Exam hall
-
కర్ణాటకలో విద్యార్థినులపై యాసిడ్ దాడి
మంగళూరు: ప్రేమను తిరస్కరించిందన్న ఆవేశంతో ఒక యువకుడు ఒక అమ్మాయిపై కక్ష పెంచుకుని యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. యాసిడ్ దాడి సమయంలో ఆ బాధిత అమ్మాయి పక్కనే కూర్చున్న వేరే ఇద్దరు అమ్మాయిలపైనా యాసిడ్ పడి వారికీ ముఖంపై కాలిన గాయాలయ్యాయి. కర్ణాటకలో మంగళూరు సమీపంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని కడబ తాలూకాలో ఈ యాసిడ్ దాడి ఘటన జరిగింది. బాధిత అమ్మాయి ముఖంపై తీవ్రస్థాయిలో గాయాలయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటిన సమీప ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడబలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రీ–యూనివర్సిటీ కోర్సు పరీక్షల కోసం కారిడార్‌లో కూర్చుని సిద్ధమవుతున్న ముగ్గురు టీనేజీ అమ్మాయిల ముఖంపైకి ఒక యువకుడు యాసిడ్ చల్లాడు. ఆ యాసిడ్ ద్రావకం పక్కనే ఉన్న మరో ఇద్దరు అమ్మాయిలపైనా పడింది. దాడి చేసి పారిపోతున్న యువకుడిని స్థానికులు వెంబడించి పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. అతడిని కేరళ మణప్పురం జిల్లా నీలాంబూర్‌కు చెందిన 23 ఏళ్ల అబిన్ షిబిగా పోలీసులు గుర్తించారు. తన ప్రేమను తిరస్కరించినందుకే బాధిత విద్యారి్థనిపై యాసిడ్ దాడికి పాల్పడినట్లు పోలీసుల ముందు యువకుడు నేరం అంగీకరించాడు. -
పుస్తకాలు చూస్తూనే పరీక్ష!
న్యూఢిల్లీ: పరీక్ష గదిలో విద్యార్థుల దగ్గర చీటీలు కనిపిస్తే వీపు వాయగొట్టే ఉపాధ్యాయులనే మనం చూశాం. అయితే పుస్తకాలు, నోటు పుస్తకాలు చూసుకుంటూ ఎగ్జామ్ ఎంచకా రాసుకోండర్రా అని చెప్పే విధానం ఒకదానికి పైలట్ ప్రాజెక్ట్‌గా పరీక్షించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్ణయించింది. ఈ వినూత్న ఆలోచన 2023 డిసెంబర్లోనే బోర్డ్ కార్యనిర్వాహక వర్గ సమావేశంలో చర్చకొచి్చంది. నిరీ్ణత కాలావధిలో పాఠ్యపుస్తకాలను చూస్తూనే విద్యార్థి పరీక్షగదిలో ఎంత సృజనాత్మకంగా సమాధానాలు రాబట్టగలడు, సూటిగాలేని తికమక, క్లిష్ట ప్రశ్నలకు ఎలా జవాబులు రాయగలడు, విద్యార్థి ఆలోచనా విధానం, విశ్లేషణ సామర్థ్యం వంటి వాటిని మదింపు చేసే ఉద్దేశంతో ఈ ‘ఓపెన్–బుక్ ఎగ్జామ్’ పైలట్ ప్రాజెక్టుకు సీబీఎస్ఈ పచ్చజెండా ఊపింది. అయితే ఈ పరీక్ష విధానాన్ని 10, 12 తరగతి బోర్డ్ పరీక్షలో అమలుచేసే ఆలోచన అస్సలు లేదని సీబీఎస్ఈ అధికారులు స్పష్టంచేశారు. కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లి‹Ù, గణితం, సామాన్య శా్రస్తాల్లో, 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంగ్లి‹Ù, గణితం, జీవశా్రస్తాల్లో ఈ ఓపెన్–బుక్ ఎగ్జామ్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టనున్నారు. స్టడీ మెటీరియల్‌ను రిఫర్ చేస్తూనే ఇలాంటి ఎగ్జామ్ పూర్తిచేయడానికి విద్యార్థి ఎంత సమయం తీసుకుంటాడు? అనే దానితోపాటు విద్యార్థులు, టీచర్లు, సంబంధిత భాగస్వాముల అభిప్రాయాలనూ సీబీఎస్ఈ పరిగణనలోకి తీసుకోనుంది. ఫార్మాటివ్ అసెస్మెంట్(ఎఫ్ఏ), సమ్మేటివ్ అసెస్మెంట్(ఎస్ఏ)ల కోణంలో ఈ తరహా పరీక్ష అమలు తీరుతెన్నులపై సీబీఎస్ఈ ఓ నిర్ణయానికి రానుంది. -
తండ్రి మరణం.. దుఃఖంతోనే పరీక్షకు హాజరైన విద్యార్థిని!
సాక్షి,అన్నానగర్(చెన్నై): కడలూరు ముత్తునగర్ సమీపంలోని వండిపాళయంకు చెందిన రవి (45) స్థానికంగా సెక్యూరిటీగా గార్డుగా పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం అకస్మాతుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. బంధువులు చికిత్స నిమిత్తం కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పుడు చికిత్స పొందుతూ రవి అర్ధరాత్రి మృతి చెందాడు. రవికి ఆదిలక్ష్మి (15) అనే కుమార్తె ఉంది. తిరుపత్తిరి పులియూరు ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. గురువారం పబ్లిక్ పరీక్ష జరుగుతోంది. ఈ స్థితిలో తండ్రి చనిపోవడంతో విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురై బోరున విలపించింది. అయినా పరీక్ష రాసేందుకు ఆదిలక్ష్మి పాఠశాలకు వచ్చింది. ఇది చూసిన ఉపాధాయయులు, విద్యార్థులు ఆమెను ఓదార్చి ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు. -
పరీక్షలో కొడుకు కోసం చిట్టీలు.. పోలీసులకు దొరికిన తండ్రి
సుద్ద మొద్దు అయిన కొడుకును ఎలాగైనా పరీక్ష గండం గట్టెక్కించాలని ఆ తండ్రి తాపత్రయపడ్డాడు. నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లి చిట్టీలు అందించేందుకు యత్నించాడు. కానీ, ఆ తండ్రికి చివరకు చేదు అనుభవం ఎదురైంది. సడన్ ఎంట్రీ ఇచ్చిన ఖాకీలు ఆ తండ్రిని పరిగెత్తించి మరీ చితకబాదారు. సోషల్ మీడియాలో ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. మహారాష్ట్రలో స్టేట్ బోర్డు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ తరుణంలో జలగావ్‌లోని ఓ పరీక్షా కేంద్రం వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొడుక్కి చిట్టీలు అందిస్తున్న సమయంలో.. ఎగ్జామ్ ఇన్విజిలేటర్ ఆ విషయాన్ని గమనించి బయట ఉన్న పోలీసులను అప్రమత్తం చేశారు. వాళ్లు పరీక్షా కేంద్రం వెనక నుంచి పరిగెడుతున్న ఆ తండ్రిని దొరకబుచ్చుకుని.. చితకబాదారు. కిందపడినా కూడా వదలకుండా లాఠీలతో బాదేశారు. శనివారం ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. శుక్రవారం పన్నెండవ తరగతి లెక్కల పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రాలు రెండూ లీక్ కావడం కలకలం సృష్టించిది. బుల్దానా జిల్లా సింధ్‌ఖేడ్ రాజా తాలుకాలో ఈ లీకేజీ వ్యవహారం వెలుగుచూసింది. ఈ ఘటనపై మహారాష్ట్ర స్టేట్ బోర్డు ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డు పోలీసులను ఆశ్రయించగా.. వాళ్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ లీక్ ప్రభావం పరీక్ష మీద పడలేదని బోర్డు ప్రకటించుకోవడం గమనార్హం. मुलाला कॉपी पुरवायला गेलेल्या बापाला पोलिसांकडून बेदम चोप, व्हिडिओ व्हायरल pic.twitter.com/RiF402O2X6 — Kiran Balasaheb Tajne (@kirantajne) March 4, 2023 -
వైరల్ వీడియో: పెళ్లి దుస్తుల్లో వెళ్లి పరీక్ష రాసిన వధువు
-
పెళ్లి దుస్తుల్లో వెళ్లి పరీక్ష రాసిన వధువు.. వీడియో వైరల్..
తిరువనంతపురం: పెళ్లి దుస్తుల్లో వెళ్లి పరీక్ష రాసిన ఓ వధువుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పుసుపు రంగు చీర, బంగారు ఆభరణాలతో పాటు ఆప్రాన్ ధరించి మెడకు స్టెతస్కోప్ వేసుకుని ఈ కొత్త పెళ్లికూతురు ప్రాక్టికిల్ ఎగ్జామ్స్‌కు హాజరైంది. కేరళకు చెందిన ఈ యువతి పేరు శ్రీ లేక్ష్మి అనిల్. బెథానీ నవజీవన్ పిజియోథెరపీ కాలేజీలో చదువుతోంది. పెళ్లి రోజే ఫిజియోథెరపీ ప్రాక్టికల్ ఏగ్జామ్ ఉండటంతో పెళ్లి మండపం నుంచి నేరుగా పరీక్ష హాల్‌కు వెళ్లింది. ఈమెను పెళ్లిదుస్తుల్లో చూసిన క్లాస్మేట్స్ నవ్వుకున్నారు. ఆమెకు చీర్స్‌తో వెల్కం చెప్పారు. View this post on Instagram A post shared by 🅰🅳🅷🅸_🅰🅻🅼🅰💓 (@_grus_girls_) చదవండి: పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు.. తర్వాత ఏం జరిగిందంటే? -
డీబార్ చేశారని మనస్థాపం.. హాస్టల్‌పై నుంచి దూకి ఆత్మహత్య
బెంగళూరు: పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడిన ఆరోపణలతో కాలేజీ నుంచి డీబార్ చేయడంతో విద్యార్థిని హాస్టల్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరు జీవనబీమా నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ విద్యార్థిని ముళబాగిలు కు చెందిన భవ్య (19). ప్రైవేటు పీజీ హాస్టల్లో ఉంటూ కోరమంగల జ్యోతినివాస్ కాలేజీలో పస్ట్ ఇయర్ బీకాం చదువుతోంది. పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడిందని శుక్రవారం కాలేజీ నుంచి డీబార్ చేశారు. దీంతో తీవ్రంగా బాధపడిన భవ్య సాయంత్రం తన సోదరికి ఫోన్ చేసి తనను కాలేజీ నుంచి డీబార్ చేశారని, నేను ఇక బతకలేను అని చెప్పింది. తల్లిదండ్రులు భయపడి తిరిగి ఫోన్ చేయగా భవ్య స్పందించలేదు. దీంతో వారు బెంగళూరుకు బయల్దేరారు. కొంతసేపటికే ఆమె హాస్టల్ ఐదవ అంతస్తు నుంచి దూకడంతో మృత్యువాత పడింది. కుమార్తె మృతికి కాలేజీ పాలకమండలి కారణమని భవ్య తల్లిదండ్రులు జీవనబీమానగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
సివిల్స్ పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదని..
న్యూఢిల్లీ : పరీక్ష కేంద్రంలోనికి అనుమతించలేదని ఓ సివిల్స్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తిని కర్ణాటకకు చెందిన వరుణ్‌గా గుర్తించారు. ఆదివారం జరిగిన యూపీఎస్సీ పరీక్షకు కొద్దిగా అలస్యంగా చేరుకోవడంతో వరుణ్‌ను అధికారులు లోనికి అనుమతించలేదు. దీంతో మనస్తాపానికి గురైన వరుణ్ రాజేంద్రనగర్‌లోని తన గదికి చేరుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం వరుణ్‌ను కలువడానికి వచ్చిన స్నేహితురాలు ఎంత సేపు ప్రయత్నించిన అతను తలుపు తెరవకపోవడంతో అమె ఇరుగుపొరుగు వాళ్లకి సమాచారం ఇచ్చింది. వారు గది తలుపులు తెరచేసరికే వరుణ్ చనిపోయాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతని రూంలోని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరీక్ష నియమాలు బాగానే ఉన్నప్పటికి.. కొన్ని సడలింపులు ఉంటే బాగుండేది అని వరుణ్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడని ఓ పోలీస్ అధికారి తెలిపారు. పోస్ట్‌మార్టమ్ అనంతరం వరుణ్ మృతదేహాన్ని ఢిల్లీలో ఉంటున్న అతని సోదరికి అందజేశామన్నారు. -
పరీక్ష హాలులోనే కుప్పకూలిన అధ్యాపకురాలు
గుంటూరు ఎడ్యుకేషన్(గుంటూరు): ఇంటర్మీడియెట్ పరీక్షల ఇన్విజిలేషన్ విధుల్లో ఉన్న ఓ అధ్యాపకురాలు పరీక్షహాలులోనే గుండెపోటుతో కుప్పకూలారు. గుం టూరు నగరం ఏసీ కళాశాలలో గురువారం ఈ విషాదం చోటు చేసుకుంది. అదే సమయంలో ఆమె తనయుడు మరో కేంద్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్ష రాశాడు. స్థానిక ఏసీ కళాశాలలో ఆంగ్లభాష అధ్యాపకురాలు పిడకాల హేమ కాంతి (44) ఇంటర్ పరీక్షలకు అదే కళాశాలలో ఇన్విజిలేటర్‌గా వ్యవహ రిస్తున్నారు. గురువారం ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ప్రశ్నపత్రాలు పంపిణీ చేసిన హేమకాంతి ఉదయం 9.30 గంటల సమయంలో గుండెనొప్పి రాగా పరీక్ష హాలులోనే కుప్పకూలిపోయారు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
► ఎంసెట్ తరహాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ► మార్చి 2 నుంచి ప్రారంభం ► హాజరుకానున్న విద్యార్థుల సంఖ్య 9.64 లక్షలు ► పరీక్ష కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం ► అధికారుల సెల్‌ఫోన్ వాడకంపై హైటెక్ నిఘా ► మాట్లాడినా, ఎస్ఎంఎస్ చేసినా జీపీఎస్ సహాయంతో గుర్తింపు సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 2న ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లను ఇంటర్మీడియెట్ బోర్డు పూర్తిచేసింది. ఈసారి ఇంటర్ పరీక్షల్లో మొదటిసారిగా నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ విధానాన్ని బోర్డు అమలు చేయనుంది. ఎంసెట్ తరహాలోనే ఇంటర్ పరీక్షల్లోనూ హైటెక్ కాపీయింగ్ జోరుగా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తుండటంతో నిమిషం నిబంధనను అమలు చేయాలని నిర్ణయించినట్లు బోర్డు కార్యదర్శి అశోక్ శనివారమిక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విద్యార్థులు వీలైనంత ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఆలస్యం చే సి ఆ తరువాత నష్టపోవద్దని సూచించారు. ఇందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందని, విద్యార్థులను 8:45 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇస్తామని వెల్లడించారు. 9 గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులకు హాల్‌టికెట్లను ఏ కారణంతో (ఫీజులతో సహా) నిరాకరించినా.. ఆయా యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అశోక్ హెచ్చరించారు. అలాంటి వారిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సు సదుపాయం కల్పించేలా చర్యలు చేపట్టారు. పరీక్షల మూల్యాంకనం మార్చి 9 (అరబిక్, ఫ్రెంచి, సంస్కృతం)నుంచి, ఇతర సబ్జెక్టుల్లో మార్చి 18 నుంచి ప్రారంభిస్తారు. వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు.. ► హాల్టికెట్లలో విద్యార్థులు ఇబ్బందులు లేకుండా బోర్డు చర్యలు చేపట్టింది. ఈనెల 29 నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులు పరీక్షలకు హాజరు కావచ్చు. ► హాల్టికెట్లలో పొరపాట్లు ఉంటే ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి మార్పు చేయించుకోవాలి. ►ఓఎంఆర్ బార్కోడ్లో పేరు, హాల్‌టికెట్ నంబరు, మీడియం వివరాలను సరిచూసుకోవాలి. ► జవాబుల బుక్‌లెట్‌లో 24 పేజీలు ఉన్నాయా? లే దా? చూసుకోవాలి. వేరు అడిషనల్ షీట్స్ ఇవ్వరు. ► కొత్త సిలబస్, పాత సిలబస్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటిసారి పరీక్షలు రాసే వారంతా కొత్త సిలబస్ ప్రశ్నపత్రంతోనే రాయాలి. విద్యార్థులు సెల్ ఫోన్లు తేవద్దు పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. పరీక్ష కేంద్రాల్లో జామర్లు ఉంటాయి. కేవలం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, అనుమతి పొందిన వారు మాత్రమే సెల్‌ఫోన్ వినియోగించాలి. అదీ ప్రశ్నాపత్రాల చేరవేత కోసమే. వారి ఫోన్లపైనా ట్యాపింగ్ తరహా హైటెక్ నిఘా ఉంటుంది. జీపీఎస్ సహాయంతో వారి ఫోన్ నుంచి ఇతరులకు ఫోన్ వెళ్లినా, మెసేజ్ వెళ్లినా, ఇతరుల ఫోన్ల నుంచి వారి ఫోన్లకు కాల్ వచ్చినా, మెసేజ్ వచ్చినా రికార్డు చేస్తారు. మాస్ కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు 50 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 200 వరకు సిట్టింగ్ స్క్వాడ్లను పోలీసు, రెవెన్యూ బృందాలతో ఏర్పాటు చేశారు. పరీక్షల ఇన్విజిలేషన్ విధుల్లో 24,651 మంది లెక్చరర్లు, 3,388 మంది టీచర్లు పాల్గొంటారు. పరీక్షలకు 1,257 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 478 ప్రభుత్వ కాలేజీలు, 34 ఎయిడెడ్ కాలేజీలు, 745 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. 118 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఉంటుంది. మొత్తం 9,64,664 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరం 4,56,655 మంది, ద్వితీయ సంవత్సరం 5,08,009 (జనరల్: 4,73,882, వొకేషనల్: 34,127) మంది. -
పరీక్ష హాలులో ప్రసవం
విజయనగరం: పరీక్ష కేంద్రంలోనే ఓ డీఎస్సీ అభ్యర్థిని ప్రసవించిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నిండు గర్భిణి గొటివాడకు చెందిన సుగుణ పరీక్షకు హాజరైంది. ఆమెది కురుపాం మండలం గొటివాడ గ్రామం. మాన్సాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పరీక్ష రాసేందుకు హాజరైంది. అయితే, పరీక్ష ప్రారంభమైన గంటకే నొప్పులు రావడంతో అధికారులు 108కు సమాచారం ఇచ్చారు. 108 రాకపోవడంతో పరీక్ష హాలులోనే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ప్రైవేట్ అంబులెన్స్‌లో తల్లీ కొడుకులను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించే లోపే శిశువు ఆస్పత్రిలో కన్నుమూసింది. -
పరీక్ష కేంద్రంలో ప్రసవం
-
పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఖమ్మం : అధికారి మందలించారనే అవమాన భారంతో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కాలేజీలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... వరంగల్ జిల్లా మహబూబాబాద్ పరిధిలోని పోచారం గ్రామానికి చెందిన డి.శ్రీధర్ ఇక్కడి కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం కళాశాలలో పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నలను ఓ చిన్న పేపర్‌పై రాసుకుంటూ అధికారికి పట్టుబడ్డాడు. దాంతో ఆయన మందలించి విద్యార్థిని బయటకు పంపారు. అనంతరం కొద్దిసేపట్లోనే తిరిగి పరీక్ష రాసేందుకు శ్రీధర్‌ను అనుమతించారు. అయితే పరీక్ష పూర్తయ్యాక శ్రీధర్ కళాశాల ఆవరణలో పెట్రోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రశ్నలను రాసుకుని మూత్రవిసర్జనకు అని బయటకు వెళ్లి జవాబులు రాసుకుని తిరిగి రావాలనేది శ్రీధర్ ఆలోచనగా తెలిసింది. -
‘పది’లం
ఆలూరు, న్యూస్‌లైన్: వయస్సు మీదపడినా వారిలో ఆశయం సన్నగిల్లలేదు. పదో తరగతి పాసుకావాలనే దృఢసంకల్పంతో పరీక్షలు రాస్తున్నారు. ఒకరు ఉద్యోగంలో పదోన్నతి కోసం.. మరొకరు గుర్తింపు కోసం.. పట్టుదలతో ఇంకొకరు.. ఇలా రకరకాల లక్ష్యాలతో బాలబాలికలతోపాటు వీరు పరీక్ష హాలులోకి అడుగు పెడుతున్నారు. ఆలూరు ప్రభుత్వ బాలుర నంబర్ 2 పాఠశాలలో శ్రద్ధగా పరీక్ష రాస్తున్నారు. మంగళవారం ‘న్యూస్‌లైన్’ వారిని పలకరించగా పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. వారి మాటల్లోనే.. గుర్తింపు కోసం.. బాలమ్మ, ఆదోని పేదరికంలో పుట్టడంతో నాకు చదువు అబ్బ లేదు. కూలి పనులు వెళ్లి కుటుంబాన్ని పోషించాల్సి వచ్చేది. అయితే ఇటీవల నాకు అంగన్ వాడీ ఆయాగా ఉద్యోగం వచ్చింది. దీంతో చదువు తప్పనిసరి అని తెలసుకున్నాను. చదువుతో మంచి గుర్తింపుకూడా వస్తుందని తెలిసింది. దీంతో 37 ఏళ్ల వయసులోనే పదో తరగతి పాస్ కావాలని పరీక్షలు రాస్తున్నాను. అంగన్వాడీ కార్యకర్తగా ఎదగాలని: లక్ష్మీదేవి, అంగన్వాడీ ఆయా ఆదోని పట్టణ కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లో నేను ఆయాగా పనిచేస్తున్నాను. నా వయస్సు 40 సంవత్సరాలు. పదో తరగతి కచ్చితంగా పాస్ కావాలనే పట్టుదలతో పరీక్షలు రాస్తున్నాను. పది పాస్ అయిన ఆయాలను అంగన్వాడీ కార్యకర్తలుగా నియమించాలని నిబంధనలు ఉన్నాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో పది పరీక్షలు రాస్తున్నాను. బీపీఎం కావాలని నా చివరి కోరిక: లోకారెడ్డి, నేమకల్లు గ్రామ ఈడీఎంసీ నేను ఈడీఎంసీగా చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామ పోస్టాఫీసులో పనిచేస్తున్నాను. నాకు తక్కువ జీతం వస్తోంది. నిజ జీవితంలో కొన్ని లక్ష్యాలను సాధించలేక పోయాను. నేను పదిపాసయితే బీపీఎంగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. అందుకోసమే వయస్సు మీదపడినా(55) పది పరీక్షలను రాస్తున్నాను. విద్యార్హత కోసం.. : నూర్‌అహ్మద్, ఆదోని ఆర్టీసీ బస్ డ్రైవర్ చదువుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం గుర్తించడానికి నాకా చాలాకాలం పట్టింది. ప్రస్తుతం నా వయస్సు 55 ఏళ్లు. ఆదోని ఆర్టీసీ బస్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. నాకింకా మూడేళ్లు సర్వీసు ఉంది. పేదరికంతో అప్పట్లో పదోతరగతి పూర్తి చేయలేకపోయాను. అవకాశం ఉండగా ఎందుకు వదులుకోవాలనుకున్నాను. ప్రధానంగా విద్యార్హత ఉండాలనే లక్ష్యంతో పదో తరగతి పరీక్షలు రాస్తున్నాను. -
సజావుగా పల్లె ‘పరీక్ష’
సాక్షి, నల్లగొండ: జిల్లాలో ఆదివారం ఉదయం వీఆర్ఓ, మధ్యాహ్నం వీఆర్ఏ పరీక్షలు ప్రశాం తంగా, సజావుగా జరిగాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో వీఆర్ఓ పరీక్షకు 86.24 శాతం, వీఆర్ఏకు 89.14 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మూడు.. నాలుగు నిమిషాలు కేంద్రాల వద్దకు ఆలస్యంగా వెళ్లిన అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతించలేదు. దూర ప్రాంతాల నుంచి రావడంతో ఆలస్యమైందని వేడుకున్నా అధికారులు కనికరించకపోవడంతో అభ్యర్థులు కన్నీళ్లతో వెనుదిరిగారు. రోజులపాటు పుస్తకాలతో కుస్తీపట్టిన శ్రమంతా వృథా అయ్యిందని విలపించారు. రెండుమూడు సెంటర్లలో మినహా మిగిలిన ప్రాంతాల్లో ప్రశాంతంగా జరిగింది. మరికొందరు పరీక్ష సమయానికి రెండు నిమిషాల ముందు ఉరుకూపరుగులతో పరీక్ష హాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. పరీక్ష కేంద్రాలున్న పట్టణాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించినా అభ్యర్థులకు కష్టాలు తప్పలేదు. రోజువారీగా తిరిగే బస్సులకు అదనంగా మరో 124 బస్సులను నడిపించారు. అయినా బస్సులన్నీ కిటకిటలాడాయి. దీంతో ముఖ్యంగా వికలాంగులు నానా అవస్థలు పడ్డారు. వీఆర్ఓకు 86.24 శాతం హాజరు.... 68 వీఆర్ఓ పోస్టులకుగాను 85,438 దరఖాస్తులు అందగా.. వీరికి 278 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇం దులో 73,690 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 201 వీఆర్ఏ పోస్టులకుగాను 4997 దరఖాస్తులు అధికారులకు అందాయి. వీరికి కేవలం జిల్లాకేంద్రంలోనే 14 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,468 మంది పరీక్ష రాశారు. మొత్తం మీద వీఆర్ఓ పరీక్షకు 11,748, వీఆర్ఏ పరీక్షకు 529 మంది గైర్హాజరయ్యారు. హాజరైన అభ్యర్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే ఒక్కో వీఆర్ఓ పోస్టుకు 1,083 మంది పోటీలో ఉన్నారు. హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు... దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు పరీక్ష కేంద్రాల చిరునామా, మార్గాలు తెలపడానికి పలుచోట్ల హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు అందుబాటులో ఉన్నారు. వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్ష కేంద్రాలు ఎక్కడున్నాయో తెలపడంతో అభ్యర్థులకు శ్రమ తప్పి సమయం ఆదా అయ్యింది. పలు వీఆర్ఓ పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ చిరంజీవులు సందర్శించారు. ఎన్జీ కళాశాలలో పరీక్ష ప్రారంభానికి ముందు హాల్లో అభ్యర్థులతో మాట్లాడారు. ఎలా సన్నద్ధమయ్యారని అడిగి తెలుసుకున్నారు. ప్రతిభనే నమ్ముకోండి.. మధ్యవర్తుల మాటలను ఎట్టిపరిస్థితుల్లోనూ వినకండి.. అని అభ్యర్థులకు సూచిం చారు. అనంతరం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ఎస్ఆర్టీఐ, డైట్ సెంటర్లలో తిరిగారు. పరీక్షల నిర్వహణ తీరుపై అధికారులతో సమీక్షించారు. మధ్యాహ్నం ప్రభుత్వ మహిళా డిగ్రీ, బాలికల జూనియర్ కళాశాలల్లో పడిన వీఆర్ఏ పరీక్ష కేంద్రాలను సందర్శించారు.