వివాహేతర సంబంధం ఉందనే అనుమానం.. ఫోన్‌లో మాట్లాడుతుంటే చూసి.. | Husband Assassinated Wife Over Extramarital Affair Karnataka | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం ఉందనే అనుమానం.. ఫోన్‌లో మాట్లాడుతుంటే చూసి..

Aug 18 2022 8:45 PM | Updated on Aug 18 2022 8:49 PM

Husband Assassinated Wife Over Extramarital Affair Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రాయచూరు(బెంగళూరు):  వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో  భార్యను గొడ్డలితో నరికి కడతేర్చిన భర్త పోలీసులకు లొంగిపోయాడు. ఈఘటన లింగసూగురు తాలాకా గుడదనాళలో బుధవారం జరిగింది. డీఎస్పీ వెంకటప్పనాయక్‌ కథనం మేరకు... గ్రామానికి చెందిన బెట్టప్పకు ఏడేళ్ల క్రితం కలబుర్గి జిల్లా యడ్రామికి చెందిన రేణుక(28)తో వివాహమైంది. వీరికి విరాట్, రాహుల్‌ అనే కుమారులున్నారు.

అయితే రేణుకకు మల్లప్ప అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని బెట్టప్ప అనుమానించేవాడు. మంగళవారం సాయంత్రం మల్లప్పతో భార్య ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని గమనించాడు. బుధవారం పుట్టింటికి వెళ్లి వస్తానని భార్య అడగడంతో మల్లప్ప కోసమే వెళ్తున్నావంటూ గొడవపడి గొడ్డలతో నరికి చంపి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి రేణుక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

చదవండి: సివిల్స్‌ కోచింగ్‌కు వెళ్లి.. యువకునితో వివాహేతర సంబంధం.. అందుకే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement