సివిల్స్‌లో సక్సస్‌ కాలేదు..కానీ ఇవాళ ఓ కంపెనీ సీఈవో..! | Failed UPSC Attempts To Being A CoFounder Anubhav Dubey Inspiring Story | Sakshi
Sakshi News home page

సివిల్స్‌లో సక్సస్‌ కాలేదు..కానీ ఇవాళ ఓ కంపెనీ సీఈవో..!

Published Thu, Mar 20 2025 1:14 PM | Last Updated on Thu, Mar 20 2025 2:23 PM

Failed UPSC Attempts To Being A CoFounder Anubhav Dubey Inspiring Story

ఒక్కోసారి మనం వెళ్లేదారిలో గమ్యం కానరాకపోవచ్చు. సక్సస్‌ అంత తేలిగ్గా రాకపోవచ్చు. లేదా మనం ఎంపిక చేసుకున్నదాంట్లో సక్సెస్‌ రాకపోవచ్చు అయినంత మాత్రాన ఓడిపోయినట్లు, అసమర్థులు కాదు. ఇంకోచోట గెలుపుని అందుకోవచ్చు. అది మనం ధైర్యంగా తీసుకునే నిర్ణయంలో ఉంటుంది. ఆ దిశగా ఫెయిల్యూర్స్‌ వైపు చూడకుండా వెళ్తే..సక్సస్‌ కచ్చితంగా మన కాళ్ల వద్దుకు వచ్చి తీరుతుందని చేసి చూపించాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. అంతేగాదు సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా తన స్ఫూర్తిదాయకమైన సక్సస్‌ జర్నీని షేర్‌ చేసుకున్నాడు.

అతడే చాయ్ సుత్తా బార్ సహ వ్యవస్థాపకుడు అనుభవ్ దూబే. సోషల్ మీడియా పోస్ట్‌లో యూపిఎస్సీ కల చెదరిపోవడంతో తన ఆత్మవిశ్వాసం సన్నగిల్లి కొట్టుమిట్టాడుతున్న తరుణంలో తన స్నేహితుడితో కలిసి తీసుకున్న ఆ నిర్ణయం తన లైఫ్‌నే ఛేంజ్‌ చేసిందంటూ చెప్పుకొచ్చారు. అంతేగాదు ఒక్కచోట విజయం అందుకోలేదని అక్కడే నిరీక్షించటం కంటే మరో చోట ప్రయత్నించి చూస్తే.. సక్సెస్‌ తథ్యం అంటున్నాడు. 

తాను యూపీఎస్సీకి ప్రిపేరవుతున్నప్పుడూ..వరుసగా వైఫల్యాలు పకరిస్తూనే ఉన్నాయి. ఇక రాసే ఛాన్స్‌ అయిపోయింది. ఇంకో పక్క జీవితంలో ఏం సాధించలేకపోయానన్న ఆత్మనూన్యత నిరాస నిస్ప్రుహలతో సతమతమవుతున్న తరుణంలో స్నేహితుడితో కలిసి వ్యాపారం చేయాలనే ఆలోచన తెరతీశాడు. ఆ నిర్ణయం కరెక్టో కాదో కూడా తెలియదు. కానీ ఏదో నమ్మకం, గెలవాలన్న​ పట్టుదల అంతే..ఆ కసితోనే చిన్ని టీ స్టార్టప్‌తో వచ్చాను. మట్టికప్పుల్లో  టీ సర్వ్‌ చేయాలన్న విన్నూత్న ఆలోచనే తన స్టార్టప్‌ని విస్తరించేలా చేసింది. 

300 కి పైగా నగరాల్లో 500కి పైగా టీ రిటైల్‌ చైన్‌గా విస్తరించింది. అదోకా బ్రాండ్‌లా తన చాయ్ సుత్తా బార్ స్టార్టప్‌ని తీసుకొచ్చాడు. ఇలా తన టీస్టాల్‌ పేరు వెరైటీగా ఉండటం కూడా ప్రజాదరణకు కారణమైంది. ఇండోర్‌కు చెందిన ఈ చాయ్ సుత్తా బార్ (CSB) అతిపెద్ద టీస్టాల్‌ విక్రేతగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు అలా తన బ్రాంచ్‌లన్నింటికి హెడ్‌గా సహా వ్యవస్థాపకుడిగా మారాడు. 

"తాను చదువులో  బ్యాక్‌బెంచర్‌ని. చిన్నప్పటి నుంచి ఎలాంటి అవార్డులు, సర్టిఫికేట్లు పొందలేదు. కానీ ఈరోజు తన చాయ్ సుత్తా బార్ (CSB) క్యాబిన్‌ ంనిండా అవార్డులు, సర్టిఫికేట్లతో నిండిపోయింది. గెలుపురాలేదని అలానే ఉండిపోవద్దు..మరోచోట కచ్చితంగా అంతకుమించిన సక్సెస్‌ని చవిచూస్తారు. ధైర్యంగా ముందడుగు వేయండి అని విలువైన సందేశంతో పోస్ట్‌ని ముగించారు అనుభవ్ దూబే.

 

(చదవండి: సునీతా విలియమ్స్ జీరో-గ్రావిటీ డైట్: ఆ తొమ్మిది నెలలు ఎలాంటి ఆహారం తీసుకున్నారంటే..)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement