కాలేజీల నిర్లక్ష్యం.. జేఈఈ చాన్స్ కోల్పోయిన విద్యార్థినులు | two students not allowed into JEE exame, coz collages not payied their fee | Sakshi
Sakshi News home page

కాలేజీల నిర్లక్ష్యం.. జేఈఈ చాన్స్ కోల్పోయిన విద్యార్థినులు

Published Sat, Apr 4 2015 3:03 PM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

కాలేజీల నిర్లక్ష్యం.. జేఈఈ చాన్స్ కోల్పోయిన విద్యార్థినులు

కాలేజీల నిర్లక్ష్యం.. జేఈఈ చాన్స్ కోల్పోయిన విద్యార్థినులు

కార్పొరేట్ కాలేజీల నిర్లక్ష్యం ఇద్దరు విద్యార్థినుల భవిష్యత్ను అంధకారంలోకి నెట్టింది. కర్నూలు జిల్లాకు చెందిన సుప్రజ, శ్వేత అనే విద్యార్థినులు శనివారం జేఈఈ పేపర్- 1 పరీక్ష రాసేందుకు తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ కేంద్రానికి వెళ్లారు. అయితే వారు చదువుకున్న కాలేజీ యాజమాన్యం పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లించలేదంటూ నిర్వాహకులు వారిని లోనికి అనుమతించలేదు. 

 

దీంతో విద్యార్థినులు ఇద్దరూ కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా, ఫీజులు సకాలంలోనే చెల్లించామని, తమ పిల్లలు పరీక్ష రాసేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు అధికారుల్ని వేడుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement