి చేసుకున్న వారు వివిధ కారణాలతో ఆమెను విడిచిపెట్టారు. వీరమణి నడవడిక సక్రమంగా లేదని నెల రోజుల క్రితం శ్రీనివాస్ ఆమెతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తగాదాను పెద్దల్లో పెట్టగా, ఇష్టం లేకపోతే వెళ్లిపోవాలని వారు శ్రీనివాస్‌తో చెప్పారు. దీంతో శ్రీనివాస్ తన సొంత గ్రామానికి వెళ్లిపోయాడు. హతమార్చి.. ఆత్మహత్య చేసుకోవాలని.. శనివారం రాత్రి రెండు బాటిళ్లలో పెట్రోలు, అగ్గిపెట్టె, కత్తి, రెండు జతల దుస్తులు, పురుగుమందును వెంట తీసుకుని శ్రీనివాస్ సింగవరంలో భార్య ఇంటికి వచ్చాడు. ఆదమరచి నిద్రపోతున్న వీరమణి కుడి చెంపపైనా, మెడపై కత్తితో వేటు వేయగా, ఆమె కేకలు వేస్తూ అక్కడికక్కడే చనిపోయింది. కుమార్తె కేకలు విన్న ఆమె తల్లి వెంకటలక్ష్మి అక్కడకు రాగా, ఆమె మెడ, తలపై కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన బావమరుదులు రామారావు, వీరమణి పెదనాన్న కుమారుడు వీరవెంకట కృష్ణలను గాయపర్చాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగేశాడు. అప్పటికే అక్కడకు చేరుకున్న స్థానికులు.. శ్రీనివాస్‌ను పట్టుకుని చెట్టుకు కట్టేశారు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని అంబులెన్స్లోను, అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్‌ను ఆటోలోను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంకటలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదివారం ఉదయం ఆమెను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శ్రీనివాస్, రామారావు, వెంకటకృష్ణ రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరమణి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రవర్తన మార్చుకోమని వీరమణికి ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో ఆమెను హతమార్చినట్టు శ్రీనివాస్ చెప్పాడని సీఐ రమణ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
కోరిక తీర్చలేదని..బాలింతను చంపిన భర్త
గండేడ్, న్యూస్‌లైన్: పచ్చి బాలింత అయిన భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త కళ్లు కామంతో మూసుకుపోయాయి. తన వాంఛ తీర్చలేదని కట్టుకున్న ఇల్లాలినే గతునులిమి కడతేర్చిన ఘటన ఆదివారం గండేడ్ మండలం కంచన్‌పల్లిలో వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దిర్శం వెంకటయ్య(35), చెన్నమ్మ(28) దంపతులు. తమకున్న రెండెకరాల్లో వ్యవసాయంతో పాటు స్థానికంగా కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పిల్లలు ప్రియాంక(6), చెన్నకేశవులు(4) ఉన్నారు. 11 రోజుల క్రితం చెన్నమ్మ కంచన్‌పల్లిలో మరో పాపకు జన్మనిచ్చింది. శనివారం రాత్రి 10:30 గంటల సమయంలో వెంకటయ్య మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తన కోరిక తీర్చాలంటూ భార్యను వేధించాడు. చెన్నమ్మ అంగీకరించకపోవడంతో గొంతునులిమి చంపేశాడు. అదే సమయంలో మెలకువతో ఉన్న పెద్దకూతురు ప్రియాంక ‘నాన్నా అమ్మను ఏం చేయొద్ద’ంటూ ఎంత ప్రాధేయపడినా ఆ కర్కోటకుడి హృదయం ద్రవించలేదు. భార్యను చంపిన అనంతరం వెంకటయ్య అక్కడే పడుకున్నాడు. పాల కోసం రాత్రంతా పసికందు గుక్కపట్టి ఏడ్చినా పట్టించుకోలేదు. ఆదివారం ఉదయం నిద్రలేచిన వెంకటయ్య ఇల్లు, వాకిలీ శుభ్రం చేశాడు. తన ఘాతుకాన్ని వరుసకు అల్లుడయ్యే వ్యక్తికి చెప్పి.. ఈ విషయాన్ని తన అత్తగారికి చెప్పాలన్నాడు. కూతురి హత్య విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు మహబూబ్‌నగర్ జిల్లా దమ్మాయిపల్లి నుంచి వ చ్చారు. పరిగి సీఐ వేణుగోపాల్‌రెడ్డి, మహమ్మదాబాద్ ఎస్ఐలు వివరాలు సేకరిం చారు. వెంకటయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా పైవివరాలు తెలిపాడు. మృతురాలి పెద్దకూతురు ప్రియాంక ఘటనను కళ్లకు కట్టినట్లు పోలీసులకు చెప్పడంతో గ్రామస్తులు, బంధువులు అయ్యో పాపం అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. చెన్నమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ఆస్పత్రికి తరలించారు. తల్లి మృతితో పసికందును ఐసీడీఎస్, అంగన్వాడీ అధికారులు తాండూరులోని శిశువిహార్‌కు తరలించారు. తల్లి హత్య.. తండ్రి జైలు పాలవడంతో పిల్లలు అనాథలవుతారని బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. కేసు దర్యాప్తులో ఉంది.