
న్యూఢిల్లీ : పరీక్ష కేంద్రంలోనికి అనుమతించలేదని ఓ సివిల్స్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తిని కర్ణాటకకు చెందిన వరుణ్‌గా గుర్తించారు. ఆదివారం జరిగిన యూపీఎస్సీ పరీక్షకు కొద్దిగా అలస్యంగా చేరుకోవడంతో వరుణ్‌ను అధికారులు లోనికి అనుమతించలేదు. దీంతో మనస్తాపానికి గురైన వరుణ్ రాజేంద్రనగర్‌లోని తన గదికి చేరుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సాయంత్రం వరుణ్‌ను కలువడానికి వచ్చిన స్నేహితురాలు ఎంత సేపు ప్రయత్నించిన అతను తలుపు తెరవకపోవడంతో అమె ఇరుగుపొరుగు వాళ్లకి సమాచారం ఇచ్చింది. వారు గది తలుపులు తెరచేసరికే వరుణ్ చనిపోయాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతని రూంలోని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరీక్ష నియమాలు బాగానే ఉన్నప్పటికి.. కొన్ని సడలింపులు ఉంటే బాగుండేది అని వరుణ్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడని ఓ పోలీస్ అధికారి తెలిపారు. పోస్ట్‌మార్టమ్ అనంతరం వరుణ్ మృతదేహాన్ని ఢిల్లీలో ఉంటున్న అతని సోదరికి అందజేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment