Tamil Nadu: Newly Married Doctor Couple Died In Bali During Photoshoot, Details Inside - Sakshi
Sakshi News home page

Chennai: హనీమూన్‌లో షాకింగ్‌ ఘటన.. కొత్త జంట బాలి ద్వీపానికి వెళ్లి..

Published Mon, Jun 12 2023 11:04 AM | Last Updated on Mon, Jun 12 2023 1:35 PM

Tamil Nadu: Newly Married Couple Died In Bali During Photoshoot - Sakshi

అన్నానగర్‌(చెన్నై): పూందమల్లి సమీపంలో ఉన్న సెన్నీర్‌కుప్పంకు చెందిన డాక్టర్‌ విష్ణుప్రియ. చైన్నెకి చెందిన వైద్యుడు లోకేశ్వర్‌తో ఇటీవల పూందమల్లిలో వివాహం జరిగింది. కొత్త జంట హనీమూన్‌ కోసం ఇండోనేషియాలోని బాలి ద్వీపానికి వెళ్లారు. అక్కడ ఓ హోటల్‌లో బసచేసిన నవ దంపతులు పలు ప్రాంతాలలో పర్యటించారు.

రెండు రోజుల క్రితం బాలి ద్వీపం వద్ద సముద్రంలో మోటార్‌బోటులో వెళుతుండగా బోటు బోల్తాపడిన ఘటనలో విష్ణుప్రియ – లోకేశ్వర్‌ దంపతులు నీటిలో గల్లంతయ్యారు. గల్లంతైన లోకేశ్వర్‌ మృతదేహం శుక్రవారం, విష్ణుప్రియ మృతదేహం శనివారం సముద్రం నుంచి వెలికితీశారు. మృతదేహాలను తీసుకురావడానికి 4 లేదా 5 రోజులు పట్టే అవకాశం ఉందని బంధువులు తెలిపారు. ఈ విషయంలో భారత రాయబార కార్యాలయం చర్యలు తీసుకుంటోంది.

చదవండి: ‘కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం.. పరువును బజారుకీడ్చొద్దు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement