భార్యను చంపి.. ఆత్మహత్యాయత్నం | Wife Killed By Husband In Korutla | Sakshi
Sakshi News home page

భార్యను చంపి.. ఆత్మహత్యాయత్నం

Jul 25 2018 2:31 PM | Updated on Jul 25 2018 2:31 PM

Wife Killed By Husband In Korutla - Sakshi

సాయమ్మ మృతదేహం  

కోరుట్ల : జులాయిగా తిరుగుతూ అప్పులు పెరిగి.. మద్యం మత్తులో ఓ భర్త తన భార్యను పొడిచి చంపాడు. తాను పొడుచుకున్నాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం కోరుట్ల పట్టణంలో చోటు చేసుకుంది. కోరుట్ల సతీష్‌ చందర్‌రావు కథ నం ప్రకారం.. కరీంనగర్‌ పట్టణంలోని అల్లమయ్యగుట్ట కాల నీలో పేర్ల మల్లేశం(42)- సాయమ్మ(38) దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు.

ఈ కుటుంబం కూలీనాలీతో పొట్ట పోసుకు ని జీవనం గడుపుతున్నారు. కొంతకాలంగా మల్లే శం ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు. సాయ మ్మ కుటుంబభారాన్ని చూసుకుంటోంది. ఈ క్రమంలో మల్లేశం మద్యానికి బానిసయ్యాడు. కు టుంబపోషణ.. మద్యం కోసం చేసిన అప్పులు సుమారు రూ.లక్షకు మించిపోయాయి. దీంతో తరుచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మల్లేశం భార్య సాయమ్మతో గొడవకు దిగాడు. వివాదం పెరగడంతో కత్తితో సాయమ్మ డొక్కలో పొడిచాడు. సాయమ్మ అక్కడిక్కడే చనిపోయింది. అన ంతరం మల్లేశం అదే కత్తితో ఛాతీతో పొడుచు కోగా స్వల్పగాయాలు అయ్యాయి. మల్లేశంను ఆ సుపత్రికి తరలించి చికిత్స అందించిన తరువాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన స్థలాన్ని సీఐ సతీష్‌ చందర్‌రావు, ఎస్సై రవికుమార్‌ పరిశీలిచి.కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement