
సాక్షి,హైదరాబాద్: మందుబాబులూ బహుపరాక్! తాగి తూలుతూ స్టేషన్‌లోకి ప్రవేశించే వారిని మెట్రో జర్నీకి అనుమతించబోమని మెట్రో అధికారులు స్పష్టంచేశారు. టికెట్ విక్రయ యంత్రం వద్దకు వచ్చేవారు అతిగా మద్యం సేవించినట్లు అనుమానం వచ్చినా, తాగి తూలినా వారిని ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ గేటు వద్దనున్న సిబ్బంది లోనికి అనుమతించరని హెచ్చరించారు.
ఇక మందుబాబులు స్టేషన్లు, కోచ్‌లలో మితిమీరి ప్రవర్తిస్తే షీటీమ్స్, పోలీసు బలగాలు వారి ఆట కట్టిస్తాయని స్పష్టం చేశారు. పరిమిత మోతాదులో మద్యం సేవించి ఇతరులను ఇబ్బందిపెట్టకుండా జర్నీచేసే వారికి ఎలాంటి అడ్డంకులుండవని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment