మియాపూర్‌: వీడిన బాలిక హత్య కేసు మిస్టరీ | Shocking Facts Revealed In Miyapur Minor Murder Mystery, More Details Inside | Sakshi
Sakshi News home page

దారుణం.. బాలికను చంపింది తండ్రే

Published Wed, Jun 19 2024 4:20 PM | Last Updated on Wed, Jun 19 2024 4:37 PM

Miyapur Minor Murder Mystery Unveiled

సాక్షి,హైదరాబాద్‌: మియాపూర్‌లో సంచలనం రేపిన బాలిక హత్య కేసును పోలీసులు చేదించారు. బాలిక మర్డర్ కేసులో ఆమె తండ్రే హంతకుడని పోలీసులు తేల్చారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ కేసును విచారించారు.

 బాలిక మిస్సింగ్ మిస్టరీ  వారం రోజుల తర్వాత వీడింది. తండ్రిపై అనుమానంతో తమదైన తీరులో పోలీసులు దర్యాప్తు చేశారు. బాలిక తండ్రి బానోతు నరేష్ పోర్న్ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యాడు.

తన కోరిక తీర్చాలంటూ బాలికపై తండ్రి ఒత్తిడి తెచ్చాడు. అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతురిని హతమార్చాడు. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి హత్య చేశాడు. బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు హత్య జరిగిన ప్రదేశానికి నిందితుడు తిరిగి వెళ్లినట్లు గుర్తించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement