ప్రతీకాత్మక చిత్రం
తిరువొత్తియూరు: సెల్ఫీ మోజు నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా సెల్ఫీ చేసుకుంటున్న సమయంలో కాలుజారి కల్లాడి నదిలో పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆదివారం శవమై తేలింది.
వివరాల ప్రకారం.. తిరుపతికి చెందిన కట్టా వినిత చౌదరి (26) కర్ణాటకలోని బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. శని, ఆదివారం సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి ఊటీ విహారయాత్రకు వచ్చారు. శనివారం సాయంత్రం కల్లాడి నది ఒడ్డుపై స్నేహితులతో కలిసి సెల్ఫీ చేసుకుంటున్న సమయంలో వినిత చౌదరి నదిలో పడిపోయారు.
ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. శనివారం రాత్రి వరకూ గాలించిన ఆచూకీ దొరకలేదు. ఆదివారం ఉదయం గాలింపు చేపట్టి వినితా చౌదరి మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: విహారంలో విషాదం.. పడవ బోల్తాపడి ఒకే ఫ్యామిలీలో 8 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment