తిరుత్తణి(చెన్నై): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన ఆర్కేపేట ప్రాంతంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. చంద్రవిలాసపురం పంచాయతీలోని సుందర్రాజుపురానికి చెందిన యువరాజ్ (29) శ్రీపెరంబదూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. అతనికి అదే గ్రామానికి చెందిన మేనమామ కుతూరు గాయత్రి (22)తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు రెండేళ్ల కూతురు ఉంది.
ఈ క్రమంలో గాయతి తిరుత్తణిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సమయంలో తిరుత్తణికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలుస్తుంది. భర్త అనుమానంతో పనులకు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో రెండు గదుల్లో వేర్వేరుగా భార్యభర్త నిద్రిస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో గాయత్రి గదిలో మరో యువకుడి ఉండడాన్ని గుర్తించిన యువరాజ్ వారిని నిలదీశాడు. ఈ క్రమంలో గాయత్రి ప్రియుడితో కలిసి భర్తను గొంతు నులిమి హత్య చేసి అక్కడు నుంచి పరారైనట్లు తెలుస్తోంది. యువరాజ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. ఆర్కేపేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాయత్రిని అదుపులోకి తీసుకుని పరారైన ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment