
తిరువొత్తియూరు(చెన్నై): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని యువకుడిని హత్య చేసిన వివాహిత, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై సాలిగ్రామం శారదాంబాల్ వీధికి చెందిన సౌందర్య కోడంబాక్కం మండలం 132 వార్డులో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. భర్త నుంచి విడిపోయి ఇద్దరు కుమారులతో నివాసముంటోంది. వీరితో ఆమె అక్క కుమారుడు కూడా ఉంటున్నాడు.
ఇటీవల సౌందర్యకు ఆమె మాజీ భర్త స్నేహితుడు విజయ్ (27)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొద్ది నెలలుగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి సౌందర్య ఇంట్లో విజయ్ హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న విరుగంబాక్కం పోలీసులు విచారణ చేపట్టారు. అందులో.. సౌందర్యకు అదే ప్రాంతానికి చెందిన ప్రభు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. సౌందర్య తన ప్రియుడు ప్రభుతో కలిసి ఇంట్లో ఉన్న విజయ్ అడ్డు తొలగించుకోవడం కోసం హత్య చేసినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment