
బెంగళూరు: నిత్యం మొబైల్లో మునిగిపోవడం, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం వెరసి భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను హత్య చేసి శవాన్ని నదిలో పడేసిన ఘటన మండ్య జిల్లా శ్రీరంగ పట్టణం తాలూకా మండ్యకొప్పళు గ్రామంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూజ, శ్రీనాథ్ భార్యభర్తలు. వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, పూజా గంటల తరబడి మొబైల్ వాడేది. టిక్‌టాక్ చేసే పూజా అది లేకపోవడంతో రీల్స్ చేయడం మొదలుపెట్టింది. ఇదే సమయంలో ఆమె ఇతరులతో చాటింగ్ చేయడాన్ని భర్త గుర్తించాడు. సహించలేక మరో వ్యక్తితో కలిసి చంపేసి శవాన్ని నదిలో పడేశాడు. ఈ విషయం మూడు రోజుల తరువాత బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చదవండి: అబద్దాలతో పెళ్లి చేసుకుంటే.. ఇకపై పదేళ్ల జైలు శిక్ష.. కొత్త చట్టాల్లో ఏముందంటే..?
Comments
Please login to add a commentAdd a comment