తిరుత్తణి: కరోనా టీకా వేసుకున్న వారికి మాత్రమే సినిమా థియేటర్లలోకి అనుమతి ఇవ్వనున్నట్టు కలెక్టర్ ఆల్పీ జాన్ వర్గీస్ తెలిపారు. ఆయన శుక్రవారం తిరుత్తణిలో సినిమా థియేటర్ల వద్ద ప్రత్యేక కరోనా వ్యాక్సినేషన్ శిబిరం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో జిల్లాలో గణనీయంగా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ఇంకా 20 శాతం మంది వ్యాక్సిన్ వేసుకోలేదన్నారు.
ఈ క్రమంలో రద్దీగా ఎక్కువగా ఉండే ఆలయాలు, సినిమా థియేటర్లు, మాల్స్, రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారిని మాత్రమే సినిమా థియేటర్లలోకి అనుమతించాలని యాజమాన్యాలను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లా ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జవహర్‌హలాల్, ఆర్‌డీవో సత్య, మున్సిపల్ కమిషనర్ రామజయం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment