not allowed
-
గేటుకు తాళం వేసి దివాలీ పార్టీకి రానీయ లేదు: బిలియనీర్ భార్య వైరల్ వీడియో
రేమండ్ సీఎండీ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోడీతో విడిపోయినట్లు ప్రకటించడం బిజినెస్ వర్గాల్లో సంచలనంగా మారింది. అయితే 53 ఏళ్ల ఫిట్నెస్ కోచ్ నవాజ్‌మోడీ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల భర్త గౌతమ్ సింఘానియా నిర్వహించిన దీపావళి పార్టీకి హాజరయ్యేందుకు తనను అనుమతించలేదని చెబుతున్న వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో భర్త నుంచి తనకు ఆహ్వానం ఉన్నప్పటికీ దీపావళి పార్టీకి రాకుండా ఒక 'బలవంతుడు' తనను గేటు వద్ద అడ్డుకున్నాడని గౌతమ్ సింఘానియా భార్య ఆరోపించారు. గత వారం తన భర్త నిర్వహించిన దీపావళి పార్టీకి హాజరవకుండా ఆపారనీ, దాదాపు మూడు గంటలకు పైగా లోపలికి వెళ్లకుండా గేటు వెలుపల వేచి ఉండేలా చేశారని ఆరోపించారు. ఇది ఇలా ఉండగా గత నెలలో, నవాజ్ మోడీపై గౌతమ్ బ్రీచ్ క్యాండీ ఇంట్లో దాడి చేయడంతో కాలర్ బోన్ విరిగిపోయిందనీ, ఆ తర్వాత ఆమెను ఆసుపత్రిలో చేర్పించారని, దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని ఫ్రీ ప్రెస్ జర్నల్ కథనం ప్రకారం తెలుస్తోంది. కాగా గతంలో కన్నతండ్రి విజయ్ సింఘానియా గౌతమ్ సింఘానియాపై ఆరోపణలు చేశారు. తనకు నిలువ నీడ లేకుండా చేసేందుకు తన కొడుకు గౌతమ్ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడంటూ విజయ్ సింఘానియా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముంబైలో తాను నిర్మించిన 37 అంతస్తుల డూప్లెక్స్ ఫ్లాట్ 'జేకే హౌస్' నుంచి తనను బయటకు గెంటేసి, దానిని సొంతం చేసుకోవాలని తన కుమారుడు చూస్తున్నాడంటూ ఆరోపించారు. అయితే తన తండ్రి ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని గౌతమ్ సింఘానియా కొట్టి పారేశాడు. తన తండ్రి ఆస్తులకు కేవలం తాను మాత్రమే చట్టపరమైన వారసుడినని పేర్కొన్నారు. అయితే, ఈ సమస్యను కుటుంబసభ్యులు సామరస్యంగా,స్నేహాపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. అంతేకాదు విజయపత్ సింఘానియాను చైర్పర్సన్-ఎమిరిటస్ పదవినుంచి రేమండ్ లిమిటెడ్ షాకింగ్ తొలగించడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఆస్తి వివాదం మధ్య దక్షిణ ముంబైలోని గ్రాండ్ పార్డి సొసైటీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. (విడిపోతున్నాం..ఈ దీపావళి గతంలోలా ఉండదు: బిలియనీర్ షాకింగ్ ప్రకటన) It seems after dumping his father years back, now *Gautam Singhania* has locked out his wife *Nawaz Modi Singhania* from a company event. This was last night outside the Raymond House in Thane.#gautamsinghania#nawazmodisinghania pic.twitter.com/AHHwlKrSWd — The Cheshire Cat (@C90284166) November 13, 2023 -
Bharat Jodo Yatra: ప్రైవేటీకరణకు అడ్డుకట్ట: రాహుల్
సాక్షి, బళ్లారి: ప్రభుత్వ రంగ సంస్థల విచ్చలవిడి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ అన్నారు. తాము అధికారంలోకి వస్తే దీనికి అడ్డుకట్ట వేస్తామని ప్రకటించారు. ఆయన భారత్ జోడో పాదయాత్ర బుధవారం కర్ణాటకలో కొనసాగింది. చిత్రదుర్గం జిల్లాలో అవయవ దానం చేసిన వారి పిల్లలు, కుటుంబీకులతో రాహుల్ కలిసి నడిచారు. గొప్ప దాతల సంబంధీకులతో కలిసి నడవడం ఎంతో గర్వకారణంగా ఉందంటూ అనంతరం ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. కన్నడ నట దిగ్గజం దివంగత రాజ్‌కుమార్, ఇటీవల మరణించిన ఆయన కుమారుడు పునీత్ రాజ్‌కుమార్ నేత్రదానం లక్షలాది మంది కన్నడిగులకు ఆదర్శంగా నిలిచిందంటూ కొనియాడారు. అంతకుముందు గిరియమ్మనహళ్లి వద్ద రాహుల్ నిరుద్యోగ యువతతో, రైతులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు పథకం తీసుకొస్తామన్నారు. విద్య, ఆరోగ్య రంగాల్లో అపారమైన ఉపాధి అవకాశాలున్నాయన్నారు. యువత సొంత వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు పెట్టుకునేందుకు ప్రత్యేక ఆర్థిక సాయం అందజేసే వ్యవస్థను తెస్తామని చెప్పారు. -
అత్తింటివారి దాష్టీకం!...బాలింత అయిన కోడలిని ఇంట్లోకి రానివ్వకుండా...
యశవంతపుర: భర్త మృతి చెందిన దుఃఖంలో ఉన్న కోడలికి అండగా ఉండాల్సిన అత్తింటివారు నిర్దయగా వ్యవహరించి ఆమెను ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు. 30 రోజుల బాలింత అయిన ఆమె తన చిన్నారితో కలిసి ఓ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతోంది. ఈ ఘటన ఉడిపిలో జరిగింది. బాదామికి చెందిన అయ్యప్ప(28) ఉడిపిలో మెకానిక్ పని చేసేవాడు. రెండేళ్ల క్రితం గంగావతికి చెందిన యువతిని ప్రేమించాడు. వీరి వివాహానికి ఇరువైపులా పెద్దలు అంగీకరించలేదు. దీంతో అయ్యప్ప పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. నెల రోజుల క్రితం ఈ దంపతులకు ఆడబిడ్డ పుట్టింది. అయితే ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. 20 రోజుల క్రితం అయ్యప్ప కింద పడగా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లిన తల్లిదండ్రులు కోడలిని మాత్రం ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు. దిక్కుతోచని స్థితిలో ఆమె తన చిన్నారితో కలిసి ఉడిపి సమాజ సేవక విశుశెట్టి అంబలపాడి నిట్టూరు సఖి ఆశ్రయంలో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతోంది. (చదవండి: చైన్‌స్నాచింగ్ చేయకపోతే నిద్రపట్టదు) -
పన్ను చెల్లింపుదారులకు షాక్, 'ఏపీవై' పథకంలో చేరకుండా కేంద్రం నిషేధం!
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకంలో చేరకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ‘‘అక్టోబర్ 1 నుంచి పన్ను చెల్లింపుదారులు ఎవరైనా ఏపీవైలో చేరేందుకు అనర్హులు’’అంటూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 1లోపు చేరిన వారికి నూతన నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. ఈ అటల్ పెన్షన్ యోజన పథకం కింద పెన్షన్ ప్రయోజనాలను ప్రధానంగా లక్ష్యిత వర్గాలకు అందించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అక్టోబర్ 1, ఆ తర్వాత నుంచి ఏపీవైలో చేరిన సభ్యుల్లో ఎవరైనా పన్ను చెల్లింపుదారునిగా బయటపడితే వారి ఏపీవై ఖాతాను మూసేసి, అందులో జమ అయిన మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్టు ఆర్థిక శాఖ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. అసంఘటిత రంగంలో పనిచేసే వారికి.. వృద్ధాప్యంలో ఎటువంటి సామాజిక భద్రతా సదుపాయం లేదు. చదవండి👉 ఇన్కమ్ టాక్స్ నుంచి 143 (1) నోటీసు వచ్చిందా?..అప్పుడేం చేయాలి ? దీంతో అటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కారు 2015 జూన్ 1 నుంచి ఏపీవై పథకాన్ని తీసుకొచ్చింది. రూ.1,000–5,000 మధ్య ఎంత పెన్షన్ కావాలో ఎంపిక చేసుకుని, ఆ మేరకు నెలవారీ లేదా త్రైమాసికం లేదా, వార్షికంగా చందా చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత నుంచి పెన్షన్ అందుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 39 ఏళ్లు పూర్తయ్యే వరకు ఈ పథకంలో చేరేందుకు అర్హత ఉంది. -
టెక్ కంపెనీలకు స్పెక్ట్రం కేటాయించవద్దు
న్యూఢిల్లీ: బడా టెక్ కంపెనీలు ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేసుకునేందుకు స్పెక్ట్రంను కేటాయించవద్దని కేంద్రానికి టెల్కోల సమాఖ్య సీవోఏఐ విజ్ఞప్తి చేసింది. అలా చేస్తే అవి దొడ్డిదారిన టెలికం రంగంలోకి ప్రవేశించేందుకు అవకాశం ఇచ్చినట్లే అవుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ‘టెల్కోలకు వర్తించే నిబంధనలు, పెనాల్టీలు వంటి బాదరబందీలేవీ బడా టెక్ కంపెనీలకు ఉండవు. క్యాప్టివ్ (సొంత అవసరాలకు) 5జీ నెట్‌వర్క్‌ల కోసం ప్రభుత్వం స్పెక్ట్రం కేటాయిస్తే.. భారత్‌లోని కంపెనీలకు 5జీ సర్వీసులు, సొల్యూషన్స్ అందించడానికి బడా టెక్నాలజీ సంస్థలకు దొడ్డిదారిన ఎంట్రీ ఇచ్చినట్లే అవుతుంది. వేలంలో పాల్గొనాల్సిన అవసరం లేకుండా స్పెక్ట్రం కేటాయిస్తే, అన్ని సంస్థలకూ సమానంగా అవకాశాలు కల్పించాలన్న సూత్రానికి విఘాతం కలుగుతుంది‘ అని సీవోఏఐ వివరించింది. ఆదాయాలకు దెబ్బ.. ఇతరత్రా కంపెనీలు ప్రైవేట్ నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేస్తే టెల్కోల ఆదాయం గణనీయంగా పడిపోతుందని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ పేర్కొన్నారు. అలాంటప్పుడు ఇక తాము ప్రత్యేకంగా 5జీ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడం అర్ధరహితంగా మారుతుందని తెలిపారు. టెక్ కంపెనీలు తమ ప్రైవేట్ నెట్వర్క్ కోసం టెల్కోల నుంచి స్పెక్ట్రంను లీజుకు తీసుకోవచ్చని, డిమాండ్‌ను బట్టి వాటికి నేరుగా కూడా కేటాయించే అవకాశాలను పరిశీలిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సీవోఏఐ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 5జీ స్పెక్ట్రం కావాలనుకుంటున్న కంపెనీలు వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవడం సంతోషించతగ్గ విషయమని సీవోఏఐ పేర్కొంది. జులై నెలాఖరులో నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో అదానీ గ్రూప్ కూడా పాల్గొంటోంది. ఈ వేలంలో రూ. 4.3 లక్షల కోట్లు విలువ చేసే 72 గిగాహెట్జ్ స్పెక్ట్రంను విక్రయించనున్నారు. టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కూడా దరఖాస్తు చేసుకున్నాయి. -
దివ్యాంగ బాలుడి కేసులో... ఇండిగోకు రూ.5 లక్షల ఫైన్
న్యూఢ్లిల్లీ: మానసిక వైకల్యమున్న బాలుడిని విమానం ఎక్కకుండా అడ్డుకున్నందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ మీద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీరియస్ అయింది. విమానయాన నిబంధనల్ని ఉల్లంఘించిందంటూ శనివారం రూ.5 లక్షల జరిమానా విధించింది. ఈ నెల 7న రాంచీ విమానాశ్రయంలో తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్ విమానం ఎక్కబోతుండగా సదరు బాలున్ని సిబ్బంది అడ్డుకోవడం, అది వివాదానికి దారి తీయడం తెలిసిందే. ఆ సమయంలో బాలుడు ఎవరి మాటా వినకుండా ఉన్మాదంగా ప్రవర్తించాడన్న ఇండిగో వాదనను డీజీసీఏ తోసిపుచ్చింది. -
టీకా వేసుకుంటేనే థియేటర్లోకి అనుమతి
తిరుత్తణి: కరోనా టీకా వేసుకున్న వారికి మాత్రమే సినిమా థియేటర్లలోకి అనుమతి ఇవ్వనున్నట్టు కలెక్టర్ ఆల్పీ జాన్ వర్గీస్ తెలిపారు. ఆయన శుక్రవారం తిరుత్తణిలో సినిమా థియేటర్ల వద్ద ప్రత్యేక కరోనా వ్యాక్సినేషన్ శిబిరం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో జిల్లాలో గణనీయంగా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ఇంకా 20 శాతం మంది వ్యాక్సిన్ వేసుకోలేదన్నారు. ఈ క్రమంలో రద్దీగా ఎక్కువగా ఉండే ఆలయాలు, సినిమా థియేటర్లు, మాల్స్, రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారిని మాత్రమే సినిమా థియేటర్లలోకి అనుమతించాలని యాజమాన్యాలను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లా ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జవహర్హలాల్, ఆర్డీవో సత్య, మున్సిపల్ కమిషనర్ రామజయం పాల్గొన్నారు. -
చిదంబరానికి ఇంటి భోజనం నో
న్యూఢిల్లీ: ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిదంబరానికి ప్రత్యేక ఆహారం ఇవ్వడం కుదరదనీ, జైలులో అందరికీ ఒకే రకమైన ఆహారం ఉంటుందనీ హైకోర్టు స్పష్టం చేసింది. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్ విచారణలో చిదంబరంకి ఇంటి నుంచి తెప్పించిన ఆహారాన్ని జైలులో అనుమతించాల్సిందిగా ఆయన తరఫున కపిలి సిబాల్ కోర్టుని కోరడంతో జస్టిస్ సురేష్ కుమార్ కైత్ ‘‘జైలు లో అందరికీ ఒకే రకమైన ఆహారం అందుబాటులో ఉంటుంది’’అని తేల్చి చెప్పారు. అయితే తన క్లయింట్ 74 ఏళ్ళ వయస్సువారనీ, అందుకే ఇంటిభోజనాన్ని అనుమతించాలనీ సిబల్ వాదించగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కలుగజేసుకుంటూ ‘‘ఓమ్‌ప్రకాష్ చౌతాలా ఇంకా ఎక్కువ(84 ఏళ్ళు) వయస్సువారు, రాజకీయ ఖైదీ కూడా అయినప్పటికీ ఆయనకు జైలులో సాధారణ భోజనమే అందుతోంది. రాజ్యం ఎవ్వరి పట్లా భేదం పాటించదు’’ అని వ్యాఖ్యానించారు. -
ఆర్టికల్ 371 జోలికి వెళ్లం
గువాహటి: ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 371 జోలికి వెళ్లబోమని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అక్రమంగా ఒక్క వలసదారున్ని కూడా దేశంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఆదివారమిక్కడ జరిగిన ఈశాన్య రాష్ట్రాల మండలి (ఎన్ఈసీ) 68వ ప్లీనరీ సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 371ని కూడా కేంద్రం రద్దు చేస్తుందన్న ప్రచారం జరుగుతోందని తెలిపారు. ‘దీనిపై నేను ఇదివరకే పార్లమెంటులో స్పష్టతనిచ్చాను. నేడు 8మంది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో మరోసారి చెబుతున్నా. కేంద్రం ఆర్టికల్ 371 జోలికి వెళ్లదు’ అని పునరుద్ఘాటించారు. ఆర్టికల్ 370ని తాత్కాలికంగా ఏర్పాటు చేసినందునే దాన్ని రద్దుచేశామని, అయితే ఆర్టికల్ 371 మాత్రం ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తుందని, ఈరెండింటి మధ్య చాలా తేడా ఉందని షా వివరించారు. ఎన్ఆర్సీ గురించి మాట్లాడుతూ..అక్రమ చొరబాటుదారులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదన్న విధానానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈశాన్య ప్రాంతంలోని వివిధ రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలకు ముగింపు పలకాల్సిన అవసరముందని షా అభిప్రాయపడ్డారు. -
పోలీసులకూ నో ఎంట్రీ..
జహీరాబాద్: పోలీసులు అంటే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లి విచారణ చేసే అధికారం ఉంటుంది. అయినా ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌లోకి వెళ్లే అధికారం పోలీసులకు ఎన్నికల సంఘం కల్పించలేదు. ఎన్నికల అధికారి కోరిన సమయంలో కానీ, అత్యవసర పరిస్థితులు ఏర్పడిన సమయంలో మాత్రమే పోలింగ్ బూత్‌లోకి వెళ్లే అధికారం ఉంటుంది. అది కూడా ఎన్నికల అధికారికి అధికారం ఉంటేనే. పోటీచేసిన అభ్యర్థికి జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్నప్పటికీ రక్షణ సిబ్బందికి పోలింగ్‌బూత్‌లోకి అనుమతి లేదు. అభ్యర్థితో పాటు మఫ్టీలో ఉన్న భద్రతా సిబ్బందిలో ఒకరు మాత్రమే వెళ్లేందుకు అనుమతినిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేబినెట్, రాష్ట్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రులకు ప్రజల ఖర్చుతో భద్రత ఉంటుంది. వీరికి తమ వెంట వచ్చే భద్రతా సిబ్బందికి కూడా ప్రవేశం లేదు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిగా మంత్రి ఉంటే ఆయన ఒక్కరు మాత్రమే పోలింగ్‌బూత్‌లోకి వెళ్లవచ్చు. భద్రతా సిబ్బంది తలుపు బయటే ఆగిపోవాలి. పోలీసు సిబ్బంది ఎన్నికల అధికారుల ఆదేశాలను మాత్రమే అనుసరించాలి. రాజకీయ నాయకులు, మంత్రుల మాటలను పట్టించుకోవద్దు. ఎన్నికల కమిషన్ ఆజ్ఞాపత్రం ఉంటేనే పోలింగ్ బూత్ లోపలకు వెళ్లవచ్చు. అక్కడ ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రవర్తించరాదు. మాటలు, సైగలు చేసినా నేరం కిందకే వస్తుంది. -
సివిల్స్ పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదని..
న్యూఢిల్లీ : పరీక్ష కేంద్రంలోనికి అనుమతించలేదని ఓ సివిల్స్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తిని కర్ణాటకకు చెందిన వరుణ్‌గా గుర్తించారు. ఆదివారం జరిగిన యూపీఎస్సీ పరీక్షకు కొద్దిగా అలస్యంగా చేరుకోవడంతో వరుణ్‌ను అధికారులు లోనికి అనుమతించలేదు. దీంతో మనస్తాపానికి గురైన వరుణ్ రాజేంద్రనగర్‌లోని తన గదికి చేరుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం వరుణ్‌ను కలువడానికి వచ్చిన స్నేహితురాలు ఎంత సేపు ప్రయత్నించిన అతను తలుపు తెరవకపోవడంతో అమె ఇరుగుపొరుగు వాళ్లకి సమాచారం ఇచ్చింది. వారు గది తలుపులు తెరచేసరికే వరుణ్ చనిపోయాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతని రూంలోని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరీక్ష నియమాలు బాగానే ఉన్నప్పటికి.. కొన్ని సడలింపులు ఉంటే బాగుండేది అని వరుణ్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడని ఓ పోలీస్ అధికారి తెలిపారు. పోస్ట్‌మార్టమ్ అనంతరం వరుణ్ మృతదేహాన్ని ఢిల్లీలో ఉంటున్న అతని సోదరికి అందజేశామన్నారు. -
అతిగా తాగితే మెట్రోకు నో ఎంట్రీ
సాక్షి,హైదరాబాద్: మందుబాబులూ బహుపరాక్! తాగి తూలుతూ స్టేషన్లోకి ప్రవేశించే వారిని మెట్రో జర్నీకి అనుమతించబోమని మెట్రో అధికారులు స్పష్టంచేశారు. టికెట్ విక్రయ యంత్రం వద్దకు వచ్చేవారు అతిగా మద్యం సేవించినట్లు అనుమానం వచ్చినా, తాగి తూలినా వారిని ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ గేటు వద్దనున్న సిబ్బంది లోనికి అనుమతించరని హెచ్చరించారు. ఇక మందుబాబులు స్టేషన్లు, కోచ్‌లలో మితిమీరి ప్రవర్తిస్తే షీటీమ్స్, పోలీసు బలగాలు వారి ఆట కట్టిస్తాయని స్పష్టం చేశారు. పరిమిత మోతాదులో మద్యం సేవించి ఇతరులను ఇబ్బందిపెట్టకుండా జర్నీచేసే వారికి ఎలాంటి అడ్డంకులుండవని అధికారులు తెలిపారు. -
‘పద్మావతి’ని ఆడనివ్వం
భోపాల్: పద్మావతి సినిమాలో చరిత్రను వక్రీకరించారని వార్తలు వస్తున్నాయనీ, ఒకవేళ అదే నిజమైతే మధ్యప్రదేశ్‌లో ఆ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. సినిమా ప్రదర్శనను నిలిపివేయాల్సిందిగా రాజ్‌పూత్ వర్గానికి చెందిన కొందరు సోమవారం సీఎంను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ‘చరిత్ర వక్రీకరణను మేం సహించం. రాణీ పద్మావతి గొప్పతనం గురించి మనం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకుంటున్నాం. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే సన్నివేశాలు సినిమాలో ఉంటే ఇక్కడ ఆడనివ్వం’ అని చౌహాన్ అన్నారు. మహిళల రక్షణకు విశిష్ట సేవలందించే వ్యక్తులకు ‘రాష్ట్రమాత పద్మావతి అవార్డుల్ని’ అందజేస్తామని ప్రకటించారు. శౌర్యపరాక్రమాలు చూపినవారికి ‘మహారాణా ప్రతాప్ అవార్డు’ ఇస్తామన్నారు. మరోవైపు కేంద్రానికి తామిచ్చిన సూచనల్ని అంగీకరిస్తేనే రాష్ట్రంలో పద్మావతి చిత్రం విడుదల అవుతుందని రాజస్తాన్ సీఎం వసుంధరా రాజే స్పష్టం చేశారు. ఇదిలాఉండగా, పద్మావతి చిత్రంలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలున్నాయని ఆరోపిస్తూ వాటిని తొలగించాల్సిందిగా కోరుతూ వచ్చిన ఓ పిటిషన్‌ను సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. సినిమాకు ఇంకా సీబీఎఫ్సీ ధ్రువీకరణ ఇవ్వనందున, ఇప్పుడే ఈ అంశాన్ని తాము చేపట్టడం తొందరపాటవుతుందని ధర్మాసనం పేర్కొంది. -
మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని యజమాని
-
కోడి పందేలను అనుమతించం
► ఎస్పీలకిచ్చిన ఆదేశాలు ఈ ఏడాదీ అమలవుతాయి ► హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కోడి పందేల నిర్వహణకు ఎవరికీ అనుమతిచ్చేది లేదని ఏపీ ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. ఎవరైనా చట్ట నిబంధనలను ఉల్లంఘించి కోడి పం దేలను నిర్వహించినా, జూదమాడినా చర్యలు తీసుకోవాలని గతంలో ఆయా జిల్లాల ఎస్పీల కు ఆదేశాలు జారీ చేశామని, వాటిని ఈ ఏడా దీ అమలు చేస్తామని తెలిపింది. ఈ వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాలో చట్టాలను ఉల్లంఘించి సంక్రాతి పండగ సందర్భంగా పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నారని, ఈ పోటీల్లో సంఘ వ్యతిరేక శక్తులు పాల్గొంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ అదే జిల్లాకు చెందిన నరహరి జగదీశ్‌కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై మంగళవారం ధర్మాసనం విచారించంది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. అనుమతివ్వాలని పిటిషన్.. కోడి పందేల నిర్వహణకు అనుమతినివ్వాలని కోరుతూ ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ప్రధాన వ్యాజ్యంతోపాటు ఇంప్లీడ్ పిటిషన్‌పైనా ధర్మాసనం విచారించింది. -
కాలేజీల నిర్లక్ష్యం.. జేఈఈ చాన్స్ కోల్పోయిన విద్యార్థినులు
కార్పొరేట్ కాలేజీల నిర్లక్ష్యం ఇద్దరు విద్యార్థినుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టింది. కర్నూలు జిల్లాకు చెందిన సుప్రజ, శ్వేత అనే విద్యార్థినులు శనివారం జేఈఈ పేపర్- 1 పరీక్ష రాసేందుకు తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ కేంద్రానికి వెళ్లారు. అయితే వారు చదువుకున్న కాలేజీ యాజమాన్యం పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లించలేదంటూ నిర్వాహకులు వారిని లోనికి అనుమతించలేదు. దీంతో విద్యార్థినులు ఇద్దరూ కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా, ఫీజులు సకాలంలోనే చెల్లించామని, తమ పిల్లలు పరీక్ష రాసేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు అధికారుల్ని వేడుకున్నారు. -
గుడిలో మహిళల ప్రవేశం పై నిషేదం