
అన్నానగర్(చెన్నై): నెల్‌లై జిల్లా దిసైయాన్ విలై తాలూకా స్వామిదాస్ పట్టణంలో చెప్పులు కుట్టే కార్మికుడు కన్నియప్పన్ కుమారుడు ముత్తయ్య (19). సంగనాన్ కుళం గ్రామంలో వివాహ ఆహ్వాన పత్రికలు తయారు చేసే ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అదే కంపెనీలో ఓ యువతి పని చేస్తోంది. వేర్వేరు కులాలకు చెందిన చెందిన ముత్తయ్య, సదరు యువతి ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ముత్తయ్య ఇంటికి ప్రియురాలు వచ్చింది.
అనంతరం 4.30 గంటలకు ముత్తయ్య తన బైకులో యువతిని ఇడమొళిలో వదిలేసి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాత్రి 8 గంటల సమయంలో స్నేహితుడిని కలిసేందుకు వెళుతున్నానని చెప్పి వెళ్లిన ముత్తయ్య చాలా సేపటి వరకు ఇంటికి రాలేదు. సోదరులు అతన్ని వెతకగా ఆ ప్రాంతంలో మృతదేహమై పడివున్నాడు. దిసైయాన్‌విలై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముత్తయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. నెల్‌లై ఎస్పీ శిలంబరసన్, వల్లీయూరు డీఎస్పీ యోగేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రేమ వ్యవహారం వల్లే ఈ హత్య చోటు చేసుకుందని భావిస్తున్నారు.
చదవండి Hyderabad IIT Student Commits Suicide: హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి మిస్సింగ్ కేసు విషాదాంతం