తిరువనంతపురం: పెళ్లి దుస్తుల్లో వెళ్లి పరీక్ష రాసిన ఓ వధువుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పుసుపు రంగు చీర, బంగారు ఆభరణాలతో పాటు ఆప్రాన్ ధరించి మెడకు స్టెతస్కోప్ వేసుకుని ఈ కొత్త పెళ్లికూతురు ప్రాక్టికిల్ ఎగ్జామ్స్‌కు హాజరైంది.
కేరళకు చెందిన ఈ యువతి పేరు శ్రీ లేక్ష‍్మి అనిల్. బెథానీ నవజీవన్ పిజియోథెరపీ కాలేజీలో చదువుతోంది. పెళ్లి రోజే ఫిజియోథెరపీ ప్రాక్టికల్ ఏగ్జామ్ ఉండటంతో పెళ్లి మండపం నుంచి నేరుగా పరీక్ష హాల్‌కు వెళ్లింది. ఈమెను పెళ్లిదుస్తుల్లో చూసిన క్లాస్‌మేట్స్ నవ్వుకున్నారు. ఆమెకు చీర్స్‌తో వెల్‌కం చెప్పారు.
చదవండి: పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు.. తర్వాత ఏం జరిగిందంటే?
Comments
Please login to add a commentAdd a comment