
ప్రతీకాత్మక చిత్రం
మైసూరు(బెంగళూరు): కుటుంబ కలహాలతో తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మైసూరు జిల్లా నంజనగూడులోని మహదేవనగరకు చెందిన సోమణ్ణకు గుండ్లుపేటెకు చెందిన భాగ్య (29)తో పదేళ్ల క్రితం పెళ్లయింది. సంతానం కలగకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. సోమణ్ణ మరో మహిళతో సన్నిహితంగా ఉన్నాడని భాగ్య అనుమానించేది. ఈ క్రమంలో ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. హుల్లహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
మరో ఘటనలో..
విద్యార్థిని ఆత్మహత్య
మైసూరు: సీఏ (చార్టెడ్ అకౌంటెంట్) పరీక్షకు సన్నద్ధమ వుతున్న మైసూరు తాలూకా దాసనకొప్పలు గ్రామానికి చెందిన చందన (23) ఆత్మహత్య చేసుకుంది. ఈ యువతి ఇటీవల ఎంకామ్ పూర్తి చేసింది. ఆమె తండ్రి కేఎస్‌ఆర్‌టీసీ ఉద్యోగి. తల్లి కెనరా బ్యాంకులో పని చేస్తోంది. తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్న చందన తాను నివసిస్తున్న క్వార్టర్స్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. జయపుర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment