![Tamil Nadu: Girl Who Lost Father Attends Tenth Examination Hall - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/14/Tenth%20Examination%20Hall.jpg.webp?itok=AG8-y01o)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,అన్నానగర్(చెన్నై): కడలూరు ముత్తునగర్ సమీపంలోని వండిపాళయంకు చెందిన రవి (45) స్థానికంగా సెక్యూరిటీగా గార్డుగా పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం అకస్మాతుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. బంధువులు చికిత్స నిమిత్తం కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పుడు చికిత్స పొందుతూ రవి అర్ధరాత్రి మృతి చెందాడు. రవికి ఆదిలక్ష్మి (15) అనే కుమార్తె ఉంది.
తిరుపత్తిరి పులియూరు ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. గురువారం పబ్లిక్ పరీక్ష జరుగుతోంది. ఈ స్థితిలో తండ్రి చనిపోవడంతో విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురై బోరున విలపించింది. అయినా పరీక్ష రాసేందుకు ఆదిలక్ష్మి పాఠశాలకు వచ్చింది. ఇది చూసిన ఉపాధాయయులు, విద్యార్థులు ఆమెను ఓదార్చి ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment